పాపాయిల కోసం ప్రాణాలే అడ్డేసిన నర్సులు | Nurses risk their lives to save babies duringTaiwan earthquake | Sakshi
Sakshi News home page

పాపాయిల కోసం ప్రాణాలే అడ్డేసిన నర్సులు : వైరల్‌ వీడియో

Published Thu, Apr 4 2024 1:48 PM | Last Updated on Sat, Apr 6 2024 6:15 PM

Nurses risk their lives to save babies duringTaiwan earthquake - Sakshi

తైవాన్‌లో వచ్చిన అతిపెద్ద భూకంపం అక్కడి ప్రజలను వణికించింది. గత పాతికేళ్లలో ఎన్నడూ లేని విధంగా భూమి కంపించడం ప్రకపనలు రేపింది. పెద్ద పెద్ద భవనాలు, నివాస గృహాలు ఇళ్లు కుప్పకూలిపోయాయి. కొండచరియలు విరిగిపడ్డాయి. రవాణా  మార్గాలు స్థంభించాయి. ఈ భారీ భూకంపానికి సంబంధించిన వీడియోను, ఫోటోలు సోషల్‌ మీడియాలో చాలా వెలుగులోకి వచ్చాయి. అలాంటి వీడియో ఒకటి నెటిజనుల అభిమానాన్ని సంపాదించుకుంది.

భూకంపం ప్రభావం అక్కడి ఆసుపత్రులను కూడా ప్రభావితంచేశాయి. ఇలాంటి సమయంలో ఆసుపత్రిలో అత్యవసర చికిత్స తీసుకుంటున్న వారు, ఆపరేషన్‌ థియేటర్లలో ఉన్న రోగులు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇందుకు ఆయా విభాగాల వైద్యులు, నర్సులు అప్రమత్తమవుతారు.ప్రాణాలకు తెగించి మరీ వారిని కాపాడేందుకు ప్రయత్నిస్తారు.  అలాంటి ఘటనే తైవాన్‌ భూంకపం సమయంలోనూ చోటు చేసుకుంది. (చీరలతో కేన్సర్‌ ప్రమాదం : షాకింగ్‌ స్టడీ!)

భూకంపం తైవాన్‌ను అతలాకుతలం చేస్తున్న సమయంలో  స్థానిక  ఆసుపత్రిలోని నర్సులు  వెంటనే  స్పందించారు. ఆస్పత్రి మెటర్నిటీ వార్డులో పసికందుల ప్రాణాలు కాపాడడానికి రంగంలోకి దిగారు.  భూప్రకంపనలను గుర్తించిన వెంటనే పరుగు పరుగున వచ్చి ఉయ్యాలలో నిద్రపోతున్న శిశువులను రక్షించే ప్రయత్నం చేయడం పలువురి ప్రశంసలు దక్కించుకుంది. ప్రసూతి యూనిట్‌లోని నలుగురు సిబ్బంది ఉయ్యాలలను కదలకుండా ఉంచడానికి, గట్టిగా పట్టుకోవడానికి కష్టపడ్డారు. ఒక పక్క బిల్డింగ్‌ అటూ ఇటూ ఊగుతోంది. దీనికి పసిబిడ్డలు ఉయ్యాలలూ కదిలిపోతున్నాయి. మరోవైపు కిటికీలు పగులుతాయోమోనన్న భయం. ఈ సమయంలో వారి  ఆందోళన, కష్టం సీసీటీవీలో రికార్డైనాయి.  (గుండెలు పిండే విషాదం : మరణానికి ఏర్పాట్లు చేసుకుంటున్న స్టార్‌ యాక్టర్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement