![Watch Terrible Video Man Holds Woman Hanging From Balcony Fallsdown - Sakshi](/styles/webp/s3/article_images/2021/07/15/Viral.jpg.webp?itok=ishO8hoy)
లక్నో: ఆకాశానికి చాలా ఎత్తులో ఉండే బిల్డింగ్ నుంచి ఎవరైనా కిందపడితే ఎముకలు విరిగి అక్కడికక్కడే చనిపోవడం ఖాయం. కానీ ఘజియాబాద్‌లో ఒక మహిళ మాత్రం ప్రమాదవశాత్తు తొమ్మిదో ఫ్లోర్ నుంచి జారిపడినా ఆమె బతికి బట్టకట్టింది. కానీ తీవ్ర గాయాలు కావడంతో ఆమె పరిస్థితి విషమంగానే ఉంది. ఈ ఒళ్లు గగుర్పొడిచే వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
స్థానికుల వివరాల ప్రకారం.. ఘజియాబాద్‌లోని ఒక అపార్ట్‌మెంట్‌లో దంపతుల మధ్య ఘర్షణ జరిగినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో వారు ఉంటున్న తొమ్మిదో ఫ్లోర్ బాల్కనీలో మాట్లాడుతుండగా మహిళ పట్టుతప్పింది. దీంతో ఒక్కసారిగా షాక్‌కు గురైన ఆమె భర్త ఆమె చేతిని గట్టిగా పట్టుకొని పైకి లాగే ప్రయత్నం చేశాడు. కానీ అతని చేతి పట్టు జారి ఆమె ఒక్కసారిగా అందరూ చూస్తుండగానే కిందపడిపోయింది. అంత ఎత్తు నుంచి పడడంతో ఆమె ప్రాణాలు గాల్లో కలిసిపోయాయని అంతా భావించారు. కానీ ఆమె తీవ్ర గాయాలతో పడి ఉంది.
దీంతో వెంటనే ఆమె భర్త స్థానికుల సాయంతో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి ఎవరు ఫిర్యాదు చేయకపోయినా పోలీసులు తమ విచారణనను ప్రారంభించారు. మహిళ ప్రమాదవశాత్తు జారి పడిందా లేక ఆమె భర్త ఆమెనే తోసేశాడా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment