లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. ఘజియాబాద్‌లో ఓ వృద్దుడు రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన కారు అతన్ని ఢీకొట్టి అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ ఘటన బుధవారం చోటుచేసుకుంది. ఈ దృశ్యాలన్నీ స్థానికంగా ఉన్న సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. ఇంటి ముందు ఉన్న ఇరుకైన రోడ్డు పక్కన ఓ వృద్ధుడు కూర్చీలో కూర్చున్నాడు. అనంతరం కూర్చీ పట్టుకొని మెల్లమెల్లగా రోడ్డు దాటేందుకు ప్రయత్నించాడు. ఇంతలోనే వేగంగా వచ్చిన కారు అకస్మాత్తుగా వృద్దుడిని ఢీకొట్టి దూసుకెళ్లింది.
ఆ పెద్దాయన రోడ్డుపై పడిపోయినప్పటికీ.. డ్రైవర్ ఆగకుండా వేగంగా వెళ్లిపోయాడు. అనంతరం కుటుంబ సభ్యులు వచ్చి వృద్ధుడిని ఆసుపత్రిలో చేర్చారు. అయితే బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా ఈ ఘటన ఉద్దేశపూర్వకంగానే జరిగిందని వృద్ధుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆరోపించారు. ఆరు నెలల క్రితం మొదలైన ఓ వివాదం కారణంగా తన ఇరుగుపొరుగువారు ఈ పని చేసి ఉండొచ్చని ఆరోపించారు.
చదవండి: Viral Video: ‘కచ్చా బాదం’ మరువక ముందే ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న మరో సాంగ్
Watch #video: #CCTV camera shows driver speeding #car over #elderly man in #UttarPradesh's #Ghaziabad. pic.twitter.com/xiLb8IVJys
— Free Press Journal (@fpjindia) March 31, 2022
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కారు నడిపిన వ్యక్తిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘వీడు మనిషేనా.. అంత నిర్లక్ష్యంగా డ్రైవ్ చేస్తారా.. రోడ్డుపై ముసలివాళ్లు కనిపించినప్పుడు కాస్తా చూసుకొని నెమ్మదిగా డ్రైవ్ చేయాలని తెలీదా?..’ అంటూ మండిపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment