లెబనాన్‌పై బాంబుల వర్షం | Israel Launches Heavy Attacks On Hezbollah In Lebanon Amid Rising Civilian Deaths, UN Secretary General Urges Immediate Halt To Fighting | Sakshi
Sakshi News home page

లెబనాన్‌పై బాంబుల వర్షం

Mar 14 2026 7:59 AM | Updated on Mar 14 2026 10:36 AM

Israel Rains Bombs on Lebanon

పశ్చిమాసియా యుద్ధ తీవ్రతలు నానాటికీ పెరుగుతున్నాయి. యుద్ధం ప్రారంభమై 15 రోజులు గడుస్తున్నా పరిస్థితులు అదుపులోకి రావడం లేదు. ఈ నేపథ్యంలోనే ఇరాన్‌కు మద్ధతుగా నిలిచే గ్రూపులపై ఇజ్రాయెల్ దాడులకు తెగబడుతుంది. హిజ్బూల్లా స్థావరాలే లక్షంగా అటాక్స్ చేస్తుంది. అయితే ఈ దాడుల్లో అధిక సంఖ్యలో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు.

ఇజ్రాయెల్‌ లెబనాన్‌పై దాడులు తీవ్రతరం చేసింది. కొద్దిరోజుల క్రితమే  గ్రౌండ్‌ లెవల్ ఆపరేషన్‌ చేపట్టింది. ఆ దేశ ఆర్మీ దక్షిణ లెబనాన్‌లోకి చొచ్చుకెళ్లి దాడులు చేస్తున్నాయి. తాజాగా బీరూట్ నగరంపై బాంబులతో విరుచుకపడింది. హిజ్బుల్లా టార్గెట్‌గా జరిగిన దాడుల్లో ఆ దేశంలోని సాధారణ పౌరులు పెద్దమెుత్తంలో మరణిస్తున్నారు. తాజాగా బీరూట్‌పై జరిపిన బాంబుదాడుల్లో 12 మంది వైద్యసిబ్బంది మృతిచెందినట్లు లెబనాన్‌ ప్రకటించింది.


హిజ్బుల్లా హెచ్చరిక

అయితే ఈ నేపథ్యంలో హిజ్బుల్లా నేత నయీమ్ ఖాసిమ్ తీవ్రంగా స్పందిచారు. ఇజ్రాయెల్ దీర్ఘకాలిక యుద్ధానికి సిద్ధంగా ఉండాలని ప్రకటించారు." మమ్మల్ని మేము దీర్ఘకాలిక పోరాటానికి సిద్దం చేసుకున్నాం. భగవంతుడు కోరుకుంటే ఇజ్రాయెల్ యుద్ధ రంగంలో మమ్మల్ని చూసి ఆశ్చర్యపోతుంది. ఇది సాధారణ యుద్ధం కాదు. అస్థిత్వ యుద్దం." అన్నారు. లెబనాన్‌లో మౌళిక సదుపాయాలపై జరుపుతున్న దాడులకు ఇజ్రాయెల్ మూల్యం చెల్లించాలని తెలిపారు.

కాగా నిన్న శుక్రవారం జ్రారియే మరియు టేర్ ఫాల్సే పట్టణాలను కలిపే  లిటాని నదిపై ఉన్న వంతెనను ఇజ్రాయెల్ ధ్వంసం చేసింది. ఇది హిజ్బుల్లాకు ప్రధానమైన రహదారి. ఇది ఉత్తర లెబనాన్ నుండి దక్షిణ లెబనాన్ చేరుకోవడానికి కీలకంగా ఉంటుంది. తాజాగా ఇజ్రాయెల్ దాన్ని ధ్వంసం చేసింది.

ఇజ్రాయెల్ హెచ్చరిక 

కాగా మరోవైపు ఇజ్రాయెల్ ఈ దాడిపై ప్రకటన విడుదల చేసింది. ఇది కేవలం  ప్రారంభం మాత్రమే మరియు హిజ్బుల్లా ఉగ్రవాదులు ఉపయోగించే హిజ్బుల్లాకు తన మద్ధతు ఉపసంహరించి దానిని నిరాయుధీకరణ చేసే వరకూ లెబనాన్ భూభాగం కోల్పోతూనే ఉంటుందని ఇజ్రాయెల్ రక్షణ హెచ్చరించారు.


ఐక్యరాజ్యసమితి స్పందన

అయితే శుక్రవారం బీరుట్ ప్రాంతంలో ఐక్యరాజ్యసమితి చీఫ్ సెక్రటరీ ఆంటోనియో గుటెర్రస్ పర్యటించారు.  ఇజ్రాయెల్,  హిజ్బుల్లాలు తక్షణమే యుద్ధాన్ని ఆపాలని పిలుపునిచ్చారు. యుద్ధం కారణంగా నిరాశ్రయులైన లక్షలాది మంది ప్రజలకు మద్ధతు ఇవ్వడానికి 325 మిలియన్ డాలర్ల మానవతావాద సహాయం అందించాలని ప్రతిపాదన చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement