వీడియో: అంత బలుపెందుకు భయ్యా.. హైస్పీడ్‌లో బైకును ఢీకొట్టి.. | Car Drags Bike For Kilometer In Ghaziabad Video Viral | Sakshi
Sakshi News home page

వీడియో: అంత బలుపెందుకు భయ్యా.. హైస్పీడ్‌లో డ్రైవ్‌ చేసి బైకును ఢీకొట్టి..

Published Sat, Nov 5 2022 4:10 PM | Last Updated on Sat, Nov 5 2022 4:11 PM

Car Drags Bike For Kilometer In Ghaziabad Video Viral - Sakshi

అతి వేగం ఎంత ప్రమాదకరమో అందరికీ తెలిసిందే. అయితే, హై స్పీడ్‌లో ఉన్న ఓ కారు డ్రైవర్‌ రెచ్చిపోయాడు. నా కారుకే అడ్డు వస్తారా అనుకున్నాడో ఏమో.. రెండు బైకులకు కారుతో ఢీకొట్టి.. ఓ బైక్‌ను ఏకంగా కిలోమీటర్‌ దూరం వరకు ఈడ్చుకెళ్లాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి ర్యాష్‌ డ్రైవింగ్‌ చేశాడు. ఈ క్రమంలో తన కారుకు అడ్డుగా వచ్చిన రెండు బైకులను ఢీకొట్టాడు. అనంతరం.. కింద పడిపోయిన ఓ బైకును తన కారు ముందు భాగమైన బంపర్‌ కింద పెట్టుకుని దాదాపు కిలోమీటర్‌ దూరం వరకు ఈడ్చుకెళ్లాడు. ఈ క్రమంలో బైక్‌.. రోడ్డుపై ఈడ్చుకుంటూ వెళ్తుండగా రోడ్డుమీద మెరుపులు సైతం రావడం విశేషం. 

ఇంతలో మరో బైక్‌పై బైకర్లు ఇద్దరూ కారును వెంబడించి వీడియో తీశారు. వారిని గమనించిన కారు డ్రైవర్‌ కారును మరింత స్పీడ్‌తో డ్రైవ్‌ చేశాడు. ఇక, ఓ చోట కారును ఆపిన బైకర్లు.. డ్రైవర్‌ను కిందకు దిగాలని అడిగినప్పటికీ అతడు దిగేందుకు నిరాకరించాడు. అనంతరం.. ఈ ఘటనపై ఇందిరాపురం పరిధిలోని పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడిని అరెస్ట్‌ చేసినట్టు తెలిపారు. ఈ ప్రమాదంలో బైకర్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. కాగా, ఈ ప్రమాదం శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో జరిగింది. ఇక, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement