iran israel war
-
కామికేజ్ డాల్ఫిన్లతో దాడులకు టెహ్రాన్ ప్లాన్..?
ప్రస్తుతం ఇరాన్- అమెరికా మధ్య ఉద్రిక్తతలు ఏ మాత్రం చల్లారడం లేదు. ఇరు దేశాలు సీజ్ఫైర్ అమలు చేస్తున్న యుద్దం విషయంలో మాత్రం స్పష్టత రావట్లేదు. అయితే ఇటీవల ఓ కొత్త విషయం పలువురిని ఇబ్బందులకు గురి చేసింది. అమెరికాపై దాడులకు ఇరాన్ కామికేజ్ డాల్ఫిన్లను ఉపయోగించే అవకాశం ఉందని కథనాల వచ్చాయి. కాగా దీనిపై తాజాగా అమెరికా రక్షణ మంత్రి పీట్స్ హెగ్సెత్ స్పందించారు.ప్రస్తుతం హర్ముజ్ జలసంధి విషయంలో ఇరాన్- అమెరికా మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. జలసంధిని ఇరాన్ బ్లాక్ చేయడంతో ఏం చేయాలో గుండా రవాణాను ఇరాన్ అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అమెరికా సైతం ఇరాన్ నౌకశ్రయాలను బ్లాకేడ్ చేసింది. ఇదిలా ఉండగా ఇటీవల వాల్‌స్ట్రీట్ జనరల్‌లో ప్రచురితమైన కథనం ఇప్పుడు హాట్ టాఫిక్‌గా మారింది.ఈ విషయమై అమెరికా రక్షణ శాఖ మంత్రిని సంప్రదించగా ఈ విధంగా మాట్లాడారు. "ఇరాన్ తన కార్యకలాపాల కోసం 'కామికేజ్ డాల్ఫిన్లను వాడడం పూర్తిగా అవాస్తవం ఇరాన్ వద్ద అటువంటి డాల్ఫిన్ ఆపరేషన్లు ఏవీ లేవని తాను ఖచ్చితంగా చెప్పగలను. అయితే అమెరికా వద్ద అవి ఉన్నాయా అనే ప్రశ్నకు మాత్రం నేను అవును లేదా కాదు అని సమాధానం చెప్పను" అని అన్నారు.ఇరాన్ వద్ద కామికేజ్ డాల్ఫిన్లు ఉన్నాయాఇరాన్ వద్ద ప్రస్తుతం కామికేజ్ డాల్ఫిన్లు ఉన్నాయా లేదా అనే అంశంపై స్పష్టత లేదు. అయితే 2000 సంవత్సరంలో ఇరాన్ రష్యా నుండి కొన్ని శిక్షణ పొందిన డాల్ఫిన్లను కొనుగోలు చేసినట్లు నివేదికలు ఉన్నాయి. కాని అవి ఇప్పుడు చాలా వృద్ధాప్యంలో ఉంటాయని, కాబట్టి వాటిని ప్రస్తుత యుద్ధ అవసరాలకు వాడటం అసాధ్యమని విశ్లేషకులు భావిస్తున్నారు.అమెరికా అమెరికా మాత్రం గత కొన్ని దశాబ్దాలుగా డాల్ఫిన్లకు శిక్షణ ఇస్తోంది. 'యుఎస్ మెరైన్ మమ్మల్ ప్రోగ్రామ్' ద్వారా వీటిని మైన్లను గుర్తించడానికి, సముద్రంలో వస్తువులను వెతకడానికి ఉపయోగిస్తారు.అమెరికా శిక్షణ ఇచ్చే డాల్ఫిన్లు మైన్లను గుర్తించడానికే పరిమితమని అవి బాంబులతో పాటు పేలిపోయే 'కామికేజ్' రకం కాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.డాల్ఫిన్ల ప్రత్యేకతసైనిక అవసరాల కోసం డాల్ఫిన్లను వాడటం కొత్తేమీ కాదు. రష్యా కూడా తన ఓడరేవుల రక్షణ కోసం వీటిని వాడుతుంటుంది. సైన్స్ ప్రకారం, డాల్ఫిన్ల వద్ద ఉన్న సోనార్ వ్యవస్థ అత్యంత అధునాతనమైనది. ఎంత చీకటిగా ఉన్నా లేదా బురద నీటిలోనైనా ఇవి నీటి అడుగున ఉన్న లక్ష్యాలను ఖచ్చితంగా గుర్తించగలవు. మానవ నిర్మిత డ్రోన్ల కంటే ఇవే వేగంగా మైన్లను పసిగట్టగలవని అమెరికా నేవీ వెబ్సైట్ పేర్కొంది.కామికేజ్ అనే పేరుసాధారణంగా, ఆత్మహత్యాయుద్ధానికి పాల్పడే వారిని (ముఖ్యంగా జపాన్ విమాన పైలట్లు) 'కామికేజ్' అని పిలుస్తారు. డాల్పిన్ల విషయానికి వస్తే, వాటి శరీరానికి పేలుడు పదార్థాలను అమర్చి, శత్రువుల నౌకలను లేదా సబ్మెరైన్లను ఢీకొట్టి పేల్చేలా శిక్షణ ఇవ్వడాన్నే "కామికేజ్ డాల్పిన్లు" అంటారు.అయితే, అధికారికంగా ఏ దేశం కూడా తాము ఇలాంటి "ఆత్మహత్య" దళాలను వాడుతున్నామని ఒప్పుకోలేదు. కానీ, అమెరికా మరియు రష్యా వంటి దేశాలు "మెరైన్ మామల్ ప్రోగ్రామ్స్" ద్వారా ప్రస్తుతం డాల్పిన్లకు సైనిక శిక్షణ ఇస్తున్నాయి. -
కాల్పుల విరమణ ఎత్తివేత..! మళ్లీ ఇరాన్- అమెరికా మధ్య యుద్ధం
-
భారత్ వృద్ధికి యుద్ధం బ్రేక్
పశ్చిమాసియా ఘర్షణలతో నౌకల రవాణాకు అటంకాలు, ఇంధన ధరల పెరుగుదల భారత జీడీపీ వృద్ధికి జోరుకు అవరోధాలు కలి్పంచొచ్చని.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది 6.5 శాతంలోపునకు తగ్గిపోవచ్చని సీఐఐ ప్రెసిడెంట్ రాజీవ్ మెమానీ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా పశ్చిమాసియాలో యుద్ధంతో ఏర్పడిన ఇంధన సంక్షోభం ఎక్కువ కాలం పాటు కొనసాగితే ప్రపంచ ఆర్థిక వృద్ధితోపాటు భారత్ వృద్ధికీ అతిపెద్ద రిస్క్‌గా పేర్కొన్నారు. ఒకవేళ సకాలంలో పరిష్కారమైతే అప్పుడు వృద్ధి పుంజుకుంటుందన్నారు. అప్పుడు 6.5–7 శాతం మధ్య వృద్ధి నమోదు కావొచ్చని అంచనా వేశారు. ఒకవేళ దీర్ఘకాలం పాటు కొనసాగితే అది 6.5 శాతం కంటే తక్కువగా ఉండొచ్చన్నారు.పశ్చిమాసియా సంక్షోభం పరిష్కారమయ్యేంత వరకు జీడీపీపై, వడ్డీ రేట్లపై ఒక నిర్ణయాత్మక అభిప్రాయానికి రాలేమన్నారు. చమురు ధరలు అధిక స్థాయిల్లో (100 డాలర్లకు పైన) ఉంటే, అది వృద్ధిపై తప్పకుండా ప్రభావం చూపిస్తుందన్నారు. కాకపోతే గత 10–12 ఏళ్లలో ఏవో కొన్ని సందర్భాలను మినహాయిస్తే దాదాపు చమురు ధరలు కనిష్టాల్లోనే ఉన్నాయంటూ.. అది దేశ వృద్ధికి సాయపడినట్టు చెప్పారు. గత ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి 7.6 శాతంగా ఉంటుందన్నది ప్రభుత్వం అంచనా. వడ్డీ రేట్లు తగ్గకపోవచ్చు..వడ్డీ రేట్లు సమీప కాలంలో కిందకు దిగొచ్చే పరిస్థితుల్లేవని రాజీవ్ మెమానీ పేర్కొన్నారు. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా సమస్యలను ఎదుర్కొంటున్న ఎంఎస్ఎంఈలకు మద్దతుగా లక్ష్యిత చర్యలను ప్రభుత్వం ప్రకటించాలని కోరారు. ముఖ్యంగా రుణసాయం విషయంలో సమస్యలున్నట్టు చెప్పారు. వ్యాపార సులభతర నిర్వహణ, చిన్న తప్పులను నేరాలుగా చూడకపోవడం, న్యాయ సంస్కరణల విషయంలో వేగవంతమైన చర్యలు అవసరమన్నారు. ఈ దిశగా గత 12–18 నెలల్లో పభుత్వం చేసిన కృషిని అభినందించారు. వివాదాల సంఖ్యను సాధ్యమైనంత తగ్గించాలని, పరిష్కారానికి ప్రత్యామ్నాయ మార్గాలు అవసరమని మెమానీ పేర్కొన్నారు. ఈ దిశగా ప్రభుత్వానికి సీఐఐ సూచనలు ఇచ్చినట్లు చెప్పారు. వృద్ధి 6.3 శాతమే: ఏడీబీపశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో భారత్ వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 0.6 శాతం తగ్గి 6.3 శాతానికి పరిమితం కావొచ్చని ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ఏడీబీ) ముఖ్య ఆర్థికవేత్త ఆల్బర్ట్ పార్క్ అంచనా వేశారు. అయితే, వచ్చే ఆర్థిక సంవత్సరంలో వృద్ధి పుంజుకుంటుందన్నారు. 2025–26లో భారత్ జీడీపీ బలంగా 6.9 శాతం వృద్ధిని నమోదు చేస్తుందని, 2027–28లో 7.3 శాతానికి పుంజుకుంటుందని.. 2026–27లో ద్రవ్యోల్బణం 4.5 శాతంగా ఉంటుందని ఏడీబీ ఏప్రిల్‌లో అంచనాలు ప్రకటించడం గమనార్హం. ఇక ద్రవ్యోల్బణం ఏప్రిల్ అంచనా కంటే 2.4 శాతం పెరిగి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6.9 శాతానికి చేరుకోవచ్చని పార్క్ తెలిపారు. చమురు, గ్యాస్ కోసం దిగుమతులపై భారత్ ఎక్కువగా ఆధారపడి ఉన్నట్టు గుర్తు చేశారు.ఎల్‌నినో ప్రభావంఎల్నినో ప్రభావంపై మాట్లాడుతూ.. భారత్‌లో సాగుపై ప్రభావం పడినప్పుడల్లా ధరల పరమైన సమస్యలు ఉంటాయన్నారు. ప్రపంచంలో బియ్యం ఎగుమతుల్లో పెద్ద వాటా కలిగి ఉన్నందున, భారత్‌లో సాగుకు ఇబ్బందులు ఏర్పడితే ప్రపంచ దేశాలపైనా దాని ప్రభావం ఉంటుందన్నారు. ఎరువుల ధరలు పెరిగిపోవడం వల్ల రైతులు తక్కువగా వినియోగిస్తారని.. దీంతో దిగుమతి తగ్గి ఆ తర్వాత ఆహార లభ్యత తగ్గుతుందన్నారు. ధరలపై దీని ప్రభావం కచి్చతంగా ఉంటుందన్నారు. పునరుత్పాదక ఇంధన వనరుల వైపు వేగంగా మళ్లడం, ఇతర ఇంధన వనరుల దిగుతులపై ఆధారపడడాన్ని తగ్గించుకోవడం అవసరమన్నారు. అయితే భారత్‌లో ఎన్నో సంస్కరణలు కొనసాగుతున్నాయంటూ, వృద్ధి అవకాశాలు దీర్ఘకాలానికి ఇప్పటికీ ఆశావహంగానే ఉన్నట్టు పార్క్ చెప్పారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) మెరుగుపడతాయని, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు సాయపడతాయన్నారు.ఇదీ చదవండి: కాగ్నిజెంట్ 15 వేల మందికి ఉద్వాసన -
ప్రాజెక్ట్ ఫ్రీడమ్ ఆపరేషన్ నిలిపేస్తున్నాం: ట్రంప్
వాషింగ్టన్: ఇరాన్‌లోని హార్మూజ్ జలసంధికి సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక ప్రకటన చేశారు. ఇరాన్‌తో దౌత్యపరమైన ప్రయత్నాలలో పురోగతి కనిపిస్తున్నందున జలసంధి గుండా నౌకల రాకపోకలను నిర్ధారించే లక్ష్యంతో చేపట్టిన ప్రాజెక్ట్ ఫ్రీడమ్ ఆపరేషన్‌ను అమెరికా తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ట్రంప్ తెలిపారు. అయితే, ఇరాన్‌పై ఉన్న బ్లాకేడ్ (నౌకాశ్రయాల నిర్బంధం) మాత్రం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.అధ్యక్షుడు ట్రంప్ తాజాగా సోషల్ మీడియా ట్రుత్ వేదికగా..‘ఇరాన్‌తో చర్చల్లో గొప్ప పురోగతి కనిపిస్తోంది. అందుకే హార్మూజ్‌లో చేపట్టిన ప్రాజెక్ట్ ఫ్రీడమ్ ఆపరేషన్‌ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నాం. పాకిస్తాన్, ఇతర దేశాల అభ్యర్థనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నాం. ఈ ఆపరేషన్‌ను నిలిపివేయడానికి మేం పరస్పరం అంగీకరించాం. ఇరాన్ ప్రతినిధులతో చర్చలు సంపూర్ణ, తుది ఒప్పందం దిశగా వెళ్తున్నాయి. త్వరలో ఒప్పందం కుదిరే అవకాశముంది. అయితే, సముద్ర కార్యకలాపాలు నిలిచిపోయినప్పటికీ ఇరాన్‌పై ఒత్తిడి కొనసాగుతుంది. ఇరాన్ నౌకాశ్రయాలపై దిగ్బంధనం పూర్తి స్థాయిలో కొనసాగుతుంది. ఇరాన్‌పై అమెరికా సాగిస్తున్న పోరాటం సైనిక విజయమే. త్వరలో ఒప్పందం కుదిరే అవకాశముందని పేర్కొన్నారు.President Trump posts on TruthSocial: Based on the request of Pakistan and other Countries, the tremendous Military Success that we have had during the Campaign against the Country of Iran and, additionally, the fact that Great Progress has been made toward a Complete and Final… pic.twitter.com/BF6mZ4AtCc— Donald J Trump Posts TruthSocial (@TruthTrumpPost) May 6, 2026కాగా, ఈ చర్యల ద్వారా అమెరికా ఒకవైపు సైనిక ఒత్తిడి కొనసాగిస్తూ, మరోవైపు చర్చల ద్వారా పరిష్కారం కనుగొనే ప్రయత్నం చేస్తోంది. హార్మూజ్ జలసంధి ప్రపంచ వాణిజ్యానికి కీలక మార్గం. ముఖ్యంగా చమురు రవాణాలో ఇది అత్యంత ప్రాముఖ్యమైనది. ఈ మార్గంలో ఉద్రిక్తతలు పెరిగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.కీలక పరిణామాలు.. ఇక, ఇరాన్‌తో అమెరికా చర్చలు కొనసాగుతున్నాయి. పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో రెండు దేశాల మధ్య సందేశాల మార్పిడి జరుగుతోంది. అయితే అమెరికా ప్రతిపాదనలపై ఇరాన్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అణు కార్యక్రమం కూడా ఈ చర్చల్లో కీలక అంశంగా మారింది. ఇరాన్ అణ్వాయుధాల దిశగా కదులుతోందని అమెరికా ఆరోపిస్తుండగా, ఇరాన్ మాత్రం తన కార్యక్రమం శాంతియుతమని చెబుతోంది. మొత్తానికి ప్రస్తుతం పరిస్థితి చూస్తే హార్మూజ్‌లో ఉద్రిక్తతలు తగ్గకపోయినా, చర్చల ద్వారా పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నట్టు కనిపిస్తోంది. ప్రాజెక్ట్ ఫ్రీడమ్‌కు ఇచ్చిన తాత్కాలిక విరామం ఆ దిశలో కీలక మలుపుగా మారే అవకాశముంది. -
"భారత్ పేరుతో అమెరికా కొత్తనాటకం"
అమెరికా అవకాశ వాదం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తమ దేశానికి అవసరం ఉంటే ఉగ్రవాద నాయకులను కూడా ప్రపంచ శాంతి దూతలను చేస్తోంది. అదే వారితో పనైపోతే ఈడ్చితంతుంది. ఇది ఆ దేశం యెుక్క నైజం.. తాజాగా అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ ఆ విషయాన్ని మరోసారి రుజువు చేశారు.ఇరాన్‌తో యుద్ధం ప్రారంభించి ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం తలెత్తేలా చేసిన యుఎస్ఏ ఇప్పుడు.. అంతర్జాతీయ సరఫరా గొలుసులను, ముఖ్యంగా భారతదేశంలోని కోట్లాది మంది ప్రజల వంట అవసరాలకు కీలకమైన లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (LPG) రవాణాను రక్షించడం కోసం ప్రాజెక్ట్ ఫ్రీడమ్‌ను ప్రారంభించినట్లు తెలిపింది. తనపై వస్తున్న విమర్శలను కప్పిపుచ్చుకోవడానికి మానవతా సాయం పేరుతో కొత్తనాటకానికి తెర తీసింది. అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ ఈ విషయమై మాట్లాడుతూ.. హర్ముజ్ జలసంధిలో చిక్కుకుపోయిన నౌకలకు దారి చూపేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రూపొందించిన "ప్రాజెక్ట్ ఫ్రీడమ్" ప్రణాళిక ఒక "మానవతా ప్రయత్నం" అంతర్జాతీయ సరఫరా గొలుసులను, ముఖ్యంగా భారతదేశంలోని కోట్లాది మంది ప్రజల వంట అవసరాలకు కీలకమైన లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (LPG) రవాణాను రక్షించడమే దీని లక్ష్యం అని ఆయన అన్నారు.గత నెలలో జరిగిన ప్రపంచ బ్యాంకు సదస్సులో పేద మరియు అత్యంత బలహీనమైన దేశాలు తన వద్దకు వచ్చి, హర్ముజ్ జలసంధి ద్వారా వాణిజ్య రవాణాను పునరుద్ధరించాలని అమెరికాను కోరాయని అందుకే ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. "ఇది ఒక మానవతా ప్రయత్నం. ఇందులో కేవలం ఇంధనం మాత్రమే కాదు, ఎరువులు, ఆహార రవాణా మరియు భారతదేశంలోని బిలియన్ కంటే ఎక్కువ మంది ప్రజలు వంట కోసం ఉపయోగించే LPG కూడా ఉన్నాయి," అని ఆయన అన్నారు.చైనాపై ఆరోపణలుకాగా ఈ నేపథ్యంలోనే బెన్సెంట్ చైనాను విమర్శించారు."ఇరాన్‌కు చైనా ఆర్థికంగా అండగా నిలుస్తోంది. ఇరాన్ ప్రపంచంలోనే అతిపెద్ద ఉగ్రవాద ప్రోత్సాహక దేశం. చైనా వారి ఇంధనంలో 90 శాతాన్ని కొనుగోలు చేస్తూ, ఆ ఉగ్రవాద దేశానికి నిధులు సమకూరుస్తోంది," అని ఆయన ఆరోపించారు. వచ్చే వారం ట్రంప్ మరియు జిన్‌పింగ్‌ల భేటీ జరగనున్న నేపథ్యంలో, ఈ విషయంలో చైనా నిర్మాణాత్మక పాత్ర పోషించాలని ఆయన కోరారు.ఇరాన్ దగ్గర సత్తా లేదుయుద్ధంలో ఇరాన్ తన పోరాట పటిమను కోల్పోయిందని, అమెరికా దళాలకు వ్యతిరేకంగా ఇరాన్ చేస్తున్న ప్రకటనలన్నీ కేవలం 'ప్రచారమే అన్నారు. ఇరాన్ నాయకత్వం దేశవ్యాప్తంగా బంకర్లలో దాక్కుంది, అసలేం జరుగుతుందో వారికి తెలియడం లేదని .ఇరాన్ నౌకాదళం ఇప్పుడు ఒక నౌకాదళంలా లేదు, అది కేవలం "సముద్రపు దొంగల ముఠా"గా మారిందన్నారు. వారు అంతర్జాతీయ నౌకాయాన స్వేచ్ఛను అడ్డుకోవాలని చూస్తున్నారని అమెరికా దాన్ని అడ్డుకుంటుందని తెలిపారు. ఇరాన్ ఆర్థిక వ్యవస్థ పతనమవుతోంది. సైనికులకు జీతాలు అందకపోతే వారు పోరాడలేరని ఆయన వ్యాఖ్యానించారు. -
అమెరికా KC-135 స్ట్రాటోట్యాంకర్ అదృశ్యం
వాషింగ్టన్: ఇరాన్‌పై యుద్ధంలో అమెరికాకు ఎదురుదెబ్బ తగిలింది. అమెరికా సైనిక విమానాలకు గాలిలో ఇంధన కేంద్రంగా పనిచేసే బోయింగ్ కేసీ-135 స్ట్రాటోట్యాంకర్ విమానం ఆచూకీ గల్లంతయ్యింది.ఫ్లైట్రాడార్24 డేటా ప్రకారం.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని అల్ ధఫ్రా ఎయిర్ బేస్ నుండి బయలుదేరిన ఈ విమానం ఖతార్ మీదుగా ప్రయాణిస్తుండగా సంకేతాలు నిలిచిపోయాయి. అదృశ్యానికి ముందు ‘7700’ అనే అత్యవసర సంకేతాన్ని జారీ చేసింది.విమానాన్ని పర్షియన్ గల్ఫ్ మీదుగా కొనసాగుతున్న సైనిక చర్యలకు మద్దతుగా ఉపయోగిస్తున్నట్లు సమాచారం. ల్యాండింగ్‌కు ముందు కొంతసేపు గాలిలో వృత్తాకారంలో తిరిగినట్లు ట్రాకింగ్ డేటా తెలిపింది. అత్యవసర పరిస్థితికి కారణం ఇంకా తెలియాల్సి ఉంది.ఈ ఘటనపై ఇరాన్ మీడియా సంస్థ ఫార్స్ వార్తా సంస్థ ఈ ఘటనపై నివేదిక ఇచ్చింది. అయితే, అమెరికా విమానం అదృశ్యానికి ఇరాన్ ప్రమేయం ఉందని ఎలాంటి ప్రకటన చేయలేదు. -
ఇరాన్-అమెరికా యుద్ధం తీవ్రస్థాయికి?.. సంచలన వ్యాఖ్యలు
ఇటీవలే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఇరాన్ ప్రతిపాదన తనకు నచ్చలేదని యుద్దం ముగించే అవకాశాలు లేవని అన్నారు. తాజాగా దీనికి ఇరాన్ అధికారి ఘాటుగా స్పందించారు. ఇరాన్- అమెరికా మధ్య మరోసారి యుద్ధం తీవ్రస్థాయికి చేరే అవకాశం ఉందన్నారు.ఆ దేశ మిలిటరీ కేంద్ర కమాండ్‌లోని సీనియర్ అధికారి మొహమ్మద్ జాఫర్ అసాదీ మాట్లాడుతూ "ఇరాన్ మరియు యునైటెడ్ స్టేట్స్ మధ్య మరోసారి ఘర్షణ జరిగే అవకాశం ఉంది." అని అన్నారు. యు.ఎస్ అధికారుల తాజా చర్యలు మరియు ప్రకటనలు కేవలం "వారు సృష్టించిన గందరగోళం నుండి బయటపడటానికి మాత్రమేనని ఆయన తెలిపారు. యు.ఎస్ అధికారుల చర్యలు మరియు ప్రకటనలు ప్రాథమికంగా మీడియా ఆధారితమైనవి. చమురు ధరలు పడిపోకుండా నిరోధించడం ఒకటైతే, వారు సృష్టించిన గందరగోళం నుండి తమను తాము రక్షించుకోవడం రెండవది" అని ఆయన అన్నారు. అమెరికా ఏదైనా ఉద్రిక్తతలకు పాల్పడితే ఇరాన్ సాయుధ బలగాలు తిప్పికొట్టడానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. అమెరికన్లు చేసే ఏ కొత్త సాహసాలకైనా, మూర్ఖత్వాలకైనా సాయుధ బలగాలు పూర్తిగా ఎదుర్కొంటాయి అని పేర్కొన్నారు అని ఆయన పేర్కొన్నారు. కాగా ఇది వరకే ఇరాన్ న్యాయవ్యవస్థ అధిపతి దీనిపై స్పందించారు.తమ దేశం "చర్చల నుండి ఎప్పుడూ వెనుకడుగు వేయలేదని కానీ కానీ శాంతి పేరుతో నిబంధనలను రుద్దడం ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించబోమన్నారు. కాగా ప్రస్తుతం అమెరికా-ఇరాన్ మధ్య సీజ్ ఫైర్ నడుస్తోంది. ఇరు దేశాలు కాల్పుల విరమణను పాటిస్తున్నాయి. అయితే అణుఒప్పందం విషయంలో ఇరు దేశాలు వెనక్కి తగ్గకపోవడంతో యుద్ధం మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
ఇరాన్‌పై యుద్ధం ముగిసింది.. కాంగ్రెస్ అనుమతి అక్కర్లేదు
వాషింగ్టన్: ఇరాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చింది కాబట్టి యుద్ధం ముగిసినట్లేనని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా కాంగ్రెస్‌కు తెలియజేశారు. యుద్ధానికి చట్టపరమైన ఆమోదం కోసం తాను గడువును పాటించాల్సిన అవసరం లేదని వాదించారు. అమెరికా, ఇరాన్ మధ్య ఫిబ్రవరి 28న ఆరంభమైన దాడులు ఏప్రిల్ 7 నుంచి ఆగిపోయాయని గుర్తుచేశారు. 1973 నాటి వార్ పవర్స్ చట్టం ప్రకారం.. అమెరికా అధ్యక్షుడు మరో దేశంపై సైనిక చర్య ప్రారంభించినప్పుడు దాని గురించి చట్టసభ సభ్యులకు తెలియజేసిన 60 రోజుల్లోపు కాంగ్రెస్ ఆమోదం పొందాలి. లేకపోతే యుద్ధాన్ని విరమించుకోవాల్సి ఉంటుంది. ట్రంప్ శుక్రవారం కాంగ్రెస్ సభ్యులకు లేఖ రాశారు. కాల్పుల విరమణ నేపథ్యంలో యుద్ధం ఆగిపోయింది కాబట్టి వార్ పవర్స్ చట్టం ప్రకారం తాను నడుచుకోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఇరాన్‌పై యుద్ధం గురించి కాంగ్రెస్ సభ్యులకు అధికారికంగా తెలియజేసిన తర్వాత సరిగ్గా 60వ రోజున ట్రంప్ ఈ లేఖ రాయడం గమనార్హం. 60 రోజుల డెడ్‌లైన్ శుక్రవారమే ముగిసింది. మరోవైపు అమెరికా, ఇరాన్ మధ్య తాత్కాలికంగా కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పటికీ దీర్ఘకాల శాంతి ఒప్పందంపై ఇంకా ఒక నిర్ణయానికి రాలేదు. ఇరుదేశాల మధ్య చర్చల ప్రక్రియలో ప్రతిష్టంభన కొనసాగుతోంది. ప్రధానంగా అణ్వస్త్ర ప్రయోగాల విషయంలో అమెరికా విధించిన షరతులను ఇరాన్ అంగీకరించడం లేదు. వారికి లేని అనుమతి నాకెందుకు? ఇరాన్‌తో యుద్ధం కొనసాగించడానికి తనకు కాంగ్రెస్ అనుమతి అవసరం లేదని ట్రంప్ తేల్చిచెప్పారు. గతంలో అమెరికా కమాండర్–ఇన్–చీఫ్‌లు అలాంటి అనుమతి ఏనాడూ తీసుకోలేదని స్పష్టంచేశారు. యుద్ధం చేసే విషయంలో అధ్యక్షుడి అధికారాలను పరిమితం చేసే కాంగ్రెస్ అధికారాన్ని మాజీ అధ్యక్షులు పూర్తిగా రాజ్యాంగ విరుద్ధంగా భావించారని తెలిపారు. ట్రంప్ తాజాగా మీడియాతో మాట్లాడారు. ఇరాన్‌పై దాడులు కొనసాగించడానికి కాంగ్రెస్ నుంచి అనుమతి తీసుకుంటారా? అని ప్రశ్నించగా, మాజీ అధ్యక్షులు కాంగ్రెస్‌ను పరిగణనలోకి తీ సుకోకుండా యుద్ధాలు చేశారని పేర్కొన్నారు. ఇంతకుముందు ఎవరూ అనుమతి అడగలేదని వెల్లడించారు. వారికి లేని అనుమతి తనకెందుక ని ట్రంప్ పరోక్షంగా అసహనం వ్యక్తంచేశారు. ఇరాన్ నుంచి తిరిగొస్తూ క్యూబాను స్వాదీనం చేసుకుంటాం చమత్కరించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి చమత్కరించారు. ఇరాన్ నుంచి స్వదేశానికి తిరిగి వచ్చేటప్పుడు అమెరికా నౌకాదళం క్యూబాతో తలపడుతుందని అన్నారు. క్యూబాను స్వాధీనం చేసుసుకొనే ఆలోచన ఉందంటూ తన మనసులోని మాటను పరోక్షంగా వ్యక్తీకరించారు. క్యూబాకు చాలా సమస్యలు ఉన్నాయని చెప్పారు. ట్రంప్ శుక్రవారం సాయంత్రం ఓ కార్యక్రమంలో మాట్లాడారు. ‘‘ఇరాన్ నుండి తిరిగి వస్తున్నప్పుడు, మా పెద్ద విమాన వాహక నౌకల్లో ఒకటైన, బహుశా ప్రపంచంలోనే అతిపెద్దదైన యూఎస్ఎస్ అబ్రహం లింకన్‌ను క్యూబా తీరానికి సుమారు 100 గజాల దూరంలో నిలిపినప్పుడు క్యూబా ప్రజలు ఎదురొస్తారు. మీకు ధన్యవాదాలు, మేము లొంగిపోతున్నాం అని చెబుతారు’’అని ట్రంప్ వ్యాఖ్యానించారు. క్యూబాపై అమెరికా ఎప్పటినుంచో కన్నేసింది. అక్కడి ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది. తనకు కావాల్సింది సాధించుకోవడానికి క్యూబాపై సైనిక చర్య తీసుకోవచ్చని ట్రంప్ పదేపదే బెదిరిస్తూ వస్తున్నారు. హార్మూజ్‌లో ఇరాన్‌కు చెల్లింపులు చేస్తే ఆంక్షలు విధిస్తాం దుబాయ్: హార్మూజ్ జలసంధిలో ప్రయాణించడానికి ఇరాన్‌కు చెల్లింపులు చేస్తే ఆంక్షలు విధిస్తామని షిప్పింగ్ కంపెనీలను అమెరికా హెచ్చరించింది. ఈ మేరకు యూఎస్ ఆఫీసు ఆఫ్ ఫారిన్ అసెట్స్ కంట్రోల్ శుక్రవారం సోషల్ మీడియాలో పోస్టుచేసింది. హార్మూజ్ జలసంధిని తెరిచే విషయంలో ప్రతిష్టంభన కొనసాగుతోంది. జలసంధిలో ఇరాన్ ఓడరేవులను అమెరికా సైన్యం దిగ్బంధించింది. మరోవైపు విదేశీ నౌకల రాకపోకలను ఇరాన్ అడ్డుకుంటోంది. తమ తీరానికి దగ్గరగా ఉన్న మార్గాల్లో కొన్ని నౌకలకు మాత్రం అనుమతి ఇస్తోంది. అందుకు వాటి నుంచి రుసుము వసూలు చేస్తోన్న సంగతి తెలిసిందే. -
హార్మూజ్‌ను దాటుకుని వస్తున్న భారత నౌక
బెంగళూరు: హార్మూజ్ జలసంధి వద్ద ఇతర దేశాల నౌకలకు అనుమతి నిరాకరిస్తూ భారత నౌకలకు మాత్రం అనుమతి ఇచ్చామని ఇండియాలోని ఇరాన్ సుప్రీం లీడర్ ప్రతినిధి అబ్దుల్ మజీద్ హకీమ్ ఇలాహీ అన్నారు. దీనిబట్టే రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు ఎంత బలంగా ఉన్నాయో తెలుస్తోందని తెలిపారు. మార్షల్ ఐలాండ్స్ జెండా ఉన్న ఎల్పీజీ క్యారియర్ ఎంఠీ సర్వ్ శక్తి భారత సరుకు తీసుకుని మే 2న హార్మూజ్ జలసంధిని సురక్షితంగా దాటింది. మే 13న విశాఖపట్నానికి చేరే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. 46,313 మెట్రిక్ టన్నుల లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ తీసుకెళ్తున్న ఈ నౌకలో 20 మంది సిబ్బంది ఉన్నారు. అందులో 18 మంది భారతీయులు ఉన్నారు. బెంగళూరులో నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఇలాహీ మాట్లాడుతూ.. భారత్-ఇరాన్ మధ్య శతాబ్దాల చరిత్ర, సంస్కృతి ఆధారంగా బంధం నిలిచిందని తెలిపారు. వివిధ రంగాల్లో దౌత్య సంబంధాలు కొనసాగుతున్నాయని చెప్పారు. “భారత్ ఒక గొప్ప దేశం. మేము భారత ప్రజలను గౌరవిస్తాము. మాకు ఇరాన్‌తో 5,000 సంవత్సరాల సంబంధం, స్నేహం ఉంది. విద్య, తత్వశాస్త్రం, సంస్కృతి, నాగరికత, ఆర్థిక రంగాల ద్వారా ఇరాన్ భారత్‌తో అనుసంధానమై ఉంది. ఇరానీయులు భారతీయులను చాలా ఇష్టపడతారు. మన సంస్కృతి కూడా ఒకటే. మన ప్రవర్తన ఒకటే. మన ముఖాలు, ఆకృతులు కూడా ఒకటే” అని అన్నారు.“భారత్-ఇరాన్ మధ్య సంబంధం, స్నేహం చాలా బలంగా, లోతుగా ఉంది. ప్రస్తుతం భారత్‌తో మా సంబంధం, సహకారం చాలా బాగుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్‌తో మూడుసార్లు చర్చించారు. భారత్ విదేశాంగ మంత్రి కూడా ఇరాన్ విదేశాంగ మంత్రితో అనేక సార్లు చర్చలు జరిపారు. అనేక దేశాలకు అనుమతి లభించని సమయంలో ఇరాన్ భారత నౌకలు హార్మూజ్ జలసంధిని దాటేందుకు అనుమతించింది” అని ఆయన తెలిపారు.గత శతాబ్దాల్లో అనేకమంది ఇరానీయులు భారత్‌లో స్థిరపడ్డారని, ఇది సామాజిక, సాంస్కృతిక సంబంధాలను మరింత బలపరిచిందని చెప్పారు. భవిష్యత్ సంబంధాలపై ఆశాభావం వ్యక్తం చేస్తూ.. సత్సంబంధాలు మరింత బలపడతాయని అన్నారు. ఇరాన్ నాయకత్వం భారత్‌తో సన్నిహిత సంబంధాలను ప్రోత్సహించిందని, ద్వైపాక్షిక సహకారంలో అడ్డంకులను తొలగించేందుకు మద్దతు ఇచ్చిందని తెలిపారు.ఇరాన్ అగ్ర నాయకత్వాన్ని ప్రస్తావిస్తూ.. దివంగత సుప్రీం లీడర్ అలీ ఖమేనీ గతంలో పలుసార్లు భారత్‌తో బలమైన సంబంధాలను ప్రోత్సహించారని, అడ్డంకులు ఉండకూడదని అన్నారని తెలిపారు. ప్రస్తుతం ఉన్న సుప్రీం లీడర్ అయతొల్లా సయ్యద్ మొజ్తబా ఖమేనీ కూడా భారత్‌ను ఇష్టపడతారని, రెండు దేశాల మధ్య వ్యూహాత్మక, స్నేహపూర్వక సంబంధాలను మరింత బలపరచాలని భావిస్తున్నారని తెలిపారు. -
"మేము సముద్రపు దొంగలమేమో" .. ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యవహార శైలి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయిన ఎప్పుడు ఎలా మాట్లాడుతారో ఆయనకే తెలియదు. తాజాగా ఆయన అటువంటి వ్యాఖ్యలే చేశారు. "మేము సముద్రపు దొంగల లాంటి వాళ్లం" అని అమెరికాలో జరిగిన ర్యాలీలో మాట్లాడారు. హర్ముజ్ జలసంధిలో ఇరాన్ నౌకల స్వాధీనం నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఫ్లోరిడాలో జరిగిన ఒక ర్యాలీ ట్రంప్ మాట్లాడారు. అందులో " మేము ... నౌకపైకి దూకి, దాన్ని మా ఆధీనంలోకి తీసుకున్నాము. సరుకును స్వాధీనం చేసుకున్నాం, చమురును తీసుకున్నాం. ఇది చాలా లాభదాయకమైన వ్యాపారం." అన్నారు. ట్రంప్ ఇలా వ్యాఖ్యానించిన తర్వాత ఆ సభలో ప్రజలు కేరింతలు కొడుతూ ఈలలు వేశారు. ఇటీవల ఇరాన్‌కు చెందిన నౌకలను అమెరికా దిగ్భందనం చేసింది ఈ నేపథ్యంలో ట్రంప్ ఇలా మాట్లాడారు.అయితే ఇరాన్ ఓడరేవుల వద్ద అమెరికా నౌకాదళం దిగ్బంధనం కొనసాగుతుంది. అమెరికా దళాలు 'మేజిస్టిక్ ఎక్స్' ఇరాన్-ఫ్లాగ్ కలిగిన 'టూస్కా' వంటి కార్గో నౌకలను స్వాధీనం చేసుకున్నాయి. దీనిపై ఇరాన్ సైతం ఘాటుగానే స్పందించింది. "అంతర్జాతీయ జలాల్లో సాయుధ దోపిడీ" అని పేర్కొంటూ, వాషింగ్టన్ అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తోందని ఆరోపించింది.విదేశాంగ శాఖ ప్రతినిధి ఎస్మాయిల్ బఘాయీ మాట్లాడుతూ, ఈ చర్య వాస్తవంగా సముద్రపు దొంగతనాన్ని సమర్థించడమేనని అన్నారు. దీనిని ఆయన "అంతర్జాతీయ జలాల్లో సముద్రపు దొంగతనం మరియు సాయుధ దోపిడీని ప్రత్యక్షంగా చట్టబద్ధం చేయడమే" అని అభివర్ణించారు. తాజాగా ట్రంప్ సైతం ఈ వ్యాఖ్యలకు కౌంటర్ తాము సముద్రపు దొంగలమేనన్నారు.అయితే కొద్దిసేపటి క్రితం ట్రంప్ మాట్లాడుతూ ఇరాన్ చర్యలు తనను సంతృప్తి పరచలేదని యుద్దాన్ని ముగించే ప్రసక్తే లేదన్నారు. -
ఒకప్పుడు బాంబులు మోత.. ఇప్పుడు మాత్రం..?
ప్రస్తుతం అమెరికా- ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం నడుస్తోంది. దీంతో కాల్పుల మోతకు తాత్కాలిక తెర పడింది. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దాదాపుగా రెండునెలలలుగా కాల్పుల మోతతో దద్దరిల్లిపోయిన టెహ్రాన్ నగరం ఇప్పుడు ఏలా ఉందో ఆ యువతి వీడియో చూపించింది. ఈ వీడియో నెటిజన్స్‌ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇరాన్, ఇజ్రాయెల్, మరియు అమెరికా దేశాల మధ్య కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో'ఎస్టెల్' అనే వినియోగదారు షేర్ చేసిన ఇన్స్టాగ్రామ్ వీడియో ఒకటి ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది. "ఏ డే ఇన్ టెహ్రాన్ డ్యూరింగ్ సీజ్ఫైర్" (టెహ్రాన్‌లో కాల్పుల విరమణ వేళ ఒక రోజు) పేరుతో ఉన్న ఈ వీడియో, టెహ్రాన్‌లోని సాధారణ ,ప్రశాంతమైన జీవనశైలిని ప్రపంచానికి చూపిస్తోంది. గతంలో క్షిపణులు నగరాన్ని తాకిన భయానక దృశ్యాలకు ఇది పూర్తిగా భిన్నంగా ఉండటంతో ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.టెహ్రాన్ మెుత్తం కలియతిరుగుతూ...రాజధాని నగర వీధుల గుండా ప్రయాణిస్తూ ఎస్టెల్ తన కారులో ప్రధాన రహదారుల గుండా ప్రయాణిస్తూ నగరాన్ని చూపించారు. ఫుట్‌పాత్ మీద ఉన్న ఒక చిన్న విక్రేత వద్ద క్యాట్ ప్లషీని కొనడం, ఒక ఫుడ్ కోర్టులోకి వెళ్లి లంచ్ ఆర్డర్ చేయడం, ఇరానియన్ బిస్కెట్లు కొనడం వంటి దృశ్యాలు ఉన్నాయి. అంతేకాకుండా, ఆమె ఒక స్టాల్లో కొరియన్ ఫుడ్ కూడా రుచి చూసింది.అదే విధంగదా సాయంత్రం సమయంలో, ఆమె ఒక విలాసవంతమైన హోటల్లోని లాంజ్‌కు వెళ్ళింది. అక్కడ ప్రజలు యుద్ధ భయం లేకుండా ఆనందంగా సమయాన్ని గడుపుతున్నారు.వైరల్‌గా వీడియోఅయితే ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్ల వైరల్‌గా మారింది. నెటిజన్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ, మీడియాలో చూపే దానికి, అక్కడ జరుగుతున్న దానికి చాలా తేడా ఉందని పేర్కొన్నారు. ఇరాన్ ప్రజల ఆతిథ్యాన్ని, నగర అందాలను ప్రశంసిస్తూ, యుద్ధం త్వరగా ముగియాలని కోరుకుంటున్నారు. కాగా ప్రస్తుతం యుద్ధం విషయంలో నీలినీడలు కమ్ముకున్నాయి. యుద్ధం ముగింపుకు ఇరాన్ చేసిన కొత్త ప్రతిపాదనను ట్రంప్ తిరస్కరించారు.దీంతో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. View this post on Instagram A post shared by Estelle W (@estelleeats__) -
నో డీల్..నో క్లారిటీ : మా దళాలు సిద్ధం : ఇరాన్ సంచలన ప్రకటన
ఏప్రిల్ 7 నుంచి అమెరికా బలగాలు, ఇరాన్ మధ్య కాల్పులు జరగలేదని కాంగ్రెస్ నేతలకు శుక్రవారం(మే 1) రాసిన లేఖలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఫిబ్రవరి 28న ప్రారంభమైన యుద్ధం ఇప్పుడు ముగిసిందంటూ కాంగ్రెస్‌కు సమాచారం ఇచ్చి 60 రోజులు పూర్తయిన నేపథ్యంలో ట్రంప్ ఈ లేఖ రాశారు. అంతేకాదు యుద్ధానికి కాంగ్రెస్ అనుమతి పొందాల్సిన అవసరం ఇప్పుడు తనకు లేదని పేర్కొన్నారు. అయితే దీనికి స్పందనగా ఇరాన్ చేసిన ప్రకటన సంచలనంగా మారింది. అమెరికా ఒప్పందాలను ఉల్లంఘిస్తోందని, దీనివల్ల ఇరు దేశాల మధ్య ఘర్షణలు మళ్లీ చెలరేగే అవకాశం ఉందని, తాము సిద్ధంగా ఉన్నామని ఇరాన్ హెచ్చరించింది.ఖతం అల్-అన్బియాసెంట్రల్ హెడ్ క్వార్టర్స్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ సర్దార్ మహమ్మద్ జాఫర్ అసాదీ శనివారం మాట్లాడుతూ, వాషింగ్టన్ దౌత్యపరమైన అవగాహనలకు కట్టుబడి ఉండటం లేదని విమర్శించారు. అమెరికా అధికారుల చర్యలు, ప్రకటనలు ప్రధానంగా మీడియా ప్రేరేపితమైనవని విమర్శించారు. కేవలం చమురు ధరలు తగ్గకుండా చూడటానికి ,వారు సృష్టించిన గందరగోళం నుండి బయటపడటానికి మాత్రమే వారు ప్రకటనలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఏవైనా పరిస్థితులను ఎదుర్కోవడానికి ఇరాన్ సాయుధ దళాలు సిద్ధంగా ఉన్నాయని స్పష్టం చేశారు.ఇదీ చదవండి: షాకింగ్ : పక్కా ప్లాన్‌తో మలయాళీ సిస్టర్స్ సూసైడ్!భారీ నష్టంసిఎన్ఎన్ (CNN) పరిశోధనాత్మక నివేదిక ప్రకారం, గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ జరిపిన దాడుల వల్ల భారీ నష్టం వాటిల్లింది. కువైట్‌లోని క్యాంప్ బ్యూరింగ్ ప్రాంతంలోని అతిపెద్ద అమెరికా స్థావరాలలో ఒకటైన ఇక్కడ మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయి. దీనిలోని ప్రధాన భాగాలు ప్రస్తుతం పనిచేయడం లేదు.ఇదీ చదవండి: నటి ఎగ్ ఫ్రీజింగ్ ఇంజెక్షన్స్: రెండు రోజులు నరకంఎనిమిది దేశాల్లోని కనీసం 16 అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసింది. పశ్చిమ ఆసియాలోని మెజారిటీ అమెరికా సైనిక స్థావరాలు ఈ దాడుల వల్ల ప్రభావితమయ్యాయని, కొన్ని చోట్ల సౌకర్యాలు పూర్తిగా ఉపయోగించలేని స్థితికి చేరుకున్నాయని నివేదిక పేర్కొంది.ఇరాన్ ఆర్థిక వ్యవస్థపై ప్రభావంమరోవైపు, అమెరికా విధిస్తున్న ఆంక్షలు ఇరాన్‌ను ఆర్థికంగా దెబ్బతీస్తున్నాయి.పారిశ్రామిక మార్గాల్లో అమెరికా కఠిన చర్యల వల్ల ఇరాన్ చమురు ఎగుమతులకు ఆటంకం కలిగింది. దీనివల్ల ఇరాన్ దాదాపు 4.8 బిలియన్ డాలర్ల చమురు ఆదాయాన్ని కోల్పోయిందని పెంటగాన్ అంచనా వేసినట్లు యాక్సియోస్ (Axios) నివేదించింది. కాగా అమెరికా, ఇరాన్ మధ్య దీర్ఘకాలిక ఒప్పందమేదీ ఇంతవరకూ కుదుర్చుకోలేదు. పాకిస్తాన్ ద్వారా తెహ్రాన్ కొత్త సందేశం పంపించిందని ఇరాన్ మీడియా చెబుతోంది. మరోవైపు మధ్యవర్తుల ద్వారా అమెరికాకు పంపిన ఒక అధికారిక ప్రతిపాదనలో కొత్త కాలపరిమితిని స్పష్టంగా పేర్కొన్నారని ఆ అధికారి తెలిపారు. ఈ ప్రతిపాదన ప్రకారం, ఇజ్రాయెల్ మరియు అమెరికా మళ్లీ దాడి చేయవన్న హామీతో యుద్ధం ముగుస్తుంది. ఇరాన్ జలసంధిని తెరుస్తుంది ,అమెరికా ఇరాన్‌పై తన దిగ్బంధనాన్ని ఎత్తివేస్తుంది. -
ఇరాన్ నన్ను ఇరిటేట్ చేస్తోంది.. ట్రంప్
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ ప్రతిపాదనలతో తాను సంతృప్తిగా లేనని ప్రస్తుతానికి యుద్దం ముగించే ఆలోచన లేదని తేల్చిచెప్పారు. అయితే ఇరాన్ మాత్రం తమతో యుద్దం ముగింపుకై సంప్రదింపులు జరుపుతుందని ట్రంప్ స్పష్టం చేశారు.ఇరాన్- అమెరికా యుద్ధం ప్రారంభమై దాదాపు 60 రోజులు గడుస్తోంది అయినప్పటీకీ చర్చల్లో పెద్దగా పురోగతి కనిపించడం లేదు. ఇరు దేశాలు చర్చల విషయంలో తగ్గడం లేదు. అమెరికా ఇరాన్ అణ్వాయుధాలు కలిగి ఉండడం కుదరదు అనడం ఇరాన్ దానికి ఎట్టి పరిస్థితుల్లో నో చెప్పడంతో చర్చలు సాగడం లేదు. అయితే తాజాగా ట్రంప్ ఈ విషయంలో మరోసారి స్పందించారు.ట్రంప్ మాట్లాడుతూ "వారు ఒక ఒప్పందం చేసుకోవాలనుకుంటున్నారు, కానీ నేను దానికి సిద్ధంగా లేను; నాకు దానితో తృప్తి లేదు, కాబట్టి ఏం జరుగుతుందో చూద్దాం. వారు పురోగతి సాధించారు, కానీ వారు ఎప్పటికైనా గమ్యాన్ని చేరుకుంటారో లేదో నాకు ఖచ్చితంగా తెలియదు. వారి మధ్య తీవ్రమైన విభేదాలు ఉన్నాయి. ఇరాన్లో వారు ఒకరితో ఒకరు కలిసిమెలిసి ఉండటంలో తీవ్రమైన సమస్యను ఎదుర్కొంటున్నారు," అని ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ అన్నారు.కాగా ఇరాన్‌తో యుద్ధం ప్రారంభమైననాటి నుంచి చట్టపరమైన అనుమతి కోరడానికి ట్రంప్ ప్రభుత్వానికి ఈ రోజు ( శనివారం)చివరి గడువు అయితే, ప్రస్తుత కాల్పుల విరమణ సమయంలో యుద్ధం ముగిసిపోయినందున దానికి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని వైట్ హౌస్ కాంగ్రెస్‌కు తెలిపినట్లు సమాచారం. -
చైనా, రష్యా, కొరియాతో తలపడాల్సి వస్తే.. అమెరికా పరిస్థితి
-
ఐరన్ డోమ్ మాత్రమే కాదు.. ‘ఐరన్ బీమ్ లేజర్ సిస్టమ్’ సైతం
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)కు ఇజ్రాయెల్ తన ఐరన్ డోమ్ వ్యవస్థను పంపిందన్న విషయం ఇటీవలే బయటకు వచ్చింది. అయితే, ఇరాన్‌తో ఘర్షణ సమయంలో కేవలం ఐరన్ డోమ్‌ను మాత్రమే కాదు.. ఇజ్రాయెల్ తన ఐరన్ బీమ్ లేజర్ ఆధారిత గగనతల రక్షణ వ్యవస్థ వెర్షన్‌ను కూడా పంపిందని తాజాగా ఫైనాన్షియల్ టైమ్స్ నివేదించింది. ఇరాన్ నుంచి వచ్చే క్షిపణులు, డ్రోన్ల భారీ దాడి నుంచి యూఏఈని కాపాడడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ ఈ చర్య తీసుకుంది. ఇజ్రాయెల్, యూఏఈ మధ్య రక్షణ సహకారం ఎంతగా పెరిగిందో చెప్పడానికి ఇదే ఉదాహరణ.ఇజ్రాయెల్‌తో స్నేహ బంధం ఉంటే ఇలాంటి అధునాతన రక్షణ వ్యవస్థల సాయం, సాంకేతిక మద్దతు లభిస్తుందని ప్రాంతీయ అధికారి ఒకరు అన్నారు. ఇజ్రాయెల్ “స్పెక్ట్రో” అనే అధునాతన పర్యవేక్షణ వ్యవస్థను కూడా యూఏఈకు పంపింది. ఇది 20 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చే డ్రోన్లను గుర్తించడంలో సాయపడుతోంది. యూఏఈకు ఇజ్రాయెల్ పంపిన దాడి, రక్షణ వ్యవస్థలు ఎక్కువగా ప్రోటోటైప్స్ కాగా, ఇవి ఇంకా ఇజ్రాయెల్ ఆయుధ వ్యవస్థల్లో పూర్తిగా సమన్వయం కాలేదు.ఐరన్ బీమ్ లేజర్ వ్యవస్థ అంటే?ఐరన్ బీమ్ లేజర్ రక్షణ వ్యవస్థ వెర్షన్ తక్కువ దూర రాకెట్లు, డ్రోన్లను ఆవిరి చేసి నాశనం చేస్తుంది. లెబనాన్ నుంచి హెజ్బొల్లా ప్రయోగించిన ప్రాజెక్టైళ్లపై ఇజ్రాయెల్ మొదట దీనిని వినియోగించింది. ఐరన్ డోమ్ గగనతల రక్షణ వ్యవస్థతో పాటు కొంతమంది ఇజ్రాయెల్ సైనిక సిబ్బందిని కూడా యూఏఈకు పంపించారు.ఇరాన్ ఇటీవల యూఏఈపై భారీగా బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించింది. ఆయుధ వ్యవస్థలతో పాటు ఇజ్రాయెల్ స్పై సమాచారం కూడా పంచుకుంది. ఇరాన్లో తక్కువ దూర క్షిపణుల ప్రయోగ సన్నాహాలపై ముందస్తు సమాచారం ఇచ్చింది.యూఏఈ అనేక స్థాయుల గగనతల రక్షణ వ్యవస్థలను వినియోగించింది. ఇరాన్ నుంచి ఎదురైన దాడులను వాటి ద్వారా ఎదుర్కొంది. ఇజ్రాయెల్ అభివృద్ధి దశలో ఉన్న లేదా ఇంకా రాడార్ నెట్‌వర్క్‌తో పూర్తిగా సమకాలీకరించని ఆయుధాలను కూడా యూఏఈకు పంపింది. గతంలో అబ్రహాం ఒప్పందాల ద్వారా యూఏఈ సహా నాలుగు అరబ్ దేశాలతో ఇజ్రాయెల్ సత్సంబంధాలు ఏర్పడ్డాయి. -
అమెరికా కీలక నిర్ణయం.. 5,000 మంది సైనికులు వెనక్కి..
వాషింగ్టన్: జర్మనీ నుంచి 5,000 మంది అమెరికా సైనికులను వెనక్కి తీసుకురావాలని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ ఆదేశించినట్లు పెంటగాన్ తెలిపింది. ఇరాన్ యుద్ధంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, యూరప్ మధ్య విభేదాలు పెరుగుతున్న నేపథ్యంలో అమెరికా ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. నాటో మిత్ర దేశానికి హెచ్చరికగా ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.ఇరాన్‌తో అమెరికా జరపాల్సిన శాంతి చర్చలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. దీంతో అమెరికాను ఇరాన్ ప్రభుత్వం అవమానానికి గురిచేసిందంటూ ఇటీవల జర్మనీ చాన్సలర్ ఫ్రెడ్రిక్ మెర్జ్ పలు వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌తో జరిగిన చర్చల్లో అమెరికా బలహీనంగా కనిపించిందని, సరైన ఫలితం తీసుకురాలేకపోయిందని విమర్శించారు.దీంతో ట్రంప్ కొన్ని రోజుల క్రితం మాట్లాడుతూ.. జర్మనీ నుంచి సైనికులను ఉపసంహరించుకుంటామని హెచ్చరించారు. పెంటగాన్ ప్రధాన ప్రతినిధి షాన్ పార్నెల్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఉపసంహరణ ప్రక్రియ వచ్చే 6 నుంచి 12 నెలల్లో పూర్తవుతుందని రాయిటర్స్ పత్రిక పేర్కొంది. మరోవైపు, ఇటలీ, స్పెయిన్‌లో కూడా తమ సైనికులను తగ్గించే అంశాన్ని పరిశీలిస్తున్నామని డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే చెప్పారు. జర్మనీలో 36,436 మంది అమెరికా సైనికులు ఉన్నారు. వారిలో 5,000 మంది అమెరికాకు తిరిగి వచ్చేయనున్నారు. ఇక, ఇటలీలో 12,662 మంది, స్పెయిన్‌లో 3,814 మంది అమెరికా సైనికులు ఉన్నారు. ఇరాన్‌పై అమెరికా యుద్ధానికి మద్దతు ఇవ్వకపోవడంతో పాటు హార్మూజ్ జలసంధి విషయంలో సహకరించకపోవడం వల్ల నాటో మిత్రదేశాలపై డొనాల్డ్ ట్రంప్ మండిపడుతున్నారు. -
ఇరాన్‌తో యుద్ధాన్ని ఆపేశాం: వైట్‌హౌస్ సంచలన ప్రకటన
వాషింగ్టన్: ఇరాన్‌తో జరిగిన యుద్ధంపై వైట్‌హౌస్ ప్రకటన చేసింది. ఇరాన్‌తో యుద్ధాన్ని ఆపేశామని యూఎస్ కాంగ్రెస్‌కు వైట్‌హౌస్ అధికారిక లేఖలో తెలిపింది. పశ్చిమాసియాలో దళాలు ఉన్నప్పటికీ వైట్‌హౌస్ ఈ ప్రకటన చేయడం గమనార్హం. ఇరాన్‌తో ఇప్పుడు కాల్పుల విరమణ ఉంది కాబట్టి యుద్ధం ముగిసిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వాదిస్తోంది. అమెరికాలో 60 రోజుల లోపు యుద్ధంపై కాంగ్రెస్‌కు వెళ్లి అనుమతి తీసుకోవాలి లేదా యుద్ధాన్ని ఆపాలన్న నిబంధన ఉంది. కాబట్టి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఇలా చెప్పి ఆ గడువు నుంచి తప్పించుకోవాలని చూస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. యుద్ధం ఇప్పటికే ముగిసింది కాబట్టి కాంగ్రెస్ అనుమతి అవసరం లేదనేదే లాజిక్. ఇది ఒక లీగల్ స్ట్రాటజీ అయి ఉండొచ్చని విశ్లేషకులు అంటున్నారు. 1973 వార్ పవర్స్ రిజల్యూషన్ (అధ్యక్షుడు సైనిక చర్యల కోసం అనుసరించాల్సిన చట్టపర పరిమితులు నిర్ణయించే చట్టం) ప్రకారం.. కేవలం 60 రోజులు మాత్రమే సైనిక చర్యలు చేపట్టవచ్చు. ఆ తర్వాత వాటిని ముగించాలి లేదా కాంగ్రెస్ అనుమతి కోరాలి లేదంటే అమెరికా సాయుధ దళాల భద్రతకు సంబంధించిన తప్పనిసరి సైనిక చర్య అవసరమైతే మరో 30 రోజుల పొడిగింపు కోరాలి. అదీ బలగాల ఉపసంహరణ సమయంలో విజ్ఞప్తి చేయాలి.యుద్ధం ఫిబ్రవరి 28న ప్రారంభమైంది. ఆ రోజు ఇజ్రాయెల్, అమెరికా కలిసి ఇరాన్‌పై గగనతల దాడులు ప్రారంభించాయి. మొదటి గగనతల దాడుల తర్వాత 48 గంటల్లో ట్రంప్ అధికారికంగా కాంగ్రెస్‌కు ఈ ఘర్షణ గురించి సమాచారం ఇచ్చారు. దాంతో 60 రోజుల గడువు మే 1న ముగిసింది. -
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఊహించని నిర్ణయం
టెహ్రాన్: అమెరికా-ఇరాన్ చర్చల్లో ప్రతిష్టంభన కొనసాగుతున్న సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఊహించని నిర్ణయం తీసుకున్నారని సమాచారం. ఇరాన్ తన మాట వినకపోవడంతో దాడులు చేయాలని ఆయన ఆదేశించినట్లు అమెరికా మీడియా సంస్థ యాక్సియోస్ వెల్లడించింది.యాక్సియోస్ నివేదిక ప్రకారం.. అమెరికా-ఇరాన్ చర్చల్లో పురోగతి లేకపోవడం, ఇరాన్ బెదిరింపులు పెరగడం వంటి పరిణామాలపై ట్రంప్ యూనైటెడ్ స్టేట్ సెంట్రల్ కమాండ్ అధికారి బ్రాడ్ కూపర్, రక్షణ మంత్రి, జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌తో 45 నిమిషాల పాటు ముఖాముఖీ చర్చలు జరిపారు. ఈ చర్చల్లో ఇరాన్‌పై దాడులు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.అందుకు ఊతం ఇచ్చేలా అమెరికా 24 గంటల వ్యవధిలో ఇజ్రాయెల్‌కు భారీగా ఆయుధ సామాగ్రిని పంపింది. జెరూసలేం పోస్టు ప్రకారం సుమారు 6,500 టన్నుల ఆయుధాలు, పరికరాలు ఇజ్రాయెల్‌కు చేరాయి. వీటిలో వాయు, భూతల ఆయుధాలు, సైనిక ట్రక్కులు, జాయింట్ లైట్ టాక్టికల్ వెహికల్ యూనిట్లు ఉన్నాయి. ఈ సరుకు రెండు నౌకల ద్వారా అష్డోడ్, హైఫా పోర్టులకు చేరగా, అనేక విమానాల ద్వారా కూడా రవాణా జరిగింది.‘ఆపరేషన్ రోరింగ్ లయన్ ప్రారంభమైనప్పటి నుంచి 403 ఎయిర్లిఫ్ట్స్, 10 సీలిఫ్ట్స్ ద్వారా 115,600 టన్నులకుపైగా సైనిక సామాగ్రి అందుకుంది’అని ఇజ్రాయెల్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటనలో తెలిపింది. ఇజ్రాయెల్ ఎప్పుడైనా శత్రువులపై చర్యలకు సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. రక్షణ అధికారులు ఆయుధ రవాణా కొనసాగుతుందని, మరింత విస్తరించవచ్చని తెలిపారు. -
వచ్చే వారం పెరగనున్న పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు.. ఎంతంటే?
ఢిల్లీ: దేశ వ్యాప్తంగా వాహనదారులకు, వంట గ్యాస్ వినియోగదారులకు భారీ షాక్ తగలనుంది. ఇరాన్‌పై అమెరికా మధ్య యుద్ధ పరిస్థితులు, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడం నేపథ్యంలో భారతీయ ఆయిల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్, గృహ వినియోగ ఎల్పీజీ ధరలను పెంచే దిశగా కసరత్తు చేస్తున్నాయి.జాతీయ కథనాల ప్రకారం, వచ్చే వారంలోనే ధరల పెంపు జరిగే అవకాశం ఉంది. గృహ వినియోగ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్‌పై రూ.50 వరకు పెరుగవచ్చని, పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు రూ.5 వరకు పెరిగే అవకాశం ఉందని సమాచారం.ఇప్పటివరకు ఎన్నికల నేపథ్యంలో ధరల పెంపుపై సంయమనంతో ఉన్న ఆయిల్ కంపెనీలు, ఇప్పుడు వారాంతంలో ధరలను పెంచేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయం సాధారణ ప్రజలపై నేరుగా ప్రభావం చూపనుంది. రవాణా ఖర్చులు పెరగడం వల్ల వస్తువుల ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
ఇరాన్లో పెను సంచలనం.. అబ్బాస్ అరాగ్చీ తొలగింపుకు ప్లాన్
టెహ్రాన్: అసలే యుద్ధంతో అతలాకుతలమువుతున్న ఇరాన్లో ఇప్పుడు మరో సంక్షోభం తలెత్తినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ దేశ అంతర్గత వ్యవహారాలలో ఎంతో కీలకంగా వ్యవహారిస్తున్న విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీని పదవి నుంచి తొలగించే యత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే ప్రస్తుతం అమెరికాతో జరుగుతున్న చర్చలు పక్క దారి పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.ప్రస్తుతం అమెరికా- ఇరాన్ మధ్య సీజ్ఫైర్ ఒప్పందం నడుస్తోంది. ఇరు దేశాలు తాత్కాలిక కాల్పుల విరమణ ప్రకటించి కాల్పుల విరమణ కోసం ప్రయత్నాలు జరుపుతున్నాయి. అయితే ఇంత ప్రాధాన్యమైన పరిస్థితులు నడుస్తున్న వేళ ఇరాన్లో రాజకీయ సంక్షోభం తలెత్తినట్లు తెలుస్తోంది.ఇరాన్ అధ్యక్షుడు మాసూద్ పెజెష్కియన్, ఆ దేశ స్పీకర్ మహమ్మద్ ఖాలిబాప్ ఇరువురు నేతలు అబ్బాస్ అరాగ్ఛీని తొలగించాలని ఆదేశాలిచ్చినట్లు ఆ దేశ మీడియా కథనాలు పేర్కొన్నాయి. అమెరికాతో చర్చల సమయంలో అధ్యక్షుడి ఆదేశాల అనుసారం కాకుండా ఇరాన్ సైన్యం ఆదేశాలు పాటించినట్లు అరాగ్చీపై ఆరోపణలు వచ్చాయి. గత రెండువారాలుగా అమెరికాతో చర్చల ప్రయత్నాలలో అరాగ్చీ తమ ఆదేశాలను అస్సలు పట్టించుకోవడం లేదని ఇద్దరు నేతలు ఆరోపించినట్లు నివేదికలు వచ్చాయి. .మంత్రిగా బాధ్యతాయుత వ్యక్తిగా ప్రవర్తించాల్సిన సమయంలో దేశ అధ్యక్షుడు ఆదేశాలను లెక్కచేయకుండా ఇరాన్ రెవెల్యూషనరీ గార్డ్స్ నేతలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం ఏంటని ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వ్యవహరంపై ఇజ్రాయెల్ సైతం గతంలో ఓ నివేదిక ప్రచురించింది. ఆయతుల్లా ఖమేనీ హత్యతో ఇప్పుడు ఇరాన్ పాలన ఆ దేశ మిలటరీ చేతిలోకి వెళ్లిందని వారు గత పాలకులకంటే అధికమైమ మతఛాందస భావాలు కలవారని ప్రచురించింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు అంతర్గతంగా రాజకీయ సంక్షోభం తలెత్తినట్లు తెలుస్తోంది. -
అయతుల్లా అలీ ఖమేనీ ఒంటి చేయి రహస్యం ఇదేనా?
టెహ్రాన్: ఒక్కోసారి మన కళ్లే మనల్ని మోసం చేస్తాయి. అచ్చం సుప్రీమ్ లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ విషయంలో అదే జరిగింది. ప్రపంచ దేశాలకు ఆయన ఇరాన్ సుప్రీమ్ లీడర్‌గానే కనిపించవచ్చు. కానీ సుపరిచితులందరికీ ఆయన ఒంటి చేయి వీరుడు అని మీకు తెలుసా?ఇరాన్ -ఇరాక్ యుద్ధం 22 సెప్టెంబర్ 1980న ప్రారంభమైంది. దాదాపు ఎనిమిదేళ్లు కొనసాగి, 20 ఆగస్టు 1988న ముగిసింది. ఈ యుద్ధం ప్రారంభమైన మరుసటి ఏడాది జూన్ 27, 1981న నాటి అధ్యక్ష హోదాలో ఇరాన్ యుద్ధ సన్నాహాల్ని పర్యవేక్షించారు. అనంతరం, ప్రార్ధన చేసి తిరిగి వచ్చాడు. వచ్చిన తర్వాత ఓ ప్రాంతంలో నిర్వహించిన సమావేశంలో అనుచరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తున్నారు.అదిగో అప్పుడే ఓ యువకుడు ఖమేని ముందుకు వచ్చాడు. ఖమేని డెస్క్‌పై ఓ టేప్‌రికార్డ్ పెట్టాడు. దానిని ఆన్ చేశాడు. ఇరాన్‌లోని మతపరమైన పాలనకు వ్యతిరేకంగా ఉన్న ఒక మిలిటెంట్ గ్రూప్ ఫుర్కాన్ అమర్చిన బాంబు నిమిషం వ్యవధిలో పేలింది. ప్రత్యర్థులు పన్నిన కుట్రలో ఆయన చావునుంచి తృటిలో తప్పించుకున్నారు. ఖమేనీ తన కుడి చేయి, లంగ్స్, ఊపిరితిత్తులకు తీవ్రగాయాలయ్యాయి. కోలుకోవడానికి సుదీర్ఘ కాలం పట్టింది. కొన్ని గాయాలు నయమైనప్పటికీ, అతని కుడి చేయి శాశ్వతంగా పనిచేయకుండా ఆగిపోయింది.ఘటన జరిగిన కొద్ది రోజులకు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఖమేనీకి సహచరులు ‘ఒంటి చేత్తో ఏం సాధిస్తావు, అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాలి’ అని సలహా ఇచ్చిన వేళ, ఆయన గద్గద స్వరంతో, ‘నేను ఒంటి చేయి వీరుణ్ని. ఫీనిక్స్ పక్షి బూడిద నుంచి లేచినట్లు లేస్తాను. నాకు ఆ చేయి అవసరం లేదు. నా మెదడు, నా నాలుక పనిచేస్తే చాలు’ అని అన్నారు.కొంతకాలం తర్వాత ఖమేనీ తన ఎడమ చేతితో రాయడం నేర్చుకున్నాడు. ఇలా అంచలంచెలుగా ఎదుగుతూ.. ఘటన జరిగిన ఎనిమిదేళ్లకు ఇరాన్ సుప్రీం లీడర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ప్రపంచంలోనే సుదీర్ఘకాలంగా ఓ దేశానికి సుప్రీం లీడర్‌గా ఖమేనీ చరిత్రలో నిలిచిపోయారు. -
ట్రంప్ మరో కీలక ప్రకటన.. ఆ 2 దేశాల్లోనూ..
వాషింగ్టన్: ఇరాన్‌తో అమెరికా చేస్తున్న యుద్ధానికి మద్దతు ఇవ్వకపోవడంతో నాటోలోని దేశాలపై విమర్శలతో విరుచుకుపడుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు మరో బాంబ్ పేల్చారు. ఇటలీ, స్పెయిన్‌లో తమ సైనికులను తగ్గించే అంశాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు. “అవును.. బహుశా నేను ఈ పనిని చేస్తాను. ఎందుకు చేయకూడదు. ఇటలీ మాకు ఎలాంటి సాయమూ చేయలేదు, స్పెయిన్ కూడా చాలా దారుణంగా వ్యవహరిస్తోంది” అని వ్యాఖ్యానించారు. అంతకు ముందు జర్మనీ విషయంలోనూ ఇలాంటి ప్రతిపాదనే చేశారు ట్రంప్. జర్మనీలో అమెరికా మోహరించిన వేలాది మంది సైనికులను తగ్గించే అంశాన్ని పరిశీలిస్తున్నామని, సమీక్షిస్తున్నామని డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. జర్మనీ చాన్సలర్ ఫ్రెడ్రిక్ మెర్జ్ ఇటీవల మాట్లాడుతూ.. ఇరాన్‌తో జరిగిన చర్చల్లో అమెరికా బలహీనంగా కనిపించిందని, సరైన ఫలితం తీసుకురాలేకపోయిందని విమర్శించారు. ఫ్రెడ్రిక్ ఆ విమర్శ చేసిన నేపథ్యంలో ట్రంప్ జర్మనీలో సైనికులను తగ్గిస్తామంటూ స్పందించారు. కాగా, 2025 డిసెంబర్ 31 నాటికి ఇటలీలో 12,662 మంది, స్పెయిన్‌లో 3,814 మంది క్రియాశీల అమెరికా సైనికులు ఉన్నారు. జర్మనీలో 36,436 మంది ఉన్నారు. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ చర్యలకు మద్దతు ఇవ్వకపోవడం, హార్మూజ్ జలసంధి విషయంలో సహకరించకపోవడం వల్ల నాటో మిత్రదేశాలపై ట్రంప్ మొదటి నుంచి తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇరాన్ విషయంలో ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీకి ధైర్యం లేదంటూ ఈ నెల ప్రారంభంలో ట్రంప్ విమర్శించారు. గత వారం వచ్చిన ఒక నివేదిక ప్రకారం.. ఇరాన్‌పై సైనిక చర్యలకు మద్దతు ఇవ్వనందుకు స్పెయిన్‌ను నాటో నుంచి సస్పెండ్ చేయాలన్న విషయాన్ని అమెరికా పరిశీలిస్తోంది. -
ఆ దేశాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నాను: ట్రంప్
వాషింగ్టన్: ఇరాన్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి విరుచుకుపడ్డారు. ఇరాన్ ఇప్పటికే బలహీనమైపోయిందని, ఇంకెంత కాలం నిలబడుతుందో చూద్దామని అన్నారు. శుక్రవారం తెల్లవారుజామున (భారత కాలమానం ప్రకారం) డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ.. “ఇరాన్ నేతలు 42,000 మందిని చంపారు. నేను ఓ విధంగా ఆ దేశాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నాను. ఇది రఫ్ గ్రూప్, కానీ, మేము వారిని పూర్తిగా బలహీనపరిచాం. వారి ఆర్థిక వ్యవస్థ దుర్భర స్థితిలో ఉంది. కాబట్టి వారు ఎంతకాలం నిలబడతారో చూద్దాం.సైనిక చర్య జరిగినప్పటికీ దాన్ని నేను యుద్ధం అని పిలవను. ఇరాన్ ఒప్పందం చేసుకోవడానికి అమితాసక్తి చూపుతోంది. వారికి నౌకాదళం లేదు, వైమానిక దళం లేదు, అన్ని రకాల సామగ్రి దాదాపు పూర్తిగా నశించింది. వారి డ్రోన్ ఫ్యాక్టరీలు సుమారు 82 శాతం తగ్గిపోయాయి. వారు ఒప్పందం చేసుకోవాలనుకుంటున్నారు.. మేము వారి అణు సామర్థ్యాన్ని పూర్తిగా ధ్వంసం చేశాం. అందువల్ల వారికి అణు బాంబు దక్కలేదు.నేను 8 యుద్ధాలను ఆపాను. దాదాపు ప్రతి సందర్భంలో వారు నాకు ధన్యవాదాలు తెలుపుతూ లేఖలు పంపారు. నోబెల్ కమిటీకి కూడా లేఖలు పంపారు. నేను 30 నుంచి 50 మిలియన్ మంది ప్రాణాలు కాపాడానని భారతదేశ విషయంలో.. పాకిస్తాన్ ప్రధానమంత్రి కూడా అన్నారు. అది ఇంకా ఎక్కువ కావచ్చు. రెండు అణ్వాయుధ దేశాలు పోరాడుతున్నాయి. 11 విమానాలు కూల్చివేశారు. నేను దాన్ని పరిష్కరించాను. టారిఫ్‌లు వాడాను.. వాళ్లు యుద్ధం కొనసాగిస్తే వారిపై టారిఫ్‌లు విధిస్తానని నేను చెప్పాను” అని తెలిపారు. మరోవైపు, అమెరికా హార్మూజ్ నిర్బంధం వల్ల చమురు మార్కెట్లో సరఫరా సంక్షోభం తీవ్రత పెరుగుతోంది. తగ్గిన సరఫరాతో చమురు ధరలు పెరుగుతున్నాయి. హార్మూజ్ మూసివేతతో గ్లోబల్ మార్కెట్‌పై భారీ దెబ్బ పడింది. అమెరికా-ఇరాన్ మధ్య ఇప్పట్లో ఒప్పందం కుదిరే పరిస్థితులు కనపడట్లేదు. -
పేరుకుపోతున్న ఇరాన్ చమురు నిల్వలు.. నెక్ట్స్ జరిగేదేంటంటే?
ఇరాన్ పోర్టులపై అమెరికా నౌకాదళ నిర్బంధం కారణంగా టెహ్రాన్ చమురు ఎగుమతులు తగ్గాయి. ఇరాన్ చమురు నిల్వలు పేరుకుపోతున్నాయి. చమురు నిల్వ చేసుకునే ప్రదేశాలు తక్కువగా ఉండడంతో ట్యాంకర్లలో క్రూడ్ నిల్వలు పెరుగుతున్నట్లు షిప్పింగ్ డేటా చూపిందని విశ్లేషకులు తెలిపారు. దీని వల్ల ఇరాన్లో ఎటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రపంచం ముందు ఏయే సవాళ్లు ఉన్నాయి? గల్ఫ్ ఆఫ్ ఒమాన్ నుంచి ఇరాన్ క్రూడ్‌ను తీసుకెళ్లిన నౌకలు ఏప్రిల్ 13-25 తేదీల మధ్య చాలా తక్కువగా ఉన్నాయని చమురు విశ్లేషణ సంస్థ వోర్టెక్సా తెలిపింది. మార్చిలో 13-25 తేదీల మధ్య 23.4 మిలియన్ బారెల్స్ ఎగుమతి చేసింది. మార్చి 13-25 తేదీలతో పోల్చితే ఏప్రిల్ 13-25 తేదీల మధ్య 80 శాతానికి పైగా తగ్గుదల నమోదైందని తెలిపిన ఎల్ఎస్ఈజీ డేటాను వోర్టెక్సా చూపించింది.ఇరాన్‌కు చెందిన కొన్ని నౌకలు పోర్టుల నుంచి బయలుదేరిన తర్వాత అమెరికా అడ్డుకుంది. ఆంక్షల పరిధిలో ఉన్న కంటైనర్ నౌకలు, ఆసియా జలాల్లోని ఇరాన్ ట్యాంకర్లు కూడా ఇందులో ఉన్నాయి.ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల వల్ల మొత్తం చమురు మార్కెట్లో సరఫరా తగ్గి, డిమాండ్‌తో పోలిస్తే అందుబాటులో ఉన్న చమురు తక్కువగా ఉండటం వల్ల పరిస్థితి క్లిష్టంగా మారుతోంది. చమురు సరఫరా తగ్గి, పోటీ పెరిగి, ధరలు పెరుగుతున్నాయి.ఈ దశలో, సుమారు 4 మిలియన్ బ్యారెల్స్ ఇరాన్ క్రూడ్ గల్ఫ్ ఆఫ్ ఒమాన్ నుంచి విజయవంతంగా బయటకు వెళ్లినట్లు అంచనా వేస్తున్నారు. అయితే, ఆ నౌకలను తర్వాత అడ్డగించారా? అన్నది ప్రస్తుతం నిర్ధారించలేకపోతున్నారు.ఇరాన్ నుంచి సరఫరా తగ్గడం వల్ల మార్కెట్లో ఇప్పటికే ఉన్న క్లిష్ట పరిస్థితి మరింత పెరిగింది. హార్మూజ్ జలసంధిని మూసివేయడంతో.. సౌదీ అరేబియా, యూఈఏ, కువైట్, ఇరాక్ నుంచి చమురు ఎగుమతులు తగ్గి, ధరలు పెరిగాయి.గత నెలలో, ధరలు తగ్గేందుకు ఇరాన్‌కు అమెరికా ఇంధన ఎగుమతులపై తాత్కాలిక ఆంక్షల మినహాయింపు ఇచ్చింది. బెంచ్‌మార్క్ బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ఫ్యూచర్స్ ఫిబ్రవరి 28న యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి బ్యారెల్‌కు సుమారు $50 పెరిగాయి. దీంతో పెట్రోల్, డీజిల్, జెట్ ఇంధన ధరలు పెరిగాయి.ప్రపంచంలోనే అతిపెద్ద అంతరాయం ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ దీన్ని ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఉత్పత్తి అంతరాయం అని పేర్కొంది. హార్మూజ్ నిర్బంధం ప్రారంభమైన తర్వాత గల్ఫ్ ఆఫ్ ఒమాన్ నుంచి ఏ ఇరాన్ క్రూడ్ ట్యాంకర్లు బయటకు వెళ్లలేదని తెలుస్తోంది.తమ నిర్బంధం ద్వారా ఇరాన్‌కు క్రూడ్ ఎగుమతి ఆదాయం తగ్గిందని అమెరికా తెలిపింది. “ప్రస్తుతం 41 ట్యాంకర్లలో 69 మిలియన్ బ్యారెల్స్ చమురు ఉంది, ఇవి ఇరాన్ ప్రభుత్వం అమ్మలేకపోతోంది” అని యూఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది.ఇరాన్ కరెన్సీ రియాల్ (దేశీయ ద్రవ్య మాధ్యమం) అమెరికా డాలర్‌తో పోలిస్తే రికార్డు కనిష్టానికి పడిపోయింది. ఇది చమురు ఆధారిత ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలను చూపిస్తోంది. ఒత్తిడి ఉన్నప్పటికీ, ఖార్గ్ దీవిలోని ప్రధాన ఎగుమతి కేంద్రంలో ఇరాన్ ఇంకా క్రూడ్ లోడింగ్ కొనసాగిస్తోందని ట్యాంకర్ ట్రాకర్స్ తెలిపింది.ఉపగ్రహ చిత్రాల ప్రకారం గల్ఫ్ ఆఫ్ ఒమాన్‌లోని చాబహార్ పోర్టు వద్ద దాదాపు 10 ట్యాంకర్లు నిలిచివున్నాయి. ఫిబ్రవరిలో ఇరాన్ రోజుకు సుమారు 3.24 మిలియన్ బ్యారెల్స్ క్రూడ్ ఉత్పత్తి చేసింది. అందులో సగం దేశీయ రిఫైనింగ్‌కు ఉపయోగించింది.అయితే, నిల్వలకు స్థలం తక్కువగా ఉండటంతో ఒకటి రెండు వారాల్లో ఉత్పత్తి తగ్గించాల్సి రావచ్చని విశ్లేషకులు తెలిపారు. భూభాగ నిల్వలు సుమారు 60 శాతం నిండి ఉన్నాయి. పూర్తి నిల్వలు 50 మిలియన్ బ్యారెల్స్ పైగా ఉన్నాయి. మొత్తం సామర్థ్యం 86 మిలియన్ బ్యారెల్స్. సామర్థ్య పరిమితుల వల్ల జూన్ మధ్యలో ఇరాన్ ఉత్పత్తిని తగ్గించాల్సి రావచ్చని ఎఫ్జీఈ నెక్స్టాంట్ ఈసీఏ కన్సల్టెన్సీ అంచనా వేసింది. -
బ్రహ్మాస్త్రం సిద్ధం!
అమెరికాతో రెండో విడత చర్చలు నిలిచిపోయిన నేపథ్యంలో ఇరాన్ కీలక ప్రకటన చేసింది. అమెరికాకు గుండెపోటు తెప్పించే రహస్య అస్త్రం సిద్ధంగా ఉందని తేల్చిచెప్పింది. దాని గురించి తెలిస్తే శత్రువులు భయకంపితులు కావడం తథ్యమని పేర్కొంది. ఇదొక ‘సూపర్ వెపన్’అని ఇరాన్ నేవీ కమాండర్ షహ్రామ్ ఇరానీ తేల్చిచెప్పారు. శత్రువుపై త్వరలోనే ఈ కొత్త అస్త్రం ప్రయోగిస్తామని అన్నారు. రహస్య అస్త్రం ప్రస్తుతం శత్రువు పక్కనే ఉందని వెల్లడించారు. అది చూసి వారి(అమెరికా) గుండె పేలిపోదనే ఆశిస్తున్నట్లు తెలిపారు. ఇరాన్ చెబుతున్న రహస్య ఆయుధం ‘హూట్ రాకెట్ టార్పెడో’కావొచ్చని రక్షణ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది సముద్ర గర్భంలో తుపాకీ తూటాలాగా శరవేగంగా ప్రయాణిస్తూ శత్రు దేశాల యుద్ధ నౌకలు, జలాంతర్గాములను తుత్తునియలు చేసే ఆయుధం. అనుకూలతలే కాకుండా కొన్ని ప్రతికూలతలు కూడా ఉన్నాయని అంటున్నారు. అసలేమిటి హూట్ టార్పెడో? ఈ ఆయుధాన్ని తొలిసారిగా 2006లో ఇరాన్ రహస్యంగా పరీక్షించింది. అత్యంత వేగంగా ప్రయాణించడం ఈ టార్పెడో ప్రత్యేకత. శత్రుదేశాలు ప్రతిస్పందించేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. దీని గురించి బయటి ప్రపంచానికి అంతగా తెలియదు. హూట్ అంటే పర్షియన్ భాషలో భారీ తిమింగలం. నీటి అడుగున అత్యంత వేగంగా దూసుకెళ్లే ఆయుధాల్లో హూట్ సైతం ఉన్నట్లు ఇరాన్ చెబుతోంది. కానీ, రష్యా వద్ద ఇంతకంటే మెరుగైన సూపర్–కావిటేటింగ్ టార్పెడో ఉంది. ఇది 1990వ దశకంలోనే రష్యా నావికాదళంలోకి ప్రవేశించింది. సంప్రదాయ టార్పెడోల కంటే సూపర్ టార్పెడోలు కొంత భిన్నమైనవి. ఇవి అండర్‌వాటర్ గైడెడ్ క్షిపణుల్లాంటివి. సముద్ర గర్భంలో గంటకు 60 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. కానీ, హూట్ టార్పెడో 360 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లగలదని ఇరాన్ చెప్పుకుంటోంది. అదే నిజమైతే మాత్రం ఇదొక గొప్ప ముందడుగు అవుతుంది. నీరు అత్యంత శక్తివంతమైన నిరోధకం. గాలి కంటే వెయ్యి రెట్లు ఎక్కువ సాంద్రత కలిగి ఉండటం వల్ల నీటి అడుగున ప్రయోగించిన ఆయుధాలు వాటి వేగాన్ని చాలావరకు కోల్పోతాయి. నీటిలో గంటకు 360 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఆయుధాన్ని అభివృద్ధి చేయడం సామాన్యమైన విషయం కాదు. నీటి అడుగున హూట్ చుట్టూ గ్యాస్ బుడగ ఏర్పడుతుంది. అది నీటి నిరోధకతను గణనీయంగా తగ్గిస్తుంది. దాంతో హూట్ వేగంగా ముందుకు సాగుతుంది. → హూట్ రాకెట్ టార్పెడో 200 కిలోలకుపైగా వార్హెడ్లను(శక్తివంతమైన పేలుడు పదార్థాలు) మోసుకెళ్లగలదు. → హూట్ వేగమే దాని ప్రతికూలతగా చెప్పొచ్చు. అధిక వేగం కారణంగా ఇంధనం అత్యంత వేగంగా దహనమవుతుంది. దీనివల్ల టార్పెడో కేవలం 15 కిలోమీటర్ల పరిధిని కలిగి ఉంటుంది. అంటే ప్రయోగించిన చోటునుంచి 15 కిలోమీటర్ల పరిధిలోని యుద్ధనౌకలు, జలాంతర్గాములను మాత్రమే ధ్వంసం చేయగలదు. → సంప్రదాయ టార్పెడోలు సాధారణంగా 30 కిలోమీటర్ల పరిధిని కలిగి ఉంటాయి. → హూట్ అ్రస్తాన్ని విజయవంతంగా పరీక్షించారే తప్ప ఏనాడూ యుద్ధక్షేత్రంలో ప్రయోగించలేదు. ఒకవేళ అమెరికా యుద్ధనౌకలు, విమాన వాహన నౌకలు, సబ్మెరైన్లను లక్ష్యంగా చేసుకొని ప్రయోగిస్తే ఎంతవరకు ఆశించిన ఫలితాలు వస్తాయో ఇరాన్ సైనికాధికారులు చెప్పలేకపోతున్నారు. ఇలాంటి సూపర్ టార్పెడోల వేగం, శబ్దం చాలా ఎక్కువ. కచి్చతంగా లక్ష్యాన్ని ఛేదించడం కష్టమని అంటున్నారు. → అమెరికాకు చెందిన భారీ విమాన వాహక నౌక ‘యూఎస్ఎస్ అబ్రహం లింకన్’ప్రస్తుతం ఇరాన్ సమీపంలోనే మోహరించి ఉంది. దీనికి అనేక అంచెల్లో బలమైన రక్షణ వ్యవస్థ ఉంది. హూట్ టార్పెడోతో ఢీకొట్టడం అంత సులువు కాదని అమెరికా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. → హూట్ టార్పెడోను సబ్మెరైన్లు, నౌకలు, స్పీడ్బోట్ల నుంచి ప్రయోగించవచ్చు. → హూట్ రేంజ్ 15 కిలోమీటర్లే కాబట్టి దగ్గరగా వచి్చనప్పుడు శత్రుసైన్యం ముందుగానే కనిపెట్టి ప్రతిదాడి చేసేందుకు ఆస్కారం ఉంది. → ఇరాన్ తన హూట్ సూపర్ టార్పెడోను ప్రయోగించగల ఏకైక ప్రదేశం హార్మూజ్ జలసంధి వంటి పరిమిత జలాల్లో మాత్రమే. → ఇరాన్ చేతిలో ఆకస్మిక దాడికి గురవుతామన్న అంచనాతో అమెరికా విమాన వాహక నౌకలు హార్మూజ్‌కు దూరంగా ఉంటూ, సురక్షితమైన దూరాల నుంచే తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. → ఒకవేళ హూట్ టార్పెడో అద్భుతంగా పనిచేసి అమెరికా విమాన వాహక నౌకను తాకితే, అది గణనీయమైన నష్టాన్ని కలిగించగలదు. కానీ, అందుకు అవకాశాలు తక్కువేనని నిపుణులు పేర్కొంటున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఒక్కటైన గల్ఫ్ దేశాలు?.. ట్రంప్‌కు ఖమేనీ బిగ్ షాక్?
టెహ్రాన్: ఇరాన్‌పై అమెరికా యుద్ధంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. గల్ఫ్ దేశాలతో ఏకమై హర్మూజ్ జలసంధిలో అమెరికా చేస్తున్న ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ పిలుపునిచ్చారు. ఈ మేరకు గల్ఫ్ దేశాలకు తన స్వహస్త్రాలతో లేఖ రాసినట్లు రాయిటర్స్ కథనం తెలిపింది.గురువారం మొజ్తాబా ఖమేనీ రాసిన లేఖలో ఫిబ్రవరి 28న నుంచి అమెరికా,ఇజ్రాయెల్‌తో ఇరాన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి గల్ఫ్,హర్మూజ్ జలసంధికి సంబంధించి కొత్త అధ్యాయం రూపుదిద్దుకుంటోంది.ఇరాన్ గల్ఫ్ దేశాల్ని సురక్షితం చేస్తుందని, హర్మూజ్ జలసంధిపై అమెరికా చేస్తున్న దుర్వినియోగాలను’నిర్మూలిస్తుందని అన్నారు. హర్మూజ్ జలసంధి కొత్త నిర్వహణ అన్ని గల్ఫ్ దేశాలకు శాంతి, పురోగతి, ఆర్థిక ప్రయోజనాలను చేకూరుస్తుందని మొజ్తాబా కమేనీ రాసిన లేఖలో స్పష్టం చేశారు.గల్ఫ్ ప్రాంతంలో అమెరికా ఉనికిని అనవసరమని మొజ్తాబా ఖమేనీ పేర్కొన్నారు. భవిష్యత్తులో అమెరికా లేకుండా గల్ఫ్ ప్రాంతం మరింత శాంతి, అభివృద్ధి సాధిస్తుందని అన్నారు. అంతేకాదు ఇరాన్ అణు, క్షిపణి సామర్థ్యాలను జాతీయ ఆస్తులుగా పరిరక్షిస్తామని ప్రకటించారు. పర్షియన్ గల్ఫ్‌లో అమెరికా ఉనికే ఆ ప్రాంతంలో అస్థిరతకు ప్రధాన కారణం. ఆ దేశానికి తన సొంత భద్రతను కాపాడుకునే సామర్థ్యం లేదు. అమెరికాను అభిమానించే వారికి, అమెరికా భద్రత కల్పిస్తుందనే ఆశ అసలు లేదు.ఇరాన్ శత్రువులకు దాని జలాల లోతుల్లో తప్ప మరెక్కడా స్థానం లేదు. వేలాది కిలోమీటర్ల దూరం నుంచి పర్షియన్ గల్ఫ్, ఒమన్ సముద్రంలో అల్లకల్లోలం సృష్టిస్తున్న శత్రువులకు అక్కడ మరెక్కడా స్థానం లేదని స్పష్టం చేశారు.ఖమేనీ రాసిన ఈ లేఖ, ఇరాన్ నేవీ కమాండర్ షెహరామ్ ఇరానీ టార్పిడో గురించి వివరిస్తూ అమెరికాను బెదిరించిన తర్వాత వెలువడింది. ఇరాన్ నేవీ తన ప్రకటనలో, శత్రు యుద్ధనౌకలను, జలాంతర్గాములను చీల్చగల సూపర్ జలాంతర్గామి ఆయుధాన్ని ఊహించమని పేర్కొంది. ‘హూట్’ (ఇరాన్ భాషలో హూట్ అంటే తిమింగళం) అనే పేరున్న ఈ సూపర్ వెపన్ దెబ్బకు శత్రువులు భయపడుతున్నారు. యుద్ధ సమయంలో ఇరాన్ నావికాదళం బలహీనపడినప్పటికీ, త్వరలోనే కొత్త ఆయుధంతో శత్రువుపై దాడి చేస్తామని ప్రకటించింది.‘ఏ క్షణమైనా కొత్త ఆయుధంతో శత్రువును ఢీకొంటాం. బహుశా వాళ్లకు హార్ట్ అటాక్ రాకపోవచ్చు’ అని వ్యాఖ్యానించారు. కాగా, హర్మూజ్ జలసంధి ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని.. ఇరాన్ తీసుకున్న ఈ నిర్ణయం గల్ఫ్ దేశాల భవిష్యత్తు రాజకీయ, ఆర్థిక పరిస్థితులపై ప్రభావం చూపే అవకాశం ఉంది. -
ఇరాన్‌పై అమెరికా దాడులు మళ్లీ మొదలు.. ట్రంప్ సంచలన నిర్ణయం
వాషింగ్టన్ : పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అమెరికా-ఇరాన్ చర్చల్లో ప్రతిష్టంభన నెలకొనడంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఊహించని రీతిలో ఇరాన్‌పై మెరుపు దాడులు చేయాలని ఆదేశాలు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. ట్రంప్ ఆదేశాల మేరకు అమెరికా సెంట్రల్ కమాండ్ (సెంటామ్) సైనిక చర్యలకు సన్నాహాలు చేస్తోందని ప్రముఖ అమెరికన్ మీడియా సంస్థ యాక్సియోస్ నివేదించింది. రెండు వేర్వేరు మూలాల ఆధారంగా.. గురువారం ఇరాన్‌పై దాడుల ప్రణాళికలపై సెంటామ్ కమాండర్ అడ్మిరల్ బ్రాడ్ కూపర్‌తో ట్రంప్ చర్చించనున్నట్లు పేర్కొంది.చర్చలలో ప్రధాన అంశాలుట్రంప్–కూపర్ సమావేశంలో పలు అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. వాటిలో ఇరాన్‌పై భారీ స్థాయిలో కాంబాట్ ఆపరేషన్ నిర్వహించడం, శాంతి ఒప్పంద చర్చలు ముందుకు సాగేందుకు ప్రయత్నించడం, యుద్ధం ముగించే ముందు శత్రువుకు చివరి దెబ్బ ఇవ్వడం వంటి వ్యూహాలు ఉన్నాయి. యాక్సియోస్ కథనం ప్రకారం, అమెరికాతో శాంతి చర్చలకు ఇరాన్‌ను ఒప్పించేలా స్వల్పకాలిక శక్తివంతమైన దాడులు జరిపేందుకు సెంటామ్ మొగ్గు చూపుతోంది. ఇరాన్ మౌలిక సదుపాయాలపై దాడులు చేసి, అదనంగా బాంబులు వర్షం కురిపించి అణు చర్యలపై ఒత్తిడి పెంచే అవకాశం ఉందని నివేదిక తెలిపింది.సెంట్రల్ కమాండ్ మరో ప్రణాళికలో హర్మూజ్ జలసంధిలోని కొంత భాగాన్ని స్వాధీనం చేసుకుని వాణిజ్య నౌకాయానానికి తిరిగి తెరవడంపై దృష్టి సారించింది. ఈ ఆపరేషన్‌లో భూతల దళాలు కూడా పాల్గొనవచ్చని నివేదిక పేర్కొంది. ఇరాన్ ఓడరేవులపై అమెరికా విధించిన దిగ్బంధనాన్ని ట్రంప్ ప్రధాన బలంగా భావిస్తున్నారని సమాచారం. అయినప్పటికీ, ఇరాన్ లొంగకపోతే ఆయన సైనిక చర్యను పరిగణించవచ్చని వర్గాలు తెలిపాయి.మూడవ ప్రత్యామ్నాయంఈ బ్రీఫింగ్లో ప్రస్తావనకు రాబోయే మరో వ్యూహం, ఇరాన్ వద్ద ఉన్న అత్యంత సుసంపన్నమైన యురేనియం నిల్వలను స్వాధీనం చేసుకోవడానికి ప్రత్యేక దళాలతో ఆపరేషన్ చేపట్టడం. గతంలో ఇరాన్ అణు కార్యక్రమం ఒక ముప్పు అని ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్‌పై యుద్ధం ప్రారంభించడానికి ఇది ప్రధాన కారణమని ఆయన అన్నారు. యుద్ధం ఇప్పటికే 60 రోజులకు పైగా కొనసాగుతోంది. ఇరాన్ మాత్రం తాము అణ్వాయుధాలను కోరుకోవడం లేదని, శాంతియుత ప్రయోజనాల కోసం అణు సాంకేతికతను అభివృద్ధి చేసుకునే హక్కు ఉందని చెబుతోంది.జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ జనరల్ డాన్ కెయిన్ కూడా ట్రంప్‌తో జరిగే సెంట్రల్ కమాండ్ సమావేశానికి హాజరుకానున్నారు. ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ దాడుల ముందు కూడా కూపర్ ఇలాంటి బ్రీఫింగ్ ఇచ్చారు. దానికి ప్రతిస్పందనగా ఇరాన్, ఇజ్రాయెల్ అమెరికా స్థావరాలపై దాడులు జరిపి ప్రపంచ ఆర్థిక సంక్షోభాన్ని మరింతగా పెంచిందని యాక్సియోస్ నివేదిక హైలెట్ చేసింది. -
ప్రపంచానికే నష్టం.. ట్రంప్‌నకు పుతిన్ హెచ్చరిక
మాస్కో: ఇరాన్, అమెరికా మధ్య యుద్ధ పరిస్థితులు, ఉద్రిక్తతల వేళ అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్, వ్లాదిమిర్ పుతిన్ మధ్య ఫోన్ సంభాషణ ఉత్కంఠకు తెరలేపింది. వీరిద్దరూ దాదాపు 90 నిమిషాలు మాట్లాడుకున్నారని రష్యా ప్రతినిధి వెల్లడించారు. ఇరువురు నేతల మధ్య ముఖ్యంగా ఇరాన్, ఉక్రెయిన్ గురించి జరిగినట్టు తెలిపారు. ఇదే సమయంలో ఇరాన్‌పై మరోసారి సైనిక చర్చ వద్దని ట్రంప్‌ను పుతిన్ హెచ్చరించినట్టు సమాచారం.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బుధవారం రాత్రి ఫోన్లో మాట్లాడుకున్నారు. ఈ సంభాషణలో ఉక్రెయిన్ యుద్ధం, ఇరాన్ ఘర్షణ, మరియు తాత్కాలిక కాల్పుల విరమణ అవకాశాలపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా పుతిన్.. ఇరాన్‌పై ఒకవేళ అమెరికా లేదా ఇజ్రాయెల్ మళ్లీ సైనిక చర్యకు దిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పారు. ఆ సైనిక చర్య ప్రభావం ఇరాన్ దాని పొరుగు దేశాలకే కాకుండా మొత్తం ప్రపంచానికి అత్యంత నష్టదాయకంగా మారుతుందని పుతిన్ హెచ్చరించారు. ఇదే క్రమంలో ఇరాన్‌తో కాల్పుల విరమణను పొడిగించాలని ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని పుతిన్ స్వాగతించారు.ఈ మేరకు వారిద్దరి సంభాషణ జరిగినట్టు క్రెమ్లిన్ ప్రతినిధి యూరి ఉషాకోవ్ వెల్లడించారు. ట్రంప్-పుతిన్ ఫోన్ సంభాషణలో ప్రధానంగా పశ్చిమాసియా యుద్ధం, ఉక్రెయిన్ అంశాలు ప్రస్తావనకు వచ్చినట్టు పేర్కొన్నారు. ఉక్రెయిన్‌లోని ప్రస్తుత పరిస్థితులను, రష్యా సైన్యం సాధిస్తున్న పురోగతిని పుతిన్ వివరించారని చెప్పారు. ఐరోపా దేశాల మద్దతుతో జెలెన్స్కీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే యుద్ధాన్ని పొడిగిస్తోందని ఇద్దరు నేతలు ఏకాభిప్రాయం వ్యక్తం చేసినట్లు ఉషాకోవ్ తెలిపారు. ఈ ఫోన్ కాల్ రష్యా చొరవతోనే జరగ్గా, సంభాషణ ఫలప్రదంగా సాగిందని క్రెమ్లిన్ వర్గాలు పేర్కొన్నాయి.ఇదిలా ఉండగా.. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ఐదో సంవత్సరంలోకి ప్రవేశించింది. రష్యా సైన్యం డోన్బాస్ ప్రాంతంలో ఇరుక్కుపోయింది. ఉక్రెయిన్ డ్రోన్లు రష్యా ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై దాడులు చేస్తున్నాయి. ఇరు దేశాల మధ్య దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించాలని పుతిన్‌కు ట్రంప్ సూచించినట్టు తెలిసింది. ఈ క్రమంలో మే 9వ తేదీన రష్యా విక్టరీ డే సందర్భంగా ఉక్రెయిన్‌పై తాత్కాలిక కాల్పులు విరమణపై పుతిన్ ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. -
శత్రువు గుండె పగిలే కొత్త ఆయుధం : ఇరాన్ సంచలన హెచ్చరిక
ఇరాన్‌పై అమెరికా ఇజ్రాయెల్ ప్రకటించిన యుద్ధం మరింత భీకర రూపం దాల్చనుందా? అంటే ఇరాన్ తాజా హెచ్చరికలు అవుననే సంకేతాలు అందిస్తున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ దళాలపై కొత్త ఆయుధాన్ని ఉపయోగించబోతున్నామంటూ సంచలన ప్రకటన చేసింది. ఈ ఆయుధం శత్రువులకు "గుండెపోటు" తెప్పించేంత భయంకరమైనదని ఇరాన్ నావికాదళ కమాండర్ రియర్ అడ్మిరల్ షహరామ్ ఇరానీ పేర్కొన్నారు.ప్రభుత్వ ఆధ్వర్యంలోని ప్రెస్ టీవీ ప్రకారం, ఇరాన్ నావికాదళ కమాండర్ రియర్ అడ్మిరల్ షహ్రామ్ ఇరానీ మాట్లాడుతూ, శత్రు దళాలు దేనికైతే "తీవ్రంగా భయపడుతున్నాయో", అటువంటి ఆయుధంతో త్వరలోనే వారిని ఎదుర్కోబోతున్నామని ఇరానీ తెలిపారు. ఆ ఆయుధం వారి పక్కనే ఉందని, అది చూసి వారికి గుండెపోటు రావచ్చు అని ఆయన ఎద్దేవా చేశారు. ఇస్లామిక్ రిపబ్లిక్ చాలా త్వరలోనే భయంకర ఆయుధంతో ఎదుర్కొంటుందన్న హెచ్చరికలు భయాందోళనలు రేపాయి.అమెరికా దిగ్బంధనాన్ని ఎత్తివేయడానికి బదులుగా హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరవాలన్న ఇరాన్ ప్రతిపాదనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించిన తర్వాత ఈ హెచ్చరిక వెలువడింది. ఈ ప్రతిపాదన టెహ్రాన్ అణు కార్యక్రమంపై చర్చలను కూడా వాయిదా వేసేది. అయినప్పటికీ, హోర్ముజ్ జలసంధి సమీపంలో అమెరికా నావికా దిగ్బంధనాన్ని కొనసాగించాలని ట్రంప్ నిర్ణయించారు.ఇరాన్ చమురు వ్యాపారాన్ని అడ్డుకోవడం ద్వారా చర్చలకు తీసుకురావచ్చనే ట్రంప్ వ్యూహం సైనిక అకాడమీల్లో ఒక "జోక్" గా మారిందంటూ ధ్వజమెత్తారు. అమెరికా విమాన వాహక నౌక అబ్రహం లింకన్ పై ఇరాన్ కనీసం ఏడుసార్లు క్షిపణి దాడులు చేసిందని, దీనివల్ల అమెరికా కొంతకాలం పాటు విమాన కార్యకలాపాలను నిర్వహించలేకపోయిందని ఆయన వెల్లడించారు.కాగా ఫిబ్రవరి 28న ఇరాన్ అణుకార్యక్రమంపై విభేదాల కారణంగా ఇరాన్‌పై అమెరికా,ఇజ్రాయెల్ యుద్ధాన్ని ప్రారంభించాయి. అప్పటి నుండి ఇరాన్ అమెరికా, ఇజ్రాయెల్ లక్ష్యాలపై సుమారు 100 సార్లు ప్రతీకార దాడులు చేసినట్లు పేర్కొంది. తమ పౌరుల మరణాలకు ప్రతీకారం తీర్చుకుంటామని పేర్కొంది.హోర్ముజ్ జలసంధి దిగ్బంధనంప్రపంచ ముడి చమురు రవాణాలో 20% వాటా కలిగిన హోర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేసింది శత్రు దేశాల నౌకలు ఇరాన్ అనుమతితోనే ప్రయాణించాలని నిబంధన విధించింది. అరేబియా సముద్రం నుండి కూడా ఈ మార్గాన్ని ఇరాన్ అదుపులోకి తీసుకుంది. అమెరికా దళాలు తమ నౌకలను అక్రమంగా పట్టుకోవడం "పైరసీ" కంటే ఘోరమని ఇరానీ మండిపడ్డారు.హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరుస్తామని, దానికి బదులుగా అమెరికా విధిస్తున్న ఆర్థిక దిగ్బంధనాన్ని (blockade) తొలగించాలని, అలాగే అణు కార్యక్రమ చర్చలను వాయిదా వేయాలని ఇరాన్ ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనను వ్యతిరేకించిన ట్రంప్ బాంబు దాడుల కంటే దిగ్బంధనం చాలా ప్రభావం చూపిస్తోందని, ఇరాన్ ఎప్పటికీ అణు ఆయుధాన్ని కలిగి ఉండకూడదని స్పష్టం చేశారు. -
ఇకపై నేను మంచివాడిని కాదు
వాషింగ్టన్: ఇరాన్ అణు కార్యక్రమాలపై దౌత్యపరమైన పరిష్కారం సాధ్యమైనంత త్వరగా లభించాల్సిందేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తేల్చిచెప్పారు. ఒకవేళ ఆశించిన పరిష్కారం లభించకపోతే అత్యంత కఠినంగా వ్యవహరించక తప్పదని ఇరాన్‌ను హెచ్చరించారు. ముప్పు తప్పించుకోవాలంటే తెలివిగా వ్యవహరించాలని ఇరాన్‌కు సూచించారు. అణ్వస్త్ర కార్యక్రమాలకు స్వస్తి పలకాలని పరోక్షంగా స్పష్టంచేశారు. ఈ మేరకు చేతుల్లో తుపాకీ పట్టుకున్న ఫొటోను ట్రంప్ ట్రూత్ సోషల్‌లో తాజాగా పోస్టుచేశారు. ఇందులో కొండలపై బాంబు పేలుళ్ల దృశ్యం కనిపిస్తోంది. తన మాట వినకపోతే ఇరాన్‌పై భీకర యుద్ధానికి సిద్ధమని ట్రంప్ సంకేతాలిచ్చారు. ఇకపై తాను మంచివాడిగా ఉండబోనని(నో మోర్ మిస్టర్ నైస్ గై) అని ట్రంప్ పోస్టు చేశారు. శాంతి చర్చల విషయంలో ఇరాన్ సక్రమంగా లేదని ఆయన అసంతృప్తి వ్యక్తంచేశారు. అమెరికాతో అణ్వస్త్ర రహిత ఒప్పందం ఎలా చేసుకోవాలని ఇరాన్‌కు ఏమాత్రం తెలియడం లేదని ఆక్షేపించారు. వారు కాస్త తెలివిగా ప్రవర్తిసే బాగుంటుందని పేర్కొన్నారు. అమెరికా–ఇరాన్ మధ్య రెండో విడత చర్చల్లో ప్రతిష్టంభన నెలకొన్న సంగతి తెలిసిందే. అమెరికా షరతులను ఇరాన్ అంగీకరించడం లేదు. అమెరికా యుద్ధ వ్యయం రూ.2.37 లక్షల కోట్లుపశ్చిమాసియాలో ఇరాన్‌పై యుద్ధానికి అమెరికా ఇప్పటిదాకా 25 బిలియన్ డాలర్లు(రూ.2.37 లక్షల కోట్లు) ఖర్చు చేసినట్లు పెంటగాన్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జూల్స్ హస్ట్–3 వెల్లడించారు. ఈ సమాచారాన్ని అమెరికా చట్టసభ సభ్యులకు చేరవేశారు. హౌస్ ఆరŠమ్డ్ సర్వీసెస్ కమిటీతో ఆయన బుధవారం సమావేశమయ్యారు. 25 బిలియన్ డాలర్లలో ఎక్కువ భాగం ఆయుధ సామగ్రిపై ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు. సైనిక కార్యకలాపాలు నిర్వహించడానికి, ఖాళీ అయిన పరికరాలను భర్తీ చేయడానికి కూడా పెద్ద ఎత్తున సొమ్ము వ్యయం చేసినట్లు తెలియజేశారు. -
చమురు నిల్వలు, పైపులైన్లు పేలే పరిస్థితి సమీపిస్తోందా?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఇరాన్ ప్రతిపాదనకు నో చెప్పేశారు. బాంబుదాడుల కంటే నిర్బంధమే ప్రభావవంతమని ట్రంప్ భావిస్తున్నారా? ఇరాన్ పరిస్థితి మరింత దిగజారుతుందని ఎందుకు హెచ్చరిక చేస్తున్నారు? అవసరమైతే సైనిక చర్యకు సిద్ధమని సంకేతాలు ఎందుకు వస్తున్నాయి? అమెరికా హార్మూజ్ నిర్బంధంతో ఇరాన్ చమురు ఎగుమతులకు బ్రేక్ పడుతోంది. నిల్వలు, పైపులైన్లు పేలే పరిస్థితి సమీపిస్తోందా? ఏయే పరిణామాలు సంభవిస్తాయి? ట్రంప్ మళ్లీ ఏం చెప్పారు. ప్రస్తుతం కొనసాగుతున్న పరిణామాల వల్ల పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరిగే ప్రమాదం ఉంది. డొనాల్డ్ ట్రంప్ ‘యాక్సియోస్’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కీలక విషయాలు తెలిపారు. తదుపరి ఎటువంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో, తమ వైఖరి ఏంటో స్పష్టం చేశారు.ఇరాన్ ప్రతిపాదనను ట్రంప్ తిరస్కరిస్తూ.. ఆ దేశ అణు కార్యక్రమంపై అమెరికాకు ఉన్న ఆందోళనలకు పరిష్కారం వచ్చే వరకు హార్మూజ్ నిర్బంధం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ముందుగా హార్మూజ్ జలసంధిని తెరవాలని, ఆ తర్వాత అణు చర్చలు జరపాలని ఇరాన్ ప్రతిపాదన చేసిన విషయం తెలిసిందే. దీన్నే ట్రంప్ తిరస్కరించారు.ట్రంప్ యాక్సియోస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఈ నిర్బంధం బాంబుదాడుల కంటే కొంత ప్రభావవంతంగా ఉందని భావిస్తున్నానని తెలిపారు. ఇరాన్ బాగా ఇబ్బందులు పడుతోందని, పరిస్థితి ఇంకా కఠినంగా మారుతుందని చెప్పారు. ఇరాన్ ఒప్పందం కుదుర్చుకోవాలని చూస్తోందని, నిర్బంధం కొనసాగాలని కోరుకోవడం లేదని ట్రంప్ అన్నారు. కానీ తాను నిర్బంధాన్ని ఎత్తివేయాలనుకోవడం లేదని అన్నారు. ఇరాన్ వద్ద అణ్వాయుధం ఉండకూడదని తెలిపారు.చమురు నిల్వలు, పైపులైన్లు పేలతాయా?నిర్బంధం వల్ల ఇరాన్ చమురు ఎగుమతి చేయలేకపోతోందని, నిల్వలు, పైపులైన్లు పేలే పరిస్థితికి సమీపిస్తోందని ట్రంప్ పేర్కొన్నారు. అయితే, విశ్లేషకులు మాత్రం ఈ విషయంలో ఇప్పట్లో ప్రమాదం లేదని అంటున్నారు. ప్రస్తుతం ట్రంప్ నిర్బంధాన్ని ప్రధాన ఒత్తిడి సాధనంగా చూస్తున్నారని యాక్సియోస్ తెలిపింది. అయితే, ఇరాన్ ఒప్పుకోకపోతే సైనిక చర్యను కూడా పరిగణనలోకి తీసుకుంటారని చెప్పింది. కాగా, ఇప్పటివరకు ఎలాంటి ప్రత్యక్ష సైనిక దాడికీ అమెరికా ఆదేశాలు ఇవ్వలేదని యాక్సియోస్ చెప్పింది.యాక్సియోస్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇరాన్‌పై అమెరికా సెంట్రల్ కమాండ్ దాడుల ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ దాడుల తర్వాత ఇరాన్‌లోని మౌలిక వసతులను లక్ష్యాలుగా చేసుకునే అవకాశం ఉంది.ఇరాన్ సైతం రెడీ ఇదిలా ఉండగా, ఇరాన్ భద్రతా వర్గాల ఉన్నత అధికారి మాట్లాడుతూ.. అమెరికా హార్మూజ్ నిర్బంధానికి ప్రతిగా ఇంతవరకు చూడని విధమైన చర్యను ఎదుర్కొంటుందని హెచ్చరించారు. దౌత్యానికి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఇరాన్ సైన్యం ఇప్పటివరకు సహనం వహించిందని, సహనానికి పరిమితి ఉంటుందని చెప్పారు.ఇలాగైతే ఏయే పరిణామాలు సంభవిస్తాయి?ఇరాన్-అమెరికా తీరు వల్ల పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉంది. అమెరికా–ఇరాన్ మధ్య సైనిక ఘర్షణకు దారితీయవచ్చు. హార్మూజ్ జలసంధి వద్ద రవాణా అంతరాయం ఏర్పడి చమురు సరఫరా దెబ్బతినవచ్చు. అంతర్జాతీయ ఇంధన ధరలు పెరిగే అవకాశం ఉంది. ప్రపంచ ఆర్థిక స్థిరత్వంపై ప్రతికూల ప్రభావం పడవచ్చు. దౌత్య చర్చలు కఠినమై పరిష్కారం ఆలస్యం కావచ్చు. -
భారత్‌కు ఇరాన్ విదేశాంగ మంత్రి ఫోన్
న్యూఢిల్లీ: విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌కు బుధవారం సాయంత్రం ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరఘ్చి ఫోన్ చేశారు. ఇరువురు నేతలు ప్రస్తుతం నెలకొన్న పరిస్థితిపై చర్చించి, సంప్రదింపులు కొనసాగిస్తూ ఉండాలని నిర్ణయానికి వచ్చారు. భారతదేశంలోని ఇరాన్ రాయబార కార్యాలయం దీనిపై ట్వీట్ చేసింది. అమెరికా-ఇరాన్ పక్షాలు కాల్పుల విరమణకు సంబంధించిన తాజా పరిణామాలు, భారత్-ఇరాన్ ద్వైపాక్షిక సంబంధాలు, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై జైశంకర్, అబ్బాస్ అరఘ్చిర్చించారని తెలిపింది.ఎక్స్‌లో జైశంకర్ పోస్ట్ చేస్తూ.. “ఇవాళ సాయంత్రం ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరఘ్చి నుంచి ఫోన్ వచ్చింది. ప్రస్తుత పరిస్థితి, పలు అంశాలపై విస్తృతంగా చర్చించాం. నిరంతరం సంప్రదింపులు జరుపుకోవాలని నిర్ణయించాం” అని తెలిపారు.ఇదిలా ఉండగా, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ నౌకాదళం అమెరికాకు గట్టి హెచ్చరిక జారీ చేసింది. ఉద్రిక్తతలు పెరిగితే అసాధారణ పద్ధతులు ఉపయోగించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపింది.ఇరాన్ మీడియా ప్రెస్ టీవీ తెలిపిన వివరాల ప్రకారం.. ఐఆర్జీసీ నౌకాదళ రాజకీయ వ్యవహారాల ఉపాధికారి మొహమ్మద్ అక్బర్జాదెహ్ అమెరికాకు హెచ్చరిక జారీ చేశారు. అమెరికా ఏదైనా తప్పుడు చర్యలకు పాల్పడితే ఆ దేశం ఆశ్చర్యపోయేలా అమలుచేసే వ్యూహాలు తమ వద్ద సిద్ధంగా ఉన్నాయని చెప్పారు.ఏ దాడి జరిగినా ప్రతిస్పందించడానికి ఐఆర్జీసీ నౌకాదళం సిద్ధంగా ఉందని ఇరాన్ అంటోంది. పశ్చిమాసియాలో యుద్ధం ఫిబ్రవరి 28న ప్రారంభమైంది. ఈ దాడుల్లో ఇరాన్ నసుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ కూడా మరణించారు. ప్రతీకారంగా ఇజ్రాయెల్, అమెరికా ఆస్తులపై గల్ఫ్ దేశాల్లో ఇరాన్ దాడులు చేసింది. దీని వల్ల సముద్ర మార్గాల్లో అంతరాయం ఏర్పడి, అంతర్జాతీయ ఇంధన మార్కెట్లు, ప్రపంచ ఆర్థిక స్థిరత్వంపై ప్రభావం పడింది.During a phone conversation between Seyed Abbas @araghchi, Foreign Minister of Iran, and Subrahmanyam Jaishankar, Minister of External Affairs of India, the two sides discussed and exchanged views on the latest developments related to the ceasefire, bilateral relations, as well… pic.twitter.com/Vx6B5hoezx— Iran in India (@Iran_in_India) April 29, 2026Received a phone call from Foreign Minister Seyed Abbas Araghchi of Iran this evening. @araghchi Had a detailed conversation about various aspects of the current situation. We agreed to remain in close touch.— Dr. S. Jaishankar (@DrSJaishankar) April 29, 2026 -
యుద్ధం.. అమెరికాకు ఎన్ని లక్షల కోట్లు నష్టమంటే?
అమెరికా- ఇరాన్ యుద్ధం వల్ల కలిగిన నష్టం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యుద్దం కారణంగా సూమారుగా రూ. 25 లక్షల కోట్లకు పైగా నష్టపోయామని దానికి ఎట్టిపరిస్థితుల్లో పరిహారం చెల్లించాల్సిందేనని ఇరాన్ డిమాండ్ చేస్తూ వచ్చింది. కాగా తాజాగా అమెరికా సైతం యుద్ధం వల్ల తమ దేశానికి కలిగిన నష్టాన్ని అంచనా వేసింది.ఇప్పటివరకు సుమారు $25 బిలియన్ల (సుమారు రూ. 2.1 లక్షల కోట్లు) ఖర్చయినట్లు పెంటగాన్ బడ్జెట్ చీఫ్ బుధవారం వెల్లడించారు. ఇరాన్‌పై దాడుల వల్ల అమెరికా వద్ద ఉన్న హైటెక్ క్షిపణులు, బాంబుల నిల్వలు తగ్గిపోయాయి. యుద్ధం మొదలైన మొదటి రెండు రోజుల్లోనే $5.6 బిలియన్ల విలువైన ఆయుధాలు వాడినట్లు సమాచారం.ఈ యుద్ధం ప్రారంభమైన తర్వాత ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన అత్యంత సమగ్రమైన అంచనా ఇది.ఈ మేరకు రక్షణ బడ్జెట్‌పై జరిగిన కీలక సమావేశంలో రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్సెత్ పాల్గొన్నారు. రక్షణ బడ్జెట్‌ను 40% పెంచడం వల్ల గతంలో జరిగిన తక్కువ పెట్టుబడుల లోటు తీరుతుందని ఈ సమావేశంలో హెగ్సెత్ అన్నారు.. యుద్ధం విషయంలో ప్రతిపక్ష డెమొక్రాట్లు, కొందరు రిపబ్లికన్ల మాటలు "ఓటమిని కోరుకునేవిగా" ఉన్నాయని విమర్శించారు. ఇదే సమయంలో చైనాతో "ఆధిపత్యం" కోసం కాకుండా, ఒక "సమతుల్య సంబంధం" కోసం అమెరికా ప్రయత్నిస్తుందని హెగ్సెత్ పునరుద్ఘాటించారు.ఈ యుద్ధంలో అమెరికాకు సహకరించని మిత్రదేశాలు (ముఖ్యంగా నాటో) తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెగ్సెత్ హెచ్చరించారు. ఇజ్రాయెల్, దక్షిణ కొరియా, పోలాండ్ వంటి దేశాలు అమెరికాకు ఆదర్శవంతమైన మిత్రదేశాలుగా ఆయన ప్రశంసించారు.కాగా ప్రస్తుతం యుద్ధంలో ఇరు దేశాల మధ్య సీజ్ఫైర్ నడుస్తున్న సంగతి తెలిసిందే. -
యూఏఈ నిర్ణయం: ఇండియాలో ఆయిల్ ధరలు తగ్గుతాయ్!
పశ్చిమ ఆసియాలో తీవ్రమవుతున్న సంఘర్షణల నేపథ్యంలో, ప్రపంచ ఇంధన సరఫరాలపై తీవ్ర ప్రభావం పడుతున్న తరుణంలో, 12 మంది సభ్యుల ఒపెక్ , విస్తృత 22-సభ్యుల ఒపెక్+ కూటమి రెండింటి నుంచి నిష్క్రమిస్తున్నట్లు యూఏఈ ఏప్రిల్ 28నప్రకటించింది. ఈ నిర్ణయం భారతదేశానికి లాభం చేకూరుస్తుందా? లేక మరింత సంక్షోభం లోకి కూరుకుపోనుందా? దీనిపై విశ్లేషకులు ఏమంటున్నారు?పెట్రోలియం ఎగుమతి చేసే దేశాల కూటమి (OPEC), OPEC+ నుండి తప్పుకుంటున్నట్లు యూఏఈ ప్రకటించింది. మే 1 నుండి ఈ నిర్ణయం అమలులోకి రానుంది. ఈ పరిణామం భారతదేశానికి సానుకూల అంశమని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారని మనీ కంట్రోల్ తనకథనంలోపేర్కొంది. ఒపెక్ నుండి యూఏఈ నిష్క్రమణతో భారతదేశానికి చమురు సరఫరా పెరిగిచ, ధరలు తగ్గుతాయని, అంతిమంగా ఇది దేశానికి మేలు జరగవచ్చు అంటున్నారు.ఇదీ చదవండి: జస్ట్, పెళ్లికి ముందు : వరుడి వింత ప్రశ్న, అతిథులు అవాక్కుభారతదేశానికి కలిగే ప్రధాన ప్రయోజనాలు:ఇప్పటివరకు యూఏఈ 'ఓపెక్' నిర్దేశించిన కోటాల ప్రకారం పరిమితంగానే చమురును ఉత్పత్తి చేసేది. ఇప్పుడు కూటమి నుండి బయటకు వచ్చిన కారణంగా ఇండియా భారీగానే ఉత్పత్తిని పెంచుకోవచ్చు. దీనివల్ల మార్కెట్లో చమురు సరఫరా పెరిగి, ముడి చమురు ధరలు తగ్గే అవకాశం ఉంది.భారత్ తన చమురు అవసరాలలో దాదాపు 90శాతం దిగుమతులపైనే ఆధారపడుతుంది. ధరలు తగ్గితే దేశంపై విదేశీ మారకద్రవ్య భారం తగ్గి, ఇన్‌ప్లేషన్ అదుపులోకి వస్తుంది. అలాగే యూఏఈ తన చమురు ఉత్పత్తి సామర్థ్యాన్ని 2027 నాటికి రోజుకు 5 మిలియన్ బారెల్స్‌కు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది.భౌగోళికంగా భారత్‌కు దగ్గరగా ఉండటం వల్ల, అత్యవసర సమయాల్లో చమురును సులభంగా దిగుమతి చేసుకోవచ్చు.ప్రపంచ సరఫరాలో యూఏఈ వాటా 3 - 4 శాతంగా ఉండగా, భారత చమురు దిగుమతుల్లో యూఏఈ వాటా సుమారు 10 శాతంగా ఉంది. సౌరవ్ మిత్ర (గ్రాంట్ థోర్న్టన్ భరత్): యూఏఈ నిష్క్రమణ వల్ల అంతర్జాతీయ చమురు మార్కెట్లో మరింత సరళత వస్తుంది. ధరలపై ఒత్తిడి తగ్గి భారత్‌కు ఊరట లభిస్తుంది. ప్రశాంత్ వశిష్ట్ (Icra): ఓపెక్ కూటమిలో కీలక దేశమైన యూఏఈ బయటకు వెళ్లడం వల్ల ధరలను నియంత్రించే ఆ కూటమి శక్తి తగ్గుతుంది. భారత్ తన చమురు వనరులను మరింత వైవిధ్యపరుచుకోవడానికి ఇది మంచి అవకాశం.ఇదీ చదవండి: నో క్రాష్ డైట్, నో షార్ట్‌కట్ : కేవలం 45 రోజుల్లో 12 కిలోలుప్రస్తుతం పశ్చిమ ఆసియాలో యుద్ధ వాతావరణం వల్ల చమురు రవాణాకు ఆటంకాలు కలుగుతున్నప్పటికీ, మధ్యస్థ కాలంలో యూఏఈ నిర్ణయం భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఆర్థికంగా ఎంతో మేలు చేస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు.ఇదీ చదవండి: -
గన్ ఫొటోతో ఇరాన్‌కు వార్నింగ్ ఇచ్చిన ట్రంప్
వాషింగ్టన్: పశ్చిమాసియా యుద్ధం ముగింపు దశకు చేరుకుందనే ఊహాగానాల నడుమ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కయ్యానికి కాలుదువ్వుతున్నారు. ఇకపై తాను మంచిగా ఉండదలచుకోవడం లేదంటూ ఇరాన్‌కు వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు ఆయన తన ట్రూత్ సోషల్ వేదికగా ట్వీట్ చేశారు.ఆ ట్వీట్లో ట్రంప్ గన్నుతో ఉన్న ఫొటోను షేర్ చేశారు. ‘ఇకపై నేను మంచిగా ఉండాలనుకోవడం లేదు. అణు ఒప్పందం విషయంలో ఇరాన్ తన వైఖరి మార్చుకోవాలి. అణు ఒప్పందం ఎలా చేసుకోవాలో వారికి తెలియదు. లేకపోతే దీర్ఘకాలిక ఆర్థిక, సైనిక ఒత్తిడి ఎదుర్కోవాల్సి వస్తుంది’అని ఆయన స్పష్టం చేశారు. అదే సమయంలో హర్మూజ్ జలసంధిలో దీర్ఘకాలిక బ్లాకేడ్ వ్యూహాన్ని అమలు చేయాలని ఆదేశించారు.వైట్ హౌస్‌లో ట్రంప్ వ్యాఖ్యలువైట్ హౌస్‌లో ట్రంప్ మాట్లాడుతూ, అమెరికా ఇప్పటికే పశ్చిమాసియాలో తన శత్రువులను సైనికంగా ఓడించిందని పేర్కొన్నారు. ఇరాన్ ఎప్పటికీ అణు ఆయుధాలను అభివృద్ధి చేయడానికి అనుమతించబోమని ఆయన పునరుద్ఘాటించారు.ఇరాన్ ప్రతిస్పందనఇరాన్ తాజాగా అమెరికాకు కొత్త ప్రతిపాదనను పంపింది. ఇందులో హర్మూజ్ జలసంధిని తిరిగి తెరవడం, యుద్ధాన్ని ముగించడం వంటి అంశాలు ఉన్నాయి. అణు చర్చలను తరువాత దశకు వాయిదా వేయాలని కోరింది. అమెరికా మాత్రం ఇరాన్ కనీసం 10 సంవత్సరాలపాటు యురేనియం ఎన్రిచ్మెంట్ నిలిపివేయాలని, ఇప్పటికే ఉన్న ఎన్రిచ్డ్ యురేనియం తొలగించాలని డిమాండ్ చేస్తోంది. President Trump posts on Truth Social: Iran can’t get their act together. They don’t know how to sign a nonnuclear deal. They better get smart soon! President DJT pic.twitter.com/tFEwmalvrD— Donald J Trump Posts TruthSocial (@TruthTrumpPost) April 29, 2026 -
ఇరాన్‌కు ముచ్చెమటలు.. ట్రంప్ బ్లాక్‌బస్టర్ వ్యూహం
అగ్రరాజ్యం అమెరికా.. ఇరాన్‌కు చుక్కలు చూపిస్తోంది. మొన్నటి వరకు ఇరాన్‌పై దాడులతో విరుచుకుపడిన అమెరికా.. ఇప్పుడు ప్లాన్ మార్చి వ్యూహాత్మకంగా ఇరాన్‌ను దెబ్బతీస్తోంది. ఇరాన్‌పై కఠిన ఆర్థిక చర్యలకు దిగింది. తాజాగా అమెరికా ట్రెజరీ డిపార్ట్మెంట్కు చెందిన విదేశీ ఆస్తుల నియంత్రణ కార్యాలయం (OFAC) రంగంలోకి దిగింది. ఇరాన్‌కు చెందిన 35 సంస్థలు, వ్యక్తులపై.. ‘షాడో బ్యాంకింగ్’ నెట్వర్క్ ద్వారా ఇరాన్ ఆయుధాలు, క్షిపణి ప్రోగ్రామ్‌లు, ఉగ్రవాద గ్రూపులకు నిధులు సమకూర్చుతున్నాయని ఆరోపిస్తూ వీరిని బ్లాక్‌లిస్ట్ చేసింది. ఈ నేపథ్యంలో అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ కీలక వ్యాఖ్యలు చేశారు.ఇరాన్, అమెరికా యుద్ధంలో రోజురోజుకు పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఇరాన్‌పై ట్రంప్ కఠిన ఆర్థిక చర్యలకు దిగారు. ఇరాన్‌పై ‘ఎకనామిక్ ఫ్యూరీ’ పేరుతో కొనసాగుతున్న ఆర్థిక ఒత్తిడి కార్యక్రమంలో భాగంగా ఇరాన్‌కు చెందిన 35 సంస్థలు(కొన్ని బ్యాంకులు కూడా), వ్యక్తులపై ఓఎఫ్ఏసీ ఆంక్షలు విధించింది. ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ మాట్లాడుతూ.. ఇరాన్ రహస్యంగా నిర్వహిస్తున్న షాడో బ్యాంకింగ్ వ్యవస్థ ద్వారా భారీ మొత్తంలో డబ్బు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో చలామణి అవుతోంది. ఈ నిధులు ఇరాన్ సైన్యం, క్షిపణి కార్యక్రమాలు, ప్రాంతీయ ఉగ్రవాద అనుబంధ సంస్థలకు చేరుతున్నాయి. ఇరాన్ సైనిక వ్యవస్థకు ఈ రహస్య బ్యాంకింగ్ వ్యవస్థ ఆర్థిక జీవనాధారంగా పనిచేస్తుంది. ఈ నెట్‌వర్క్‌కు సహకరించే ఏ ఆర్థిక సంస్థ అయినా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ సంస్థలు, ఆంక్షలకు గురైన సంస్థలకు అంతర్జాతీయ ఆర్థిక రంగంలోకి అక్రమ ప్రవేశం కల్పించడానికి విదేశీ అధికార పరిధిలోని షెల్ ఖాతాలను ఉపయోగిస్తున్నాయి’ అని ఆరోపించారు.ఆర్థిక వ్యవస్థపై ప్రభావం.. ఇదిలా ఉండగా.. ఇరాన్ టార్గెట్ అమెరికా.. 2025 ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు ఇరాన్‌కు సంబంధించి దాదాపు వెయ్యి సంస్థలు, వ్యక్తులపై ఆంక్షలు విధించినట్లు సమాచారం. తాజా చర్యలతో అమెరికాలో ఉన్న సంబంధిత సంస్థల ఆస్తులన్నీ స్తంభించిపోయే అవకాశం ఉంది. అలాగే వీరితో లావాదేవీలు కొనసాగించే విదేశీ బ్యాంకులు అమెరికా ఆర్థిక వ్యవస్థకు దూరమయ్యే ప్రమాదం ఉంది.బ్యాంకులకు ఝలక్.. మరోవైపు.. అమెరికా విధించిన ఆంక్షలకు గురైన సంస్థల్లో బ్యాంక్ సెపాత్ అనుబంధంగా పనిచేస్తున్న సంస్థలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ బ్యాంక్ ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమాలకు నిధులు సమకూర్చుతోందని అమెరికా ఆరోపిస్తోంది. అలాగే బ్యాంక్ సినా సుప్రీం లీడర్ నియంత్రణలో ఉన్నట్లు సమాచారం. మరోవైపు.. పార్సియన్ బ్యాంక్‌లతో సంబంధాలు ఉన్న కంపెనీలను కూడా లక్ష్యంగా చేసుకుంది. అయితే, తాజా చర్యలు ఇరానియన్ ఆయిల్ కంపెనీలకు నిధులను తరలించే వాటిని లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. బ్రిటన్‌కు చెందిన షుకున్ లిమిటెడ్ సంస్థ, 2024లో ఇరాన్ చమురు లావాదేవీల కోసం 70 మిలియన్ డాలర్లకు పైగా బదిలీ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.చైనా రిఫైనరీలకు హెచ్చరిక..ఇరాన్ చమురు కొనుగోలు చేస్తున్న “టీపాట్ రిఫైనరీలు” (ప్రధానంగా షాండాంగ్ ప్రావిన్స్‌లో)తో వ్యాపారం చేసే బ్యాంకులు కూడా ఆంక్షలకు గురవుతాయని OFAC హెచ్చరించింది. ఇవి చిన్న, స్వతంత్ర రిఫైనరీలు. ప్రధానంగా చైనా షాండాంగ్ ప్రావిన్స్‌లో ఉన్నాయి. పెద్ద ప్రభుత్వ రిఫైనరీలతో పోలిస్తే, వీటికి అంతర్జాతీయ నియంత్రణలు తక్కువగా ఉంటాయి. ఇరాన్ చమురు కొనుగోలు చేయడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇరాన్ చమురు కొనుగోలు చేస్తున్న ఈ రిఫైనరీలతో వ్యాపారం చేసే బ్యాంకులు, ఆర్థిక సంస్థలు కూడా ఆంక్షలకు గురవుతాయి అని అమెరికా స్పష్టం చేసింది. అంటే, ఈ రిఫైనరీలకు ఫైనాన్స్, ఇన్సూరెన్స్, షిప్పింగ్ సర్వీసులు అందించే సంస్థలు కూడా బ్లాక్‌లిస్ట్ అయ్యే ప్రమాదం ఉంది. -
యూఏఈ సంచలన నిర్ణయం.. పాకిస్తాన్‌కు బిగ్ షాక్!
ఇరాన్, అమెరికా మధ్య చర్చలు జరుగుతున్న వేళ పశ్చిమాసియాలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. గల్ఫ్ దేశమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(UAE) సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది. చమురు ఉత్పత్తి చేసే దేశాల కూటమి అయిన ఆర్గనైజేషన్ ఆఫ్ ది పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్-ఒపెక్ (OPEC), ఒపెక్+ (OPEC+) నుంచి బయటకు వచ్చేస్తున్నట్టు తాజాగా ఓ ప్రకటనలో తెలిపింది. అయితే, దీనికి సౌదీ అరేబియా, పాకిస్తానే ప్రధాన కారణమని తెలుస్తోంది. ఇదే సమయంలో పాకిస్తాన్‌కు యూఏఈ ఊహించని షాకిచ్చింది.కాగా, మే 1 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. ఒపెక్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తామని యూఏఈ తెలిపింది. మార్కెట్ డిమాండ్, పరిస్థితులకు అనుగుణంగా చమురు ఉత్పత్తిని క్రమంగా పెంచుతామని యూఏఈ ప్రభుత్వం స్పష్టం చేసింది. దేశీయ ఇంధన ఉత్పత్తిపై పెట్టుబడులను మరింత వేగవంతం చేస్తామని వెల్లడించింది. ఈ నిర్ణయం చమురు ఎగుమతి దేశాల కూటమికి, దానికి నాయకత్వం వహిస్తున్న సౌదీ అరేబియాకు ఇది అతిపెద్ద దెబ్బ అయ్యే అవకాశం ఉంది. ఒపెక్‌కు ఝలక్..1967లో యూఏఈ ఒపెక్ కూటమిలో చేరింది. ఒపెక్‌లో సౌదీ అరేబియా, ఇరాక్ తర్వాత మూడో అతిపెద్ద చమురు ఎగుమతిదారుగా ఉంది. ఒపెక్ నిర్ణయాల్లో కీలకంగా వ్యవహరిస్తూ వస్తోంది. సుదీర్ఘ కాలంపాటు సభ్యదేశంగా కొనసాగిన యూఏఈ.. అనూహ్యంగా ఈ నిర్ణయం తీసుకోవడం ప్రపంచ దేశాలను షాక్‌కు గురి చేసింది. దీనివల్ల భవిష్యత్‌లో ఒపెక్ బలహీనం అవుతుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇప్పటికే హార్మూజ్ మూసివేతతో చమురు ఎగుమతిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఒపెక్ దేశాలకు.. యూఏఈ రూపంలో మరో షాక్ తగిలింది. దేశ ప్రయోజనాల రీత్యా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపినప్పటికీ సౌదీ, పాకిస్తానే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. ఇటీవల జరిగిన ఇరాన్ దాడులు కూడా ఇందులో మరో కారణంగా విశ్లేషకులు చెబుతున్నారు.ఇరాన్ ఎఫెక్ట్.. ఇరాన్ దాడుల విషయంలో సౌదీ అరేబియా వంటి తన ప్రాంతీయ మిత్రదేశాలు సరైన రీతిలో స్పందించకపోవడం పట్ల యూఏఈ అసంతృప్తితో ఉంది. ఈ నేపథ్యంలో ఒపెక్ నుంచి యూఏఈ బయటకు వచ్చిందనే వాదన కూడా ఉంది. అలాగే, గల్ఫ్ ప్రాంతంలో యూఏఈ, సౌదీ అరేబియా, పాకిస్తాన్ మధ్య సంబంధాలు గత కొన్నేళ్లుగా మారుతూ వచ్చాయి. ఇటీవల ఇరాన్ యుద్ధం దాడుల సందర్భంగా యూఏఈపై ఇరాన్ ఇటీవల 537 బాలిస్టిక్ క్షిపణులు, 26 క్రూయిజ్ మిసైళ్లు, 2,256 డ్రోన్లతో దాడులు చేసింది. ఈ దాడులు యూఏఈ మౌలిక వసతులను తీవ్రంగా దెబ్బతీశాయి. ఈ క్రమంలో అమెరికా మరియు ఇజ్రాయెల్‌తో కలిసి ఇరాన్‌పై చర్యలు చేపట్టింది కానీ ప్రతిగా ఎక్కువ నష్టాన్ని చవిచూసింది. ఇదే సమయంలో పాకిస్తాన్ మధ్యవర్తి వ్యవహారంపై యూఏఈ ఆగ్రహం వ్యక్తం చేసింది.పాకిస్తాన్ పాత్ర..అమెరికా–ఇరాన్ మధ్య మధ్యవర్తిగా పాకిస్తాన్ వ్యవహరించింది.యూఏఈ మాత్రం పాకిస్తాన్ ఇరాన్‌పై కఠిన వైఖరి తీసుకోవాలని కోరింది.పాకిస్తాన్ తటస్థంగా ఉండటంతో యూఏఈ అసంతృప్తి చెందింది.ప్రతిగా యూఏఈ $3.5 బిలియన్ రుణం తక్షణమే తిరిగి చెల్లించమని డిమాండ్ చేసింది.దీంతో, 2026 ఏప్రిల్‌లో పాకిస్తాన్ యూఏఈకి $3.45 బిలియన్ రుణం తిరిగి చెల్లించింది.ఇందులో $1 బిలియన్ అబుదాబి ఫండ్ ఫర్ డెవలప్మెంట్కి చెల్లించబడింది.ఇది పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకు పెద్ద దెబ్బగా మిగిలింది.యూఏఈలో 1.6 మిలియన్‌కి పైగా పాకిస్తానీలు నివసిస్తున్నారు.వీరి రిమిటెన్సులు పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకు కీలకం.తాజాగా యూఏఈ, పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇది పాకిస్తానీలకు ఎదురుదెబ్బ కానుంది.సౌదీ-పాకిస్తాన్ బంధం..యూఏఈ డిమాండ్ తర్వాత సౌదీ అరేబియా వెంటనే పాకిస్తాన్‌కు $3 బిలియన్ రుణం ఇచ్చింది.అదనంగా $5 బిలియన్ క్రెడిట్ లైన్ వాగ్దానం చేసింది.అంతకుముందు 2025లో సౌదీ–పాకిస్తాన్ రక్షణ ఒప్పందం కుదిరింది.ఈ ఒప్పందం ప్రకారం పాకిస్తాన్ తన అణు ఆయుధాలు, క్షిపణులు సౌదీ రక్షణ కోసం ఉపయోగించగలదు.దీంతో, పాకిస్తాన్ తనను పక్కన పెట్టినట్లు యూఏఈ భావించింది.యూఏఈ నిర్ణయం ప్రభావం..ఆర్థికంగా: యూఏఈ ఇకపై రోజుకు 3 మిలియన్ బ్యారెల్స్ ఉత్పత్తిని కోటా పరిమితులు లేకుండా పెంచుకోగలదు.రాజకీయంగా: ఇది సౌదీ ఆధిపత్యానికి బహిరంగ సవాలు.ప్రపంచవ్యాప్తంగా: అమెరికా, చైనా, రష్యా తమ వ్యూహాలను మళ్లీ ఆలోచించాల్సి వస్తుంది. పశ్చిమాసియాలో యూఏఈ తన స్వతంత్ర విదేశాంగ విధానాన్ని అనుసరించడానికి ఎక్కువగా ప్రయత్నిస్తోంది. 2015లో ఇరాన్ మద్దతు ఉన్న యెమెన్ హౌతీ తిరుగుబాటుదారులకు వ్యతిరేకంగా పోరాడటానికి యూఏఈ, సౌదీ అరేబియా కలిసి ఒక కూటమిగా ఏర్పడ్డాయి. అయితే, యూఏఈ మద్దతు ఉన్న యెమెన్ వేర్పాటువాదులకు ఆయుధాల రవాణా జరుగుతోందని ఆరోపిస్తూ సౌదీ అరేబియా బాంబు దాడి చేయడంతో కూటమిలో విభేదాలు తలెత్తాయి. కాలక్రమేణా రియాద్ కొన్ని వైఖరులకు విరుద్ధంగా ఉంది. గత కొన్నేళ్లుగా అమెరికా తన చమురు ఉత్పత్తిని పెంచుకోవడంతో వియన్నా కేంద్రంగా పనిచేసే 'ఒపెక్' మార్కెట్ పవర్ క్రమంగా తగ్గుముఖం పట్టింది.ఇదిలా ఉండగా.. యూఏఈకి భారత్‌తో బలమైన సంబంధాలు ఉన్నాయి. అయితే, సౌదీ అరేబియా, పాకిస్తాన్ మరియు టర్కీ ఒక కూటమిగా ఏర్పడుతున్నాయి. వారి మధ్య త్రైపాక్షిక సైనిక ఒప్పందంపై చర్చ జరుగుతోంది.భారత్‌కి అవకాశాలు:తక్కువ ధరలు: యూఏఈ ఉత్పత్తి కోటాల నుండి విముక్తి పొందడంతో రోజుకు 4.8 మిలియన్ బ్యారెల్స్ వరకు ఉత్పత్తి పెంచే అవకాశం ఉంది. ఇది గ్లోబల్ మార్కెట్లో సరఫరా పెంచి ధరలను తగ్గిస్తుంది.దిగుమతి బిల్లు తగ్గింపు: భారత్‌కి క్రూడ్ ఆయిల్ దిగుమతి ఖర్చు తగ్గి, ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉండే అవకాశం ఉంది.ఇంధన ధరలు: పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉండే అవకాశం ఉంది, ఇది వినియోగదారులకు నేరుగా లాభం జరుగుతుంది.2022లో భారత్ యూఏఈ నుండి $11 బిలియన్ విలువైన క్రూడ్ దిగుమతి చేసుకోగా, 2026లో ఇది $14 బిలియన్కి పెరిగింది.యూఏఈ వాటా భారత్ క్రూడ్ దిగుమతుల్లో 10.3% నుండి 11.4%కి పెరిగింది.దీర్ఘకాల ఒప్పందాలు: ఒపెక్ కోటాల పరిమితులు లేకుండా భారత్ యూఏఈతో దీర్ఘకాల సరఫరా ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంది. యూఏఈతో ఎనర్జీ భాగస్వామ్యం మరింత బలపడుతుంది. LNG, LPG రంగాల్లో కూడా కొత్త ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంది. -
ఈ సారి వేసవి సెలవుల ఎంజాయ్మెంట్ ఉండదా?
వేసవి సెలవులు అంటేనే అందరికీ గుర్తొచ్చేది ప్రయాణాలు, సందడి. ఎండలు మండిపోతున్నా ఎన్నో పర్యాటక ప్రదేశాలకు వెళ్తుంటారు చాలా మంది. వేసవి సెలవులు అంటేనే వచ్చే ఉత్సాహం వేరు. చాలా మంది చల్లని ప్రదేశాలకు వెళ్తుంటారు. ఎండ వేడి నుండి తప్పించుకోవడానికి చాలామంది హిల్ స్టేషన్లకు వెళ్తుంటారు. ఊటీ, కొడైకెనాల్, సిమ్లా, మనాలీ, అరకు వ్యాలీ వంటి ప్రాంతాలు పర్యాటకులతో కిక్కిరిసిపోతాయి. ప్రకృతి ఒడిలో, పచ్చని కొండలు, జలపాతాలు, చల్లని గాలి మనసుకు ఎంతో హాయినిస్తాయి. డబ్బున్న వారు విదేశాలకు వెళ్తుంటారు. బిజీగా ఉండే తల్లిదండ్రులకు, చదువులతో అలసిపోయిన పిల్లలకు ఈ సెలవులు ఒక వరప్రసాదం. పర్యాటక ప్రదేశాలకు వెళ్లి కొత్త విషయాలను కూడా నేర్చుకోవచ్చు. అయితే, ప్రస్తుతం నెలకొన్న ఇంధన కొరతలు వేసవి సెలవుల ఎంజాయ్మెంట్ను చెడగొడతాయా?ఏం జరుగుతోంది? ఇరాన్, అమెరికా మధ్య యుద్ధం వల్ల ఏర్పడిన సరఫరా సమస్యల కారణంగా డీజిల్, జెట్ ఇంధన కొరతలు పెరిగి వేసవి సెలవుల్లో పర్యాటకుల సంఖ్య తగ్గిపోయే అవకాశముందని విశ్లేషకులు చెబుతున్నారు. హార్మూజ్ జలసంధి ఇంకో 2 లేదా 3 నెలలు మూసి ఉంటే ప్రపంచం మొత్తం.. కొన్ని ఆసియా దేశాలు ప్రస్తుతం ఎదుర్కొంటున్నట్లే ఇంధన కొరతలు ఎదుర్కొంటుందని నిపుణులు చెప్పారు. ఫిబ్రవరి చివరలో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ప్రపంచ చమురు, ఎల్ఎన్జీ సరఫరాలో సుమారు ఐదవ వంతు వెళ్లే హార్మూజ్ జలసంధి మార్గాన్ని ఇరాన్ మూసివేసింది. అంతర్జాతీయ ఇంధన సంస్థ తెలిపిన వివరాల ప్రకారం రోజుకు సుమారు 11 మిలియన్ బ్యారెళ్ల చమురు మార్కెట్‌కు రాకుండా నిలిచిపోతోంది. గల్ఫ్ ప్రాంత రిఫైనరీలు కూడా పెద్ద మొత్తంలో డీజిల్, జెట్ ఇంధనం ఉత్పత్తి చేస్తాయి. ఈ సరఫరాలు లేకపోతే ప్రపంచంలో తీవ్ర ప్రభావాలు తప్పవని నిపుణులు చెప్పారు. ఆఫ్రికా, ఆసియా దేశాల్లో కొన్ని ఇప్పటికే ఇంధనం లేదా విద్యుత్‌ను పరిమితంగా వినియోగించాల్సి వచ్చింది. యూరోపియన్ కమిషన్, సభ్య దేశాలు కనీసం తాత్కాలికంగా సరఫరాలపై భరోసా ఇవ్వడానికి ప్రయత్నించాయి.వేసవిలో ఎందుకు ఆందోళన?వేసవిలో కుటుంబాలు కార్లలో ప్రయాణించడం లేదా విమానాల్లో సెలవులకు వెళ్లడం ఎక్కువగా ఉంటుంది. సరఫరా తగ్గినప్పుడు ఆసియా, యూరప్ మధ్య పోటీ పెరుగుతుంది. ఇదే పరిస్థితి 2022లో రష్యా ఉక్రెయిన్‌పై దాడి తర్వాత కనపడింది. ఇప్పుడు మళ్లీ అదే పరిస్థితి కనిపిస్తోంది. భారత్‌లో ఇంధన కొరత వల్ల ఇప్పటికే చాలా మంది ప్రయాణాలను వాయిదా వేసుకుంటున్నారు.ఒక ఇంధన రంగ నిపుణుడు చెప్పిన వివరాల ప్రకారం.. యూరప్ అధిక ధరలు చెల్లించి ఇంధన కొరతలు తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. దీంతో యూరప్ ముందుగా ధరల షాక్‌కు గురయ్యే ప్రమాదం ఉంది. కానీ గల్ఫ్ నుంచి సరఫరాలు నిలిచిపోతే కొరతలు కూడా ఏర్పడవచ్చు. రిస్టాడ్ ఎనర్జీ సంస్థలో ఆయిల్ మార్కెట్లు, డౌన్‌స్ట్రీమ్ వైస్ ప్రెసిడెంట్ జనివ్ షా తెలిపిన వివరాల ప్రకారం.. వేసవిలో యూరప్‌లో డీజిల్, జెట్ ఇంధన కొరతలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. పశ్చిమాసియా, ఆసియా నుంచి వచ్చే కీలక సరఫరాలు ప్రస్తుత అంతరాయం వల్ల తగ్గాయి. విమానయాన సంస్థలు జెట్ ఇంధన ధరలు పెరగడంతో టికెట్ ధరలు పెంచాయి, కొన్ని విమానాలను తగ్గించాయి. కొన్ని వారాల్లోనే జెట్ ఇంధన కొరతలు రావచ్చన్న సూచనలు ఉన్నాయి. యూరోపియన్ యూనియన్ ఇంధన కమిషనర్ డాన్ జోర్గెన్సెన్ స్కై న్యూస్‌కు చెప్పిన వివరాల ప్రకారం.. దురదృష్టవశాత్తు చాలా మంది సెలవులు ప్రభావితం అయ్యే అవకాశం ఉంది. విమానాలు రద్దు కావచ్చు లేదా టికెట్లు చాలా ఎక్కువ ధరలకు లభించవచ్చు.చాలా దేశాల వద్ద వ్యూహాత్మకంగా చమురు నిల్వలు ఉంచుకున్నాయి. అంతర్జాతీయ ఇంధన సంస్థలో భాగమైన దేశాలు యుద్ధం ప్రారంభ దశలోనే ధరలు పెరగకుండా ఆ నిల్వలను వినియోగించాయి. కొరతలు రాకుండా మళ్లీ వాటిని ఉపయోగించవచ్చు. యూరోపియన్ యూనియన్ దేశాలు రిఫైనరీ ఉత్పత్తిని గరిష్ఠ స్థాయికి పెంచడానికి ప్రయత్నిస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో డీజిల్, జెట్ ఇంధన ఉత్పత్తి పెంచే ప్రయత్నం జరుగుతోంది. -
ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ ఇప్పుడెలా ఉన్నారు?
న్యూఢిల్లీ: ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ ఆరోగ్యంపై వచ్చిన వదంతులను భారత్‌లోని ఆయన ఉప ప్రతినిధి డాక్టర్ మొహమ్మద్ హొస్సేన్ జియాయీనియా ఖండించారు. మొజ్తబా ఖమేనీ ఆరోగ్య పరిస్థితి బాగుందని చెప్పారు.“మా సుప్రీం లీడర్ హజ్రత్ అయతొల్లా సయ్యిద్ మొజ్తబా ఖమేనీ పరిస్థితి దేవుని కృప వల్ల బాగుంది. కొన్ని రోజుల క్రితం మాకు అందిన సమాచారం ప్రకారం.. ఆయన పరిస్థితి బాగుంది” అని జియాయీనియా తెలిపారు. ఖమేనీ ఆరోగ్యంపై వస్తున్న ఊహాగానాల్లో వాస్తవాలు లేవని చెప్పారు. ఆయన ఆరోగ్యం బాగోలేదని, కొన్ని సమస్యలు ఉన్నాయని వస్తున్న వదంతులన్నీ నిజం కాదని పేర్కొన్నారు.పశ్చిమాసియా ఘర్షణపై ఇరాన్ వైఖరిని మరోసారి చెబుతూ.. “యుద్ధం ప్రారంభం నుంచే మా దివంగత సుప్రీం లీడర్ హజ్రత్ అయతొల్లా సయ్యిద్ అలీ ఖమేనీ చెప్పిన వాక్యాన్ని మేము చెబుతున్నాము. అమెరికన్లు, మా శత్రువులు ఈ యుద్ధాన్ని ప్రారంభించారు, కానీ ఈ యుద్ధాన్ని ముగించేది మాత్రం మేమే. ఈ యుద్ధం ఎలా ముగుస్తుందో మేమే నిర్ణయిస్తాము’’ అని చెప్పారు.గతవారం న్యూ యార్క్ టైమ్స్ నివేదిక ప్రకారం.. ఫిబ్రవరి 28న జరిగిన వైమానిక దాడుల తర్వాత మొజ్తబా ఖమేనీ బహిరంగంగా ఎక్కడా కనపడలేదు. ఆ దాడులు మాజీ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ నివసించిన భవన సముదాయంపై జరిగాయి. ఆ ఘటనలో ఆయన భార్య, కుమారుడు మరణించారు.ఆ తర్వాత మొజ్తబా ఖమేనీ వద్దకు ఎవరినీ వెళ్లనివ్వడం లేదు. ప్రధానంగా వైద్య సిబ్బంది మాత్రమే ఆయనను చూసుకుంటున్నారు. దాడుల్లో గాయాల నుంచి ఆయన కోలుకుంటున్నారని న్యూ యార్క్ టైమ్స్ తెలిపింది.పశ్చిమాసియా ఘర్షణ ముగింపుకు ప్రయత్నాలు, రష్యా, చైనా, భారత్ పాత్రపై జియాయీనియా స్పందిస్తూ.. “ప్రతి దేశం పాత్ర పోషించవచ్చు, అది సానుకూలం లేదా ప్రతికూల పాత్ర కూడా కావచ్చు” అని చెప్పారు. ప్రతి ఒక్కరూ గ్యాస్, చమురు ధరల గురించి ఆందోళన చెందుతున్నారని.. కానీ, ప్రాణాలు కోల్పోతున్న ప్రజల జీవన విలువ గురించి ఎవరూ ఆందోళన చెందడం లేదని అన్నారు.ఇరాన్ ప్రజలు ఐక్యంగా ఉన్నారని, దేశంలో అంతర్గత ఉద్రిక్తతలపై వచ్చే నివేదికలు, సూచనలు ప్రభుత్వ వ్యవస్థ గురించి అవగాహన లేని వారు చెబుతున్నారని పేర్కొన్నారు. ఇరాన్ ప్రభుత్వ వ్యవస్థ ఒక వ్యక్తిపై ఆధారపడదని, అది రిపబ్లిక్ అని చెప్పారు. -
పూర్తిగా పతనమయ్యే స్థితిలో ఇరాన్: ట్రంప్
వాషింగ్టన్ డీసీ: ‘ఇరాన్ పూర్తిగా పతనమయ్యే స్థితిలో ఉంది. ఈ విషయాన్ని ఇరాన్ మాకు తెలిపింది. ఇరాన్ తమ నాయకత్వ పరిస్థితిని సర్దుబాటు చేసుకునేందుకు వీలైనంత త్వరగా హార్మూజ్ జలసంధిని తెరవాలని కోరుతోంది’ అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం అన్నారు. ఇరాన్ అంతర్గత నాయకత్వ సంక్షోభం కారణంగానే ఆ వ్యూహాత్మక జలమార్గాన్ని తెరవాలని కోరుతోందని, ఈ సమస్య త్వరలోనే పరిష్కారమవుతుందని ట్రూత్ సోషల్ పోస్ట్‌లో ట్రంప్ తెలిపారు. ప్రపంచ చమురు రవాణాలో అధిక భాగం సాగే కీలకమైన సముద్ర మార్గం హార్మూజ్ జలసంధి. దాని చుట్టూ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంటో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.ప్రస్తుతం నెలకొన్న శత్రుత్వాన్ని ఆపే లక్ష్యంతో ఇరాన్ తాజాగా చేసిన దౌత్యపరమైన ప్రతిపాదనను తిరస్కరించడానికే తాను మొగ్గు చూపుతున్నట్లు ట్రంప్ అంతకుముందే సూచించారు. హార్మూజ్ జలసంధిని తెరవాలని, అణు కార్యక్రమానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చను ఇప్పుడు కాకుండా భవిష్యత్తులో జరపాలని ఇరాన్ సూచించినట్లు సమాచారం.తాజాగా జాతీయ భద్రతా అధికారులతో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పలు సందేహాలను వ్యక్తం చేశారు. అలాగే, ఇరాన్‌లోని యురేనియం నిల్వల గురించి చర్చించకుండా కీలకమైన హార్మూజ్ జలమార్గాన్ని తిరిగి తెరిస్తే అమెరికా దౌత్యపరంగా విధిస్తున్న ఒత్తిడి ఇక ఉండదని పరిపాలనా అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, దిగ్బంధనాన్ని కొనసాగించడం వల్ల కూడా ప్రమాదాలు ఉన్నాయి. జలసంధి మూసివేత వల్ల పెరిగిన ఇంధన ధరలు అమెరికాలో ఇంధన ఖర్చులను భారీగా పెంచే అవకాశం ఉంది. అమెరికా తదుపరి వ్యూహంపై స్పష్టత రాలేదు.ఇదే సమయంలో, కొనసాగుతున్న సంఘర్షణను ముగించడానికి వ్యూహాత్మక జలసంధిని తిరిగి తెరవడానికి ఇరాన్ నుంచి వచ్చిన కొత్త ప్రతిపాదనను ట్రంప్, ఆయన జాతీయ భద్రతా బృందం చర్చిస్తున్నట్లు వైట్ హౌస్ ధ్రువీకరించింది. వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ విలేకరులతో మాట్లాడుతూ.. ఈ ప్రతిపాదన చర్చకు వచ్చిందని చెప్పారు. -
ట్రంప్‌ను డైలామాలోకి నెట్టిన ఇరాన్!
ఇరాన్, అమెరికా మధ్య చర్చల విషయంలో ఇప్పటికీ సస్పెన్స్ కొనసాగుతోంది. అయితే, ఇరాన్ తాజాగా చేసిన కొత్త ప్రతిపాదనలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. అణ్వస్త్ర కార్యక్రమాన్ని మినహాయించి ఇరాన్‌తో చర్చలు జరపడంలో అర్థమే ఉండదని అమెరికా ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఇరాన్ అణ్వస్త్ర కార్యక్రమాన్ని అడ్డుకోవడం లక్ష్యంగా ప్రారంభమైన నేపథ్యంలో దాని ప్రస్తావనే ఆలస్యం కావడంపై మల్లగుల్లాలు పడుతున్నట్టు కథనాలు వెలువడ్డాయి.అయితే, శాంతి చర్చల్లో భాగంగా అమెరికాకు ఇరాన్ ఇటీవలే కొత్త ప్రతిపాదనలను పాకిస్తాన్ మధ్యవర్తుల ద్వారా పంపించింది. ఇందులో భాగంగా శాంతి ఒప్పందం కుదుర్చుకోవడం, హార్మూజ్ జలసంధిని తెరవడం అనేవి జరిగిన తర్వాతే తమ అణ్వస్త్ర కార్యక్రమంపై చర్చలు జరుపుతామని ఇరాన్ తేల్చి చెప్పింది. మరోవైపు.. అణ్వస్త్ర కార్యక్రమంపై ఇరాన్‌తో చర్చలు ఫలప్రదమైన తర్వాతే మిగతా విషయాలపై ఫోకస్ పెడతామని అమెరికా వాదిస్తోంది. ఈ నేపథ్యంలో ఇరాన్ పంపిన నూతన ప్రతిపాదనలపై చర్చించేందుకు తన సలహాదారులతో ట్రంప్ తాజాగా సమావేశమైనట్లు తెలిసింది. అణ్వస్త్ర కార్యక్రమంపై చర్చలు జరగనిదే, మిగతా అంశాలపై ఇరాన్‌తో చర్చలను మొదలుపెట్టలేమని ట్రంప్ తేల్చి చెప్పినట్లు అధికార వర్గాలు చెప్పాయి. ఇరాన్ ప్రతిపాదించిన క్రమంలో చర్చల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లలేమని ట్రంప్ స్పష్టం చేశారని పేర్కొన్నాయి.ఇరాన్‌కు నో ఛాన్స్.. ఇరాన్‌తో శాంతి చర్చలపై అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కీలక వ్యాఖ్యలు చేశారు. మార్కో రూబియో తాజాగా ఫాక్స్ న్యూస్‌తో మాట్లాడుతూ..‘ఇరాన్ ఇక ఏ దశలోనూ అణ్వాయుధాలను అభివృద్ధి చేయలేదని నిర్ధారించే ఒప్పందం కుదరాల్సిందే. ఈ విషయంలో ఇరాన్‌కు తప్పించుకునే అవకాశాన్ని ఇవ్వకూడదు. ఇరాన్ నుంచి దీనిపై అమెరికా ధ్రువీకరణ పొందాలి’ అంటూ వ్యాఖ్యలు చేశారు. దీంతో.. అమెరికా, ఇరాన్ శాంతి చర్చల ప్రక్రియలో మరోసారి ప్రతిష్టంభన ఏర్పడింది. ఇరు దేశాలూ తమ షరతుల ప్రకారమే చర్చలు జరగాలని వాదిస్తున్నాయి. వాదనను నెగ్గించుకునే యత్నంలో అమెరికా, ఇరాన్ ఉండటంతో చర్చల ప్రక్రియ ముందుకు సాగే పరిస్థితులు కనిపించడం లేదు.ఇరాన్ ప్రతిపాదనలు ఇవే...ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధాన్ని ముగించడం, మళ్లీ ఇరాన్‌పై దాడులు జరగవు అనే హామీలను పొందడం.ఇరాన్ ఓడరేవుల ముట్టడిని అమెరికా ఆపడం, హార్మూజ్ జలసంధిని తెరవడం.మొదటి రెండు ప్రతిపాదనలు అమల్లోకి వచ్చాక తమ అణ్వస్త్ర కార్యక్రమం, సంవర్ధిత యురేనియం హక్కులపై అమెరికాతో చర్చలను మొదలుపెడతామని ఇరాన్ ప్రతిపాదించింది. -
వ్యూహం మార్చిన ట్రంప్.. IRGCకి తొలి దెబ్బ!
అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధం అసలు సిసలు స్టేజ్‌కు చేరుకుంది. ఇరాన్‌పై అమెరికా పదునైన వ్యూహాలతో ముందుకు సాగుతోంది. ఆర్థికంగా ఇరాన్ దెబ్బకొట్టే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) ఇరాన్ పోర్టులకు వెళ్లే, అక్కడి నుంచి బయలుదేరే అన్ని నౌకలను అడ్డుకుంటోంది. సముద్ర దిగ్భందనం చేసింది. దీంతో, ఇరాన్ రోజుకు దాదాపు 500 మిలియన్ డాలర్లు నష్టం చవిచూస్తోంది.ఇక, తాజాగా అమెరికా మరో మాస్టర్ ప్లాన్ చేసింది. అమెరికా ఇరాన్‌పై ఒత్తిడి పెంచడానికి విమానయాన రంగాన్ని కీలకంగా ఉపయోగిస్తోంది. అమెరికా ఆపరేషన్ ఎకానామిక్ ఫ్యూరీలో భాగంగా ఇరాన్ విమానయాన సంస్థలతో లావాదేవీలు జరిపే కంపెనీలపై ఆంక్షలు విధిస్తామని హెచ్చరిక జారీ చేసింది. ఇరాన్ విమానాలకు జెట్ ఇంధనం, క్యాటరింగ్, ల్యాండింగ్ సేవలు లేదా నిర్వహణ వంటి సహాయాన్ని అందించే సంస్థలను సాయం నిలిపివేయాలని హెచ్చరించింది. ఈ క్రమంలో, ఇరాన్ ఎయిర్‌లైన్స్‌కి సేవలు అందించే ఏ కంపెనీ అయినా ఆంక్షలకు గురయ్యే అవకాశం ఉందని చెప్పుకొచ్చింది. ఆయా కంపెనీలపై ఆంక్షలు విధిస్తామని అమెరికా పేర్కొంది.కాగా, ఇరాన్‌కు Iran Air మరియు Mahan Air విమాన సంస్థలు ఉన్నాయి. ఇవి ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC)కు మద్దతు ఇస్తున్నాయని అమెరికా ఆరోపిస్తోంది. అమెరికా ప్రకారం, ఇరాన్ ఎయిర్‌లైన్స్ IRGC కోసం ఆయుధాలు, సిబ్బంది, సామగ్రి తరలించడానికి ఉపయోగపడుతున్నాయి. ఇందులో భాగంగానే ఎయిర్‌లైన్స్‌పై ఆంక్షలు విధించి ఆర్థికంగా ఇరాన్‌ను దెబ్బతీయాలనే ప్లాన్ చేసినట్టు తెలిసింది. అలాగే, ఇతర దేశాల ప్రభుత్వాలు కూడా తమ పరిధిలోని కంపెనీలు ఇరాన్ ఎయిర్‌లైన్స్‌తో సంబంధాలు పెట్టుకోకుండా చూడాలని అమెరికా కోరుతోంది.ప్రస్తుతం అమెరికా ఆంక్షల జాబితా (SDN List)లో ఇరాన్‌కు సంబంధించిన అనేక కంపెనీలు, షిప్పింగ్ సంస్థలు, రిఫైనరీలు ఉన్నాయి. ఇవి ప్రధానంగా చైనా, హాంకాంగ్, యూఏఈ, లైబీరియా, మార్షల్ దీవులు, కేమన్ దీవులు వంటి దేశాలకు సంబంధించిన సంస్థలు. ఇరాన్ ఎయిర్‌లైన్స్‌పై అమెరికా ఆంక్షల వల్ల చైనా, టర్కీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) వంటి దేశాల్లోని కొన్ని కంపెనీలు ఇప్పటికే నష్టపోయాయి. ముఖ్యంగా చైనా రిఫైనరీలు, షిప్పింగ్ కంపెనీలు, మరియు ఇరాన్ ఆయిల్ రవాణా నెట్‌వర్క్‌లతో సంబంధం ఉన్న సంస్థలు అమెరికా ఆర్థిక వ్యవస్థ నుండి వేరుచేయబడ్డాయి.ట్రంప్ వార్నింగ్యుద్ధం ముగించటానికి, కాల్పుల విరమణకు అంగీకరించడానికి కేవలం మూడు రోజుల సమయం మాత్రమే ఉందని డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. లేదంటే వారి చమురు పైపులైన్లు పేలిపోతాయని తెలిపారు. ఇరాన్ చమురు ఎగుమతులను కొనసాగించలేకపోతే, యాంత్రికంగా, భూమి సహజశక్తుల కారణంగా పైపులైన్లు విఫలమవుతాయన్నారు. ఇరాన్‌కు భారీ పరిమాణంలో చమురు సరఫరా వ్యవస్థ ఉందని, ఏదైన కారణం చేత అది మూసుకుపోతే అప్పుడు ఇంధనాన్ని కంటైనర్లు లేదా నౌకల్లో నింపడం సాధ్యం కాదన్నారు. ప్రస్తుతం ఇరాన్ అదే పరిస్థితి ఎదుర్కొటోందన్న ట్రంప్, దిగ్బంధనం కారణంగా వారి వద్ద నౌకలు కూడా లేవని తెలిపారు. ఆర్థికంగా ఇరాన్ బలహీనంగా ఉందని ట్రంప్ చెప్పుకొచ్చారు.ఆపరేషన్ ఎకనామిక్ ఫ్యూరీ..ఇరాన్‌పై 2025లో ప్రారంభమైన ఈ కార్యక్రమం ఇరాన్‌కి సంబంధించిన ఆయుధాలు, డ్రోన్లు, ఆయిల్ స్మగ్లింగ్, విమాన రవాణా నెట్‌వర్క్‌లను అడ్డుకోవడమే లక్ష్యం.ప్రెషర్ పాయింట్: అంతర్జాతీయంగా విమానయాన సేవలు లేకుండా ఎయిర్‌లైన్స్ నడవలేవు. అందుకే ఈ రంగాన్ని ఆంక్షలతో బలహీనపరచాలని ప్రయత్నిస్తున్నారు.ప్రాంతీయ ఉద్రిక్తతలు: హార్మూజ్ జలసంధిలో ఇరాన్ బలగాలు వాణిజ్య నౌకలపై కాల్పులు జరిపిన ఘటనల తర్వాత ఈ హెచ్చరిక మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.ఆంక్షలు: అమెరికా వెలుపల ఉన్న కంపెనీలు కూడా ఇరాన్ ఎయిర్‌లైన్స్‌కి సేవలు అందిస్తే ఆంక్షలకు గురవుతాయి. ఆంక్షలు పడిన సంస్థలు అమెరికా బ్యాంకింగ్ వ్యవస్థ, మార్కెట్లకు దూరమవుతాయి.సేవలు నిషేధం:జెట్ ఇంధనం సరఫరావిమాన మెయింటెనెన్స్, రిపేర్ఇన్-ఫ్లైట్ క్యాటరింగ్గ్రౌండ్ హ్యాండ్లింగ్ల్యాండింగ్, ఎయిర్పోర్ట్ ఫీజులుప్రపంచ వ్యాపారాలు: విమానయాన, ఇన్సూరెన్స్, ఫైనాన్స్ రంగాల్లోని సంస్థలు నేరుగా ప్రభావితమవుతున్నాయి.ప్రాంతీయ ప్రభావం: హార్మూజ్ జలసంధి దిగ్భందనం వల్ల చమురు, గ్యాస్, ఎరువుల సరఫరా అంతరాయం. -
యుద్ధం ముగింపు? ఇరాన్ ప్రతిపాదనపై ట్రంప్ కీలక చర్చలు
వాషింగ్టన్ డీసీ: యుద్ధాన్ని ముగించడం, వ్యూహాత్మకంగా కీలకమైన హార్మూజ్ జలసంధిని తిరిగి ప్రారంభించడం లక్ష్యంగా ఇరాన్ పంపిన కొత్త ప్రతిపాదనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన జాతీయ భద్రతా బృందం చర్చలు జరుపుతున్నట్లు వైట్ హౌస్ ధ్రువీకరించింది.వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ ప్రతిపాదనను అత్యున్నత స్థాయిలో పరిశీలిస్తున్నట్లు తెలిపారు. “ఇవాళ ఉదయం అధ్యక్షుడు ట్రంప్ తన జాతీయ భద్రతా బృందంతో సమావేశమయ్యారని నేను ధ్రువీకరిస్తున్నాను. సమావేశం ఇంకా కొనసాగుతుండవచ్చు, లేక ముగిసి ఉండవచ్చు. ప్రతిపాదనపై చర్చ జరిగింది. దాన్ని పరిశీలిస్తున్నారని నేను చెప్పను. ఈ ఉదయం చర్చ జరిగింది అని మాత్రమే చెబుతాను. దీనిపై ముందుగా వివరాలు చెప్పదలచుకోలేదు. ఈ అంశంపై త్వరలోనే అధ్యక్షుడు స్వయంగా మాట్లాడతారు” అని ఆమె చెప్పారు.మూడోసారి పాక్‌కు అబ్బాస్ అరాఘ్చీ ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ మంగళవారం తెల్లవారుజామున పాకిస్థాన్‌కు చేరుకున్నారు. అమెరికాతో ఘర్షణను ముగించేందుకు కొనసాగుతున్న దౌత్య చర్యల్లో భాగంగా ఆయన ఇస్లామాబాద్‌కు రావడం 48 గంటల్లో ఇది మూడోసారి.అబ్బాస్ అరాఘ్చీ అంతకుముందు రష్యాలో కార్యక్రమాలు ముగించుకున్నారు. అరాఘ్చీ ఇస్లామాబాద్ తాజా పర్యటన రష్యా, ఒమాన్ సహా పలు దేశాల్లో ఉన్నతస్థాయి సమావేశాల తర్వాత జరిగింది. పాకిస్థాన్‌కు ఆయన పదేపదే రావడం ప్రస్తుత పరిస్థితిలో శాంతికి మధ్యవర్తిగా ఇస్లామాబాద్ పాత్రను సూచిస్తోందని విశ్లేషకులు అంటున్నారు. ఇంతకు ముందు, సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో అరాఘ్చీ చర్చలు జరిపారు. ఈ సమావేశంలో ద్వైపాక్షిక సంబంధాలు, ప్రాంతీయ పరిణామాలపై చర్చ జరిగింది. కాగా, ఇరాన్ అణు కార్యక్రమంపై చర్చలు తర్వాతి దశలో నిర్వహించాలని షరతు పెట్టింది. -
పోరు ఆపితే తెరుస్తాం
కైరో/మాస్కో/దుబాయ్: హార్మూజ్ జలసంధిని దిగ్బంధం నుంచి విముక్తి కల్పించి యుద్ధానికి చరమగీతం పాడితే హార్మూజ్ జలసంధి గుండా విదేశీ వాణిజ్యనౌకల రాకపోకలకు మార్గం సుగమం చేస్తామని ఇరాన్ కొత్త ప్రతిపాదనలను తెరమీదకు తెచ్చింది. ఆదివారం ఒమన్ నుంచి పాకిస్తాన్‌కు చేరుకున్న ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ ఈ మేరకు తమ ప్రతిపాదనలకు హెహబాజ్ షరీఫ్ ప్రభుత్వానికి తెలియజేశారు. వీటిని అమెరికాకు పాక్ అందజేయనుంది. వీటిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విముఖత చూపొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పుతిన్‌తో అరాఘ్చీ భేటీ.. ఇరాన్ మంత్రి అరాఘ్చీ సోమవారం రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్ నగరంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో భేటీ అయ్యారు. తమ సార్వ¿ౌమత్వం కోసం పోరాడుతున్న ఇరానియన్లను ఈ సందర్భంగా పుతిన్ పొగిడారు. తర్వాత పశ్చిమాసియా యుద్ధం, హార్మూజ్ దిగ్బంధం, అమెరికా షరతులు, ఇరాన్ డిమాండ్లు తదితర కీలకాంశాలపై అరాఘ్చీ, పుతిన్ విస్తృతంగా చర్చించుకున్నారని రష్యా అధ్యక్షభవనం క్రిమ్లిన్ తెలిపింది. ‘‘పశ్చిమాసియాలో శాంతిస్థాపన కోసం రష్యా తన శక్తిమేరకు చేసేందుకు సిద్ధంగా ఉంది. ఇరాన్‌తో వ్యూహాత్మక బంధం బలోపేతానికి కృషిచేస్తాం’’అని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ స్పష్టంచేశారు. భారతీయ ట్యాంకర్‌పై కాల్పులు.. ఒమన్ నుంచి భారత్‌కు వస్తున్న రసాయనాల ట్యాంకర్ ఎంటీ చిరాన్7పై ఇరాన్ గన్బోట్లు హెచ్చరిస్తూ కాల్పులు జరిపాయి. ఏప్రిల్ 25వ తేదీన జరిగిన ఈ కాల్పులఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హార్మూజ్‌కు వాయవ్యంగా ఒమన్‌కు చెందిన షినాస్ పోర్ట్ సమీప జలాల గుండా నౌక వెళ్తున్నప్పుడు ఈ ఘటన జరిగింది. నౌకలోని 17 మంది భారతీయనావికులకు ఎలాంటి గాయాలుకాలేదని కేంద్ర షిప్పింగ్, పోర్ట్‌లు, వాటర్‌వేస్ శాఖ డైరెక్టర్ మన్దీప్ సింగ్ రంధావా తెలిపారు. -
యూఏఈకి ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ రక్షణ
అబుదాబి: పశ్చిమాసియా యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇరాన్ దాడుల నుంచి సురక్షితంగా ఉండేందుకు యూఏఈ చర్యలకు ఉపక్రమించింది. ఇజ్రాయెల్ అందించిన ‘ఐరన్ డోమ్’ను యూఏఈ మోహరించింది. ఇరాన్ నుంచి పెరుగుతున్న డ్రోన్, క్షిపణి ముప్పులను ఎదుర్కొనేందుకు ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది.గత కొన్నేళ్లుగా ఇజ్రాయెల్, యూఏఈ సంబంధాలు మరింత బలపడుతున్నాయి. అబ్రహాం ఒప్పందాల తర్వాత రెండు దేశాలు రక్షణ రంగంలో సహకారం పెంచుకుంటూ వెళ్తున్నాయి. తాజాగా, యూఏఈలో ఐరన్ డోమ్ వ్యవస్థను అమలు చేయడం ద్వారా ఇరాన్ నుంచి వచ్చే ముప్పులను ఎదుర్కోవడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంది. రాఫెల్ అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్స్ అభివృద్ధి చేసిన ఈ వ్యవస్థ 4–70 కిలోమీటర్ల పరిధిలోని రాకెట్లు, మోర్టార్లు, డ్రోన్లను అడ్డుకుంటుంది. మిర్ ఇంటర్‌సెప్టర్ అనే క్షిపణులు లక్ష్యాన్ని గాల్లోనే ధ్వంసం చేస్తాయి. ఎల్టా సిస్టమ్స్ రాడార్ ద్వారా వచ్చే ముప్పులను గుర్తించి, వెంటనే ప్రతిస్పందిస్తుంది. ఇజ్రాయెల్‌లో ఈ వ్యవస్థ 90శాతం విజయవంతమైనట్లు తెలుస్తోంది. ఇరాన్ గత కొన్నేళ్లుగా యూఏఈ, సౌదీ అరేబియా వంటి దేశాలపై డ్రోన్ దాడులు జరిపింది. 2025లో యూఏఈపై జరిగిన దాడుల్లో 2,200కి పైగా డ్రోన్లు ఉపయోగించింది. ఈ నేపథ్యంలో యూఏఈలో ఐరన్ డోమ్‌ను వినియోగంలోకి తెచ్చింది. యూఏఈ ఇప్పటికే అమెరికా నుంచి పాట్రియట్, థాడ్ రక్షణ వ్యవస్థలను పొందింది. ఇప్పుడు ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ చేరడంతో యూఏఈ రక్షణ మరింత బలపడనుంది. అమెరికా,ఇజ్రాయెల్,యూఏఈ త్రైపాక్షిక సహకారం ఇరాన్‌పై వ్యూహాత్మక ఒత్తిడిని పెంచుతుంది. ఇరాన్‌కు వ్యతిరేకంగా ఇజ్రాయెల్,యూఏఈ,అమెరికా బలమైన కూటమి ఏర్పడుతోంది. తాజా పరిణామంతో యూఏఈలోని చమురు, వాణిజ్య కేంద్రాలు ఇప్పుడు మరింత రక్షణగా ఉండనున్నాయి. ఇరాన్ దాడులు కొనసాగితే, ఐరన్ డోమ్ వ్యవస్థ యూఏఈ భద్రతకు కీలకంగా మారుతుంది. మొత్తం మీద, యూఏఈలో ఐరన్ డోమ్ అమలు కేవలం రక్షణ చర్య మాత్రమే కాదు .. ఇరాన్ ముప్పు పెరుగుతున్న ఈ సమయంలో, యూఏఈ భద్రతా వ్యూహంలో కీలక మలుపేనని నిపుణులు భావిస్తున్నారు. -
చర్చలకు సిద్ధం..కానీ..
-
యుద్దం వేళ.. నెతన్యాహుకు షాక్ తప్పదా?
జెరూసలేం: పశ్చిమాసియాలో యుద్ధం వేళ ఇజ్రాయెల్ రాజకీయం మరో టర్న్ తీసుకుంది. యుద్ధాలు బిజీగా ఉన్న ప్రస్తుత ప్రధాని బెంజిమిన్ నెతన్యాహుకు చెక్ పెట్టేందుకు ప్రత్యర్థులు చేతులు కలిపారు. రాబోయే ఇజ్రాయెల్ పార్లమెంట్ ఎన్నికల్లో నెతన్యాహును ఓడించేందుకు కొత్త రాజకీయ పార్టీ ఏర్పటైంది. ఇజ్రాయెల్ మాజీ ప్రధానులు ఇద్దరు కలిసి నెతన్యాహును గద్దె దించే లక్ష్యంతో కొత్త రాజకీయ పార్టీని పెట్టారు. ఈ నేపథ్యంలో యుద్ధ వాతావరణంతో అట్టుడుకుతున్న ఇజ్రాయెల్‌కు ఎన్నికల హీట్ తోడైంది.ఇజ్రాయెల్‌లో కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. రాబోయే పార్లమెంట్ ఎన్నికల కోసం ఇజ్రాయెల్ మాజీ ప్రధానులు నఫ్తాలి బెన్నెట్, యైర్ లాపిడ్ కొత్త రాజకీయ పార్టీని పెట్టారు. ఈ కొత్త పార్టీకి 'టుగెదర్, లెడ్ బై బెన్నెట్' అని నామకరణం చేశారు. ఈ ఏడాది జరగబోయే ఇజ్రాయెల్ పార్లమెంట్ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు ఒకే కూటమిగా పోటీ చేయనున్నాయి. ప్రస్తుత ప్రధాని బెంజమిన్ నెతన్యాహును గద్దె దించే లక్ష్యంతో తమ పార్టీలైన యెష్ అటిడ్ (యైర్ లాపిడ్), బెన్నెట్ 2026 (నఫ్తాలి బెన్నెట్)ను విలీనం చేశారు. అయితే, విచ్ఛిన్నమైన ప్రతిపక్షాన్ని ఏకం చేయడమే ఈ ఇద్దరు రాజకీయ నాయకుల కూటమి లక్ష్యం. కాగా, నెతన్యాహుకు నఫ్తాలి బెన్నెట్, యైర్ లాపిడ్ ప్రధాన రాజకీయ ప్రత్యర్థులు.Former Israeli PMs Bennett and Lapid formed a new 'TOGETHER' party to topple Netanyahu's government. Bennett and Lapid: "The State of Israel must change direction." pic.twitter.com/wpHuAedDTP— World Vibe (@world_vibe_en) April 27, 2026అయితే, కొత్త పార్టీ ప్రధానంగా జాతీయ భద్రత, సైనిక సేవా సంస్కరణలు, మరియు సామాజిక సమానత్వంపై దృష్టి పెట్టింది. ఈ పార్టీకి మద్దతు ప్రధానంగా మధ్యతరగతి, సెంటర్-రైట్ మరియు సెక్యులర్ వర్గాల నుండి వస్తోంది. తాజా సర్వేలు ప్రకారం, ఈ కూటమి నెతన్యాహు ఆధ్వర్యంలోని లికుడ్ పార్టీకి గట్టి సవాలు విసరగలదని సూచిస్తున్నాయి.రాజకీయ నేపథ్యం..ఇజ్రాయెల్‌లో అస్థిర రాజకీయ పరిస్థితులు కొనసాగుతున్నాయి. గత నాలుగేళ్లలో ఐదు సార్లు ఎన్నికలు జరిగాయి.నెతన్యాహు నేతృత్వంలోని లికుడ్ పార్టీ బలంగా ఉన్నప్పటికీ, మెజారిటీ సాధించలేకపోయింది.చిన్న పార్టీల మధ్య కూటమి విభేదాలు తరచూ ప్రభుత్వ పతనానికి దారితీస్తున్నాయి.ఈ నేపథ్యంలో బెన్నెట్–లాపిడ్ కొత్త పార్టీ, ప్రతిపక్షాన్ని ఒకే వేదికపైకి తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది.2026 చివరిలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి.ప్రభావంఈ కొత్త పార్టీ ఏర్పాటుతో ఇజ్రాయెల్ రాజకీయాల్లో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది.ప్రతిపక్షం ఏకమైతే, నెతన్యాహు ఆధిపత్యానికి సవాలు ఏర్పడుతుంది.అయితే, ఇజ్రాయెల్ రాజకీయ చరిత్రలో కూటమి ప్రభుత్వాలు ఎక్కువకాలం నిలవలేకపోవడం ఒక పెద్ద సవాలుగా ఉంది.సవాళ్లు..అరబ్ పార్టీలతో కూటమి లేకపోవడం వల్ల కొత్త పార్టీకి క్లిష్టం కావచ్చు.గతంలో బెన్నెట్–లాపిడ్ ప్రభుత్వ అనుభవం (2021–22) తక్కువకాలం మాత్రమే నిలవడం ఓటర్లలో అనుమానం కలిగించవచ్చు. -
దిగివచ్చిన ఇరాన్.. యుద్ధం ముగింపు, హార్మూజ్‌పై గ్రీన్‌సిగ్నల్!
వాషింగ్టన్: అమెరికా, ఇరాన్ మధ్య చర్చల వేళ ఇరాన్ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అమెరికాతో యుద్ధాన్ని ముగించేందుకు, హార్మూజ్ జలసంధిని తెరిచేందుకు ఇరాన్ కొత్త ప్రతిపాదనలు అందించింది అంటూ ఓ అమెరికన్ మీడియా సంస్థ కథనాన్ని ప్రచురించింది. దీంతో, యుద్ధంగా ముగుస్తుందా? అనే చర్చ మొదలైంది. అమెరికన్ మీడియా సంస్థ యాక్సియోస్ ప్రకారం..‘అమెరికాతో యుద్ధాన్ని ముగించేందుకు, హార్మూజ్ జలసంధిని తెరిచేందుకు ఇరాన్ కొత్త ప్రతిపాదనలు చేసింది. ఈ ప్రతిపాదనలను మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్న పాకిస్తానీ అధికారుల ద్వారా అమెరికాకు ఇరాన్ చేరవేసింది. వివాదాస్పద అణు చర్చలను తదుపరి దశకు వాయిదా వేస్తున్నట్లు ఆ ప్రతిపాదనలో పేర్కొంది’ అని వెల్లడించింది. కాగా, పశ్చిమాసియా సైనిక ఘర్షణల నేపథ్యంలో ఇరాన్ కొత్త ప్రతిపాదన కీలక పరిణామంగా ఆ మీడియా కథనం అభివర్ణించింది. యాక్సియోస్ ప్రకారం.. వైట్‌హౌస్‌కు ఈ ప్రతిపాదన అందింది. కానీ, దీనిని పరిశీలించడానికి యునైటెడ్ స్టేట్స్ సుముఖంగా ఉందో లేదో స్పష్టంగా తెలియదు.Amid the deepening stalemate in peace talks, Iran has conveyed a fresh proposal to the United States through Pakistani mediators, prioritising reopening the Strait of Hormuz and bringing the ongoing war in West Asia to an end while deferring contentious nuclear negotiations to a… pic.twitter.com/DNRlZgKoZH— India Today Global (@ITGGlobal) April 27, 2026ఇదిలా ఉండగా.. చర్చలకు రెడీ అయితే ఇరాన్ ఎప్పుడైనా తమకు సందేశాన్ని పంపొచ్చని ఇటీవలే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఎట్టి పరిస్థితుల్లోనూ అణ్వాయుధాలు పొందే అవకాశాన్ని ఇరాన్‌కు ఇచ్చేది లేదని ఆయన తేల్చి చెప్పారు. ఈనేపథ్యంలో యుద్ధాన్ని ముగించేందుకు ఇరాన్ పంపిన కొత్త ప్రతిపాదనలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఇక, ఇరు దేశాల మధ్య స్తంభించిపోయిన శాంతి ప్రయత్నాల మధ్య ఈ ప్రతిపాదన వచ్చింది.అణు చర్చలపై ఉత్కంఠ..అంతకుముందు.. ఇరాన్ కనీసం ఒక దశాబ్దం పాటు యురేనియం శుద్ధిని నిలిపివేయాలని, ప్రస్తుతం ఉన్న నిల్వలను దేశం నుండి తరలించాలని అమెరికా డిమాండ్ చేసింది. అయితే, నివేదిక ప్రకారం, ఈ డిమాండ్లకు ఎలా స్పందించాలనే దానిపై ఇరాన్ నాయకత్వంలో ఏకాభిప్రాయం లేదని ఇరాన్ విదేశాంగ మంత్రి మరియు ప్రధాన సంధానకర్త అబ్బాస్ అరఘ్చి వారాంతంలో మధ్యవర్తులతో చెప్పారు. ఇక, పాకిస్తానీ మధ్యవర్తుల ద్వారా తెలియజేసిన రెండు దశల ప్రణాళికలో మొదట హార్మూజ్ జలసంధిపై సంక్షోభాన్ని పరిష్కరించడం, అమెరికా దిగ్బంధనాన్ని ముగించడంపై ప్రాధాన్యత ఇస్తుంది. కొత్త ప్రతిపాదన ప్రకారం, కాల్పుల విరమణను సుదీర్ఘ కాలం పాటు పొడిగించడమో లేదా యుద్ధానికి శాశ్వత ముగింపు పలకడమో చేయాలి. జలసంధిని తిరిగి తెరిచి, దిగ్బంధనాన్ని ఎత్తివేసిన తర్వాత, తదుపరి దశలో మాత్రమే అణు చర్చలు ప్రారంభించాలి. -
పాకిస్తాన్‌కు భారీ షాకిచ్చిన ఇరాన్!
టెహ్రాన్: అమెరికా, ఇరాన్ మధ్య చర్చల నేపథ్యంలో దాయాది దేశం పాకిస్తాన్‌కు ఊహించని షాక్ తగిలింది. పాకిస్తాన్‌పై ఇరాన్ ఎంపీ ఇబ్రహీం రెజాయీ సంచలన వ్యాఖ్యలు చేశారు. శాంతి చర్చలకు పాకిస్తాన్ తగిన మధ్యవర్తి కాదంటూ బాంబు పేల్చారు. అమెరికాకు మాత్రమే పాకిస్తాన్ వత్తాసు పలుకుతోందని ఘాటు విమర్శలు గుప్పించారు. దీంతో, చర్చలపై కొత్త ట్విస్ట్ నెలకొంది.అమెరికా, ఇరాన్ మధ్య శాంతి చర్చల సందిగ్ధం నెలకొన్న వేళ ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్ జాతీయ భద్రత మరియు విదేశాంగ విధాన కమిషన్ అధికార ప్రతినిధిగా పనిచేస్తున్న ఎంపీ ఇబ్రహీం రెజాయీ.. పాకిస్తాన్ మధ్యవర్తిత్వంపై తీవ్ర సందేహాలు వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ఇబ్రహీం ఎక్స్ వేదికగా..‘ఇరాన్‌కు పాకిస్తాన్ మంచి మిత్రుడే. కానీ, చర్చలకు సంబంధించి మధ్యవర్తిత్వానికి అవసరమైన విశ్వసనీయత పాకిస్తాన్‌కు లేదు. చర్చలకు పాకిస్తాన్ సరైన మధ్యవర్తి కాదు. ఒక మధ్యవర్తి నిష్పక్షపాతంగా ఉండాలి, ఎప్పుడూ ఒక పక్షానికే మొగ్గు చూపకూడదు. అమెరికా ప్రయోజనాలకు పాకిస్తాన్ అనుకూలంగా వ్యవహరిస్తుంది. ఇస్లామాబాద్ వాషింగ్టన్‌ను బహిరంగంగా విమర్శించకుండా ఉంటోంది అని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే, ఇరాన్, అమెరికా మధ్య అనిశ్చితి ఉన్నప్పటికీ చర్చలను సజీవంగా ఉంచడానికి ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి దౌత్యపరమైన ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్న తరుణంలో ఆయన ఇలా వ్యాఖ్యలు చేయడం పాకిస్తాన్‌కు ఊహించని షాక్ ఇచ్చినట్టు అయ్యింది. కాగా, అరఘ్చి ఇటీవల మూడు రోజుల్లో రెండోసారి ఇస్లామాబాద్‌లో పర్యటించారు. అక్కడ ఆయన పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌తో సంఘర్షణ, భవిష్యత్ కార్యాచరణ మార్గాలపై చర్చలు జరిపారు.ఫోన్లో చర్చలు: ట్రంప్ సూచనఇదిలా ఉండగా.. అమెరికా, ఇరాన్ మధ్య శాంతి చర్చల సందిగ్ధం వేళ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. శాంతి పరిష్కారం కోసం ఫోన్లో మాట్లాడుకోవచ్చని ట్రంప్ ఆదివారం సూచించారు. 17 గంటల విమాన ప్రయాణంలో ప్రతినిధి బృందాన్ని పంపే బదులు తానే ఆ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యానించారు. "అన్ని అవకాశాలు మా చేతిలోనే ఉన్నాయి. వారు మాట్లాడాలనుకుంటే మా వద్దకు రావచ్చు, లేదా మాకు ఫోన్ చేయవచ్చు" అని ట్రంప్ అన్నారు. అయితే, ఆ ఫోన్ కాల్ ఎప్పుడు జరుగుతుందో మాత్రం సూచించలేదు.ట్రంప్ వార్నింగ్రెండో విడత శాంతి చర్చలపై అనిశ్చితిపై ఇరాన్‌కు డొనాల్డ్ ట్రంప్ మరోసారి హెచ్చరించారు. యుద్ధం ముగించటానికి, కాల్పుల విరమణకు అంగీకరించడానికి కేవలం 3 రోజుల సమయం మాత్రమే ఉందన్నారు. లేదంటే వారి చమురు పైపులైన్లు పేలిపోతాయని ట్రంప్ తెలిపారు. ఇరాన్ చమురు ఎగుమతులను కొనసాగించలేకపోతే, యాంత్రికంగా, భూమి సహజశక్తుల కారణంగా పైపులైన్లు విఫలమవుతాయన్నారు. ఇరాన్‌కు భారీ పరిమాణంలో చమురు సరఫరా వ్యవస్థ ఉందని, ఏదైన కారణం చేత అది మూసుకుపోతే అప్పుడు ఇంధనాన్ని కంటైనర్లు లేదా నౌకల్లో నింపడం సాధ్యం కాదన్నారు. ప్రస్తుతం ఇరాన్ అదే పరిస్థితి ఎదుర్కొటోందన్న ట్రంప్.. దిగ్బంధనం కారణంగా వారివద్ద నౌకలు కూడా లేవని తెలిపారు. -
ఇరాన్లో నిర్ణయాలు వీళ్లే తీసుకుంటున్నారా? ఇలాగైతే యుద్ధం..
అమెరికా-ఇరాన్ మధ్య ఒప్పందం కుదురుతుందా? యుద్ధం మళ్లీ మొదలవుతుందా? అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులపై దీని ప్రభావం ఎలా ఉంటుంది? అన్న సందేహాలు అందరిలోనూ ఉన్నాయి. ఇరాన్ డిమాండ్లకు అమెరికా ఒప్పుకోవడం లేదు. అమెరికా డిమాండ్లకు ఇరాన్ ఒప్పుకోవడం లేదు. అమెరికాలో ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నుకున్న ప్రభుత్వం ఉంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమ దేశం తరఫున అన్ని నిర్ణయాలు తీసుకుంటారు. అలీ ఖమేనీ (ఇరాన్ దివంగత సుప్రీం లీడర్)ను అమెరికా-ఇజ్రాయెల్ చంపేసిన తర్వాత అతడి కుమారుడు మొజ్తబా ఖమేనీ సుప్రీం లీడర్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించారని ఇరాన్ నుంచి అధికారిక ప్రకటన వచ్చింది. అయితే, మొజ్తబా ఖమేనీ తీవ్రగాయాలతో బాధపడుతున్నాడని, నిర్ణయాలు తీసుకునే శక్తి కూడా అతడికి లేదని ప్రచారం జరుగుతోంది. మరోవైపు, అమెరికాతో చేస్తున్న యుద్ధంలో నిర్ణయాలు తీసుకునే అంశంపై మొజ్తబా ఖమేనీని కాదని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) పట్టు బిగించే ప్రయత్నాలు చేస్తోందని పలు నివేదికలు కూడా వచ్చాయి.నిర్ణయాలు ఎవరు తీసుకుంటున్నారు? అమెరికా, ఇజ్రాయెల్‌తో యుద్ధం చేస్తోంది ఇరాన్. మరి ఈ యుద్ధానికి ఇరాన్లో బాధ్యత తీసుకుంటోంది ఎవరు? ఆధికారికంగానైతే సుప్రీం లీడరే అన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారని, ఆయనే బాధ్యత వహిస్తున్నారని ఆ దేశం చెబుతోంది. ఫిబ్రవరి 28న (యుద్ధం తొలి రోజే) అలీ ఖమేనీ మృతి చెందాడు. ఆ తర్వాత మొజ్తబా ఖమేనీ సుప్రీం లీడర్‌గా బాధ్యత స్వీకరించాడు. ఇస్లామిక్ రిపబ్లిక్ వ్యవస్థలో ఆ పదవిలో ఉన్న వారే తుది నిర్ణయం తీసుకుంటారు. యుద్ధం, శాంతి, దేశానికి సంబంధించిన వ్యూహాలు వంటి ముఖ్య విషయాలపై తుది మాట ఆ సుప్రీం లీడర్‌దే. అయితే, ఇరాన్‌కు సంబంధించిన నిర్ణయాలు నిజంగానే మొజ్తబా ఖమేనీనే తీసుకుంటున్నారా? ఇరాన్ నాయకత్వంలో అంతర్గతంగా ఏకాభిప్రాయం లేదని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఒకే నిర్ణయం మీద లేరని, వేర్వేరు వర్గాలు వేర్వేరు అభిప్రాయాలు చెబుతున్నాయని ట్రంప్ తెలిపారు. అమెరికా ప్రభుత్వం ఒకే అభిప్రాయంతో, స్పష్టమైన ప్రతిపాదన ఇవ్వాలని అమెరికా కోరుతోందని అన్నారు. అప్పుడు మాత్రమే చర్చలు సరిగ్గా ముందుకు వెళ్తాయని చెప్పారు.సుప్రీం లీడర్ ఎక్కడ?పదవి చేపట్టిన తర్వాత మొజ్తబా ఖమేనీ ఒక్కసారి కూడా ప్రజల ముందుకు రాలేదు. ఆయన పేరిట లిఖితపూర్వకంగా కొన్ని ప్రకటనలు రావడం తప్ప ఆయన నిర్ణయాలు తీసుకుంటున్నారని, ఇరాన్ వ్యూహాలకు ఆమోదం తెలుపుతున్నారని గానీ చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవు. అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో మొజ్తబా గాయపడ్డాడని ఇరాన్ అధికారులు అంగీకరించారు. కానీ, అందుకు సంబంధించిన వివరాలు తక్కువగా ఇచ్చారు. న్యూయార్క్ టైమ్స్ నివేదిక ప్రకారం.. మొజ్తబా ముఖం సహా శరీరంలోని పలు అవయవాలకు గాయాలు తగిలి మాట్లాడటానికి కష్టంగా మారిందని పేర్కొంది. ఇరాన్ రాజకీయ వ్యవస్థలో అధికారం కేవలం సంస్థాగతం కాదు. మొజ్తబా తండ్రి అలీ ఖమేనీ ప్రసంగాలు, ప్రత్యక్షంగా పలు కార్యక్రమాలకు హాజరు కావడం, పలు వర్గాల మధ్య మధ్యవర్తిత్వం జరిపేవారు. అటువంటి కార్యక్రమాలు ఇప్పుడు జరగడం లేదు.కొందరు యుద్ధ సమయంలో పదవీ స్వీకరణ వల్ల అతను తన అధికారాన్ని స్థాపించలేకపోయాడని అంటున్నారు. మరికొందరు గాయాల కారణంగా వ్యవస్థను నిర్వహించగలడా అన్న ప్రశ్న వేస్తున్నారు. పరిస్థితుల గురించి స్పష్టత లేదు. ఎవరు ఏమి నిర్ణయిస్తున్నారు? అసలు అధికారంలో ఎవరు బలంగా ఉన్నారు? అన్న దానిపై గందరగోళం ఉంది.క్లిష్టమైన సమయంలో బాధ్యతలు మొజ్తబా బాధ్యతలు చేపట్టిన సమయం చాలా క్లిష్టమైనది. ఆ సమయంలో యుద్ధం జరుగుతోంది. అందుకే తన నాయకత్వాన్ని పూర్తిగా అమలు చేయడానికి, తన మాట నిలబెట్టుకోవడానికి సరైన స్థిరత్వం, సమయం దొరకలేదు. ఫలితంగా, ఇరాన్లో ఇతర వర్గాలు/నాయకులు కూడా ప్రభావం చూపుతూ ఉండవచ్చు. పాలనలో మొజ్తబా పూర్తి నియంత్రణను స్థాపించుకోలేకపోయాడని తెలుస్తోంది. యుద్ధానికి ముందు నిర్ణయాలు సుప్రీంలీడర్ చుట్టూ ఉన్న వ్యవస్థ చేతిలో ఉండేవి. ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు నిర్ణయాలు ఒక్కరే తీసుకోవడం లేదు. పలు వర్గాలు/నాయకులు కలిసి లేదా వేర్వేరు విధాలుగా ప్రభావం చూపుతున్నారు. అధికార వికేంద్రీకరణ జరిగింది.ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ, అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ అమెరికాతో చర్చల్లో పాల్గొంటున్నారు. కానీ వ్యూహాలు రచించడం అనేది వీరి చేతల్లో లేదని తెలుస్తోంది. పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్-బాఘెర్ ఘాలిబాఫ్ నేతృత్వంలో ప్రతినిధి బృందానికి ప్రస్తుతం ఉన్న అధికారాలపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి.ఇరాన్లో అరాఘ్చీ పాత్ర ఇతరుల నిర్ణయాల అమలు స్థాయిలోనే ఉంది. హార్మూజ్ విషయంలో ఆయన వెను వెంటనే చేసిన ప్రకటనలు సందేహాలు లేవనెత్తాయి. పెజెష్కియన్ కూడా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడం లేదు. ఇస్లామాబాద్‌లో అమెరికాతో జరగాల్సిన రెండో దశ చర్చలు నిలిచిపోవడం దీన్నే సూచిస్తుంది.హార్మూజ్ జలసంధి నియంత్రణ ఇరాన్‌కు ఒత్తిడి సాధనంగా మారింది. దీని ద్వారానే అమెరికాపై ఒత్తిడి తెస్తోంది. కానీ, దాన్ని మూసి ఉంచే నిర్ణయం ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ – ఇరాన్ విప్లవ గార్డ్ సైనిక విభాగం) చేతిలో ఉంది. ఇరాన్లో ఒకే వ్యక్తి వ్యూహాన్ని స్పష్టంగా నడిపిస్తున్నట్టు కనిపించడం లేదు. చర్యలు, వాటికి సంబంధించిన సందేశాల మధ్య జాప్యం కనపడుతోంది. సుప్రీం లీడర్‌కు పూర్తిగా అధికారాలు ఉన్నాయి. కానీ, స్పష్టంగా అవే అమలు అవుతున్నట్లు కనపడడం లేదు. అధ్యక్షుడు నాయకత్వం వహించడం లేదు. రాజనీతిక చర్యలు నిర్ణయాత్మకంగా జరగడం కాదు. ఇలాగైతే యుద్ధం ఇప్పట్లో ఆగుతుందా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇరాన్ ఒప్పందం చేసుకోకపోతే చరిత్రలో ఎవరూ చూడనంత విధ్వంసాన్ని చూస్తారని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటికే హెచ్చరించారు. యుద్ధం భీకరంగా జరిగితే ఇరాన్లో అంతా బూడిదే మిగులుతుంది. -
పాక్ ప్రధానితో ఇరాన్ ఫోన్ కాల్..
ఇస్లామాబాద్: ఇరాన్, అమెరికా మధ్య చర్చల సందర్భంగా హైడ్రామా చోటుచేసుకుంది. చర్చల కోసం పాకిస్థాన్ వెళ్లిన ఇరాన్ విదేశాంగమంత్రి అబ్బాస్ అరాగ్చీ అమెరికా ప్రతినిధులు రాకముందే ఒమన్ బయల్దేరి వెళ్లిపోయారు. దీంతో శాంతి చర్చలకు తన ప్రతినిధులను ఇస్లామాబాద్‌కు పంపించడం లేదని ట్రంప్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో అమెరికాతో శాంతి చర్చలపై అనిశ్చితి నెలకొన్న వేళ ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ కీలక కామెంట్స్ చేశారు.పెజెష్కియాన్ తాజాగా పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌తో పెజెష్కియాన్ ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్బంగా ఆయన శాంతి చర్చలపై ఇరాన్ వైఖరిని స్పష్టం చేశారు. ఈ క్రమంలో అమెరికా విధిస్తున్న ఇరాన్ ఓడరేవుల దిగ్బంధనం, బెదిరింపుల నడుమ ఆ దేశంతో చర్చలు అసాధ్యమని తేల్చి చెప్పారు. అలాగే, ఇరాన్ తన సార్వభౌమాధికారాన్ని వదులుకోదని, అలాగే ఒత్తిళ్లకు తలొగ్గి ఒప్పందాలు చేసుకోబోదని స్పష్టం చేశారు. ప్రస్తుత ఉద్రిక్తతలకు అమెరికానే కారణమని పేర్కొన్నారు. అమెరికా అనుసరిస్తున్న చర్యలే చర్చలకు ప్రధాన అడ్డంకి ఆయన కుండబద్దలు కొట్టారు.కాగా, ఏప్రిల్ 13 నుంచి ఇరాన్ ఓడరేవులను అమెరికా నౌకాదళం దిగ్బంధించిన విషయం తెలిసిందే. ఈ పరిణామం వల్ల ఇరాన్ ఆర్థికంగా తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇలాంటి దిగ్బంధనాల నడుమ పరస్పర నమ్మకాన్ని పునరుద్ధరించడం అసాధ్యమని పేజెష్కియాన్ వెల్లడించారు. అందుకే ఇరు దేశాల మధ్య చర్చలు జరగాలంటే ముందుగా అమెరికా ఆంక్షలను తొలగించి, చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.అరాగ్చీ స్పందన..ఇస్లామాబాద్ నుంచి వెళ్లిపోయిన తర్వాత ఇరాన్ విదేశాంగమంత్రి అబ్బాస్ అరాగ్చీ స్పందించారు. ఇప్పటికే తాము ఒక ఫ్రేమ్ వర్క్‌ను పాకిస్తాన్‌కు అందించామని తెలిపారు. యుద్ధాన్ని శాశ్వతంగా ముగించేందుకు ఇది ఒక మంచి మార్గమని ఆయన చెప్పారు. అయితే, శాంతి చర్చలపై అమెరికాకు నిజంగా ఆసక్తి ఉందా? అన్నది అనుమానమేనని ఆయన చెప్పుకొచ్చారు. ప్రస్తుతం అబ్బాస్ అరాగ్చీ ఒమన్ పర్యటనలో ఉన్నారు. అయితే, చర్చల కోసం ఆయన తిరిగి పాకిస్తాన్ వచ్చే అవకాశం ఉందన్న వార్తలు వస్తున్నాయి. -
అయ్యో ఇరాన్.. ఎంతటి గడ్డు పరిస్థితులు..
వెనకటికి ఒక సామెత ఉండేదంటారు.. పైన పటారం.. లోన లొటారం.. అని.. ఈ సామెత ఇప్పుడు అచ్చు గుద్దినట్టు ఇరాన్‌కు వర్తించేలా ఉంది. ఎందుకంటే అమెరికాతో యుద్ధం నేపథ్యంలో ఇరాన్ పరిస్థితి దారుణంగా తయారైంది. ఆర్థికంగా తీవ్ర ఒత్తిళ్లను ఎదుర్కొంటోంది. పైకి అంత బాగానే ఉన్నట్టు మేనేజ్ చేస్తున్న ఇరాన్.. వాస్తవంగా మాత్రం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. అది ఎంతలా అంటే.. ఆహార ద్రవ్యోల్బణం 112 శాతానికి చేరుకుంది. వంట నూనెల ధరలైతే 200% పైగా పెరిగాయి. నిత్యావసరాలే కాదు.. చివరికి అంత్యక్రియల ఖర్చులు కూడా 40% పెరిగాయి. దీంతో, ఇరాన్ ప్రజలు ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు.అమెరికా, ఇజ్రాయెల్ మార్చి యుద్ధం తర్వాత ఇరాన్ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా క్షీణించింది. ద్రవ్యోల్బణం, కరెన్సీ విలువ తగ్గడం, పరిశ్రమలకు జరిగిన నష్టం.. ఇలా అన్నీ కలిసి పెద్ద సంక్షోభానికి దారితీస్తున్నాయి. ఇరాన్లో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. బియ్యం, కోడిగుడ్లు తదితర ఆహార వస్తువుల ధరలు భారీగా పెరిగాయి. ఉద్యోగుల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. 2026 ఏప్రిల్ నాటికి పాలు, గుడ్లు, చికెన్, బియ్యం వంటి ఆహార పదార్థాలు 70–130% వరకు పెరిగాయి. ముఖ్యమైన ఔషధాలు అయితే 300% నుండి 2,700% వరకు పెరిగి సాధారణ కుటుంబాలకు అందని స్థాయికి చేరాయి. ఇన్సులిన్ కొరత కారణంగా రేషన్ విధానం అమలు చేస్తున్నారు. సాధారణ నొప్పి నివారణ మందులు కూడా రేషన్‌లోనే అందిస్తున్నారు. మానసిక ఆరోగ్య మందులు లభ్యం కావడం కష్టమైంది. దీంతో, సామాన్యులు దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుత పరిస్థితి ఇలాగే కొనసాగితే ఏడాదికి ద్రవ్యోల్బణం 80% నుంచి 500% వరకు పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.అయితే, 2025 చివరి నాటికే ఇరాన్ ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉంది. ద్రవ్యోల్బణం 50% పైగా కొనసాగింది. రియాల్ విలువ 20 రోజుల్లో 20% కంటే ఎక్కువ తగ్గింది. బ్యాంక్ అయాందె కుప్పకూలడం వల్ల బ్యాంకింగ్ వ్యవస్థలో నమ్మకం దెబ్బతింది. ఈ పరిస్థితుల్లోనే యుద్ధం ప్రారంభమైంది. దీంతో, ఇరాన్ రియాల్ విలువ ఎన్నడూ లేని స్థాయిలో పడిపోయింది. ఒక డాలర్ విలువ 16 లక్షల రియాల్స్‌కు దగ్గరలో ఉంది. దీంతో పౌరుల పొదుపు ఆవిరవుతోంది. ప్రజల దగ్గర డబ్బులు లేకపోవడంతో అమ్మకాలు తగ్గి, రెస్టారెంట్లు, చిన్న వ్యాపారాలు నష్టాల్లో నడుస్తూ మూతపడుతున్నాయి. యుద్ధ సమయంలో ప్రభుత్వం పన్నులు తగ్గించడంలేదు సరి కదా, రుణాలు కట్టడం ఆలస్యమైతే జరిమానాలు విధిస్తోంది. చెక్కులు బౌన్స్ అవుతున్నాయి. దీంతో బ్యాంక్‌లు చాలా ఖాతాలను మూసివేస్తున్నాయి.గుడ్డు, మాంసం ఎంతంటే.. గత రెండు నెలల్లో ఇరాన్లో గుడ్లు, మాంసం, వంట నూనె ధరలు నిరంతరం పెరిగాయి. గుడ్ల ధరలు 2026 ఏప్రిల్ నాటికి రూ.333(భారత కరెన్సీ ప్రకారం)కి చేరాయి. మాంసం ధర కిలోకు రూ.574 వరకు పెరిగాయి. 2025లో మాంసం ధర రూ.313గా ఉంది. ఇక, వంట నూనె ధరలు కూడా 100% పైగా పెరిగి 380 వరకు చేరాయి. 2025లో వంట నూనె ధర రూ.180గా ఉంది. ఇక, 2025లో బియ్యం ధర రూ.34 ఉండగా.. తాజాగా 67కు చేరుకుంది.ఉద్యోగుల పరిస్థితి ఇదీ.. అధికారిక లెక్కల ప్రకారం.. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇరాన్లో 10 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు. అనధికారికంగా ఈ సంఖ్య 20 నుంచి 30 లక్షల వరకు ఉండొచ్చని ఓ అంచనా. 1.5 కోట్ల మంది ప్రజలు ఎలాంటి ఆదాయం లేక అల్లాడుతున్నారు. ఉద్యోగాలు కోల్పోయిన వారికి ప్రభుత్వం ఇచ్చే నెలవారీ సబ్సిడీ, ఫుడ్ వోచర్లతో కనీసం 10 కిలోల బియ్యం కూడా రాని పరిస్థితి నెలకొంది.కారణాలు..ఇంటర్నెట్ బ్లాకౌట్ ఉద్యోగాల కోతకు ప్రధాన కారణం.యువత, చిన్న వ్యాపారాలు అత్యధికంగా ప్రభావితమయ్యాయి.పేదరికం, నిరుద్యోగం పెరుగుతూ ప్రజల జీవన ప్రమాణాలను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి.ప్రభావిత రంగాలుఈ-కామర్స్, లాజిస్టిక్స్, టెక్నాలజీ, మీడియా, విద్య, సర్వీస్ రంగాలు ప్రభావితమయ్యాయి.నిరంతర కనెక్టివిటీ అవసరం ఉండటంతో ఉద్యోగాల కోతలు ఎక్కువయ్యాయి.పెద్ద కంపెనీలు: ఉద్యోగాల కోతలు ఇప్పుడు పెద్ద వాణిజ్య సంస్థలలో కూడా ప్రారంభమయ్యాయి.ప్రస్తుత పరిస్థితుల్లో ఇరాన్ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టుకోవడం, ప్రజల జీవన ప్రమాణాలను కాపాడుకోవడం, అంతర్జాతీయ ఒత్తిడిని ఎదుర్కోవడం ప్రధాన లక్ష్యాలుగా ఉన్నాయి. ఈ చర్యలు తీసుకుంటే, ఇరాన్ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలకుండా, కనీస స్థాయిలో అయినా నిలబడే అవకాశం ఉంటుంది.ప్రధాన లక్ష్యాలు..ఆర్థిక స్థిరీకరణ: ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడం, కరెన్సీ విలువను నిలబెట్టడం.ప్రజల జీవన ప్రమాణాలు: ఆహారం, ఔషధాలు వంటి నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉంచడం.పరిశ్రమల పునరుద్ధరణ: పెట్రోకెమికల్స్, మెటల్స్, వ్యవసాయం, నిర్మాణ రంగాలను తిరిగి నిలబెట్టడం.బ్యాంకింగ్ వ్యవస్థ రక్షణ: బ్యాంకుల లిక్విడిటీ, డిపాజిట్లపై నమ్మకం కాపాడుకోవడం, రుణాలపై నియంత్రణ.సామాజిక స్థిరత్వం: నిరుద్యోగం తగ్గించడం, ప్రజల్లో అసంతృప్తి తగ్గించడం.అంతర్జాతీయ సంబంధాలు: నిర్బంధం, బ్లాకేడ్ పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ వాణిజ్య మార్గాలు కనుగొనడం. యూఏఈ, టర్కీ వంటి ప్రాంతీయ మధ్యవర్తుల ద్వారా పరిమిత ఎగుమతులు కొనసాగించడం. -
ట్రంప్ సంచలన నిర్ణయం.. ఇరాన్‌తో చర్చలకు బ్రేక్!
పశ్చిమాసియాలో పరిస్థితి మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకునే పరిస్థితి ఏర్పడుతోంది. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా జరగా ల్సిన అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు విఫలమైనట్లు తెలుస్తోంది. ఇరాన్‌తో చర్చల కోసం అమెరికా ప్రతినిధులు స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్ వెళ్లాల్సి ఉండగా, వారి పర్యటనను రద్దు చేస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఫలితం లేని చర్చల కోసం తమ సమయాన్ని వృథా చేసుకోవాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ట్రంప్ తన సోషల్ మీడియా ట్రూత్ వేదికగా ప్రకటించారు. ‘కేవలం చర్చల కోసం 18 గంటల పాటు ప్రయాణం చేసి అక్కడ ఖాళీగా కూర్చోవాల్సిన అవసరం లేదు. ఫలితం లేని చర్చల వల్ల సమయం తప్ప మరేమీ వృథా కాదు. మా దగ్గర అన్ని దారులు సిద్ధంగా ఉన్నాయి. ఇరాన్ చర్చలు జరపాలని అనుకుంటే వారే మాకు నేరుగా ఫోన్ చేయవచ్చు’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు.వెనుదిరిగిన ఇరాన్ ప్రతినిధులు..మరోవైపు, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ నేతృత్వంలోని ప్రతినిధి బృందం కూడా శనివారం సాయంత్రం ఇస్లామాబాద్ నుండి వెనుదిరిగింది. అమెరికాతో నేరుగా చర్చలు జరిపే ప్రసక్తే లేదని ఇరాన్ ఇప్పటికే స్పష్టం చేసింది. మధ్యవర్తిత్వం వహిస్తున్న పాకిస్థాన్‌తో చర్చలు జరిపిన అనంతరం వారు తమ దేశానికి బయలుదేరారు. చర్చల ప్రక్రియలో ఈ ఆకస్మిక బ్రేక్ కారణంగా పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధం మొదలవుతుందా అనే ఆందోళన నెలకొంది. అయితే, ‘చర్చల రద్దు అంటే యుద్ధం మొదలైనట్టు కాదు, మేము ఇంకా దాని గురించి ఆలోచించలేదు’ అని ట్రంప్ పేర్కొన్నప్పటికీ, పరిస్థితులు మాత్రం నివురు గప్పిన నిప్పులా ఉన్నాయి. అటు ఇరాన్ తన విమాన సర్వీసులను పునరుద్ధరిస్తున్నా, సరిహద్దుల్లో బలగాల కదలికలు ఆగడం లేదు. -
చర్చల్లో ఇరాన్ బిజీ.. యుద్ధం బహుమతి అంటూ అమెరికా వ్యాఖ్యలు
ఇస్లామాబాద్: అమెరికా, ఇరాన్ చర్చలపై ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే ఇరాన్ బృందం ఇస్లామాబాద్‌కు చేరుకోగా, వాషింగ్టన్ నుంచి విట్కాఫ్, కుష్నర్లు పాకిస్తాన్ బయల్దేరారు. మరోవైపు.. పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్‌తో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ భేటీ అయ్యారు. ఈ విషయాన్ని పాకిస్తాన్‌లోని ఇరాన్ రాయబార కార్యాలయం పోస్ట్ చేసింది. అలాగే, ఇరాన్ యుద్ధంపై ఈజిప్టు, పాక్ అధికారులు చర్చించారు. అమెరికా, ఇరాన్‌ల మధ్య మరో విడత చర్చలు ప్రారంభించే ప్రయత్నాలపై ఇరు దేశాల విదేశాంగ మంత్రులు చర్చించారు.ఈ క్రమంలో అమెరికా యుద్ధ కార్యదర్శి పీట్ హెగ్సెత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌తో యుద్ధం ప్రపంచానికి పెద్ద బహుమతి అని చెప్పుకొచ్చారు. అలాగే, ఇరాన్ సముద్ర రవాణాపై అమెరికా దిగ్బంధనం అవసరమైనంత కాలం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఇరాన్ సైనిక వైఖరి బలహీనపడిందని, సముద్రంలో క్రమరహిత వ్యూహాలపై ఎక్కువగా ఆధారపడుతోందన్నారు. అవసరమైనంత కాలం ఒత్తిడిని కొనసాగించడానికి అమెరికా సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. దెబ్బతిన్న ఇరాన్ సైన్యం, ప్రత్యేకించి ఐఆర్జీసీ సముద్రపు దొంగల ముఠాగా మారిపోయిందని తెలిపారు. విచక్షణారహితంగా మందుపాతరలు పాతేది, యాదృచ్ఛికంగా ఓడలపై కాల్పులు జరిపేది, కొన్ని వారాల వ్యవధిలో 45,000 మంది తమ సొంత ప్రజలను అమాయక నిరసనకారులను చంపింది వారేనని ఆరోపించారు.ఇదిలా ఉండగా.. తూర్పు పసిఫిక్ మహాసముద్రంలో అనుమానాస్పద డ్రగ్స్ పడవపై అమెరికా సైన్యం దాడి చేసింది. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడికి సంబంధించిన దృశ్యాలను యూఎస్ సదరన్ కమాండ్ ఎక్స్‌లో పోస్ట్ చేసింది. అందులో నీటిలో తేలియాడుతున్న ఒక పడవ పేలుడు ధాటికి పూర్తిగా మంటల్లో కాలిపోతున్నట్టు ఉంది. స్మగ్లింగ్ మార్గాల్లో వెళ్తున్న డ్రగ్స్ సరఫరాదారులనే తాము లక్ష్యంగా చేసుకున్నట్లు అమెరికా సైన్యం స్పష్టం చేసింది.ఇరాన్ కౌంటర్.. అమెరికాతో కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి రావడానికి ముందు వరకు ఇజ్రాయెల్ గగనతలంపై తాము పూర్తి పట్టును సాధించామని ఇరాన్ రక్షణశాఖ అధికార ప్రతినిధి, బ్రిగేడియర్ జనరల్ రజా తలాయీ నైక్ వెల్లడించారు. దాడులు చేసేందుకు మరిన్ని అధునాతన ఆయుధాలు ఇరాన్ అమ్ములపొదిలో సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. దేశవ్యాప్తంగా ఉన్న యూనిట్లలో ఇరాన్ స్వయంగా అధునాతన ఆయుధాలను తయారుచేస్తోందని, ఇదే పేర్కొన్నారు. -
అమెరికాతో చర్చలు.. ఇరాన్ కొత్త ట్విస్ట్!
ఇస్లామాబాద్: అమెరికా, ఇరాన్ మధ్య రెండో విడత చర్చలకు రంగం సిద్ధమైంది. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో మరోసారి చర్చలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ కొత్త ట్విస్ట్ ఇచ్చారు. అమెరికాను దురాక్రమణదారుగా అభివర్ణిస్తూ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇదే సమయంలో అమెరికాతో నేరుగా చర్చలు జరిపే ప్రసక్తే లేదన్నారు. దీంతో, చర్చల విషయమై పాకిస్తాన్‌కు టెన్షన్ నెలకొంది. ఇస్లామాబాద్ వేదికగా మరికొన్ని గంటల్లో అమెరికా, ఇరాన్ మధ్య రెండో విడత చర్చలు జరగనున్నాయి. ఇప్పటికే పాకిస్తాన్‌కు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ నేతృత్వంలోని ప్రతినిధి బృందం రాగా, అమెరికా నుంచి ప్రత్యేక రాయబారులు వస్తున్నారు. ఈ క్రమంలోనే ఇరాన్ కీలక ప్రకటన చేసింది. అరాగ్చీ బృందం ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. అమెరికాతో ఎలాంటి చర్చలు జరగబోవని స్పష్టంచేసింది. ప్రాంతీయ శాంతి ప్రయత్నాల మధ్య ఈ పర్యటన కొనసాగుతున్నప్పటికీ, అమెరికా-ఇరాన్ ప్రత్యక్ష చర్చలకు అవకాశం లేదని తెలిపింది. తమ అభిప్రాయాలను పాకిస్తాన్ అధికారులకు మాత్రమే వివరిస్తామని తెలిపింది. దీంతో, చర్చలపై మరోసారి సందిగ్ధం నెలకొంది.మరోవైపు.. అమెరికా, ఇరాన్ చర్చల నేపథ్యంలో ఇస్లామాబాద్‌లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. 10వేల మంది భద్రతాసిబ్బంది పహారా కాస్తున్నారు. రెడ్ జోన్‌ను పూర్తిగా మూసివేసి, కార్యాలయ ఉద్యోగులకు 'వర్క్ ఫ్రమ్ హోమ్' సౌకర్యం కల్పించారు. ఏప్రిల్ 11, 12 తేదీల్లో జరిగిన మొదటి రౌండ్ చర్చలు విఫలం కావడంతో ఈ రెండో రౌండ్ అత్యంత కీలకంగా మారింది. కాగా, ఈ చర్చల కోసం అమెరికాకు చెందిన లాజిస్టిక్స్, భద్రతా బృందం ఇప్పటికే పాకిస్తాన్‌కు చేరుకుందని పాక్ ప్రభుత్వ వర్గాలు నిర్ధారించాయి. అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్, ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్ ఇరాన్‌తో చర్చల కోసం పాక్‌కు వెళ్లనున్నారు. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీతో వారు భేటీ కానున్నారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వీరితో కలిసి వెళ్లడం లేదు. చర్చల్లో పురోగతి సాధిస్తే ఆయన పాకిస్తాన్‌కు వెళ్లే అవకాశం ఉన్నట్లు అధికారులు చెప్పారు. -
చర్చలపై కొత్త ఆశలు!
ఇస్లామాబాద్: పశ్చిమాసియాలో హార్మూజ్‌జలసంధి దిగ్బంధంతో రెండో దఫా చర్చలపై ప్రతిష్టంభన నెలకొన్న వేళ ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ పాకిస్తాన్ చేరుకోవడం శాంతి చర్చలపై కొత్త ఆశలను చిగురింపజేస్తోంది. పాకిస్తాన్‌తోపాటు ఒమన్, రష్యాల్లోనూ పర్యటించి శాంతి చర్చల్లో తేల్చుకోవాల్సిన కీలకాంశాలపై ఒక అవగాహనకు రానున్నారని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ‘‘టెహ్రాన్ నుంచి ఇస్లామాబాద్(పాకిస్తాన్), మస్కట్(ఒమన్), మాస్కో(రష్యా) పర్యటనకు శ్రీకారం చుడుతున్నా. ద్వైపాక్షిక అంశాలపై మా భాగస్వాములతో సహకారం కోసం ఈ మూడు దేశాల్లో పర్యటించబోతున్నా. పొరుగుదేశాలే మాకు ముఖ్యం’’అని అరాఘ్చీ తన సామాజిక మాధ్యమ ‘ఎక్స’ఖాతాలో శుక్రవారం ఒక పోస్ట్‌పెట్టారు. దీంతో రెండోదఫా చర్చలకు సన్నాహకాలు మొదలయ్యాయని తెలుస్తోంది. అరాఘ్చీ తన బృందంతో కలిసి ఇస్లామాబాద్‌కు చేరుకున్నారు. అమెరికా దౌత్యవేత్తలకు సాయపడే బృందాలు, భద్రతా సిబ్బంది ఇప్పటికే ఇస్లామాబాద్‌లో సిద్ధంగా ఉన్నాయి. అమెరికా సాంకేతిక బృందంతో ఇరాన్ మధ్యవర్తులు మాట్లాడి షెడ్యూల్‌ను ఖరారుచేశాక అసలైన అమెరికా ప్రతినిధుల బృందం శనివారం రాత్రికల్లా ఇస్లామాబాద్‌కు చేరుకుంటుందని పాక్ ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. స్టీవ్ విట్కాఫ్, కుష్నర్లు శనివారం పాకిస్తాన్ చేరుకుంటారని అమెరికా కూడా ధ్రువీకరించింది. కొనసాగుతున్న దిగ్బంధం‘‘ట్రంప్ సూచనమేరకు సముద్రమందుపాతరలను పెట్టే పడవలను పేల్చేందుకు కాచుకుని కూర్చున్నాం. దశాబ్దాల్లో తొలిసారిగా పశ్చిమాసియాజలాల్లో ఒకేసారి మూడు అమెరికా యుద్ధవిమానాల వాహక నౌకలు యూఎస్ఎస్ అబ్రహాం లింకన్, యూఎస్ఎస్ గెరాల్డ్ ఆర్.ఫోర్డ్, యూఎస్ఎస్ జార్జ్ హెచ్.డబ్ల్యూ.బుష్ లు చక్కర్లు కొడుతున్నాయి. 200 యుద్ధవిమానాలు, 15,000 మంది నావికాదళసభ్యులు హార్మూజ్‌ను దిగ్బంధించాయి’’అని అమెరికా సెంట్రల్ కమాండ్ శుక్రవారం వెల్లడించింది. మరోవైపు అమెరికాయేతర నౌకలు సైతం అమెరికా నౌకాశ్రయాల్లోకి ముడిచమురు, సహజవాయువులను సరఫరాచేసేందుకు వీలుగా జోన్స్ చట్టం అమలును మరో 90 రోజులపాటు నిలుపుదల చేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. మరోవైపు ఇరాన్ స్వాదీనంచేసుకున్న ఎపామినోండాస్ నౌకలోని భారతీయ నావికుడు సురక్షితంగా ఉన్నట్లు కేంద్ర పోర్ట్‌లు, షిప్పింగ్, వాటర్‌వేస్ శాఖ డైరెక్టర్ మన్దీప్ సింగ్ రణ్‌ధావా శుక్రవారం చెప్పారు. -
మలి విడత చర్చలు.. పాక్‌కు అమెరికా ప్రతినిధులు!
పాకిస్తాన్‌లోని ఇస్లామాబాద్ వేదికగా జరగనున్న మలి విడత శాంతి చర్చల కోసం అమెరికా ప్రతినిధులు బయల్దేరి వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్, ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్లు పాకిస్తాన్‌కు వెళ్లనున్నారు. అయితే అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వీరితో కలిసి వెళ్లడం లేదని అమెరికా వర్గాలు తెలిపాయి. ఇరాన్‌తో జరిగే చర్చల్లో పురోగతి కనిపిస్తే వాన్స్ పాకిస్తాన్‌కు వెళ్తారని అధికారులు తెలిపారు. కాగా మలి విడత చర్చల కోసం ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ ఇప్పటికే ఇస్లామాబాద్ చేరుకున్నట్లు సమాచారం. ఆయన పాకిస్తాన్‌కు బయల్దేరి వెళ్లడానికి ముందు పాకిస్తాన్ డిప్యూటీ సీఎం, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్, పాక్ ఆర్మీ చీఫ్ మునీర్‌తో ఫోన్లో చర్చించినట్లు తెలుస్తోంది. దీంతో వరుస హెచ్చరికలతో ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్న ఇరాన్, అమెరికాకు చెందిన ప్రతినిధులు పాక్‌కు చేరుకోవడం చూస్తుంటే రెండో విడత శాంతి చర్చలు ఉంటాయనే అంచనాలు బలపడుతున్నాయి. -
బాంబు దాడిలో తీవ్ర గాయాలు మోజ్డాబా ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ..
-
ఇజ్రాయెల్ దాడిలో మహిళా జర్నలిస్టు మృతి
బీరూట్: లెబనాన్‌పై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో మహిళా జర్నలిస్టు అమల్ ఖలీల్ ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయెల్–హెజ్బోల్లా యుద్ధ సంబంధ వార్తలను సేకరించేందుకు విధి నిర్వహణలో భాగంగా యుద్ధక్షేత్రంలో ఉన్న ఉన్నప్పుడు అమల్ ఖలీల్‌పై దాడి జరిగింది. ఈ దాడిలో ఆమె ప్రాణాలు కోల్పోయారు. ఆమెతోపాటు వచ్చి యుద్ధం ఫొటోలు తీస్తున్న ఫ్రీలాన్స్ ఫొటోగ్రాఫర్ జినాబ్ ఫరాజ్ తీవ్రంగా గాయపడ్డారు. లెబనాన్‌లోని అల్–అఖ్బర్ వార్తాపత్రికలో పనిచేస్తున్న 43 ఏళ్ల ఖలీల్, ఫోటోగ్రాఫర్ ఫరాజ్ ఇద్దరూ ఒకే వాహనంలో ప్రయాణిండగా వీళ్ల సమీపంలోని మరో వాహనంపై దాడి జరిగింది. దీంతో ఆ వాహనంలోని ఇద్దరు ప్రాణాలుకోల్పోయారు. ఇది చూసి వీరిద్దరూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని సమీప ఇంట్లోకి వెళ్లి దాక్కున్నారు. అయితే తర్వాత ఆ ఇంటి మీద సైతం వైమానిక దాడి జరిగింది. దీంతో ఇల్లు ధ్వంసమైంది. విషయం తెల్సి లెబనాన్ ఆర్మీ, పౌర రక్షణ బలగాలు, లెబనాన్ రెడ్ క్రాస్ సంస్థ సభ్యులు హుటాహుటిన ఆ ఇంటికి చేరుకున్నారు. ఆరుగంటల తర్వాత శిథిలాల నుంచి ఖలీల్ మృతదేహాన్ని బయటకుతీశారు. దక్షిణ లెబనాన్‌లోని అల్–తిరీ గ్రామంలో ఈ దాడి ఘటన చోటుచేసుకుంది. -
వెంటబడి.. చొరబడి
టెహ్రాన్: దుబాయ్ నుంచి బయల్దేరి హార్మూజ్ జలసంధి మీదుగా గుజరాత్‌లోని ముంద్రా పోర్ట్‌కు క్షేమంగా రావాల్సిన కంటైనర్ నౌక ‘ఎపామినోండాస్’ను ఇరాన్ బలగాలు స్వా«దీనం చేసుకున్న వీడియో తాజాగా బహిర్గతమైంది. లైబీరియా జెండాతో వస్తున్న ‘ఎపామినోండాస్’పైకి ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్(ఐఆర్జీసీ) నేవీ బలగాలు మెరుపువేగంతో దాడిచేసి తమ వశం చేసుకున్న వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా షేర్ అవుతోంది. ఒమన్‌కు ఈశాన్యంగా 15 నాటికల్ మైళ్లదూరంలో హార్మూజ్ జలాల్లో ఉన్న నౌకపైకి ఐఆర్జీసీ నేవీ గన్బోట్లు హఠాత్తుగా కాల్పులు జరిపి నౌక ముందుకు వెళ్లకుండా అడ్డుకున్నాయి. వెంటనే గన్బోట్లలో నేవీ కమెండోలు మెరుపువేగంతో నౌక సమీపానికి చేరుకున్నారు. నౌక పక్కల వైపు ఉండే చిన్నపాటి ప్రవేశ ద్వారం గుండా లోపలికి చొరబడ్డారు. ఈ దురాక్రమణపర్వం మొత్తం నేవీ వాళ్ల డ్రోన్ కెమెరాల్లో రికార్డయ్యాయి. మాస్క్ లు ధరించిన కమెండోలు రైఫిళ్లు ఇతర మారణాయుధాలతో నౌకలోకి చొరబడి తమను ప్రతిఘటించే సాయుధులకోసం వెతికారు. నౌకలో సాయుధుల ఎవరూ లేకపోవడంతో నేరుగా నౌక ఇంజిన్ రూమ్‌లోకి వెళ్లి దాని ఆపరేటింగ్ సిస్టమ్‌ను తమ వశంచేసుకున్నారు. తర్వాత నౌక తమ అ«దీనంలోకి వచి్చందని అధికారికంగా ప్రకటించారు. తర్వాత నౌకను ఇరాన్ తీరం వైపు మళ్లించారు. తీరానికి తీసుకెళ్లాక నౌకను తనిఖీచేసి సరకులో ఏమైనా అక్రమ, చట్టబద్ధ వస్తువులున్నాయా లేదా అనేది తనిఖీచేస్తారు. వాస్తవానికి ఈ నౌక రాకపోకలకు సంబంధించి ఎలాంటి ముందస్తు అనుమతులులేవని ఇరాన్ నేవీ ప్రకటించింది. నౌకను స్వా«దీనంచేసుకునే క్రమంలో ఎపామినోండాస్ పైకి ఇరాన్ కమెండోలు కాల్పులు జరిపి గ్రనేడ్లు విసిరేశారు. దీంతో నౌకలోని ప్రధానభాగమైన బ్రిడ్జ్(సెంట్రల్ కమాండ్ సెంటర్) పాక్షికంగా దెబ్బతింది. కానీ నౌకలోని సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదు. దెబ్బకు దెబ్బ... హార్మూజ్‌లో, హిందూ మహాసముద్రంలో రెండు ఇరాన్ నౌకలను అమెరికా బలగాలు స్వా«దీనం చేసుకున్నాయి. ఇరాన్ కార్గో నౌక ‘టౌస్కా’స్వాధీనపరంపర తాలూకు వీడియోలను మీడియాకు అందజేశాయి. ఇరాన్ నౌకలను సులభంగా తమ వశంచేసుకున్నామని ఆ వీడియోల్లో అమెరికా సైన్యాధికారులు ప్రకటించారు. దీంతో ఆగ్రహించిన ఐఆర్జీసీ నేవీ బలగాలు తాము సైతం విదేశీ నౌకలను స్వా«దీనంచేసుకోగలమని నిరూపించాలనుకున్నాయి. ఇందులోభాగంగా ‘ఎపామినోండాస్’, ‘యుఫోరియా’, ‘ఎంఎస్సీ ఫ్రాన్సిస్కా’నౌకలను స్వా«దీనం చేసుకుని తమ సత్తా చాటాయని తెలుస్తోంది. -
అమెరికా నేవీకి ట్రంప్ కీలక ఆదేశాలు
అమెరికా- ఇరాన్ రెండో విడత చర్చలుకు రాయబారం నడుస్తోన్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. అమెరికా ఆ జలసంధిని బ్లాకేడ్ చేసిన నేపథ్యంలో జలసంధిలో మందుపాతరలు పెట్టడానికి యత్నిస్తున్న ఏ నౌకలైనా పేల్చిపడేయాలని తెలిపారు. ఈ మేరకు యుఎస్ నేవీని ఆదేశించినట్లు ప్రకటన విడుదల చేశారు.పశ్చిమాసియాలో అసలు ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు. ఓ వైపేమో శాంతి చర్చల ప్రస్థావన తెస్తూనే మరోవైపు అమెరికా- ఇరాన్ రెండు దేశాలు కయ్యానికి కాలు దువ్వుతున్నాయి. కొద్ది సేపటి క్రితమే హర్ముజ్ జలసంధిలో తొలిసారిగా పన్నువసూలు చేసినట్లు ఇరాన్ పేర్కొంది. అమెరికా బ్లాకేడ్‌కు వ్యతిరేకంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. కాగా ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్ సైతం హర్ముజ్ విషయంలో తీవ్రంగా స్పందిచారు.ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియా పోస్ట్‌లో ఈ మేరకు పోస్ట్ చేశారు."హార్ముజ్ జలసంధి ప్రయాణిస్తున్న ఏ నౌకలైనా సరే ఏ బోట్లనైనా, అవి చిన్నవైనా పెద్దవైనా (వారి నౌకాదళ నౌకలన్నీ, మొత్తం 159 కూడా సముద్ర గర్భంలోనే ఉన్నాయి. పేల్చిపడేయాలని నేను యునైటెడ్ స్టేట్స్ నేవీని ఆదేశించాను. ఇందులో ఎటువంటి సంకోచం ఉండకూడదు." అని ఆదేశించినట్లు తెలిపారు.అయితే ప్రస్తుతం జలసంధిలో అమెరికా మైన్-క్లియరింగ్ (గనుల తొలగింపు) కార్యకలాపాలు ఇప్పటికే కొనసాగుతున్నాయని, ఆ ప్రయత్నాలను మరింత ముమ్మరం చేయాలని ఆయన సూచించారు. అదనంగా మరిన్ని మైన్ 'స్వీపర్లు' హర్ముజ్‌కు తరలించాలని దానిని మూడు రెట్లు పెంచాలని అమెరికా నేవీని ఆదేశించినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. -
హర్ముజ్ వద్ద మరోసారి టెన్షన్ టెన్షన్
ప్రస్తుతం హర్ముజ్ జలసంధి వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హర్ముజ్ జలసంధిని బ్లాకేడ్ చేశాం అని అమెరికా ప్రకటించడం.. అదే సమయంలో ఇరాన్ సైతం హర్ముజ్ నుంచి రాకపోకలకు అంతరాయం కలిగించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ హర్ముజ్‌లో తొలిసారిగా టోల్ కలెక్ట్ చేసినట్లు ప్రకటించింది. దీంతో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.ఇరాన్ పార్లమెంట్ డిప్యూటీ స్పీకర్ హమీద్రేజా హాజీ ఈ మేరకు ప్రకటన చేసినట్లు అల్ జజీరా కథనం పేర్కొంది. " ఈ సముద్ర మార్గం గుండా ప్రయాణించే నౌకల నుండి ఇరాన్ టోల్ వసూలు చేయడం ప్రారంభించింది. దీనికి సంబంధించిన మొదటి విడత ఆదాయాన్ని ఇప్పటికే దేశంలోని సెంట్రల్ బ్యాంక్‌లో జమ చేశాం" అని ఆయన అన్నట్లు పేర్కొంది. అమెరికా విధిస్తున్న నౌకాదళ ఆంక్షలకు ప్రతిచర్యగా ఇరాన్ ఈ పన్నును అమలు చేస్తోన్నట్లు తెలిపింది.కాగా ఇదివరకే హర్ముజ్ విషయంలో ఇరాన్ కీలక ప్రకటన చేసింది. అమెరికా విధిస్తున్న ఆంక్షలు మరియు నౌకాదళ ఒత్తిడి కొనసాగినంత కాలం ఈ చమురు రవాణా మార్గాన్ని తిరిగి తెరిచే ప్రసక్తే లేదని ఇరాన్ స్పష్టం చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాల్పుల విరమణను పొడిగించినప్పటికీ, అమెరికా చర్యలను ఇరాన్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. పాకిస్థాన్ చేస్తున్న రాయబార ప్రయత్నాలను ఇరాన్ గుర్తించినప్పటికీ, అమెరికా తీరును మాత్రం తప్పుబడుతూ వస్తుంది.కాగా ఇదివరకే అమెరికా బెదిరింపులకు ఏ మాత్రం తగ్గేది లేదని ఇది వరకే ఇరాన్ పలుమార్లు స్పష్టం చేసింది. అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాత్రం ఇరాన్‌కు తరచుగా తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తు వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇరాన్ మాత్రం ఎట్టిపరిస్థితుల్లో వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలోనే హర్ముజ్ వద్ద టోల్ కలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. -
హర్మూజ్ జల సంధిలో భారత్ నౌకను సీజ్ చేశాం : ఇరాన్
టెహ్రాన్: అమెరికా-ఇరాన్‌ల మధ్య శాంతి ఒప్పందం చర్చలపై ప్రతిష్టంభన నెలకొన్న వేళ హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. గల్ఫ్ దేశాల నుంచి వస్తున్న వాణిజ్య నౌకలను ఇరాన్ అడ్డుకుంటూ, స్వాధీనం చేసుకుంటున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. బుధవారం ఇరాన్ నౌకాదళం రెండు వాణిజ్య నౌకలను స్వాధీనం చేసుకుంది. వాటిలో ఒకటి భారత్‌కు చెందిన నౌక కూడా ఉంది. ఈ నౌక దుబాయ్ నుంచి బయలుదేరి గుజరాత్‌లోని ముంద్రా పోర్టుకు వెళ్లాల్సి ఉంది. అంతలోనే ఇరాన్ కమాండోలు గన్బోట్ల ద్వారా భారత్ నౌకను అదుపులోకి తీసుకున్నారు. ఎస్ఎస్ఈ పేరుతో పనామా జెండాతో వెళ్తున్న మరో ఫ్రాన్స్ నౌకను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ రెండు నౌకలను ఇరాన్ తీరానికి తీసుకెళ్లారు.ఇరాన్ విడుదల చేసిన వీడియోలో ముసుగులు ధరించిన కమాండోలు తుపాకులతో నౌకపైకి ఎక్కి తనిఖీలు చేపట్టిన దృశ్యాలు చూడొచ్చు. నౌకపై కాల్పులు జరిపి, గ్రెనేడ్లు విసరడంతో బ్రిడ్జ్ (కమాండ్ సెంటర్) దెబ్బతింది. అయితే సిబ్బందికి ఎటువంటి గాయాలు కాలేదు.ఈ ఘటనకు ముందు అమెరికా మెరైన్లు రెండు ఇరాన్ జెండా కింద నడుస్తున్న నౌకలను స్వాధీనం చేసుకోవడంతో, ఇరాన్- అమెరికా మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. అమెరికా అధికారులు ఇరాన్ ‘మస్కిటో ఫ్లీట్’ అనే చిన్న, వేగవంతమైన పడవలను ఉపయోగిస్తున్నారని ఆరోపించారు.భారత్‌కు వెళ్తున్న వాణిజ్య నౌకల భద్రతపై ఆందోళనలు పెరుగుతున్నాయి. హర్మూజ్ జలసంధి అంతర్జాతీయ వాణిజ్యంలో కీలక మార్గం కావడంతో, ఇలాంటి దాడులు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 🇮🇷⚡️BREAKING: IRGC releases footage showing their Navy forces seizing the 'MSC Epaminondas' vessel in the Strait of Hormuz earlier today. pic.twitter.com/Mx8Jt6QIAB— IRGC (@IRGC_Press) April 22, 2026 -
టెహ్రాన్ వీధుల్లో ఉరేగింపు.. వేల సంఖ్యలో జనం
టెహ్రాన్: ప్రస్తుతం ఇరాన్- అమెరికా మధ్య రెండో విడత చర్చలు జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ట్రంప్ సైతం కీలక ప్రకటన చేశారు. రెండో విడత చర్చలపై శుక్రవారం నాటికి శుభవార్త రావచ్చని రాబోయే 36 నుంచి 72 గంటల్లోపూ మరో దశ శాంతి చర్చలు ప్రారంభమయ్యే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో ఇరాన్ బలప్రదర్శన చేసింది. తన బాలిస్టిక్ క్షిపణితో టెహ్రాన్ వీధుల్లో ఉరేగింపు జరిపింది. ఈ ఊరేగింపులో పెద్దసంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.ప్రస్తుతం ఇరాన్- అమెరికా యుద్ధంలో సీజ్ఫైర్ నడుస్తున్నందున ఇరాన్లో శాంతియుత పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలు సాధారణ కార్యకలాపాల్లో పాలు పంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇరాన్ తమ దేశ ఆయుధ సంపత్తిని తెలియజేస్తూ టెహ్రాన్ వీధుల్లో ఓ ర్యాలీ నిర్వహించింది. ఒక భారీ వాహనంపై తన దేశానికి చెందిన ఆధునాతన బాలిస్టిక్ క్షిపణి ఖదర్ను ప్రదర్శనకు ఉంచి ఊరేగింపు జరిపింది.ఈ ర్యాలీలో పెద్దసంఖ్యలో ప్రజలు పాల్గొని నినాదాలు చేస్తూ ర్యాలీగా బయిలు దేరారు. ఖదర్ అనే క్షిపణి పాత షహాబ్-3A క్షిపణికి ఆధునాతన వెర్షన్ ఇది. ఇజ్రాయెల్‌పై దాడులకు ఇరాన్ ప్రధానంగా వీటినే వినియోగించింది.అయితే ఇటీవల ట్రంప్ తరచుగా ఇరాన్ ఆయుధ సామాగ్రిపై ట్రంప్ తరచుగా కామెంట్స్ చేశారు. ఇరాన్ వద్ద ప్రస్తుతం ఎటువంటి ఆయుధ సామాగ్రి లేదని తరచుగా మాట్లాడారు. కాగా ఇటీవల యుఎస్ అధికారి ఇచ్చిన నివేదిక ఇందుకు భిన్నంగా ఉంది. అమెరికా డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ డైరెక్టర్ లెఫ్టినెంట్ జనరల్ జేమ్స్ ఆడమ్స్ ప్రకారం.. ఇరాన్ వద్ద ఇంకా వేల సంఖ్యలో క్షిపణులు, డ్రోన్లు ఉన్నాయి. క్షిపణి లాంచర్లలో సగానికి పైగా ఇంకా సురక్షితంగా ఉన్నాయి. తీరప్రాంత రక్షణ క్షిపణులు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నాయని పేర్కొన్నారు.మరోవైపు గత వారం CNN జరిపిన దర్యాప్తులో కూడా ఇవే విషయాలు వెల్లడయ్యాయి. ఇరాన్ క్షిపణి ప్రయోగ వాహనాల్లో దాదాపు సగం ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయని, అలాగే వేలాది డ్రోన్లు ఆయుధాగారంలోనే దాడులకు సిద్ధంగా ఉన్నాయని ఆ దర్యాప్తులో తేలింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇరాన్ ర్యాలీ సైతం తమ వద్ద ఇంకా బలమైన ఆయుధాలు ఉన్నాయని పరోక్షంగా హెచ్చరించడానికే అన్న కోణంలో ఉంది.Iran publicly displays 2000 km range ballistic missile in Tehran pic.twitter.com/HnKXAyPis9— Iran Headlines (@Iran_Headlines) April 23, 2026 -
ఇరాన్‌పై అమెరికా మరో ట్విస్ట్..
వాషింగ్టన్: ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కాల్పుల విరమణ గడువు పొడిగింపు, హార్మూజ్ జలసంధి దిగ్బంధంపై అమెరికా భారీ ట్విస్ట్ ఇచ్చింది. ఇరాన్‌తో కాల్పుల విరమణకు సంబంధించి ఐదు రోజుల గడువు ఉందన్న వార్తలు, నిరవధిక గడువు ఉందన్న సమాచారం నిజం కాదని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ తెలిపారు. అధ్యక్షుడు ట్రంప్ ఎటువంటి నిర్దిష్ట గడువును ఇంకా విధించలేదని ఆమె తేల్చిచెప్పారు.వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ తాజాగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. హార్మూజ్ జలసంధిలో కొనసాగుతున్న దిగ్బంధం పట్ల ట్రంప్ సంతృప్తిగా ఉన్నారు. ఇరాన్‌తో కాల్పుల విరమణకు సంబంధించి 3 నుంచి 5 రోజుల గడువు ఉందన్న వార్తలు నిజం కాదు. చర్చల సమయం, తదుపరి చర్యల గడువును అధ్యక్షుడు ట్రంప్ మాత్రమే నిర్ణయిస్తారు. ఇక, ఇరాన్ ప్రస్తుతం చాలా బలహీనంగా ఉంది. చర్చలకు సంబంధించిన అన్ని కీలక నిర్ణయాలు ఇప్పుడు ట్రంప్ చేతిలోనే ఉన్నాయి.ఇరాన్‌కు ప్రధాన ఆదాయ వనరైన చమురు ఎగుమతులను అమెరికా అడ్డుకుంది. ఖర్గ్ ద్వీపం చమురు నిల్వలతో నిండిపోయింది. ఖర్గ్ ద్వీపం నుంచి చమురును బయటకు పంపే అవకాశం లేకుండా అమెరికా దిగ్బంధించింది. దీనివల్ల ఇరాన్ ప్రతిరోజూ సుమారు 500 మిలియన్ల ఆదాయాన్ని కోల్పోతోంది. కనీసం తన సొంత ప్రజలకు వేతనాలు కూడా చెల్లించలేని స్థితికి ఇరాన్ చేరుకుంది. ట్రంప్ ప్రయోగించిన ఈ ఆర్థిక ఒత్తిడి సత్ఫలితాలను ఇస్తోంది అని చెప్పుకొచ్చారు.White House press secretary Karoline Leavitt said Wednesday that President Trump “has not set a firm deadline to receive an Iranian proposal" following another extension to the ceasefire."There's obviously a lot of internal division," Leavitt said, referring to Iran's… pic.twitter.com/zHXmKkdhrB— CBS News (@CBSNews) April 22, 2026 ఇరాన్ కౌంటర్.. మరోవైపు.. అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో శాంతి చర్చలకు అసలైన అడ్డంకులు ఎక్కడ ఉన్నాయో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ సోషల్ మీడియాలో వివరించారు. గతంలో కుదుర్చుకున్న ఒప్పందాలను అమెరికా గౌరవించక పోవడం ఒక కారణమని ఆయన పేర్కొన్నారు. ఇరాన్ ఓడరేవులపై, ఆర్థిక వ్యవస్థపై కొనసాగుతున్న ఆంక్షలు, దిగ్బంధం మరో కారణమని చెప్పారు. అమెరికా నుంచి వస్తున్న సైనిక, రాజకీయ బెదిరింపులు శాంతి చర్చలకు అడ్డంకులని తెలిపారు. అమెరికా మాటలకు, చేతలకు మధ్య ఉన్న తేడాను ప్రపంచం మొత్తం చూస్తోందని విమర్శించారు. ఇరాన్ ఎప్పుడూ చర్చలకు, ఒప్పందాలకు సిద్ధంగానే ఉందని స్పష్టం చేశారు. ఇదే సమయంలో హార్మూజ్‌ను తెరిచే ప్రసక్తేలేదని తేల్చి చెప్పారు. -
50 డేస్.. అమెరికా అట్టర్ ప్లాప్ షో..
ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధంలో ఇప్పటికే ట్విస్టుల మీద ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. పాకిస్తాన్ వేదిక చర్చల్లో కూడా సందిగ్ధత నెలకొంది. సీజ్‌ఫైర్‌ను ట్రంప్ పొడిగించినప్పటికీ అరకొరదాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక, ఇరాన్ సైతం ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంది. మరోవైపు.. ఇరాన్‌పై దాడుల కారణంగా అమెరికా ఆయుధాల సంఖ్య రోజురోజుకి తరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 2027 బడ్జెట్లో అమెరికా భారీగా కొత్త మిసైళ్లను ఆర్డర్ చేసింది. ఇంతకీ అమెరికా వద్ద ఇంకా ఎన్ని క్షిపణులు, ఆయుధాలు ఉన్నాయనే అంశం ఓ నివేదిక బయటకు వచ్చింది.అమెరికా, ఇరాన్ యుద్ధం ప్రారంభమై 50 రోజులు దాటింది. యుద్ధంలో ఇరాన్‌పై అమెరికా భారీగానే దాడులు చేసింది. భారీ క్షిపణులు, వైమానిక దాడులతో విధ్వంసమే సృష్టించింది. ఇందుకోసం పెద్ద సంఖ్యలో ఆయుధాలను ఉపయోగించింది. దీంతో, ఇరాన్ సైనిక సామర్థ్యం తగ్గిపోవడమే కాకుండా, అమెరికా ఆయుధ నిల్వలు కూడా గణనీయంగా తగ్గాయి. ఆయుధ నిల్వలు భారీగా తరిగిపోయాయి. అయితే, అమెరికా వద్ద ప్రస్తుత యుద్ధాన్ని కొనసాగించడానికి సరిపడా మిసైళ్లు ఉన్నప్పటికీ, దీర్ఘకాలంలో కొత్త యుద్ధాలు తలెత్తితే నిల్వల కొరత పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది.అమెరికా ఆయుధ నిల్వల పరిస్థితి..టోమాహాక్ క్రూయిజ్ మిసైళ్లు: యుద్ధానికి ముందు 3,100 ఉండగా.. యుద్ధం కోసం 850 వినియోగించబడ్డాయి. దీంతో, దాదాపు 25% నిల్వలు తగ్గాయి.JASSM (జాయింట్ ఎయిర్ టు సర్ఫేస్ స్టాండాఫ్ మిసైళ్లు): 4,400 ఉండగా.. ఇరాన్ యుద్ధం కోసం 1,000 వినియోగించబడ్డాయి.THAAD ఇంటర్సెప్టర్లు: 360 ఉండగా.. 190–290 వినియోగించబడ్డాయి. ఇప్పుడు 70 మాత్రమే మిగిలి ఉన్నాయి.పాట్రియట్ PAC-3: 2,330 ఉండగా.. 1,060–1,430 వినియోగించబడ్డాయి. కేవలం 900 మాత్రమే మిగిలాయి.SM-6: 600 ఉండగా..200 వినియోగించారు. 400 వరకు ఉన్నాయి. SM-3: 150 ఉండగా.. 40 వరకు వినియోగం. ఇంకా 110 మిగిలి ఉన్నాయి.భవిష్యత్తు ప్రణాళిక.. భారీగా ఖర్చు..2027 బడ్జెట్లో అమెరికా భారీగా కొత్త మిసైళ్లను ఆర్డర్ చేసింది.టోమాహాక్: 55 నుంచి 785కి పెంపు( ఒక్క దానికి ఖర్చు: తయారీకి $2.6 మిలియన్ డాలర్లు).Patriot PAC-3: 357 నుంచి 3,203కి పెంపు ( $3.9 మిలియన్)THAAD: 55 నుంచి 857కి పెంపు($15.5 మిలియన్)SM-6: 166 → 540కి పెంపు($4.3 మిలియన్)SM-3: 12 → 136కి పెంపు($9–10 మిలియన్)ప్రధాన సమస్యలు..ఇరాన్ తక్కువ ఖర్చుతో తయారు చేసే డ్రోన్లు, క్రూయిజ్ మిసైళ్లు అమెరికా ఖరీదైన రక్షణ వ్యవస్థలను బలవంతంగా వినియోగింపజేస్తున్నాయి.THAAD, Patriot లాంటి రక్షణ వ్యవస్థలు తీవ్ర ఒత్తిడిలో ఉన్నాయి.ఉత్పత్తి చేయడానికి ఎక్కువ సమయం పట్టడం కారణం (టోమాహాక్ – 47 నెలలు, THAAD – 53 నెలలు, SM-36 నెలలు, SM-36 నెలలు) కావడంతో నిల్వలను తిరిగి భర్తీ చేయడం కష్టతరం అవుతుంది. ఇదే సమయంలో ఇరాన్ మాత్రం.. యుద్ధంలో ప్రధానంగా షాహెడ్ డ్రోన్లు మరియు క్రూయిజ్ మిసైళ్లు వినియోగిస్తోంది. ఇవి తక్కువ ఖర్చుతో, పెద్ద సంఖ్యలో తయారు చేయగలిగే సామర్థ్యం కలిగి ఉండటంతో అమెరికా మరియు మిత్రదేశాల రక్షణ వ్యవస్థలపై తీవ్రమైన ఒత్తిడి పెడుతున్నాయి. ఇరాన్ ఒకేసారి వందల డ్రోన్లను పంపి, అమెరికా THAAD మరియు Patriot వ్యవస్థలను నిర్వీర్యం చేశాయి. ఇరాన్ ఉపయోగిస్తున్న డ్రోన్లుShahed-136 ("కమికాజే" డ్రోన్)ఒకే దిశలో దాడి చేసే UAV (Unmanned Aerial Vehicle).ఖర్చు: సుమారు $20,000–$50,000 మాత్రమే.లక్ష్యం: శత్రు రక్షణ వ్యవస్థలను అధిక సంఖ్యలో దాడులతో అలసటకు గురి చేయడం.“పేదవాడి క్రూయిజ్ మిసైల్” అని పిలుస్తారు, ఎందుకంటే ఇది తక్కువ ఖర్చుతో క్రూయిజ్ మిసైల్ లాంటి ప్రభావం చూపుతుంది.UAE రక్షణ శాఖ ప్రకారం, యుద్ధం ప్రారంభం నుండి 941 డ్రోన్లు గుర్తించబడ్డాయి, వాటిలో 65 UAEలో పడిపోయి మౌలిక వసతులకు నష్టం కలిగించాయి.Shahed-131 / Shahed-238 (అప్‌గ్రేడ్ వెర్షన్లు)Shahed-136 కంటే చిన్నవి లేదా వేగవంతమైనవి.కొన్ని జెట్-ఇంజిన్ ఆధారిత డ్రోన్లు కూడా వినియోగించబడ్డాయి, ఇవి మరింత వేగంగా ఉండి Patriot లాంటి రక్షణ వ్యవస్థలకు సవాలు విసురుతున్నాయి.ఇరాన్ క్రూయిజ్ మరియు బాలిస్టిక్ మిసైళ్లు1. Zolfaghar బాలిస్టిక్ మిసైల్700 కిమీ పరిధి.1,100 పౌండ్ల వార్‌హెడ్ మోసే సామర్థ్యం.ఇరాక్‌లోని ఎర్బిల్ ప్రాంతంలో పలు దాడుల్లో వినియోగించబడింది.2. Soumar క్రూయిజ్ మిసైల్రష్యా KH-55 ఆధారంగా అభివృద్ధి చేయబడింది.దీర్ఘదూర దాడులకు ఉపయోగపడుతుంది.3. Quds-1 / Quds-2 క్రూయిజ్ మిసైళ్లుతక్కువ ఖర్చుతో తయారు చేయగలిగే సామర్థ్యం.గల్ఫ్ ప్రాంతంలోని మౌలిక వసతులపై దాడులకు వినియోగించబడ్డాయి.ఇదిలా ఉండగా.. అమెరికా పెంటగాన్ ఇంటెలిజెన్స్ విభాగం తాజా అంచనాల ప్రకారం.. ఇరాన్ ఇంకా తన ప్రధాన సైనిక సామర్థ్యాలను కొనసాగిస్తోంది. అలాగే ఎన్బీసీ నివేదిక ప్రకారం, ఇరాన్ సైన్యం ఇంకా ప్రాంతీయ శక్తిగా కొనసాగుతోందని తెలుస్తోంది. -
నౌకలపై ఇరాన్ దాడి
వాషింగ్టన్/టెహ్రాన్/ఇస్లామాబాద్/దుబాయ్: పాక్ ప్రాయోజిత శాంతి చర్చల ప్రక్రియకు తూట్లు పొడుస్తూ ఇరాన్ హార్మూజ్ జలసంధిని మరోమారు కాల్పులమోతకు వేదికగా మార్చేసింది. శాంతి చర్చలకు ఫలవంతమైన ప్రతిపాదనలతో ఇరాన్ వచ్చేవరకు కాల్పుల విరమణ గడువును పొడిగిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించిన కొద్దిసేపటికే విదేశీ నౌకలపై ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్(ఐఆర్జీసీ) నేవీ బలగాలు దాడులపర్వానికి తెరలేపాయి. ఇటీవల కొన్ని గంటలపాటు హార్మూజ్‌ను పూర్తిగా తెరుస్తున్నట్లు ఇరాన్ చేసిన ప్రకటనతో పర్షియన్ గల్ఫ్ నుంచి ఆశగా బయల్దేరిన నౌకలు గురువారం హార్మూజ్ జలసంధిని దాటే క్రమంలో వాటిపైకి ఐఆర్జీసీ నేవీ గన్బోట్లు తుపాకులు ఎక్కుపెట్టాయి. దీంతో మూడు నౌకలు స్వల్పంగా దెబ్బతిన్నాయి. మూడింటిలో రెండింటిని ఇరాన్ స్వా«దీనంచేసుకుని తమ తీరానికి తీసుకెళ్తున్నాయి. మరోవైపు ఇరాన్ ప్రతినిధి బృందం ఇస్లామాబాద్‌కు బయల్దేరని కారణంగా అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సారథ్యంలోని బృందం సైతం పాకిస్తాన్‌కు బయల్దేరలేదు. దీంతో రెండో దఫా చర్చలు సాధ్యపడలేదు. అయితే చర్చలు తాత్కాలికంగా వాయిదాపడ్డాయేగానీ రద్దుకాలేదని అమెరికా వ్యాఖ్యానించింది. శుక్రవారంలోపు రెండోదఫా చర్చలు జరిగే వీలుందని ట్రంప్ చెప్పినట్లు ‘ది న్యూయార్క్ పోస్ట్’తన కథనంలో పేర్కొంది. మరోవైపు బుధవారంతో ముగిసిపోతున్న కాల్పుల విరమణ గడువును ట్రంప్ హఠాత్తుగా పొడిగించడంపై మధ్యవర్తిత్వ దేశం పాకిస్తాన్ హర్షం వ్యక్తంచేసింది. సత్ఫల ప్రతిపాదనలతో ముందుకొచ్చేలా ఇరుపక్షాలను ఒప్పించేందుకు తమకు గడువు, సువర్ణావకాశం దక్కాయని పాకిస్తాన్ వెల్లడించింది. ‘‘మా దాడుల ధాటికి ఇరాన్ నాయకత్వంలో విభేదాలు పొడచూపాయి. పాక్ ఫీల్డ్ మార్షల్ ఆసిం మునీర్, ప్రధాని షెహబాజ్ షరీఫ్‌ల అభ్యర్థన మేరకు ఇరాన్‌పై దాడులకు తాత్కాలిక విరామం ప్రకటిస్తున్నా. ఇరాన్ నుంచి ఆమోదయోగ్య ప్రతిపాదనలు వచ్చేదాకా కాల్పుల విరమణ గడువు పొడిగిస్తున్నా. గడువు పొడిగించినా హార్మూజ్ దిగ్బంధం, ఇరాన్ నౌకాశ్రయాల గుండా నౌకల రాకపోకలపై నిషేధం కొనసాగుతుంది’’అని ట్రంప్ అన్నారు. రెండో దఫా చర్చలు జరిగి శాశ్వత శాంతి ఒప్పందం అమల్లోకి వస్తే హార్మూజ్ తెరచుకుని ముడిచమురు సంక్షోభం సమసిపోయి క్రూడ్ ఆయిల్, పెట్రో ధరలు దిగొచ్చేవి. ఇవేవీ సాకారంకాకపోవడంతో ప్రపంచవ్యాప్తంగా పెట్రో ధరలు పెరిగి పరోక్షంగా నిత్యావసర సరుకుల ధరలు మరింత ప్రియమైన పెనుప్రమాదం అలాగే పొంచి ఉంది. ముంద్రా పోర్ట్‌కు వస్తుంటే మెరుపుదాడిఒమన్కు ఈశాన్యంగా 15 నాటికల్ మైళ్లదూరంలో హార్మూజ్ జలాల్లో ఉన్న లైబీరియా జెండాతో వెళ్తున్న కంటైనర్ నౌక ‘ఎపామినోండాస్’పైకి ఐఆర్జీసీ నేవీ గన్బోట్లు హఠాత్తుగా కాల్పులు జరిపి నౌక ముందుకు వెళ్లకుండా అడ్డుకున్నాయి. వాస్తవానికి ఈ నౌక గుజరాత్‌లోని ముంద్రా పోర్ట్‌కు రావాల్సి ఉందని నౌకల స్థితిగతులపై నిఘా పెట్టే ‘మెరైన్ ట్రాఫిక్’సంస్థ వెల్లడించింది. తర్వాత యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)కేంద్రంగా పనిచేసే పనామా జెండాతో వెళ్తున్న ‘యుఫోరియా’నౌక మీద ఇరాన్ బలగాలు కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో నౌకలోని నావికులకు ఎలాంటి గాయాలు కాలేదు. ఇరాన్ తీరానికి కేవలం 8 నాటికల్ మైళ్లదూరం నుంచి వెళ్తున్నప్పుడు యుఫోరియాపై కాల్పులు జరిపారని వ్యాన్‌గార్డ్, యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్(యూకేఎంటీఓ) వెల్లడించింది. ఇరాన్ తీరానికి కేవలం ఆరు నాటికల్ మైళ్లదూరం నుంచి వెళ్తున్నప్పుడు పనామా జెండాతో ఉన్న ‘ఎంఎస్సీ ఫ్రాన్సిస్కా’నౌక మీదా బుల్లెట్ల వర్షం కురిపించారు. దీంతో నౌక కిందిభాగం స్వల్పంగా దెబ్బతింది. ఎపామినోండాస్, ఎంఎస్సీ ఫ్రాన్సిస్కా నౌకలను స్వా«దీనంచేసుకుని ఇరాన్తీరాలకు బలగాలు తీసుకెళ్తున్నాయి. ఎలాంటి సరైన ధృవీకరణ పత్రాలు, అనుమతులు లేకుండా, రహస్యంగా ఇవి హార్మూజ్‌ను దాటుతున్నాయని ఇరాన్ నేవీ ఆరోపించింది. ట్రాకింగ్‌ను సైతం ఏమార్చి పారిపోతున్నాయని పేర్కొంది. ఎంఎస్సీ ఫ్రాన్సిస్కా నౌక శ్రీలంకలోని హంబన్»ొటా నౌకాశ్రయానికి, యుఫోరియా నౌక జెడ్డాకు వెళ్లాల్సి ఉందని వాటి ట్రాకింగ్డేటా ప్రకారం తెలుస్తోంది. యుద్ధం మొదలైన ఫిబ్రవరి 28వ తేదీ తర్వాత ఇప్పటిదాకా 30కిపైగా నౌకలపై దాడులు జరిగాయి.గడువు పెంపుపై పెదవి విరిచిన ఇరాన్ గడువు పెంపును అమెరికా వేసిన మరో ఎత్తుగడగా ఇరాన్ అభివర్ణించింది. ‘‘సదభిప్రాయంతోనే సీరియస్‌గా తొలి దఫా చర్చలకు కూర్చున్నాం. కానీ అమెరికా అవిశ్వాసం చూపింది. అసంబద్ధ, అతి డిమాండ్ల చిట్టా విప్పింది. ఈ వారాంతంలోపు అమెరికాతో శాంతి చర్చల్లో పాల్గొనాలా వద్దా అనే దానిపై మేం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు’’అని ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బఘేల్ చెప్పారు.క్షిపణుల ప్రదర్శన మరోవైపు తమపై దాడులకు అమెరికా, ఇజ్రాయెల్ జంకుతున్నాయంటూ ఇరాన్ పాలకులు వ్యాఖ్యానించారు. ప్రభుత్వసూచనల మేరకు ఇరాన్ సాయుధబలగాలు బుధవారం టెహ్రాన్ వీధుల్లో భారీ క్షిపణులు, మిస్సైల్ లాంఛర్లను ఊరేగింపుగా ప్రదర్శించారు. తమ వద్ద ఇంకా భారీసంఖ్యలో క్షిపణులు ఉన్నాయని పేర్కొన్నారు. క్షిపణులను చూసేందుకు జనం పెద్దసంఖ్యలో వీధుల్లోకి వచ్చారు. జెండాలను చేతబూని ఇరాన్ పాలకులకు అనుకూలంగా నినాదాలుచేశారు.సముద్ర ఇంటర్నెట్ కేబుళ్లు కత్తిరిస్తాం: ఇరాన్గల్ఫ్ దేశాలకు ఇంటర్నెట్ సేవలు అందించే అత్యంత కీలక సముద్రగర్భ ఇంటర్నెట్ కేబుళ్లను తప్పదనుకుంటే కత్తిరించేస్తామని ఇరాన్ హెచ్చరించింది. ఈ మేరకు ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్(ఐఆర్జీసీ) ఒక హెచ్చరిక జారీచేసింది. ఈ వార్తను ఇరాన్ వార్తాసంస్థ టాస్నిమ్ ప్రచురించింది. ‘‘ఈసారి హార్మూజ్ జలసంధి గుండా వెళ్లే పలు ప్రధాన కేబుళ్లు ఏకకాలంలో ‘ప్రమాదవశాత్తు’ పాడైపోవచ్చు లేదా ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా మారొచ్చు. దీంతో పర్షియన్ గల్ఫ్ దేశాల్లో ఇంటర్నెట్ సేవలు స్తంభించిపోయే ప్రమాదముంది. గల్ఫ్ అరబ్ దేశాల ఇంటర్నెట్ భవితవ్యం ప్రశ్నార్థకమవుతుంది’’ అని టాస్నిమ్ తన కథనంలో పేర్కొంది. హార్మూజ్ గుండా పలుదేశాల ఇంటర్నెట్ కేబుళ్లు వెళ్తున్నాయి. ఎర్రసముద్ర జలాల్లో ఇప్పటికే ఇవి పలుమార్లు కత్తిరింపులకు గురయ్యాయి. తమ పరిధిలోనూ వాటిని కత్తిరిస్తామని ఇరాన్ దన్నుతో పనిచేస్తున్న యెమెన్‌లోని హూతీ తిరుగుబాటుదారులు పలుమార్లు హెచ్చరించారు.ఎలాంటి చెల్లింపులు జరపలేదునగదు, క్రిప్టో కరెన్సీ లావాదేవీల వార్తలను ఖండించిన భారత్ న్యూఢిల్లీ: ఇండియా దిశగా వస్తున్న నౌకలు సురక్షితంగా హార్మూజ్ జలసంధిని దాటేలా ఇరాన్‌కు భారత్ నగదు లేదా క్రిప్టోకరెన్సీ చెల్లింపులు జరిపిందన్న వార్తల్లో ఏమాత్రం నిజంలేదని మోదీ సర్కార్ స్పష్టంచేసింది. హార్మూజ్ జలసంధి దిగ్బంధం తర్వాత ఏ దేశానికి చెందిన నౌకనూ రాకపోకలు సాగించేందుకు ఇరాన్ అనుమతించట్లేదు. అయితే తమ నౌక ఇప్పటికే తమ వద్ద అనుమతి పొందిందని, అనుమతి పొందిన జాబితాలో రెండో నంబర్ తమ నౌకదేనని ‘సన్మార్ హెరాల్డ్’నౌకలోని సిబ్బంది చెబుతున్నట్లుగా ఉన్న ఒక ఆడియో క్లిప్ బయటకురావడంతో భారత్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై మోదీ సర్కార్ వివరణ ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర పోర్ట్‌లు, షిప్పింగ్, వాటర్‌వేస్ శాఖ అదనపు కార్యదర్శి ముఖేశ్ మాంగళ్ బుధవారం ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘‘హార్మూజ్‌ను దాటేందుకు ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్(ఐఆర్జీసీ) నేవీ అధికారులకు సన్మార్ హెరాల్డ్ నౌక కెప్టెన్ డాలర్ల రూపంలో నగదు చెల్లింపులు జరిపాడని వస్తున్న వార్తలో నిజంలేదు. ఈ విషయాన్ని మేం నౌక యజమానితో మాట్లాడి రూఢీచేసుకున్నాం. ఈ ఉదంతంతో భారత్‌కు, కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు’’అని ముఖేశ్ స్పష్టంచేశారు. ఏప్రిల్ 18వ తేదీన రెండు భారత్‌కు వచ్చే నౌకలపై ఆర్‌ఆర్‌జీసీ నేవీ బలగాలు కాల్పులు జరిపాయి. కాల్పులు ఆపేస్తే వెనక్కి వెళ్లిపోతామని సన్మార్ హెరాల్డ్ నౌకలోని సిబ్బంది చెప్పినట్లుగా ఆనాడు మీడియాలో వార్తలొచ్చాయి. -
ఇరాన్లో కుమ్ములాట… మొజ్తాబా ఖమేనీని సైడ్ చేసేశారా?
టెహ్రాన్: ఇరాన్ అంతర్గత అంతర్యుద్ధంతో కొట్టుమిట్టాడుతోంది. ఇరాన్‌పై అమెరికా యుద్ధంలో నిర్ణయాలు తీసుకునే అంశంపై ఓ వైపు సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ.. ఆయన్ని కాదని ఐఆర్జీసీ (ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్) చాపకింద నీరులా ప్రభుత్వంపై పట్టు బిగించే ప్రయత్నాలు కొనసాగిస్తోంది. ఈ అంతర్గత పోరాటం కారణంగా పాకిస్థాన్‌లో జరగాల్సిన అమెరికా- ఇరాన్ కాల్పుల విరమణ చర్చలు విఫలమయ్యాయి. ఫలితంగా ‘ఆపరేషన్ సక్సెస్ - పేషెంట్ డెడ్’ అన్న చందంగా ఇరాన్ వ్యవహారం మారింది. ప్రస్తుతం ఈ పరిణామం ప్రపంచ దేశాల్లో హాట్‌టాపిక్‌గా మారి, అంతర్జాతీయ వేదికలపై తీవ్ర చర్చలకు దారితీస్తోంది. అమెరికా సైతం చర్చలు విఫలమవడానికి, ఆలస్యం అవ్వడానికి కారణం ఇదేనని స్పష్టంగా చెబుతోంది. ఇంతకీ ఇరాన్లో ఏం జరుగుతోంది. ఇరాన్-అమెరికా శాంతి ఒప్పంద చర్చలు మరింత ఆలస్యమవుతున్నాయి. ఇందుకు ప్రధాన కారణం ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ గైర్హాజరీ, ఆయన నిర్ణయాల్లో స్పష్టత లేకపోవడమేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం భావిస్తోంది.ఆరు వారాల క్రితం అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో ఇరాన్ సుప్రీం నేత ఆయతుల్లా అలీ ఖమేనీ ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత ఆయన వారసుడిగా మొజ్తాబా ఖమేనీ ఎన్నికయ్యారు. అయితే ఇప్పటివరకు ప్రజలు ఆయనను ప్రత్యక్షంగా చూడలేదు, ఆయన గొంతు వినలేదు. పశ్చిమాసియా యుద్ధంలో ఇరాన్ కీలక నేతలను కోల్పోవడం వల్ల భయాందోళనలో ఉన్నారని సమాచారం.అమెరికా మీడియా నివేదికల ప్రకారం, మొజ్తాబా ప్రత్యక్ష నిర్ణయాల్లో పాల్గొనకపోవడం వల్ల ఇరాన్ నాయకత్వంలో విభేదాలు పెరిగాయి. అణు కార్యక్రమంపై చర్చల్లో ఇరాన్ ప్రతినిధులకు ఎంత అధికారం ఇవ్వాలో స్పష్టత లేకపోవడం చర్చలపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. ప్రస్తుతం ఇరాన్ వద్ద 60 శాతం శుద్ధి చేసిన యురేనియం 440 కిలోల నిల్వ ఉంది. ఇది 90 శాతం ఆయుధ స్థాయి కంటే తక్కువ అయినప్పటికీ, ఎనిమిది నుంచి పన్నెండు అణు బాంబులు తయారు చేయగల సామర్థ్యం ఉంది. ఈ అంశమే చర్చల్లో ప్రధాన అడ్డంకిగా మారింది.ఇంటర్నేషనల్ క్రైసిస్ గ్రూప్‌కి చెందిన అలీ వాయేజ్ ప్రకారం, మొజ్తాబా స్వయంగా చర్చలు జరిపే స్థితిలో లేరు. ఆయన కేవలం విస్తృత నిర్ణయాలకు ఆమోదం తెలుపుతున్నారని, చర్చల వ్యూహాల్లో ఆయన పాత్ర లేదని చెప్పారు. ఆయన గైర్హాజరీని ఇరాన్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా చూపిస్తోందని, ఇది అంతర్గత విమర్శల నుంచి రక్షణగా పనిచేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి మొజ్తాబా ప్రత్యక్షంగా కనిపించకపోవడం ఇరాన్ పాలనకు సవాలుగా మారింది. ఆయన పేరుతో టీవీల్లో వార్తలు, సోషల్ మీడియాలో పోస్టులు వస్తున్నాయి. కొన్నిసార్లు ఏఐ ద్వారా రూపొందించిన వీడియోలతో సందేశాలు పంపడం ఆయన ఆరోగ్యంపై, ఆయన ఎక్కడున్నారనే అనుమానాలను మరింత పెంచుతోంది.ఫిబ్రవరి 28న అమెరికా-ఇరాన్ దాడుల్లో మొజ్తాబా గాయపడ్డారని సీఎన్ఎన్ నివేదిక తెలిపింది. మరోవైపు, రాయిటర్స్ ప్రకారం ఆయన ఆడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో సమావేశాలు నిర్వహిస్తూ, యుద్ధం, అమెరికాతో చర్చల వంటి ప్రధాన అంశాలపై నిర్ణయాల్లో పాల్గొంటున్నారని సమాచారం.ఇరాన్ ప్రభుత్వంలో కుమ్ములాటఇరాన్లో ప్రస్తుతం పెద్ద రాజకీయ కుమ్ములాట జరుగుతోంది. ఐఆర్జీసీ (ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్) ప్రభుత్వంపై పట్టు బిగించింది. అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ నియామకాలను అడ్డుకోవడం, ముఖ్యంగా ఇంటెలిజెన్స్ మంత్రిని నియమించడాన్ని నిరోధించడం ద్వారా అధ్యక్షుడిని పూర్తిగా పక్కకు పెట్టిందన్న ఆరోపణలు సైతం ఉన్నాయి.మొజ్తాబా ఖమేనీ గైర్హాజరీ, ఆయన నిర్ణయాల్లో స్పష్టత లేకపోవడం వల్ల ఐఆర్జీసీ మరింత ఆధిపత్యం సాధించింది. ఆయన చుట్టూ భద్రతా వలయాన్ని ఏర్పాటు చేసి, ప్రభుత్వ అధికారులకు ఆయనను కలిసే అవకాశం లేకుండా చేసింది. దీంతో పశ్చిమాసియాలో సంక్షోభ సమయంలో తీసుకునే నిర్ణయాలు ఆలస్యమవుతున్నట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు హైలెట్ చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో అమెరికా-ఇరాన్ మధ్య చర్చలు తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉన్నప్పటికీ, అది ఎప్పుడు జరుగుతుందో స్పష్టత లేదు. మొజ్తాబా ఖమేనీ గైర్హాజరీ, ఆయన నిర్ణయాల్లో స్పష్టత లేకపోవడం, ఐఆర్జీసీ ఆధిపత్యం పెరగడం వల్లే శాంతి చర్చలు నిలిచిపోయాయని విశ్లేషకులు చెబుతున్నారు -
"ఇరాన్ ఆయుధాలు తెలిస్తే దిమ్మతిరగాల్సిందే"
ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ ఆయుధ సంపత్తిపై మాట్లాడారు. టెహ్రాన్ వద్ద ప్రస్తుతం ఎటువంటి ఆయుధ సంపత్తి లేదని ఆ దేశ నావికాదళం, వైమానిక దళం దాదాపుగా తుడిచిపెట్టుకపోయిందన్నారు. అయితే తాజా సర్వే కథనాలు మాత్రం అందుకు విభిన్నంగా ఉన్నాయి. ఇరాన్ వద్ద ఇప్పటికీ వేలాదిగా క్షిపణులు, డ్రోన్లు సిద్ధంగా ఉన్నాయని నివేదికలు చెబుతున్నాయి.ఇరాన్‌పై అమెరికాతో పాటు ఇజ్రాయెల్ ఏక కాలంలో విరుచుకపడ్డాయి. ఆ దేశంలోని రక్షణ,మౌళిక స్థావరాలే లక్షంగా దాడులకు తెగబడ్డాయి. ఈ నేపథ్యంలోనే వైమానిక దళం తుడిచిపెట్టుకుపోయిందని, వారి నౌకాదళం సముద్ర గర్భానికి చేరుకుందని ట్రంప్, రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సెత్ ప్రకటించారు. ఇరాన్‌కు తమతో యుద్దం చేసే సీన్ లేదని బిల్డప్ ఇచ్చారు. అయితే ఇరాన్‌పై తీవ్రమైన వైమానిక దాడులు చేసినప్పటికీ వారి వద్ద ఇంకా వేల సంఖ్యలో క్షిపణులు, కామికేజ్ డ్రోన్లు నిఘా నివేదికలు చెబుతున్నాయి.అమెరికా డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ డైరెక్టర్ లెఫ్టినెంట్ జనరల్ జేమ్స్ ఆడమ్స్ ప్రకారం.. ఇరాన్ వద్ద ఇంకా వేల సంఖ్యలో క్షిపణులు, డ్రోన్లు ఉన్నాయి. క్షిపణి లాంచర్లలో సగానికి పైగా ఇంకా సురక్షితంగా ఉన్నాయి. తీరప్రాంత రక్షణ క్షిపణులు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నాయని పేర్కొన్నారు. అయితే గత వారం CNN జరిపిన దర్యాప్తులో కూడా ఇవే విషయాలు వెల్లడయ్యాయి. ఇరాన్ క్షిపణి ప్రయోగ వాహనాల్లో దాదాపు సగం ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయని, అలాగే వేలాది డ్రోన్లు ఆయుధాగారంలోనే దాడులకు సిద్ధంగా ఉన్నాయని ఆ దర్యాప్తులో తేలింది.అయితే ప్రస్తుతం సీజ్ఫైర్ నడుస్తున్నప్పటికీ.. యుద్ధం విషయంలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అమెరికా డిమాండ్లకు ఎట్టి పరిస్థితుల్లో తలొగ్గేది లేదని ఇరాన్ తెగేసి చెబుతుంది. మరోవైపు ట్రంప్ సైతం తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇరాన్ ఆయుధ సంపత్తిపై నివేదికలు చూస్తుంటే మరోసారి యుద్దం తలెత్తితే తీవ్రపరిణామాలు తలెత్తి అవకాశాలు కనిపిస్తున్నాయి. -
ట్రంప్ ప్లాన్ బెడిసికొట్టిందా.. మొదటికే ముప్పు?
ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు, మాటల యుద్ధం కొనసాగుతోంది. కాగా, ఇరాన్ వద్ద ఉన్న యురేనియం కోసం అధ్యక్షుడు ట్రంప్ ఎదురుచూస్తున్నారు. అయితే, సుసంపన్నం చేసిన యురేనియంను అప్పగించడానికి అమెరికా ఇరాన్‌తో ఒప్పందం కుదుర్చుకున్నప్పటికీ ఆ పదార్థాన్ని దేశం నుండి బయటకు తీసుకురావడం అనేది చర్చల కంటే చాలా కష్టతరం కావచ్చు అంటూ పలు నివేదికలు చెబుతున్నారు. అమెరికాకు ఇది అంత సులభం కాదని హెచ్చరిస్తున్నాయి. దీంతో, ట్రంప్ ప్లాన్ బెడిసికొట్టిందా? అనే అనుమానాలు చర్చకు వస్తున్నాయి. వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక ప్రకారం.. మాజీ అధికారులు, అణు నిపుణులు ఈ ఆపరేషన్ చరిత్రలోనే అత్యంత సంక్లిష్టమైన యురేనియం తొలగింపు ఆపరేషన్‌గా ముగిసే అవకాశం ఉందని అంటున్నారు. ఎందుకంటే.. ఇరాన్ యురేనియంలో అధిక భాగం ఇస్ఫహాన్ మరియు నతాంజ్ వంటి కేంద్రాలలో నిల్వ చేయబడిందని భావిస్తున్నారు. ఈ రెండూ ఇటీవలి నెలల్లో అమెరికా మరియు ఇజ్రాయెల్ దాడులకు గురయ్యాయి. దీంతో, అక్కడికి చేరుకోవడం కష్టమైంది. సొరంగాల ప్రవేశ మార్గాలను కూడా పూడ్చివేసినట్టు తెలుస్తోంది. ఎందుకంటే.. అంతర్జాతీయ తనిఖీ అధికారులు కొన్ని నెలలుగా ఈ ప్రదేశాలను సందర్శించలేదు.ఇదే సమయంలో మరో ప్రశ్న కూడా ఉంది. యురేనియం గురించిన దానిలో ఎక్కువ భాగం భారీ సిలిండర్లలో వాయు రూపంలో నిల్వ చేయబడింది. ఆ కంటైనర్లు చెక్కుచెదరకుండా ఉన్నాయో లేదో బృందాలు మొదట తనిఖీ చేయాలని నిపుణులు అంటున్నారు. అవి దెబ్బతిన్నట్లయితే, ప్రమాదాలు తీవ్రంగా పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నాయి. ఆ పదార్థాన్ని సురక్షితంగా అంచనా వేయడానికి మరియు వెలికితీయడానికి రిమోట్-ఆపరేటెడ్ పరికరాలు మరియు రోబోట్లతో సహా ప్రత్యేక పరికరాలు అవసరం కావచ్చు. దీనికి భారీగా ఖర్చు అవుతుంది. అలాంటి పరిస్థితులలో కార్యకలాపాలకు వారాలు పడుతుంది. దెబ్బతిన్న, దాడి అనంతర వాతావరణంలో, కాలపరిమితులు అనిశ్చితంగా మారతాయి. దాన్ని బయటకు తరలించడం సులభం కాదు. ఇక, అణ్వాయుధ పదార్థాల రవాణా ఒక సున్నితమైన పని. సంఘర్షణలతో కూడిన ప్రాంతం నుండి దీన్ని చేయడం ప్రమాదాన్ని మరింత పెంచుతుంది.ÚLTIMA HORA: Un periodista iraní afirma que se registraron nuevas explosiones en una instalación subterránea de almacenamiento de misiles en Isfahán (Irán), previamente atacada por EE.UU. antes del alto el fuego, con ondas expansivas sentidas en la zona.pic.twitter.com/RqZxZGZJL6— Isaac (@isaacrrr7) April 20, 20261990లలో కజకిస్తాన్ నుండి ఆయుధ సామగ్రిగా ఉపయోగపడే యురేనియంను తొలగించడంతో సహా, గతంలో అమెరికా చేపట్టిన మిషన్లు నియంత్రిత వాతావరణంలో జరిగాయి. అయితే, ఇరాన్ విషయంలో పరిస్థితి మరింత సంక్లిష్టంగా ఉంది. భద్రత, విమాన రవాణా ఏర్పాట్లు వంటివి చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకోవాలి.యురేనియం ఎక్కడికి పంపాలి?అయితే, శుద్ది చేసిన యురేనియాన్ని యునైటెడ్ స్టేట్స్కు పంపడాన్ని ఇరాన్ వ్యతిరేకించింది. చర్చలో ఉన్న ప్రత్యామ్నాయాలలో రష్యా లేదా కజకిస్తాన్‌లో సౌకర్యాలు ఉన్నాయి. అక్కడ ఆ పదార్థాన్ని పలుచగా చేసి అంతర్జాతీయ పర్యవేక్షణలో నిల్వ చేయవచ్చు. ఒకవేళ ఇరాన్ బదిలీకి అంగీకరించినప్పటికీ, ధృవీకరణ చాలా కీలకం. కొంత పదార్థం దాచడం లేదా ధ్వంసం చేసే అవకాశాలు ఉన్నాయని అమెరికా అధికారులు ఆందోళన చెందుతున్నారు. యురేనియం తరలించబడిందా లేక ఉన్నచోట ఉందా అని నిర్ధారించడానికి పర్యావరణ తనిఖీలతో సహా, ఏ ఒప్పందానికైనా లోతైన తనిఖీలు అవసరం కావచ్చు.ఇరాన్ వద్ద 440 కిలోల యురేనియం..అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (ఐఏఈఏ) గణాంకాల ప్రకారం.. 2025 జూన్‌లో అమెరికా దాడులకు ముందు ఇరాన్ వద్ద 60 శాతం సుసంపన్నమైన యురేనియం సుమారు 440 కిలోల వరకు ఉంది. అణుబాంబు తయారీకి అవసరమైన 90 శాతానికి ఇది చాలా దగ్గరగా ఉండటం గమనార్హం. ప్రస్తుతం ఈ నిల్వల భవితవ్యంపై సందిగ్ధత కొనసాగుతోంది. ఎందుకంటే దాడులకు గురైన ప్రాంతాల్లో తనిఖీలకు ఐఏఈఏ ఇన్స్పెక్టర్లను ఇరాన్ అనుమతించడం లేదు.యురేనియం శుద్ధి ఇలా.. శుద్ధి యురేనియం.. సాధారణంగా యురేనియం శుద్ధి 3–5 శాతం వరకు చేస్తే అది విద్యుత్ ఉత్పత్తి కోసం ఉపయోగపడుతుంది. కానీ ఇరాన్ ఏకంగా 20 శాతం పైగా శుద్ధి చేస్తోందని(60 శాతం దాకా చేసిందని కూడా!).. ఇది అణు ఆయుధాల తయారీకి దగ్గర స్థాయిలో ఉందని అమెరికా ఆరోపణ. ఇరాన్ మాత్రం ఇదంతా వైద్య పరిశోధన, అణు శక్తి ఉత్పత్తి కోసం మాత్రమే అని చెబుతోంది. 2015లో కుదిరిన Joint Comprehensive Plan of Action (JCPOA) ప్రకారం.. ఇరాన్ యురేనియం శుద్ధి 3.67% వరకు మాత్రమే పరిమితం చేయాలి. అలా చేస్తే ఇరాన్ మీద ఆర్థిక ఆంక్షలను తొలగిస్తామని అమెరికా పేర్కొంది. అయితే.. 2018లో ట్రంప్ అధికారంలో ఉన్నప్పుడు ఈ ఒప్పందం నుంచి అగ్రరాజ్యం తప్పుకుంది. తమ దేశ జాతీయ భద్రతా ప్రయోజనాలను ఈ డీల్ కాపాడలేదని.. పైగా ఇరాన్‌కు ఆర్థిక లాభాలు కట్టబెట్టిందని ఆయన ఆ టైంలో ఆరోపించారు. ఒప్పందం తొలగిపోవడంతో ఇరాన్ మళ్లీ తన అణు కార్యక్రమాన్ని వేగవంతం చేసింది. అదే విషయంలో ట్రంప్ ఇప్పుడు కొత్త డీల్ కుదుర్చుకునేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఇరాన్ అణు కార్యక్రమాన్ని నిలిపివేయడం మిడిల్ ఈస్ట్ భద్రతకు కీలకమని అంటున్నారు.అయితే, కజకిస్తాన్ (1994), లిబియా (2003) యురేనియం/అణు పదార్థాల తొలగింపు ఆపరేషన్లు విజయవంతంగా జరిగాయి. కానీ ఇరాన్ పరిస్థితి వాటితో పోలిస్తే చాలా క్లిష్టమైనది. యురేనియం తరలింపునకు కజకిస్తాన్, లిబియా ప్రభుత్వాలు సహకరించాయి. ఇరాన్ మాత్రం ప్రతిఘటనతో, భూగర్భ సదుపాయాల్లో పదార్థాన్ని దాచిపెట్టింది.కజకిస్తాన్ – Project Sapphire (1994)స్థితి: సోవియట్ యుగం తర్వాత 600 కిలోల weapons-grade HEU (Highly Enriched Uranium) ఉల్బా మెటలర్జికల్ ప్లాంట్‌లో నిల్వ.ఆపరేషన్: అమెరికా–కజకిస్తాన్ రహస్య సహకారంతో 31 నిపుణుల బృందం 6 వారాల పాటు పని చేసి, 1032 కంటైనర్లలో ఉన్న యురేనియాన్ని 448 సురక్షిత కంటైనర్లలో ప్యాక్ చేసింది.తరలింపు: 3 C-5 విమానాల ద్వారా Oak Ridge (USA)కి తరలించి, IAEA పర్యవేక్షణలో low-enriched uranium గా మార్చారు.ప్రధాన అంశం: కజకిస్తాన్ ప్రభుత్వం పూర్తిగా సహకరించింది, అందువల్ల ఆపరేషన్ సురక్షితంగా, రహస్యంగా పూర్తయింది.లిబియా – Disarmament (2003–2004)స్థితి: గడాఫీ పాలనలో అణు, రసాయన, జీవ రసాయన ఆయుధాల ప్రోగ్రామ్‌లు కొనసాగాయి.తీర్మానం: 2003 డిసెంబర్ 19న గడాఫీ స్వచ్ఛందంగా WMD ప్రోగ్రామ్‌లను నిలిపివేస్తానని ప్రకటించాడు.ఆపరేషన్: అమెరికా, యుకే, IAEA పరిశీలకులు కలిసి యురేనియం సదుపాయాలు, సెంట్రిఫ్యూజ్‌లు, రసాయన ఆయుధాలను తొలగించారు.ప్రధాన అంశం: లిబియా అంతర్జాతీయ ఒత్తిడి, ఆంక్షలు, ఇరాక్ యుద్ధం తర్వాత సంబంధాలను మెరుగుపరచుకోవడానికి స్వచ్ఛందంగా సహకరించింది. -
గల్ఫ్ దేశాలకు ఇరాన్ వార్నింగ్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుతం ఇరాన్‌తో శాంతి చర్చలు కోసం తపిస్తున్నారు. యుద్ధాన్ని ప్రారంభించిన ట్రంప్ ఎలాగైనా దానిని ముగించే దిశగా పావులు కదుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇరాన్ సీజ్ఫైర్ని మరోసారి పొడిగిస్తూ ప్రకటన చేశారు. ఇరాన్‌తో ఏకీకృత ఒప్పందం వచ్చే వరకూ కాల్పుల విరమణ కొనసాగుతుందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఇరాన్ రివెల్యూషనరీ గార్డ్స్ మరోసారి గల్ఫ్ దేశాలకు వార్నింగ్ ఇచ్చింది. తమ దేశంపై దాడి చేయడానికి అమెరికాకు సహకరిస్తే చమురు ఉత్పత్తి లేకుండా చేస్తామని వార్నింగ్ ఇచ్చింది.ఇరాన్- అమెరికా యుద్ధం ప్రారంభమై దాదాపు 50 రోజులు గడుస్తోంది. ప్రస్తుతం ఇరు దేశాలు సీజ్ఫైర్ ఒప్పందాన్ని పాటిస్తున్నాయి. అయితే ఈ యుద్ధం గల్ఫ్ దేశాల పాలిట శాపంగా మారింది. అమెరికా ఎయిర్‌బేస్‌లకు సహకరిస్తున్నారని నెపంతో ఇరాన్ గల్ఫ్ దేశాల టార్గెట్‌గా దాడులు జరిపింది. అయితే ప్రస్తుతం సీజ్ఫైర్ నడుస్తున్న నేపథ్యంలో అమెరికా గల్ఫ్ దేశాల్లోని తన స్థావరాలను మరింత బలోపేతం చేస్తుందేమోనని ఇరాన్ అనుమానిస్తోంది. దీంతో ఆ దేశాలకు నేరుగా వార్నింగ్ ఇచ్చింది.ఇరాన్ రెవెల్యూషనరీ గార్డ్స్ ఓ ప్రకటనలో "ఇరాన్ దేశంపై దాడి చేయడానికి శత్రువుల పక్కన చేరి దేశ భూభాగాన్ని, సౌకర్యాలని వారు ఉపయోగించుకునేలా సహకరిస్తే దక్షిణ పొరుగు దేశాలు చమురు ఉత్పత్తికి వీడ్కోలు చెప్పాల్సి ఉంటుందని తెలుసుకోవాలి " అని గార్డ్స్ ఏరోస్పేస్ ఫోర్స్ కమాండర్ మజీద్ మౌసావి పేర్కొన్నట్లు ఇరాన్ మీడియా కథనాలు ప్రచురితమయ్యాయి.అయితే ఇది వరకూ యుద్ధంలో ఇరాన్ ప్రధానంగా గల్ఫ్ దేశాల్లోని ఆయిల్ స్థావరాలే లక్షంగా దాడి చేసింది. సౌదీ అరేబియా, యూఏఈ (UAE), కువైట్, బహ్రెయిన్, ఖతార్‌లలోని చమురు నిల్వ ఉంచిన డిపోలు, రిఫైనరీలు, మరియు గ్యాస్ ఫెసిలిటీలపై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకపడింది. ఈ నేపథ్యంలో మరోసారి వార్నింగ్ ఇచ్చింది. -
ఈ 8 మంది అమ్మాయిలను వదిలేయండి: ట్రంప్
వాషింగ్టన్ డీసీ: ఇరాన్‌ను ఇన్నాళ్లుగా హెచ్చరిస్తూ వస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం సాయంత్రం మాత్రం ఆ దేశాన్ని ఓ కోరిక కోరారు. ఇరాన్ ఎనిమిది మంది మహిళలకు మరణశిక్ష అమలు చేయడానికి సిద్ధమవుతోందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వారిని విడుదల చేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోరారు.ఇలా చేస్తే ఇరు దేశాల మధ్య చర్చలకు గొప్ప ఆరంభం అవుతుందని ట్రంప్ చెప్పారు. ఇరాన్-అమెరికా మధ్య పాకిస్థాన్‌లో జరగాల్సిన చర్చలు అనిశ్చితిలో ఉన్న సమయంలో.. సైనిక చర్యకు అమెరికా సిద్ధంగా ఉందని ట్రంప్ హెచ్చరించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఒక్కసారిగా ట్రంప్ చాలా కూల్‌గా విజ్ఞప్తి చేస్తూ ట్రూత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.‘నా ప్రతినిధులతో త్వరలో చర్చల్లో పాల్గొనబోయే ఇరాన్ నాయకులకు చెబుతున్నాను. ఈ మహిళలను విడుదల చేస్తే నేను ఎంతో కృతజ్ఞతగా భావిస్తాను. మీరు తీసుకున్న ఆ నిర్ణయాన్ని ఆ మహిళలు గౌరవంగా భావిస్తారు, దానికి విలువ ఇస్తారన్న నమ్మకం ఉంది. దయచేసి వారికి ఎలాంటి హాని చేయవద్దు. ఇది మా చర్చలకు గొప్ప ఆరంభం అవుతుంది. ఈ విషయంపై మీరు చూపిన శ్రద్ధకు ధన్యవాదాలు’ అని ట్రంప్ పేర్కొన్నారు.కాగా, ఎక్స్‌లో ఒకరు ఆ ఎనిమిది మంది మహిళల ఫొటోలను పోస్ట్ చేశారు. ‘ఈ ఎనిమిది మంది మహిళలను ఉరితీయాలని ఇస్లామిక్ రిపబ్లిక్ సన్నాహాలు చేసుకుంటోంది. అంతర్జాతీయ సమాజం నుంచి, మానవ హక్కుల సంస్థలవారిమని చెప్పుకునే వారి నుంచి దీనిపై ఒక్క మాట కూడా రావడం లేదు’ అని అన్నారు. ఈ పోస్టుపైనే ట్రంప్ స్పందించారు.కాగా, ఇరాన్-అమెరికా మధ్య రెండో దశ చర్చలు ఇప్పటికే జరగాల్సి ఉండగా పాకిస్థాన్‌కు ఇరాన్ రాకపోవడంతో జరగలేదు. అసలు రెండో దశ చర్చలు జరుగుతాయా? అన్న సందిగ్ధత నెలకొంది. ఇరాన్-అమెరికా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం బుధవారం రాత్రిలో ముగియనుంది. ఆ తర్వాత మళ్లీ యుద్ధం జరుగుతుందా? అన్న భయాలు నెలకొన్నాయి. -
మరోసారి ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
వాషింగ్టన్ : ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ఒప్పందం మరికొన్ని గంటల్లో ముగియనుంది. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాల్పుల విరమణను పొడిగించేది లేదని ఇరాన్‌కు వార్నింగ్ ఇచ్చారు. హర్మూజ్ దిగ్బంధంతో ఇప్పటికే విజయం సాధించాం. అద్భుతమైన డీల్‌తో చర్చలకు ముగింపు పలుకుతాం’అని అన్నారు. ముందస్తు ప్రకటించినట్లు ఏప్రిల్ 22తో ఇరాన్‌పై అమెరికా కాల్పుల విమరణ ఒప్పందం ముగియనుంది. ఈ క్రమంలో ట్రంప్ సీఎన్‌బీసీ ఇంటర్వ్యూ ఇచ్చారు.ఈ ఇంటర్వ్యూలో ఇరాన్‌తో ఒప్పందం విజయవంతంగా ముగిస్తాం. పశ్చిమాసియా యుద్ధ చర్చల్లో అమెరికా స్థానం బలంగా ఉంది. ప్రస్తుతం కొనసాగుతున్న కాల్పుల విరమణ ఒప్పందం పొడిగించే అవకాశం లేదు. అమెరికా తన వ్యూహాత్మక ప్రయోజనాలను కాపాడుకునే దిశగా అమెరికా కాల్పుల విమరణ ధైర్యంగా తీసుకున్న నిర్ణయం. పొడిగింపులు అమెరికా ప్రయోజనాలకు విరుద్ధంగా ఉంటాయి. ఈ నిర్ణయం అమెరికా తన చర్చా శక్తిని తగ్గించకుండా, ప్రత్యర్థులపై ఒత్తిడి కొనసాగించడానికి తీసుకున్నదని ఆయన సూచించారు.మేము చివరికి ఒక గొప్ప ఒప్పందాన్ని సాధిస్తాం. అమెరికా భవిష్యత్తు చర్చలు విజయవంతంగా ముగుస్తాయని, దేశానికి లాభదాయకమైన ఫలితాలు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. -
వాహనదారులకు అలెర్ట్.. పెట్రోల్‌కి గుడ్‌బై?
ఢిల్లీ: వాహనదారులకు అలెర్ట్. పశ్చిమాసియా యుద్ధం కారణంగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. త్వరలో కేంద్రం పెట్రోల్‌లో ఇథనాల్ కలిపి అమ్మకాలు నిర్వహించేలా డ్రాఫ్ట్ బిల్లు (ప్రతిపాదిత చట్టం) సిద్ధం చేసినట్లు సమాచారం. అయితే, ఆ డ్రాఫ్ట్ బిల్లులో గతంలో చెప్పినట్లుగా పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్‌ను కలిపి అమ్మకాలు నిర్వహించేలా కాకుండా.. 85శాతం ఇథనాల్.. 15శాతం పెట్రోల్ మాత్రమే వాహనాల్లో వినియోగించేలా కేంద్రం ప్రతిపాదనలు చేసినట్లు సమాచారం. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఇంధన సంక్షోభం తలెత్తింది. భారత్ తన ఇంధన అవసరాల కోసం దాదాపు 90శాతం విదేశాల నుంచి ఎక్కువగా గల్ఫ్ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. రానున్న రోజుల్లో చమురు దిగుమతులు తగ్గించుకునేలా ప్రయత్నాలు ప్రారంభించిందిఇదే అంశంపై పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖకు సంబంధం ఉన్న సీనియర్ ప్రభుత్వ అధికారులు జాతీయ మీడియాతో మాట్లాడారు. త్వరలోనే ప్రభుత్వం ఇథనాల్ 85 (ఈ85) అంశాన్ని డ్రాఫ్ట్ రూపంలో ప్రజాభిప్రాయ సేకరణ కోసం అందుబాటులోకి తేనున్నట్లు చెప్పారు. అంతేకాదు ఇథనాల్ 85పై ఇటు ప్రభుత్వంలో అటు మార్కెట్లో సైతం ఏకాభిప్రాయం ఉంది ప్రాథమిక పరీక్షలు నిర్వహించినట్లు వెల్లడించారు. ఈ85 కోసం ఇంజన్లో కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది. మార్కెట్లో విడుదలయ్యేందుకు రెండేళ్ల సమయం పడుతుందని అంచనా. మరో అధికారి మాట్లాడుతూ..ఆటోమొబైల్ ఇండస్ట్రీ వర్గాలు సైతం 15శాతం పెట్రోల్,85శాతం ఇథనాలు కలిపి అమ్మకాలు నిర్వహించేలా ప్రభుత్వం ప్రవేశ పెట్టనున్న డ్రాఫ్ట్ బిల్లుపై అంగీకారం తెలిపాయని,త్వరలో అధికారిక ప్రకటన చేస్తాయన్న ఆయన.. ‘మార్కెట్ ఏకాభిప్రాయం ఇప్పటికే కుదిరింది. ఈ85 కోసం వాహనాల ప్రాథమిక పరీక్షలు కూడా పూర్తయ్యాయి’అని చెప్పారు. ప్రస్తుతం ఉన్న ఈ20 పెట్రోల్‌కు భిన్నంగా, ఈ85ను ఒక ప్రత్యేక ఇంధన గ్రేడ్‌గా ప్రవేశపెట్టనున్నట్లు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఈ20 వేరియంట్లో ఇథనాల్ మిశ్రమాన్ని 27శాతం వరకు కలపవచ్చు. ఇంధన సంక్షోభం మధ్య కేంద్రం తీసుకుంటున్న ఈ నిర్ణయం దేశానికి కీలక మలుపు కానుంది. పెట్రోల్‌పై ఆధారాన్ని తగ్గించి, దేశీయంగా ఉత్పత్తి అయ్యే ఇథనాల్ వినియోగాన్ని పెంచడం ద్వారా రైతులకు మద్దతు లభించనుంది. పర్యావరణానికి ప్రయోజనం కలిగించడమే కాకుండా, చమురు దిగుమతులపై ఆధారాన్ని తగ్గించడం ద్వారా ఆర్థిక వ్యవస్థకు ఊరటనిచ్చే అవకాశం ఉంది. అయితే, కొత్త ఇంజిన్లు, మౌలిక సదుపాయాలు, వినియోగదారుల అవగాహన వంటి సవాళ్లను అధిగమించాల్సి ఉంటుంది. ఈ85 ప్రవేశం భారత ఇంధన రంగంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలకనుంది. -
పాకిస్థాన్‌కు ట్రంప్..? యుద్ధం ముగిసేనా..!
ఇరాన్ అమెరికా మధ్య చర్చల విషయంలో ప్రస్తుతం తీవ్ర ప్రతిష్టంభన నడుస్తోంది. ఇరాన్ చర్చలకు ససేమిరా అనడంలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ నేరుగా రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ఇస్లామాబాద్‌లో జరిగే రెండో విడత చర్చలకు ట్రంప్ స్వయంగా పాల్గొనే అవకాశం ఉందని రాయిటర్స్ కథనం పేర్కొంది.ఇటీవల పాకిస్థాన్ ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ మధ్య తొలివిడత చర్చలు జరిగాయి. అయితే ఇరు దేశాల మధ్య ఎటువంటి అంగీకారం కుదరకపోవడంతో ఎటువంటి ఒప్పందం లేకుండానే భేటీ ముగిసింది. అయితే మరో దఫా చర్చల కోసం అమెరికా ప్రయత్నిస్తుండగా ఇరాన్ మాత్రం అంగీకరించట్లేదు. యుఎస్ఏ పెట్టే డిమాండ్లకు ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించేది లేదని తేల్చిచెప్పింది.ఈ నేపథ్యంలో అమెరికా కీలక ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సారి జరిగే శాంతి చర్చలకు ట్రంప్ నేరుగా లేదా వర్చువల్‌గా పాల్గొనాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇరాన్‌తో రాయబారం కోసం ప్రయత్నిస్తున్నట్లు కీలక సమాచారం అందుతుంది. ఇరాన్ సైతం తొలుత చర్చలు జరపమని పట్టుబట్టినప్పటికీ ప్రస్తుతం సానూకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ట్రంప్ నేరుగా హాజరైతే చర్చల అంశం ఆశాజనకంగా ముగిసే అవకాశమున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. చర్చలు విఫలానికి కారణంట్రంప్.. ప్రధానంగా ఇరాన్ ఎట్టిపరిస్థితుల్లో అణ్వాయుధాలు తయారు చేయకూడదని, హర్ముజ్ దిగ్భందనం తొలగించాలని కోరుతున్నారు. అయితే దీనికి ఇరాన్ ఒప్పుకోవడం లేదు. మరోవైపు అమెరికా యుద్ధ పరిహారం చెల్లించాలని, ఇరాన్ మీద ఉన్న ఆంక్షలన్నీ ఎత్తివేయాలని విదేశాల్లో ఫ్రీజ్ చేసిన ఇరాన్ డబ్బులు చెల్లించాలని కోరుతుంది. ఈ డిమాండ్లకు అమెరికా ఒప్పుకోవడం లేదు. దీంతో రెండు దేశాల మధ్య చర్చల విషయంలో ప్రతిష్ఠంభన నెలకొంది.సెక్యూరిటీ నీడలో ఇస్లామాబాద్చర్చల జరిగే ఇస్లామాబాద్ ప్రాంతం ప్రస్తుతం సెక్యూరిటీ నీడలో ఉన్నట్లు తెలుస్తోంది. చర్చల కోసం పాకిస్థాన్ సుమారు 20,000 మంది భద్రతా సిబ్బందిని ఇస్లామాబాద్‌లో మోహరించింది. తొలిదశ చర్చల సమయంలో సైతం ఇరాన్ అమెరికా ప్రతినిధులకు ప్రత్యేక భద్రత ఏర్పాటు చేశారు. -
హర్ముజ్ తొలిసారిగా జిన్‌పింగ్ స్పందన
ప్రస్తుతం హర్ముజ్ విషయంలో తీవ్ర ప్రతిష్టంభన నడుస్తోంది. అమెరికా, ఇరాన్ రెండు దేశాలు పట్టు వదలకుండా భీష్మించుకొని కూర్చువడంతో తీవ్ర ఉద్రిక్తకర పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ స్పందించారు. హర్ముజ్ జలసంధిలో రవాణాను పునరుద్ధరించాలని ఇరు దేశాలు యుద్ధాన్ని వీడి శాంతి బాట పట్టాలని హితవు పలికారు.ప్రస్తుతం యుద్ధం విషయంలో చైనాపై అమెరికా అనుమానం వ్యక్తం చేస్తోంది. యూఎస్ఏ నిఘా ఏజెన్సీలు ఇరాన్‌కు చైనా ఆయుధాల తరలింపు చేస్తోందని సమాచారం అందించాయి. వాటిలోనూ మ్యాన్‌పాడ్ (భుజంపై మోసుకెళ్లగలిగే ఆయుధాలు) తరలింపు చేపడుతుందని వీటితోనే అమెరికా క్షిపణులపై ఇరాన్ దాడి చేయగలిగిందని పేర్కొన్నాయి. అయితే దీనిని చైనా ఖండించింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఆ దేశ అధ్యక్షుడు జిన్‌పింగ్ తొలిసారిగా హర్ముజ్ విషయంలో స్పందించారు.ఈ మేరకు సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్‌తో ఫోన్లో మాట్లాడారు. ఫోన్లో సంభాషించారు. ఇరు దేశాలు శాంతి కోసం వివాదాలను, రాజకీయ మరియు దౌత్య మార్గాల్లో పరిష్కరించుకోవాలని, తక్షణమే సమగ్ర కాల్పుల విరమణ జరగాలని జిన్‌పింగ్ కోరినట్లు బీజింగ్ కథనాలు వెల్లడించాయి. హర్ముజ్ జలసంధి తెరిచి ఉండటం అంతర్జాతీయ సమాజంతో పాటు ఎంతో ప్రయోజనకరమని కోరినట్లు తెలుస్తోంది.ఈనేపథ్యంలో జిన్‌పింగ్ మధ్యప్రాచ్య కీలక సూచన చేసినట్లు తెలుస్తోంది. మధ్యప్రాచ్య దేశాలు తమ భవిష్యత్తును తామే నిర్ణయించుకోవాలని జిన్‌పింగ్ అన్నట్లు తెలుస్తోంది. దీంతో పరోక్షంగా భద్రత కోసం అమెరికాపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలనే సూచించినట్లుగా సమాచారం. అయితే యుద్ధం ప్రారంభమై దాదాపు 50 రోజులు గడుస్తోంది. ఈ నేపథ్యంలో చైనా అధ్యక్షుడు స్పందించడం ఇదే తొలిసారి. ప్రపంచంలోనే అత్యధికంగా సహజ వాయువును (LNG) దిగుమతి చేసుకునే చైనాకు ఈ జలసంధి అత్యంత కీలకం.హర్ముజ్ చైనాకు కీలకంఅయితే ప్రపంచంలోనే చైనా అతిపెద్ద చమురు దిగుమతిదారుగా ఉంది. తన చమురుఅవసరాల్లో దాదాపు 70 శాతం దిగుమతులు ద్వారానే సమకూర్చుకుంటుంది. దిగుమతుల్లో రష్యా తొలిస్థానంలో ఉండగా తదుపరి సౌదీ అరేబియా ఉంది. అయితే యుద్ధం కారణంగా మార్చి నెలలో ఆ ప్రాంతానికి చైనా ఎగుమతులు 43 శాతం పడిపోయాయని కథనాలు పేర్కొన్నాయి. -
ఇరాన్‌కు సీక్రెట్ సాయం.. చైనా దొరికిపోయిందా?
ఇరాన్, అమెరికా మధ్య ఉద్రికత్తల వేళ పలు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. యుద్ధంలో ఇరాన్‌కు చైనా సాయం చేస్తున్నట్టు ఇప్పటికే వార్తలు బయటకు వచ్చాయి. ఇలాంటి తరుణంలో అమెరికా రిపబ్లికన్ పార్టీకి చెందిన భారతీయ మూలాల నాయకురాలు నిక్కీ హేలీ దీనికి సంబంధించిన విషయాన్ని బహిర్గతం చేశారు. దీంతో, చైనా అడ్డంగా బుక్కైనట్టు నీక్కి చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో చైనాను అమెరికా టార్గెట్ చేసే అవకాశం ఉంది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగే చాన్స్ ఉంది. పశ్చిమాసియా ఘర్షణల్లో చైనా ఇరాన్‌కు రహస్యంగా సాయం చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. చైనా టెహ్రాన్‌కు భారీగా ఆయుధాలు సరఫరా చేస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. మనిషి భుజం మీద పెట్టుకొని క్షిపణులను ప్రయోగించే షార్ట్ రేంజ్ మిసైల్ లాంచర్లను, ఇతర క్షిపణి వ్యవస్థలను టెహ్రాన్‌కు సరఫరా చేయడానికి బీజింగ్ ప్రణాళిక రచిస్తున్నట్లు తెలిపాయి. తన పేరు బయటకు రాకుండా ఉండేందుకు చైనా ఈ ఆయుధాలను ఇతర దేశాల మీదుగా పంపుతున్నట్లు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో అమెరికాకు పట్టుబడిన ఇరాన్ నౌక టౌస్కా అనే కంటైనర్ చర్చనీయాంశంగా మారింది. ఈ ఆరోపణకు ఆజ్యం పోసింది.దొరికిపోయినట్టేనా? కాగా, ఇటీవలే అమెరికా నౌకాదళం హార్మూజ్ సముద్ర మార్గంలో ఇరాన్ జెండాతో ప్రయాణిస్తున్న Touska అనే కంటైనర్ నౌకను స్వాధీనం చేసుకుంది. ఈ నౌక ఇరాన్ షిప్పింగ్ లైన్స్ (IRISL)కు చెందినది. IRISLపై అమెరికా 2019లోనే ఆంక్షలు విధించింది. ఎందుకంటే ఇది ఇరాన్ క్షిపణి కార్యక్రమానికి అవసరమైన వస్తువులను తరలిస్తుందని ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో నిక్కీ హేలీ.. ఈ నౌక చైనా నుండి ఇరాన్‌కు వస్తూ, క్షిపణుల తయారీకి ఉపయోగించే రసాయన పదార్థాలను తీసుకెళ్తోందని ఆరోపించారు. నౌకలను ఆపాలని అమెరికా పదేపదే ఆదేశాలు ఇచ్చినా ఇరాన్ మాత్రం దీన్ని ఆపలేదు అంటూ వ్యాఖ్యానించారు. దీంతో, యుద్ధంలో ఇరాన్‌కు చైనా సహాయం చేస్తోంది అనే వెల్లడి అయ్యింది. ఇది విస్మరించలేని వాస్తవం’ అని ఆమె పేర్కొన్నారు.The ship the U.S. seized in the Strait of Hormuz this weekend was headed from China to Iran and is linked to chemical shipments for missiles. It refused repeated orders to stop. Another reminder that China is helping prop up Iran’s regime—a reality that can’t be ignored.— Nikki Haley (@NikkiHaley) April 20, 2026మరోవైపు.. నిక్కీ హేలీ ఆరోపణలపై ఇరాన్ గట్టిగానే సమాధానం ఇచ్చింది. నౌక విషయంలో అమెరికా చర్యను సాయుధ దోపిడీగా అభివర్ణించింది. ఆ నౌక చైనా నుంచి ప్రయాణిస్తోందని ఇరాన్ సైన్యం పేర్కొంది. ఈ సమయంలో అమెరికా బలగాలను తాము ఎదుర్కోవడానికి సిద్దంగా ఉన్నప్పటికీ నౌకలో సిబ్బంది కుటుంబ సభ్యులు ఉన్నందున తక్షణ ప్రతిస్పందన ఇవ్వలేకపోయామని తెలిపింది.ఇదిలా ఉండగా, ఆసియా నుంచి ప్రయాణం తర్వాత ఆ నౌక ద్వంద్వ ప్రయోజన వస్తువులను తీసుకువచ్చే అవకాశం ఉందని తమ ప్రాథమిక అంచనాలని అమెరికా భద్రతా వర్గాలు రాయిటర్స్ వార్తా సంస్థకు తెలిపాయి. ఆ నౌక గతంలో కూడా ద్వంద్వ ప్రయోజన వస్తువులుగా భావించే వాటిని రవాణా చేసిందని ఆ వర్గాల్లో ఒకరు తెలిపారు. అయితే, ఆ వస్తువుల వివరాలను మాత్రం ఆయా వర్గాలు వెల్లడించలేదు. అయితే, సైనిక, పారిశ్రామిక అవసరాలకు ఉపయోగపడే అవకాశం ఉన్న లోహాలు, పైపులు, ఎలక్ట్రానిక్ విడిభాగాలతో పాటు ఇతర వస్తువులను స్వాధీనం చేసుకునే అవకాశం ఉందని అమెరికా సెంట్రల్ కమాండ్ (సెంట్కామ్) పేర్కొంది. 🚨 HOLY CRAP! The Iranian-flagged ship Touska, which the US military seized yesterday, was in-bound from China “loaded with dual-use chemicals used to manufacture ballistic missiles,” per WPUS Marines are now searching 5,000 containers on board.No wonder they tried to run the… pic.twitter.com/Vjl5Z1ynLR— Nick Sortor (@nicksortor) April 21, 2026 చైనాకు కష్టమే.. మొత్తంగా Touska నౌక స్వాధీనం అమెరికా–ఇరాన్–చైనా మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచింది. ఇది హార్మూజ్ సముద్ర మార్గం ఎంత సున్నితమైన జియోపాలిటికల్ ప్రాంతమో మరోసారి చూపించింది. దీంతో, చైనా–అమెరికా సంబంధాలపై దీర్ఘకాలిక ప్రభావం చూపే అవకాశం ఉంది. అమెరికా ఆంక్షలు కఠినతరం కావడం, చైనా–ఇరాన్ వాణిజ్యం అంతర్జాతీయ పరిశీలనకు గురవడం వల్ల రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. అమెరికా చైనాపై మరిన్ని ఆంక్షలు లేదా వాణిజ్య పరిమితులు విధించే అవకాశం ఉంది. ఇది చైనా–అమెరికా మధ్య ఉన్న ట్రేడ్ వార్‌ను మరింత కఠినతరం చేస్తుంది. -
హర్ముజ్ వద్ద అమెరికా బలగాల వార్నింగ్
ప్రస్తుతం హర్ముజ్ జలసంధిని అమెరికా బ్లాకేడ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హర్ముజ్ జలసంధిని దాటడానికి ప్రయత్నిస్తున్న ఓ నౌకకు యుఎస్ ఎయిర్‌ఫోర్స్ సిబ్బంది హెచ్చరించారు. ఇది అమెరికా దిగ్భందనమని వెనక్కి వెళ్లకపోతే తీవ్రపరిణామాలుంటాయన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.హర్ముజ్ జలసంధి విషయంలో ఇరాన్- అమెరికా మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఓవైపేమో అమెరికా హర్ముజ్‌ను బ్లాకేడ్ చేయగా మరోవైపు ఇరాన్ సైతం జలసంధిని మరోసారి మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో జలసంధి గుండా వెళ్లే నౌకలను అడ్డుకుంటుంది. ఈ మేరకు దీనికి సంబంధించిన వీడియోని యుఎస్ సెంట్రల్ కమాండ్ ఎక్స్ వేదికగా షేర్ చేసింది.యూఎస్ గస్తీ హెలికాప్టర్‌లోని సిబ్బంది ఈ మేరకు హెచ్చరికలు జారీ చేశారు. " ఇది యునైటెడ్ స్టేట్స్ వార్‌షిప్ 115. మీరు యుఎస్ బ్లాకేడ్ చేసిన ప్రాంతంలోకి ప్రవేశిస్తున్నారు. ఈ బ్లాకేడ్ ఇరాన్ పోర్టులకు అన్నిటికీ వర్తిస్తుంది. ఇది షిప్పైన ఉన్న అన్ని జెండాలకు వర్తిస్తుంది. అని హెచ్చరించారు.. ఈ దిగ్బంధనం ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకు సుమారు 27 నౌకలను అమెరికా దళాలు వెనక్కి పంపించాయి. అంతర్జాతీయ చట్టాల ప్రకారం ప్రతి నౌకను తనిఖీ చేసే అధికారం తమకు ఉందని, నిబంధనలు ఉల్లంఘిస్తే బలప్రయోగం చేస్తామని అమెరికా హెచ్చరించింది.అయితే ఇటీవల అమెరికా 'టౌస్కా' అనే ఇరాన్ కంటైనర్ నౌకను స్వాధీనం చేసుకుంది. దీనిని ఇరాన్ తీవ్రంగా ఖండించింది. ఇది సముద్రపు దొంగతనమని అమెరికా దళాలు అంతర్జాతీయ నియమాలను ఉల్లంఘించాయని ఆరోపించింది. తమ వాణిజ్య నౌకపై జరిగిన ఈ దాడికి త్వరలోనే ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ సైన్యం హెచ్చరించింది.కాగా ఇరు దేశాల మధ్య మరోసారి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికా మరో దఫా శాంతిచర్చలకు రావాలని పట్టుబట్టడం ఇరాన్ దానిని తిరస్కరించడంతో మరోసారి ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి.Since the commencement of the blockade against ships entering or exiting Iranian ports and coastal areas, U.S. forces have directed 27 vessels to turn around or return to an Iranian port. pic.twitter.com/G8dl96wN4H— U.S. Central Command (@CENTCOM) April 20, 2026 -
24 గంటల్లో ప్రపంచ యుద్ధం మొదలవుతుంది కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు
-
ఇరాన్‌కు చైనా వెన్నుపోటు.. కారణం అదేనా?
ఇరాన్, అమెరికా యుద్ధంలో నేపథ్యంలో ప్రస్తుతం అన్ని దేశాల దృష్టి హార్మూజ్ జలసంధిపైనే ఉంది. జలసంధిని తెరిచి నౌకల రాకపోకలు జరగాలని వేయి కళ్లతో ఎదురుచూస్తున్నాయి. కానీ, ఇరాన్ మాత్రం.. హార్మూజ్ అంతర్జాతీయ జలమార్గం కాదని.. అది తమ భూభాగానికి చెందిన సముద్ర ప్రాంతమంటూ కొత్త పలుకు ఎత్తుకుంది. అందువల్ల నౌకలు వెళ్లడానికి ఇరాన్ అనుమతి అవసరమని, అలాగే టోల్ వసూలు చేసే హక్కు తమకు ఉందని వాదిస్తోంది. ఇలాంటి తరుణంలో మొట్టమొదటి సారిగా హార్మూజ్ అంశంపై ఇరాన్ మిత్ర దేశం చైనా స్పందించింది. ఇరాన్‌కు షాక్ ఇచ్చే విధంగా జిన్‌పింగ్ వ్యాఖ్యానించారు.హార్మూజ్‌పై ఇరాన్ వ్యాఖ్యల నేపథ్యంలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ తాజాగా స్పందించారు. ఈ సందర్భంగా జిన్‌పింగ్.. హర్మూజ్‌ను అంతర్జాతీయ జలమార్గంగా అభివర్ణించారు. హార్మూజ్ జలసంధిని సాధారణ రాకపోకలకు తెరిచి ఉంచాలి. వెంటనే జలసంధిని తెరవాలని ఇరాన్‌కు సూచించారు. ఇది ప్రాంతీయ దేశాలు, అంతర్జాతీయ సమాజ ఉమ్మడి ప్రయోజనాలకు అనుగుణంగా ఉంటుంది. తక్షణ, సమగ్ర కాల్పుల విరమణను చైనా సమర్థిస్తుందన్నారు. శాంతిని పునరుద్ధరించడానికి దోహదపడే అన్ని ప్రయత్నాలకు చైనా మద్దతు ఇస్తుంది. రాజకీయ, దౌత్య మార్గాల ద్వారా వివాదాలను పరిష్కరించుకోవాలని సూచిస్తోందని పేర్కొన్నారు. కాగా, ఇరాన్ ఓడరేవులను అమెరికా దిగ్బంధించడం, ఇరాన్ హార్మూజ్ జలసంధిని మూసివేసిన తర్వాత చైనా అధ్యక్షుడు తొలిసారిగా ప్రకటన చేయడం విశేషం.అయితే, హార్మూజ్ జలసంధి మూసివేత ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా ఆసియాలో తీవ్రమైన ఇంధన కొరతకు దారితీసింది. ప్రపంచ చమురు సరఫరాలో ఐదో వంతు ఈ మార్గం ద్వారానే జరుగుతుంది. ఈ క్రమంలోనే ఇరాన్ చమురును ప్రధానంగా దిగుమతి చేసుకునే చైనా, పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు సుదీర్ఘకాలం కొనసాగుతుందేమోనని ఆందోళన వ్యక్తం చేస్తోంది.నౌకపై దాడులు.. చైనా ఆందోళనమరోవైపు అమెరికా నావికా దిగ్బంధాన్ని ధిక్కరిస్తూ, చైనా నుంచి ఇరాన్ ఓడరేవుకు వెళ్తున్న ఒక సరకు రవాణా నౌకపై అమెరికా నేవీ కాల్పులు జరపడంపైనా చైనా ఆందోళన వ్యక్తం చేసింది. ఇరు దేశాలు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తాయని, కాల్పుల విరమణ ఒప్పందానికి కట్టుబడి ఉంటాయని, ఘర్షణలను రెచ్చగొట్టడం, ఉద్రిక్తతలను పెంచడం వంటివి మానుకుంటాయని భావిస్తున్నాం. అలాగే హార్మూజ్ జలసంధిలో సాధారణ నౌకాయానాన్ని పునఃప్రారంభించడానికి అవసరమైన పరిస్థితులను కల్పిస్తాయని మేము ఆశిస్తున్నాం’ అని పేర్కొంది.హార్మూజ్ మూసివేతతో చైనాకు నష్టాలు👉ఎనర్జీ సరఫరా అంతరాయం: చైనా క్రూడ్ ఆయిల్లో సుమారు 50% గల్ఫ్ దేశాల నుండి వస్తుంది. హార్మూజ్ మూసివేయడం లేదా దాడులు పెరిగితే, చైనాకు రోజుకు లక్షల బ్యారెల్స్ ఆయిల్ సరఫరా ఆగిపోతుంది.👉ఆర్థిక ప్రభావం: ఇంధన ధరలు పెరగడం వల్ల చైనా పరిశ్రమలు, రవాణా, విద్యుత్ ఉత్పత్తి ఖర్చులు పెరుగుతాయి. ఇది GDP వృద్ధిని మందగింపజేస్తుంది. చైనా ఆర్థిక వృద్ధి 0.5–1% వరకు తగ్గే అవకాశం ఉంది.👉వాణిజ్య నష్టం: ఇరాన్, గల్ఫ్ దేశాలతో చైనా వాణిజ్యం 40–50% వరకు తగ్గింది. ఇది చైనా ఎగుమతులు, దిగుమతులపై నేరుగా ప్రభావం చూపుతోంది. వాణిజ్యం తగ్గడం వల్ల చైనాకు బిలియన్ల డాలర్ల నష్టం జరుగుతుంది.👉జియోపాలిటికల్ ఒత్తిడి: అమెరికా-ఇరాన్ ఘర్షణల కారణంగా హార్మూజ్ అస్థిరత పెరిగింది. చైనా తన నౌకలు, వాణిజ్య మార్గాలను రక్షించుకోవడానికి అదనపు ఖర్చు పెట్టాలి.చైనా ప్రధాన ప్రత్యామ్నాయ మార్గాలు..1. పైప్లైన్లురష్యా–చైనా పైప్లైన్లు: సైబీరియా నుండి చైనాకు నేరుగా ఆయిల్, గ్యాస్ సరఫరా.మధ్య ఆసియా పైప్లైన్లు: కజకిస్తాన్, టుర్క్‌మెనిస్తాన్ నుండి గ్యాస్ సరఫరా. ఇవి హార్మూజ్ మీద ఆధారాన్ని తగ్గిస్తాయి.2. ఆర్కిటిక్ సముద్ర మార్గంరష్యా "నార్తర్న్ సీ రూట్" ద్వారా చైనాకు ఆయిల్, LNG సరఫరా పెరుగుతోంది. ఈ మార్గం హార్మూజ్, మలక్కా వంటి "చోక్పాయింట్"లను తప్పించగలదు.3. స్ట్రాటజిక్ రిజర్వులుచైనా వద్ద 90 రోజులకు సరిపడే ఆయిల్ రిజర్వులు ఉన్నాయి. హార్మూజ్ మూసివేత వంటి తక్షణ షాక్‌లను ఎదుర్కోవడానికి వీటిని ఉపయోగిస్తోంది.4. ఎనర్జీ డైవర్సిఫికేషన్పునరుత్పాదక శక్తి (సోలార్, విండ్)లో భారీ పెట్టుబడులు.సూపర్‌గ్రిడ్ ప్రాజెక్ట్: దేశీయ విద్యుత్ ఉత్పత్తి పెంచి, ఆయిల్ దిగుమతులపై ఆధారాన్ని తగ్గించడం వంటి చర్యలు తీసుకుంటోంది. -
ట్రంప్ కొత్త రాగం.. మా కండీషన్ అదే..
వాషింగ్టన్: అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌పై అమెరికా అఖండ విజయం సాధించింది. ఇరాన్‌పై స్పష్టమైన ఆధిక్యంలో ఉన్నట్టు ట్రంప్ చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో టెహ్రాన్ తీవ్రంగా నష్టపోయిందని, బలహీనపడిందని అన్నారు. ఇరాన్‌పై అమలు చేస్తున్న ఆంక్షలు, సముద్ర నిర్బంధం కీలక పాత్ర పోషిస్తున్నాయని ట్రంప్ అభిప్రాయపడ్డారు.అధ్యక్షుడు ట్రంప్ సోషల్ మీడియా ట్రుత్ వేదికగా..‘యుద్ధంలో ఇరాన్‌పై మేము విజయం సాధించాం. ఇరాన్ సైనిక సామర్థ్యం గణనీయంగా తగ్గిపోయింది. ప్రస్తుతం పరిస్థితులు మాకు అనుకూలంగా ఉన్నాయి. అమెరికా దాడుల కారణంగా ఇరాన్ చాలా బలహీనపడింది. ఇరాన్ నౌకాదళం పూర్తిగా దెబ్బతింది. వైమానిక దళం కార్యకలాపాలు తగ్గాయి. రక్షణ వ్యవస్థలు కూడా బలహీనంగా మారాయి. అలాగే, ఆర్థిక పరంగా కూడా ఇరాన్ రోజుకు సుమారు 500 మిలియన్ డాలర్ల నష్టం చవిచూస్తోంది. ఈ పరిస్థితుల్లో ఇరాన్‌పై అమలు చేస్తున్న ఆంక్షలు, సముద్ర నిర్బంధం కీలక పాత్ర పోషిస్తున్నాయి’ అని వెల్లడించారు.ఇదే సమయంలో ఇరాన్ అణ్వాయుధాలను పూర్తిగా వదులుకోవాలి. ఇదే ప్రధాన షరతు అంటూ ట్రంప్ క్లారిటీ ఇచ్చారు. అవసరమైతే తాను కూడా ఇరాన్ నాయకులతో ప్రత్యక్షంగా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నానని ట్రంప్ వెల్లడించారు. అయితే, చర్చలు విఫలమైతే పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. ఒప్పందం కుదరకపోతే మాత్రం పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఇరాన్‌పై దాడులు తీవ్రంగా ఉంటాయని చెప్పుకొచ్చారు. అయితే, ఈ పరిస్థితిని కొన్ని మీడియా సంస్థలు తప్పుగా చూపుతున్నాయని కూడా ఆయన విమర్శించారు. కొన్ని ఫేక్ న్యూస్ మీడియా సంస్థలు దీనిని తప్పుగా చూపిస్తున్నాయి. ముఖ్యంగా ది న్యూయార్క్ టైమ్స్, ది వాల్ స్ట్రీట్ జర్నల్, ది వాషింగ్టన్ పోస్ట్ వంటి సంస్థలను ఆయన తీవ్రంగా విమర్శించారు.ఇదిలా ఉండగా.. అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరిన వేళ, ఇస్లామాబాద్ చర్చలు కీలక మలుపు తిప్పే అవకాశముంది. ఒకవైపు ట్రంప్ ధీమా వ్యక్తం చేస్తుండగా, మరోవైపు ఇరాన్ అనుమానాలు వ్యక్తం చేస్తుండటం పరిస్థితిని మరింత సంక్లిష్టంగా మార్చింది. ఈ చర్చల ఫలితం ఆధారంగా రాబోయే రోజుల్లో పరిస్థితి ఎలా మారుతుందో చూడాల్సి ఉంది. -
హార్మూజ్‌ను దాటిన 10 భారతీయ నౌకలు
న్యూఢిల్లీ: ఇప్పటిదాకా భారతీయ జెండాతో ఉన్న 10 సరకు రవాణా నౌకలు హార్మూజ్ జలసంధిని విజయవంతంగా దాటాయని విదేశాంగ శాఖ కార్యదర్శి రణ్«దీర్ జైశ్వాల్ వెల్లడించారు. ‘‘భారతీయ నౌక ‘దేశ్ గరిమా’విజయవంతంగా హార్మూజ్‌ను ఆదివారం దాటేసింది. దీంతో జలసంధిని దాటిన మన నౌకల సంఖ్య పదికి పెరిగింది. ముడి చమురుతో బయల్దేరిన ఈ నౌక త్వరలోనే ముంబై నౌకాశ్రయానికి చేరుకోనుంది. పర్షియన్ గల్ఫ్ జలాల్లో ఇంకా పలు నౌకలు భారత్ దిశగా వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి’’అని జైశ్వాల్ చెప్పారు. -
సందిగ్ధంలో చర్చలు!
టెహ్రాన్/వాషింగ్టన్/ఇస్లామాబాద్/దుబాయ్: తాత్కాలిక కాల్పుల విరమణ ప్రకటనతో పశ్చిమాసియాలో నివురుగప్పిన నిప్పులా ఉన్న ఇరాన్–అమెరికా యుద్ధంలో రెండో దశ శాంతి చర్చలు ముందుకుసాగడం ప్రశ్నార్థకంగా మారింది. తమ అ«దీనంలో ఉన్న హార్మూజ్ జలసంధిని అమెరికా హఠాత్తుగా దిగ్బంధించడంతో ఇప్పటికే గుర్రుమీదున్న ఇరాన్ ఆదివారం తమ వాణిజ్య నౌకపై అగ్రరాజ్య నావికాదళం దాడిచేసి స్వాధీనం చేసుకోవడంతో పట్టరాని ఆవేశంతో ఊగిపోతోంది. దీంతో అమెరికాతో రెండో దఫా చర్చలకు కూర్చునేదేలేదని తెగేసి చెప్పింది. ‘‘రెండువారాల కాల్పుల విరమణను అమెరికా ఉల్లంఘించింది. హార్మూజ్‌ను దిగ్బంధించింది. మా ‘తౌస్కా’ కార్గో నౌకపై దాడి చేసి స్వా«దీనంచేసుకుంది. అందుకే మా బృందాన్ని ఇస్లామాబాద్‌కు పంపట్లేదు. శుద్ధిచేసిన యురేనియంను అప్పగించడంపై ఏనాడూ అమెరికాతో చర్చించలేదు’’ అని ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బఘేల్ సోమవారం స్పష్టంచేశారు. దీంతో ఇప్పటికే రెండో దశ చర్చలకోసం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసిన పాకిస్తాన్ వెనువెంటనే రంగంలోకి దిగింది. అటు ఇరాన్‌ను బ్రతిమాలుతూనే హార్మూజ్ దిగ్బంధం, నౌకపై దాడి అంశాల్లో పట్టువిడుపులు ఉండాలని అమెరికాకు హితబోధ చేస్తోంది. చర్చల కోసం ఈజిప్ట్ సైతం ఇరాన్‌ను ఒప్పించేందుకు తన వంతు ప్రయత్నంచేస్తోంది. దీంతో చర్చలకు యత్నాలు ఏమేరకు ఫలిస్తాయో, అవి నేటి చర్చల్లో ఏ స్థాయిలో ప్రతిఫలిస్తాయో చూడాల్సిందే. హెచ్చరిక, దాడి, స్వా«దీనం.. హార్మూజ్ జలసంధిని దిగ్బంధించడంతోపాటు తమ నౌకాశ్రయాల మీదుగా ఏ ఒక్క నౌక బయల్దేరకుండా అడ్డుకుంటూ అమెరికా చేస్తున్న చేష్టలతో ఇరాన్‌కు చిర్రెత్తుకొస్తోంది. దీనికి తోడు ఆదివారం గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లో హార్మూజ్ దిశగా వస్తున్న 900 అడుగుల పొడవైన భారీ ఇరాన్ వాణిజ్య నౌక ‘తౌస్కా’ను అమెరికా ఆదివారం స్వా«దీనంచేసుకుంది. ఇరాన్‌లోని బందాస్ అబ్బాస్పోర్ట్కు వెళ్లేందుకు దుస్సాహసం చేయకుండా తక్షణం ఉన్నచోటే ఆగిపోవాలని తొలుత అమెరికా నావికాదళాలు హెచ్చరించాయి. దాదాపు ఆరుగంటలపాటు ఈ హెచ్చరికలు చేశారు. అయినా సరే తౌస్కా అలాగే ప్రయాణాన్ని కొనసాగించడంతో అమెరికా గైడెడ్ మిస్సైల్ విధ్వంసక నౌక ‘యూఎస్ఎస్ స్పుయెన్స్’ దాడిచేసింది. తౌస్కాలోని ఇంజిన్ రూమ్‌పైకి కాల్పులు జరిపింది. తర్వాత యూఎస్ఎస్ ట్రిపోలీ నౌక, హెలికాప్టర్లలో అమెరికా నావికాదళాలు ‘తౌస్కా’ను సమీపించి స్వాదీనం చేసుకున్నాయి. తమ నౌకను అమెరికా స్వాదీనం చేసుకుందన్న వార్త తెల్సి ఇరాన్ ప్రతిదాడికి దిగింది. ఒమన్ సముద్రంలో ఉన్న అమెరికా నౌకలపైకి డ్రోన్ల దండును పంపి దాడిచేసింది. గడువు పొడిగించబోను: ట్రంప్ తాత్కాలిక కాల్పుల విరమణ గడువును పొడిగించబోనని సోమవారం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పునరుద్ఘాటించారు. ఇరాన్ ప్రతినిధి బృందం ఇంకా పాకిస్తాన్‌కు రాని నేపథ్యంలో రెండో దఫా చర్చలపై సందిగ్ధం నెలకొన్న వేళ ట్రంప్ ఈ వ్యాఖ్యలుచేయడం గమనార్హం. ‘‘ అమెరికా కాలమానం ప్రకారం బుధవారం సాయంత్రంతో తాత్కాలిక కాల్పుల విరమణ గడువు ముగుస్తుంది. ఆలోపు ఇరాన్ మాతో శాంతిచర్చలు పూర్తిచేసి ఒప్పందం కుదుర్చుకోవాలి. గడువును పొడిగించడం అనేది దాదాపు అసాధ్యం. ఒప్పందం కుదరకపోతే దాడులు తథ్యం’’ అని ట్రంప్ అన్నారు. దీనిపై ఇరాన్ స్పందించింది. ‘‘అసంబద్ధ, అతి డిమాండ్లతో అమెరికా చర్చల ప్రక్రియను సంక్లిష్టంగా మార్చేసింది. అలాంటి అమెరికాతో మరోసారి చర్చలకు సిద్ధపడబోం. అమెరికా దౌత్యమోసానికి మేం బలికాబోం’’ అని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ వ్యాఖ్యానించారు. గడువు పొడిగించబోనని ట్రంప్ ప్రకటించిన కొద్దిసేపటికే పెజెష్కియాన్ మాట్లాడటం గమనార్హం. చర్చల కోసం అమెరికా బృందం మంగళవారం పాకిస్తాన్‌కు బయల్దేరే ఆస్కారముంది. ఈ విషయాన్ని అమెరికా అధికారులు ధృవీకరించలేదు. ఇరాన్, పాక్ మంతనాలు చర్చలకు ప్రతినిధి బృందాలను పంపాలని ఇరాన్‌ను పాక్ కోరింది. ఈ మేరకు సోమవారం ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీతో పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ మాట్లాడారు. చర్చల పర్వం మరింత మందుకు సాగాల్సిన ఆవశ్యకతను అరాఘ్చీకి ఇషాక్ వివరించారు. -
ఇరాన్ విదేశాంగ మంత్రికి పాక్ ఉప ప్రధాని ఫోన్!
అమెరికా, ఇరాన్ మధ్య రెండో విడత చర్చలపై అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో పాకిస్థాన్ ఉప ప్రధాని ఇషాఖ్ దర్ సోమవారం ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీతో ఫోన్లో మాట్లాడినట్లు తెలుస్తోంది. చర్చల కొనసాగింపుకు సంబంధించి కీలక విషయాలపై చర్చించారు. ఈ నేపథ్యంలో పాక్ విదేశాంగ మంత్రి కూడా అయిన దర్ టెలిఫోన్లో అరాఘ్చీతో మాట్లాడినట్లు పాక్ విదేశాంగ కార్యాలయం ఎక్స్ పోస్టులో తెలిపింది. ప్రాంతీయ శాంతి, సుస్థిరతను పెంపొందించేందుకు అన్ని పెండింగ్ సమస్యలను త్వరితంగా పరిష్కరించుకోవాలని, ఇందుకోసం చర్చలు ఎంతో అవసరమని దర్ పేర్కొన్నట్లు పాక్ తెలిపింది. అమెరికా, ఇరాన్ మధ్య రెండు వారాల కాల్పుల విరమణ బుధవారంతో ముగియనున్న నేపథ్యంలో ఉభయ దేశాల మధ్య రెండో విడత చర్చలపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ మంగళవారం ఈ చర్చలు ఇస్లామాబాద్‌లో జరుగుతాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇదివరకు ప్రకటించారు. ఇక ఇరాన్ రెండో విడత చర్చలకు నిరాకరించిన సమయంలో, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ బృందం ఇరాన్‌తో మలి విడత చర్చల కోసం పాక్‌కు వెళ్లలేదన్న సమాచారం చర్చనీయాంశమైంది. -
మలి విడత చర్చలు.. పాక్‌కు వెళ్లని జేడీ వాన్స్!
పశ్చిమాసియా సంక్షోభం మరింత ముదురుతోంది. రెండో విడత చర్చల కోసం పాక్‌కు వచ్చేది లేదని ఇరాన్ మొండికేసి కూర్చుంది. మరోవైపు అమెరికా ప్రతినిధులు మాత్రం ఇరాన్‌తో రెండో విడత చర్చల కోసం పాక్ రాజధాని ఇస్లామాబాద్‌కు చేరుకున్నట్లు వార్తలు వచ్చిన వేళ ఒక కీలక అప్డేట్ వెలుగులోకి వచ్చింది. ఇరాన్‌తో చర్చల నిమిత్తం అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇస్లామాబాద్‌కు వెళ్లలేదనే రాయిటర్స్ తమ కథనంలో పేర్కొంది. సోమవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌కు చెందిన కాన్వాయ్ వైట్‌హౌస్‌కు చేరుకోవడం ఈ విషయానికి మరింత బలం చేకూర్చినట్లయింది. బుధవారంతో ఇరాన్, అమెరికా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ముగియనుంది. ఇరు దేశాల మధ్య చర్చలు జరగాల్సి ఉన్న నేపథ్యంలో ఇప్పుడు జేడీ వాన్స్ అసలు పాక్‌కు వెళ్లలేదని వస్తున్న వార్తలతో మలి విడత చర్చలు జరగడం అనుమానమే. తొలి విడత చర్చలకు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, వైట్‌హౌస్ ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్, ట్రంంప్ అల్లుడు జారెడ్ కుష్నర్లు వెళ్లిన సంగతి తెలిసిందే. కానీ ఆ చర్చలు ఎటూ తేలకుండానే ముగిశాయి. మరోవైపు శాంతి చర్చలకు హాజరయ్యే విషయాన్ని తాము ఇంకా పరిశీలిస్తూనే ఉన్నామని, దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఇరాన్ అధికారి ఒకరు రాయిటర్స్‌కు పేర్కొన్నారు. -
చర్చల్లేవ్.. ‘కాల్పుల విరమణ‘ ముగుస్తోంది.. నెక్ట్స్ విధ్వంసమే?
టెహ్రాన్: ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధానికి చర్చలతో ముగింపు పలకాలని ప్రపంచ దేశాలు మొదటి నుంచి సూచిస్తున్నాయి. ఇప్పటికే పాకిస్థాన్‌లో మొదటి దశ చర్చలు జరిగి, అవి విఫలమయ్యాయి. సోమవారం రెండో దశ చర్చలు జరుగుతాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించినప్పటికీ నేడు చర్చలు జరగలేదు. ఇరాన్ చర్చలకు వెళ్లకపోవడమే ఇందుకు కారణం. మరోవైపు బుధవారం (ఏప్రిల్ 22)తో అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ముగియనుంది. మళ్లీ యుద్ధం మొదలైతే పరిస్థితులు అత్యంత భయానకంగా ఉంటాయి.సోమవారం చర్చలు జరుగుతాయని భావించడంతో ఇస్లామాబాద్‌లో భద్రతా చర్యలు కట్టుదిట్టం చేశారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఈ చర్చల్లో తమ ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించాల్సి ఉంది. ముందుగా ట్రంప్.. వాన్స్ హాజరు కావడంలేదని చెప్పినప్పటికీ చివరకు తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. వాన్స్ ఇస్లామాబాద్‌లో జరిగిన తొలి చర్చల రౌండ్‌కూ నాయకత్వం వహించిన విషయంతెలిసిందే. ఈ సారి అమెరికా ప్రతినిధి బృందంలో ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్, ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్ కూడా ఉన్నారు. అమెరికాతో తదుపరి దశ చర్చల రౌండ్‌పై ఎలాంటి ప్లాన్లూ లేవని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇప్పటికే స్పష్టం చేసింది. రెండో దశ చర్చలు జరగాలని అంతర్జాతీయ మధ్యవర్తులు చెప్పినప్పటికీ ఇరాన్ నుంచి ఈ ప్రకటన వచ్చింది.చర్చలు ఎందుకు జరగలేదు? ప్రస్తుత కాల్పుల విరమణ ఏప్రిల్ 22న ముగియనున్న నేపథ్యంలో చర్చలు జరగకపోవడం ఆందోళన కలిగించే అంశం. ప్రస్తుతం నెలకొన్న వాతావరణం చర్చలకు అనుకూలం కాదని ఇరాన్ అధికారులు అంటున్నారు. దేశ ప్రయోజనాలు, భద్రత కోసం ఏం చేయడానికైని సిద్ధంగా ఉన్నామని ఇరాన్ చెబుతోంది. అయితే, అమెరికన్లు తమ బెదిరింపు విధానంతో అధిక డిమాండ్లను సాధించుకునేందుకు చర్చల వేదికలను వాడుకుంటే కుదరదని హెచ్చరిచింది. అమెరికా నావికాదళ నిర్బంధం, అణు డిమాండ్లపై ఇరాన్ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. తమ డిమాండ్లపై అమెరికా వైపు నుంచి సానుకూల సంకేతం వస్తేనే ఇరాన్ దౌత్య బృందం ఇస్లామాబాద్ వెళ్లే అవకాశం ఉందని ఇరాన్ తెలిపింది. హార్మూజ్ జలసంధి, లెబనాన్, అణు కార్యక్రమం, సీజ్ చేసిన ఆస్తులను రిలీజ్ చేయడం వంటి వాటిపై ఇరాన్ డిమాండ్లను పెడుతోంది. తాజాగా ఇరాన్ వాణిజ్య నౌకను అమెరికా సీజ్ చేయడంతో ఇరాన్ రగిలిపోతోంది. దీనిపై ప్రతీకారం తీసుకుంటామని ఇరాన్ తెలిపింది. చర్చల ముందు ఇరాన్ నౌకను అమెరికా సీజ్ చేయడంపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి.నెక్ట్స్ ఏం జరుగుతుంది?చర్చలు పునఃప్రారంభం కాకపోతే ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉంది. ఈ కింది పది ప్రమాదాలు పొంచి ఉంటాయి.కాల్పుల విరమణ గడువు ముగిసిన తర్వాత సైనిక ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉందిపూర్తి స్థాయి యుద్ధానికి దారితీసే పరిస్థితి ఏర్పడే ప్రమాదం ఉందిహార్మూజ్ జలసంధి వద్ద రవాణా అంతరాయం వల్ల చమురు సరఫరా దెబ్బతినే అవకాశం ఉందిగ్యాస్, ఇంధన కొరత పలు దేశాల్లో ఉత్పన్నమయ్యే అవకాశం ఉందిఅంతర్జాతీయ చమురు ధరలు పెరిగే అవకాశం ఉందిప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందిస్టాక్ మార్కెట్లు కుదేలయ్యే పరిస్థితి రావచ్చుపశ్చిమాసియాలో భద్రతా పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉందిఇతర దేశాలు ఈ ఘర్షణలో చేరే ప్రమాదం ఉందిదౌత్య చర్చలు పూర్తిగా నిలిచిపోయి దీర్ఘకాలిక అస్థిరత నెలకొనే అవకాశం ఉంది -
హార్మూజ్‌పై ఇరాన్ భారీ ట్విస్ట్.. దిమ్మ తిరిగే ప్లాన్!
టెహ్రాన్: ఇరాన్, అమెరికా మధ్య మాటల దాడి నడుస్తోంది. సై అంటే సై అని ఇరు పక్షాల నేతలు వాదించుకుంటున్నారు. యుద్ధం, దాడుల విషయంలో తగ్గేదేలే అంటూ ప్రతి సవాల్ చేసుకుంటున్నారు. రెండో దఫా చర్చలకు అమెరికా సిద్ధమైన వేళ ఇరాన్ చెక్ పెట్టింది. చర్చలకు వచ్చేది లేదని తేల్చి చెప్పింది. మరోవైపు.. హార్మూజ్ జలసంధిపై సస్పెన్స్ కొనసాగుతోంది. జలసంధి తెరవాల్సిందేనని ట్రంప్ పట్టుబడుతుంటే.. అదంతా జాంతా నై అని ఇరాన్ మొండి పట్టుతో ఉంది. ఇలాంటి తరుణంలో జలసంధిపై మరింత పట్టు బిగించాలని ఇరాన్ ప్లాన్ చేస్తోంది.అంతర్జాతీయ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధిపై మరింత పట్టు కోసం ఇరాన్ ప్రణాళికలు, కొత్త చట్టాలను అన్వేషిస్తోంది. ఇప్పటి వరకు ఇరాన్‌కు నష్టం కలిగించిన ఇజ్రాయెల్ సహా పలు దేశాలపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఇరాన్ సిద్దమైంది. జలసంధిపై నియంత్రణను కట్టుదిట్టం చేసే కొత్త చట్టాన్ని ఇరాన్ రూపొందించినట్లు తెలుస్తోంది. తాజాగా ఇరాన్ పార్లమెంటరీ సివిల్ ఇంజనీరింగ్ కమిటీ చైర్మన్.. ఈ మేరకు మహమ్మద్ రెజాయ్ కూచీ ప్రకటన చేశారు. ఇజ్రాయెల్‌కు చెందిన నౌకలపై పూర్తి నిషేధంతో పాటు ఈ జలసంధి గుండా ప్రయాణించే నౌకలపై కఠిన నిబంధనలను అమలు చేసేందుకు తమ ప్రభుత్వం కొత్త ముసాయిదా చట్టాన్ని సిద్ధం చేసిందన్నారు. ఈ ముసాయిదా చట్టం తుది రూపం దాల్చే దశకు చేరుకుందని వెల్లడించారు.అలాగే, అతి త్వరలోనే దీనిని ఇరాన్ పార్లమెంట్ ఆమోదించనున్నట్లు తెలిపారు. కొత్త చట్టం అమల్లోకి వస్తే ఇజ్రాయెల్‌తో సంబంధం ఉన్న నౌకలను హార్మూజ్ గుండా ప్రయాణించేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించే ప్రసక్తే లేదన్నారు. ఇరాన్ శత్రు దేశాలుగా పరిగణించే దేశాల నౌకలు ప్రయాణించాలంటే ఆ దేశ జాతీయ భద్రతా మండలి నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని స్పష్టం చేశారు. గతంలో ఇరాన్‌కు నష్టం కలిగించిన దేశాల నౌకలు ఆ నష్టపరిహారాన్ని చెల్లించే వరకు జలసంధి గుండా ప్రయాణించడానికి వీలు లేదన్నారు. జలసంధి గుండా వెళ్లే నౌకలు తమ రవాణా రుసుమును కేవలం ఇరాన్ కరెన్సీలో చెల్లించాల్సి ఉంటుందని బాంబు పేల్చారు.ఉచితం కాదు: ఇరాన్ఇదే సమయంలో హార్మూజ్ జలసంధిలో నౌకల భద్రత ఉచితం కాదని ఇరాన్ ఉపాధ్యక్షుడు మహ్మద్ రెజా ఆరిఫ్ అన్నారు. ఇరాన్ చమురు ఎగుమతులపై ఆంక్షలు విధిస్తూ ప్రపంచ దేశాలు తమ నౌకల భద్రతను ఉచితంగా ఆశించడం కుదరదని తేల్చిచెప్పారు. తమ చమురు ఎగుమతులపై ఉన్న ఆర్థిక, సైనిక ఒత్తిడిని తొలగిస్తేనే ప్రపంచ చమురు ధరలు అదుపులోకి వస్తాయని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. అమెరికా చేస్తోన్న నౌకాదళ దిగ్బంధనం కొనసాగినంత కాలం జలసంధిలో సరఫరా పునరుద్ధరణ కష్టమని తేల్చి చెప్పారు. ఇప్పుడు ప్రపంచం ముందు రెండే దారులు ఉన్నాయి. అందరికీ స్వేచ్ఛా యుత చమురు మార్కెట్ ఉండాలి లేదంటే భారీ మూల్యాన్ని చెల్లించుకోవడానికి సిద్ధపడాలని తెలిపారు. ఈ నేపథ్యంలో ఇరాన్ వ్యతిరేక దేశాలు భారీ మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. -
గల్ప్ దేశాలకు గుణపాఠం..
ఇరాన్‌పై అమెరికా-ఉక్రెయిన్ దాడుల కారణంగా పశ్చిమాసియా అట్టుడుకుతోంది. యుద్ధం కారణంగా ఇప్పటికే ఇరాన్, అమెరికాకు భారీ నష్టం వాటిల్లింది. ఇటు ఇరాన్ ప్రతి దాడులతో గల్ప్ దేశాల పరిస్థితి దారుణంగా మారింది. ఇదే సమయంలో గల్ఫ్ దేశాలకు అమెరికా ఇచ్చిన ప్రధాన భరోసా మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్ THAAD (Terminal High Altitude Area Defense) విఫలం కావడంతో గల్ప్ దేశాలకు కునుకు పట్టడం లేదు. భారీగా డబ్బులు వెచ్చించి మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్ కొనుగోలు చేసినప్పటికీ ఇలా జరగడంతో పలు దేశాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.ఇజ్రాయెల్-అమెరికాలతో ఇరాన్ తనకున్న పరిమితి వనరులతోనే ధైర్యంగా పోరాటం చేస్తూ వ్యూహాత్మకంగా ఎదురుదాడులు చేస్తోంది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై విరుచుకుపడి, శత్రువుల ఆయుధాలను నాశనం చేసింది. ఇదే సమయంలో గల్ప్ దేశాల్లో ఉన్న రక్షణ వ్యవస్థలను ఇరాన్ క్షిపణులు చేధించడం చర్చనీయాంశంగా మారింది. గల్ప్ దేశాలకు అమెరికా అందించిన అత్యాధునిక టెక్నాలజీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్ థాడ్, Patriot PAC-3 లాంటి వ్యవస్థలను ఇరాన్ మట్టికరిపించింది. అయితే, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 2025 మేలో రియాద్ వేదికగా గల్ప్ దేశాలతో 142 బిలియన్ డాలర్లు(భారత కరెన్సీలో సుమారు రూ.11.8 లక్షల కోట్)లు విలువైన రక్షణ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందులో THAAD, Patriot అప్గ్రేడ్లు, డ్రోన్లు, ఆధునిక ఆయుధాలు ఉన్నాయి. ఇవి ఇరాన్ ముప్పును ఎదుర్కోవడమే లక్ష్యంగా తయారు చేయబడ్డాయి. కానీ, ఇరాన్ క్షిపణి దాడులకు ఇవి నిలవలేకపోయాయి. అమెరికా–ఇజ్రాయెల్ ఇరాన్‌పై దాడులు చేయగా, ఇరాన్ ప్రతీకారంగా 400 క్షిపణులు, 1000 డ్రోన్లు గల్ఫ్ దేశాలపై ప్రయోగించింది. దీంతో.. THAAD రాడార్లు (AN/TPY-2) జోర్డాన్, సౌదీ, యూఏఈలో నాశనం అయ్యాయి. Patriot వ్యవస్థలు కొంతమేర అడ్డుకున్నా, భారీ సంఖ్యలో వచ్చిన డ్రోన్లు, క్షిపణులను తట్టుకోలేకపోయాయి. సౌదీ, యూఏఈలోని ఎయిర్‌బేస్‌లు, ఇంధన సదుపాయాలు, పట్టణాలు నేరుగా దెబ్బతిన్నాయి. రక్షణ కోసం గల్ఫ్ దేశాలు ఖర్చు చేసిన వందల బిలియన్ల డాలర్లు ఆశించిన మేరకు రక్షణ ఇవ్వలేకపోయాయి. అమెరికా కవచం “ఇనుప గోడ” అని చెప్పబడినా వ్యవస్థ వాస్తవంలోకి రాగానే తుస్సుమనిపించింది.ఇక, సెంటర్ ఫర్ స్ట్రాటజీక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ ప్రకారం.. దక్షిణ కొరియా, గౌమ్ సహా ప్రపంచవ్యాప్తంగా అమెరికాకు 8 థాడ్ వ్యవస్థలు ఉన్నాయి. ఇవి ఒక్కో దాని విలువ 300 మిలియన్ డాలర్లు (అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.2,760 కోట్లు). ‘ఇవి చాలా విలువైన వ్యూహాత్మక వనరులు.. వీటిని కోల్పోవడం ఒక పెద్ద ఎదురు దెబ్బ’ అని సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్‌లో క్షిపణి రక్షణ నిపుణుడు టామ్ కరాకో అన్నారు. థాడ్ బ్యాటరీలో సాధారణంగా 90 మంది సైనికులు, ట్రక్కులపై అమర్చిన ఆరు లాంఛర్లు, మొత్తం 48 ఇంటర్‌సెప్టర్ క్షిపణులు (ప్రతి లాంచర్‌కు 8 వంతున), ఒక TPY-2 రాడార్‌తో పాటు టాక్టికల్ ఫైర్ కంట్రోల్, కమ్యూనికేషన్ యూనిట్ ఉంటాయి. ఒక్కో ఇంటర్‌సెప్టర్ క్షిపణి ధర 13 మిలియన్ డాలర్లు ఉంటుంది. ఇంటిగ్రేటెడ్ గగనతల, రక్షణ వ్యవస్థ ఏర్పాటుచేయాలంటే ఇదొక్కటే మార్గమని పసిఫిక్ ఫోరమ్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ నిపుణుడు విలియమ్ అల్బెర్క్యూ అన్నారు.🚨⚡️ BLINDED: Iranian strikes destroy the $1.1 Billion US Radar in Qatar! 🇶🇦🇺🇸🇮🇷Al Jazeera reveals the destruction of the AN/FPS-132 system at Al Udeid.Iran successfully neutralized the "Brain" of THAAD and Patriot defenses! pic.twitter.com/m5xi4sdBDb— RussiaNews 🇷🇺 (@mog_russEN) April 10, 2026ఇదిలాఉండగా.. ఇరాన్-అమెరికా యుద్ధం ప్రారంభమైన తొలి రోజుల్లోనే ఇరాన్ దాడుల్లో జోర్డాన్‌లోని మువాఫాక్ సాల్టి ఎయిర్ బేస్ వద్ద అమెరికా థాడ్ క్షిపణి రక్షణ వ్యవస్థలు (US THAAD) ఉపయోగించే RTX కార్ప్ AN/TPY-2 రాడార్, సహాయక సామాగ్రి ధ్వంసమైనట్టు శాటిలైట్ ఫోటోలను ఉటంకిస్తూ ముందు సీఎన్ఎన్ నివేదించింది. అనంతరం, ఈ వ్యవస్థ ధ్వంసమైనట్టు అమెరికా అధికారి సైతం ధ్రువీకరించారు.THAAD బ్యాటరీ అంటే ఏమిటి? THAAD అనేది అత్యాధునిక క్షిపణి రక్షణ వ్యవస్థ. స్వల్ప-శ్రేణి, మధ్యస్థ, దీర్ఘ-శ్రేణి బాలిస్టిక్ క్షిపణులను ఎదుర్కోవడానికి ఇది ప్రత్యేకంగా రూపొందించబడింది. దీనిని 'అమెరికన్ బ్రహ్మాస్త్ర' అని కూడా అంటారు. వాతావరణం లోపల, వెలుపలి లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యం ఉన్న ఏకైక వాయు రక్షణ వ్యవస్థ దీనికి కారణం. అందుకే అమెరికా THAAD సామర్థ్యాన్ని నిరంతరం మెరుగుపరుస్తుంది.THAAD ఎలా పని చేస్తుంది? THAAD అనేది ఇన్కమింగ్ బాలిస్టిక్ క్షిపణులను వాటి ఫ్లైట్ టెర్మినల్ దశలో (లక్ష్యానికి దగ్గరగా) మాత్రమే అడ్డుకునేలా రూపొందించబడింది.THAAD షార్ట్, ఇంటర్మీడియట్ , ఇంటర్మీడియట్-రేంజ్ బాలిస్టిక్ క్షిపణులకు వ్యతిరేకంగా రక్షిస్తుంది.ఇందులో ఎలాంటి పేలుడు వార్హెడ్లు ఉండకపోవడం దీని ప్రధాన ప్రత్యేకత. ఇది గతిశక్తి (శక్తి వినియోగం) సహాయంతో లక్ష్యాలను నాశనం చేస్తుంది.THAAD ముఖ్యమైన అంశం ఏమిటంటే ఇది ప్రత్యేకంగా అమెరికన్ సైనికులచే నిర్వహించబడుతుంది.THAAD ప్రధాన భాగాలు? THAADలో 4 ప్రధాన భాగాలు ఉన్నాయి, ఇందులో ఇంటర్సెప్టర్లు, లాంచర్లు, రాడార్, ఫైర్ కంట్రోల్ సిస్టమ్‌లు ఉన్నాయి.ఇంటర్‌సెప్టర్ ఇంపాక్ట్ ఫోర్స్‌ని ఉపయోగించి ఇన్కమింగ్ క్షిపణులను నాశనం చేయడంలో సహాయపడుతుంది, అయితే లాంచ్ వెహికల్స్ ఇంటర్‌సెప్టర్‌ను మోసుకెళ్లి లాంచ్ చేస్తాయి.అదేవిధంగా, రాడార్ సాంకేతికతలు 870 నుండి 3,000 కి.మీ పరిధిలో బెదిరింపులను గుర్తించగలవు. అగ్నిమాపక నియంత్రణ వ్యవస్థలు ఇంటర్సెప్టర్ల ప్రయోగ, లక్ష్యాన్ని సమన్వయం చేస్తాయి. IMO, this is the best shot of an Iranian missile attack in this war so far. This was at Prince Sultan Airbase in Saudi Arabia.The US lost a THAAD radar & an E-3 Sentry AWACS at this base. Both were executed by $20K drones. pic.twitter.com/UsrpcQWfol— Dr. Syed Mohd Murtaza مرتضیٰ (@syedmohdmurtaza) April 14, 2026చర్చలే కీలకం.. THAAD, Patriot లాంటి వ్యవస్థలు బిలియన్ల డాలర్లు ఖర్చు పెట్టి కొనుగోలు చేసినా, వాస్తవ యుద్ధ పరిస్థితుల్లో బలహీనతలు బయటపడ్డాయి. ఈనేపథ్యంలో పొరుగు దేశాలతో శాంతి ఒప్పందాలు, చర్చలు, పరస్పర అవగాహన క్షిపణి దాడులను అడ్డుకోవడంలో ఉపయోగపడనుంది. అలాగే, గల్ఫ్ దేశాలు కలిసి కట్టుగా పనిచేస్తే భద్రతా వ్యవస్థలు మరింత బలపడతాయి. ఇదే సమయంలో స్వదేశీ సాంకేతికత, స్థానిక రక్షణ వ్యవస్థలు అభివృద్ధి చేస్తే ఇతర దేశాలపై ఆధారపడే పరిస్థితి తగ్గుతుందని విశ్లేషకులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. -
ఇరాన్- అమెరికా మధ్య అసలేం జరగనుంది..?
ప్రస్తుతం పశ్చిమాసియాలో పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తకరంగా మారాయి. ఓ వైపేమో డొనాల్డ్ ట్రంప్ చర్చలకు రాకుంటే వినాశనం తప్పదని హెచ్చరిస్తుంటే మరోవైపేమో ఇరాన్ హర్మూజ్ బ్లాకేడ్ విరమించేదాకా చర్చల ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలో అసలు ఏం జరగనుంది. అసలు యుద్ధం ముగింపు దశకు చేరుకుందా.. లేక మరింత ఉదృతమవుతుందా అనే సమాచారం తెలుసుకోవాలని ఉందా అయితే ఈ స్టోరీపై ఓ లుక్కేయ్యండి..!యుద్ధం ఎందుకు మెుదలైందిఅమెరికా, ఇజ్రాయెల్ ఫిబ్రవరి 28న ఇరాన్‌పై సంయుక్తంగా దాడులు ప్రారంభించాయి. అయితే దానికి మెుదటి కారణం ఇరాన్ తన అణు అణు బాంబును తయారు చేసే స్థాయికి చేరుకోవడమైతే మరోటి ఆ దేశంలోని ప్రజల అక్కడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నిరసనలు చేపట్టడం. ఈ రెండు కారణాలపై మెుదటి నుంచి వ్యతిరేకిస్తూ వస్తున్న ట్రంప్ చివరికి అనుకున్న పని చేశారు. ఇజ్రాయెల్‌తో కలిసి ఇరాన్‌పై దాడులు ప్రారంభించారు.మెుదటి రోజే ఖమేనీ హత్యదీంతో ఫిబ్రవరి 28 న ఇరాన్‌పై ఆపరేషన్ "ఎపిక్ ప్యూరీ" పేరుతో అమెరికా దాడులు ప్రారంభించింది. యుద్దం ప్రారంభించిన మెుదటిరోజే ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా ఖమేనీని అంతం చేసింది. ఈ విషయాన్ని ఇరాన్ సైతం అధికారికంగా ధృవీకరించడంతో యావత్ ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. యుద్దం తీవ్రంగానే ఉండబోతుందని ఆందోళన చెందింది. అయితే ఇరాన్ సైతం అమెరికా, ఇజ్రాయెల్ దేశాలను ఏకకాలంలో ధీటుగా ఎదుర్కొంది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై దాడులు చేయడంతో పాటు టెల్ అవీవ్ పై మిసైల్స్ అటాక్ చేసింది. ఇరాన్ ఏంతకీ వెనక్కి తగ్గలేదు.హర్ముజ్ దిగ్భందనంప్రపంచ చమురు రవాణాకు ఏంత కీలకమైన హర్ముజ్ జలసంధిని ఇరాన్ బ్లాక్ చేసింది. దీంతో ప్రపంచ చమురు రవాణాలో దాదాపు 20 శాతం చమురు ఈ జలసంధి గుండానే రవాణా జరుగుతుంది. అటువంటిది ఈ జలసంధిని ఇరాన్ బ్లాక్చేయడంతో ప్రపంచవ్యాప్తంగా గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. చమురు, గ్యాస్ సరఫరా లేక చాలా దేశాలు ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. కొన్ని దేశాలు ఇంధన కొరతను తట్టుకోలేక లాక్డౌన్ సైతం విధించాయి. ఈ నేపథ్యంలో ట్రంప్‌పై ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత ఎదురైంది.ట్రంప్ అంచనాలు తలకిందులు.యుద్దం విషయంలో ట్రంప్ అంచనా పూర్తిగా తలకిందులైంది. యుద్ధాన్ని కేవలం వారం రోజుల్లో ముగిస్తానని అక్కడ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని తొలుత నుంచి చెప్పుకుంటూ వచ్చిన ట్రంప్‌నకు ఆ రెండు విషయాల్లో చుక్కెదురైంది.. వారం రోజుల్లో కాదు కదా యుద్ధం ప్రారంభమై 40 రోజుల దాటినా ఇరాన్ వెనుకంజవేయలేదు.. మరో వైపు అక్కడి ప్రజలు ఇరాన్‌కు అండగా ప్రాణత్యాగాలకు కూడా సిద్ధపడ్డారు.ట్రంప్ చర్చల రాగంఅయితే మెుదటి నుంచి ఇటు ఇరాన్.. అటు అమెరికా ఎక్కడా తగ్గలేదు.. ఇరాన్‌లోని అణుస్థావరాలను విద్యుత్ ప్లాంట్లను ధ్వంసం చేశామని అమెరికా వాదిస్తుంటే.. అమెరికా ఫైటర్ జెట్స్‌ను కూల్చేసేమని తమతో యుద్దంలో అమెరికా ఓడిపోయిందని పరస్పరం వాదించుకున్నాయి. ఈ నేపథ్యంలో తాను చర్చలకు సిద్ధమని ట్రంప్ ఏప్రిల్ 8న ప్రకటించారు. అయితే చివరి వరకూ చర్చలపై ఏటూ తేల్చని ఇరాన్.. ట్రంప్ తీవ్ర హెచ్చరికల నేపథ్యంలో కాస్త తగ్గింది. చర్చలకు రాకుంటే ఇరాన్ నాగరికతనే అంతం చేస్తానని ట్రంప్ హెచ్చరించారు. దీంతో ఎట్టకేలకు ఇరాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో రెండు వారాల పాటు సీజ్ఫైర్ ఒప్పందం జరిగింది. ఇస్లామాబాద్ వేదికగా చర్చలుదీంతో ఇస్లామాబాద్ వేదికగా ఏప్రిల్ 11, 12 తేదీలలో చర్చలు జరిగాయి. అయితే అమెరికా నిబంధనలు నేపథ్యంలో చర్చలు విఫలమయ్యాయి.ఇరాన్ అణుబాంబు తయారిని పూర్తిగా నిలపివేయాలి. ఇప్పటికే శుద్ధి చేసిన యురేనియం నిల్వలను అమెరికాకు అప్పగించాలని డిమాండ్ పెట్టింది. దీంతో ఇరాన్ ఈ చర్చలకు అంగీకరించేది లేదని తేల్చిచెప్పింది.దీంతో అమెరికా హర్ముజ్‌ను బ్లాకేడ్ చేసింది. దీంతో ఇరాన్ సైతం తీవ్రంగా స్పందించింది. తాను కూడా హర్ముజ్‌ను అష్టదిగ్భందనం చేస్తున్నట్లు పేర్కొంది. దీంతో మరోసారి ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ నేపథ్యంలోనే ట్రంప్ మరోసారి తన దుందుడుకు స్వభావంతో వ్యాఖ్యానించారు. ఇరాన్ మిలటరీ సర్వనాశనం అయ్యిందని వారికి యుద్దం చేసే సత్తాలేదని ఆరోపించారు.యుద్ధం ముగుస్తుందా?ప్రస్తుతం యుద్దం ముగుస్తుందా లేదా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న ఎందుకంటే అమెరికా ప్రధాన లక్షం ఇరాన్‌కు అణుబాంబు లేకుండా చేయడం అయితే దానికి టెహ్రాన్ ఎట్టిపరిస్థితుల్లో ఒప్పుకునేలా లేదు. మరోవైపు ఇతర విషయాలలోనే రెండు దేశాలు పరస్పర వైవిధ్యాలు కలిగి ఉన్నాయి. ఇరాన్ స్పీకర్ మహ్మద్ గాలిబాఫ్ సైతం ఇటీవల ఈ వ్యాఖ్యలే చేశారు. అమెరికా ఒత్తిడి చేస్తున్న ఇరాన్ రెండో దఫా చర్చలకు వచ్చేది లేదని తేల్చి చెబుతుంది. ఈ నేపథ్యంలో ఏవరో ఒకరు పూర్తి స్థాయిలో వెనక్కి తగ్గితే తప్ప దీనికి పూర్తి స్థాయిలో పరిష్కార మార్గం కనిపించడం లేదు. దీంతో ఏం జరుగుతుందో వేచి చూడాలి. -
రేపు లేదా ఎల్లుండి ఏదైనా జరగొచ్చు: నెతన్యాహు
జెరూసలేం: ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌తో సాగుతున్న పోరాటం ఇంకా ముగియలేదన్నారు. యుద్ధంలో ఏ క్షణమైనా కొత్త పరిణామాలు చోటుచేసుకోవచ్చని నెతన్యాహు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో, యుద్ధం మరింత భయంకరంగా ఉంటుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.బెంజిమిన్ నెతన్యాహు తాజాగా అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలీతో కలిసి మాట్లాడుతూ..‘ఇరాన్‌పై పోరాటం ఇంకా ముగియలేదు. పోరాటం కొనసాగుతుంది. ఏ క్షణంలోనైనా మరిన్ని పరిణామాలు చోటుచేసుకోవచ్చు. రేపు లేదా ఎల్లుండి ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు?’ అంటూ పరిస్థితి చాలా ఉత్కంఠభరితంగా ఉందని పేర్కొన్నారు. ఇరాన్ వ్యతిరేక పోరాటంలో అమెరికా, ఇజ్రాయెల్ తమ లక్ష్యాలను సాధించి తీరతాయని, ప్రపంచ స్వేచ్ఛా ప్రియులకు ఇది కొత్త ఆశలు చిగురింపజేస్తుందని స్పష్టం చేశారు.ఇదిలా ఉండగా.. లెబనాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి రావడానికి ముందు తాము జరిపిన దాడుల్లో హెజ్బొల్లా కమాండర్ అలీ రిడా అబ్బాస్ మరణించినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. దక్షిణ లెబనాన్‌లోని బింట్ జెబీల్ పట్టణానికి హెజ్బొల్లా కమాండర్‌గా అబ్బాస్ ఉన్నట్లు పేర్కొంది. ప్రపంచ శాంతికి విఘాతం కలిగే చర్యలను ట్రంప్ మానుకోవాలని హూతీలు తాజాగా హెచ్చరించారు. లేకపోతే బాబ్ అల్ మాండెబ్ జలసంధిని తాము మూసేస్తామన్నారు. ఒక్కసారి దానిని మూసేస్తే తిరిగి తెరిపించడం ఎవరికీ సాధ్యం కాదని హూతీ ప్రభుత్వ విదేశాంగ శాఖ హుస్సేన్ పేర్కొన్నారు.మరోవైపు.. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ పాకిస్తాన్ వేదికగా రెండో విడత శాంతి చర్చలకు అమెరికా ఇరాన్ సన్నద్ధమయ్యాయి. తమ దేశ ప్రతినిధులు సోమవారం పాక్‌కు చేరుకుంటారని, మంగళవారం చర్చలు జరుగుతాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. తాము ప్రతిపాదించిన ఒప్పందాన్ని అంగీకరించాలని ఇరాన్‌కు సూచించారు. లేకపోతే ఆ దేశంలో విద్యుత్ కేంద్రాలు, వంతెనలన్నింటినీ ధ్వంసం చేస్తామని హెచ్చరించారు.చర్చలు లేవన్న ఇరాన్..అమెరికా అసంబద్ధ డిమాండ్ల కారణంగానే రెండో విడత చర్చల్లో పాల్గొనవద్దనే నిర్ణయానికి వచ్చినట్టు ఇరాన్ వెల్లడించింది. ‘‘ఆచరణసాధ్యం కాని, మితిమీరిన డిమాండ్లు చేయడం, ఇష్టానికి వైఖరి మార్చుకోవడం వంటి చర్యలు, పరస్పర విరుద్ధ ప్రకటనలు అమెరికాకు, అధ్యక్షుడు ట్రంప్‌కు అలవాటుగా మారాయి. దీన్ని ఇకపై ఎంతమాత్రమూ సహించే ప్రసక్తే లేదు’’ అంటూ కుండబద్దలు కొట్టింది. తమ ఓడరేవుల దిగ్బంధం కాల్పుల విరమణ ఒప్పందానికి పొడవడమేనని ధ్వజమెత్తింది. -
చర్చలకు వచ్చేది లేదు ఇరాన్.. రాకుంటే వినాశనమే ట్రంప్
-
చర్చలకు ఇరాన్ నో
వాషింగ్టన్: రెండో విడత చర్చలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రతిపాదనను ఇరాన్ తిరస్కరించింది. ఆదివారం ఈ దిశగా నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. మంగళవారం పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో చర్చలు జరుగుతాయని తొలుత ట్రంప్ ప్రకటించారు. తమ ప్రతినిధులు స్టీవ్ విట్కాఫ్, జేర్డ్ కుష్నర్ సోమవారం సాయంత్రంకల్లా ఇస్లామాబాద్ చేరతారన్నారు. వాటిలో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా పాల్గొంటారని అనంతరం వైట్‌హోస్ పేర్కొంది. అనంతరం ఇరాన్ స్పందిస్తూ, తాము ఈ చర్చల్లో పాల్గొనబోమని స్పష్టం చేసింది. అమెరికా తమ ఓడరేవుల దిగ్బంధాన్ని కొనసాగించినంత కాలం ఎలాంటి చర్చలనూ అంగీకరించబోమని కుండబద్దలు కొట్టింది. ఆ దేశ అధికార వర్తా సంస్థ ఐఆర్ఎన్ఏ ఈ మేరకు వెల్లడించింది. శాంతి ఒప్పందానికి ఇరాన్ ముందుకు రాకపోతే ఆ దేశంలోని వంతెనలు, విద్యుదుత్పత్తి ప్లాంట్లను నామరూపాల్లేకుండా ధ్వంసం చేస్తామని ట్రంప్ హెచ్చరించారు. అమెరికా, ఇరాన్ కాల్పుల విరమణ గడువు ఈ నెల 22తో ముగియనుంది. అమెరికా, ఇరాన్ మధ్య ఇటీవల ఇస్లామాబాద్‌లోనే జరిగిన చర్చలు విఫలం కావడం తెలిసిందే. అణు కార్యక్రమాన్ని శాశ్వతంగా పక్కన పెట్టాలన్న అమెరికా డిమాండ్‌కు ఇరాన్ అంగీకరించలేదు. విరమణకు ఇరాన్ తూట్లు: ట్రంప్ హార్మూజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న నౌకలపై ఐఆర్జీసీ కాల్పులు జరపడంపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తంచేశారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇరాన్ ఉల్లంఘించిందని మండిపడ్డారు. ‘‘మేము న్యాయమైన, సహేతుకమైన ఒప్పందాన్ని ప్రతిపాదిస్తున్నాం. ఇరాన్ అంగీకరిస్తుందని ఆశిస్తున్నా. లేదంటే ఇకపై మేం ఎంతమాత్రం మంచివాళ్లం కాదు.’’ అన్నారు.హార్మూజ్ ఉద్రిక్తంహార్మూజ్లో ఉద్రిక్తత పరిస్థితులు యథాతథంగా కొనసాగుతూనే ఉన్నాయి. వందలాది నౌకలు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. హార్మూజ్‌లో శనివారం భారత్ సహా పలు దేశాల నౌకలపై ఇరాన్ కాల్పులు జరపడంతో పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారింది. అసంబద్ధ డిమాండ్ల వల్లే: ఇరాన్ అమెరికా అసంబద్ధ డిమాండ్ల కారణంగానే రెండో విడత చర్చల్లో పాల్గొనవద్దనే నిర్ణయానికి వచ్చినట్టు ఇరాన్ వెల్లడించింది. ‘‘ఆచరణసాధ్యం కాని, మితిమీరిన డిమాండ్లు చేయడం, ఇష్టానికి వైఖరి మార్చుకోవడం వంటి చర్యలు, పరస్పర విరుద్ధ ప్రకటనలు అమెరికాకు, అధ్యక్షుడు ట్రంప్‌కు అలవాటుగా మారాయి. దీన్ని ఇకపై ఎంతమాత్రమూ సహించే ప్రసక్తే లేదు’’ అంటూ కుండబద్దలు కొట్టింది. తమ ఓడరేవుల దిగ్బంధం కాల్పుల విరమణ ఒప్పందానికి పొడవడమేనని ధ్వజమెత్తింది.బయటకు వెళ్లిపో!హార్మూజ్ జలసంధిలో రెండు భారత నౌకలపై ఇరాన్ కాల్పులు జరపడం పట్ల స్పందించాలని కోరిన మహిళా విలేకరిపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తంచేశారు. తక్షణమే బయటకు వెళ్లిపోమ్మంటూ మండిపడ్డారు. ట్రంప్ రియాక్షన్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
పాక్‌కు ట్రంప్ ప్రతినిధులు.. ఇరాన్ వెళ్లట్లేదా?
టెహ్రాన్: అమెరికా ప్రతినిధులు ఇరాన్‌తో చర్చల కోసం పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌కు సోమవారం (ఏప్రిల్ 20) సాయంత్రం వెళ్తున్నారని యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు అమెరికా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోగా ఇరాన్ మాత్రం కనీసం ఇస్లామాబాద్‌కు వెళ్తున్నామా? లేదా? అన్న విషయాన్ని కూడా చెప్పడం లేదు. ఇరాన్ ఇప్పటి వరకు పాకిస్థాన్‌కు చర్చల కోసం తమ టీమ్‌ను పంపే విషయంలో నిర్ణయం తీసుకోలేదని తస్నీమ్ వార్తా సంస్థ తెలిపింది. నౌకాదళ నిర్బంధం కొనసాగుతుండడంతో ఇస్లామాబాద్‌కు చర్చల బృందాన్ని పంపే నిర్ణయం ఇంకా తీసుకోలేదని ఇరాన్ తెలిపింది. “ట్రంప్ ప్రకటించిన నౌకాదళ నిర్బంధం కొనసాగుతున్నంత వరకు ఎలాంటి చర్చలు ఉండవు అని ఇరాన్ టీమ్ స్పష్టం చేసింది” అని తస్నీమ్ ప్రతినిధి తెలిపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇరాన్‌తో రెండో దఫా చర్చలు సోమవారం పాకిస్థాన్‌లో జరుగుతాయని మొదటి నుంచి చెబుతున్నారు.అమెరికా ప్రతినిధులు ఇప్పటికే ఇస్లామాబాద్ వెళ్తున్నారు. సోమవారం సాయంత్రంలోగా అక్కడికి చేరుకుంటారు. డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే సీరియస్‌గా ఉన్నారు. ఈ రెండో దశ చర్చలు సఫలం కాకపోతే దాడులు చేస్తామని తెలిపారు. తాము చాలా న్యాయమైన ఒప్పందాన్ని ప్రతిపాదిస్తున్నామని అన్నారు. ఇరాన్ దాన్ని అంగీకరిస్తుందని ఆశిస్తున్నానని ట్రంప్ చెప్పారు. ఎందుకంటే అలా చేయకపోతే, ఇరాన్లో ప్రతి విద్యుత్ కేంద్రం, ప్రతి వంతెనను అమెరికా ధ్వంసం చేస్తుందని వార్నింగ్ ఇచ్చారు. -
‘మరో జలసంధిని మూసేస్తాం.. తెరవడం ఎవ్వరితరం కాదు’
సనా: అమెరికాకు యెమెన్ హౌతీలు తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. వ్యూహాత్మక బాబ్ అల్-మండెబ్ జలసంధిని మూసివేస్తామని చెప్పారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో పాటు ఇతర దేశాలు.. శాంతికి అడ్డుగా ఉన్న చర్యలు, విధానాలను ఆపకపోతే తాము జలసంధిని మూసేస్తామని హెచ్చరించారు.శాంతికి ఆటంకం కలిగించే పనులను ఆపకపోతే ముఖ్యమైన సముద్ర మార్గాన్ని బ్లాక్ చేస్తామని చెప్పారు. విదేశీ శక్తుల మద్దతుతో పనిచేసే వారు (ప్రాక్సీ ఫోర్సెస్) బాబ్ అల్-మండెబ్ నియంత్రణకు ప్రయత్నిస్తే అంతర్జాతీయ భద్రత ప్రమాదంలో పడుతుందని తెలిపారు.హౌతి ఉప విదేశాంగ మంత్రి హుస్సేన్ అల్-ఎజ్జీ ఎక్స్‌లో ఈ మేరకు ఓ పోస్ట్ చేశారు. యెమెన్ ప్రభుత్వం ఆ జలసంధిని మూసేయాలని నిర్ణయిస్తే, ఎవరూ దాన్ని మళ్లీ తెరవలేరని తెలిపారు. అమెరికా, ఇతర దేశాలు వెంటనే తమ తీరును మార్చుకుని యెమెన్ ప్రజల హక్కులను గౌరవించాలని చెప్పారు.ప్రపంచానికి ఎంతో కీలకంఎర్ర సముద్రం నుంచి సూయజ్ కాలువ దారిలో వెళ్లే నౌకలకు చాలా ముఖ్యమైన మార్గం బాబ్ అల్-మండెబ్ జలసంధి.ఈ మార్గం చాలా సన్నగా ఉంటుంది. కేవలం 29 కిలోమీటర్ల వెడల్పు, రెండు చిన్న మార్గాల ద్వారానే నౌకలు వెళ్లాలి.ఇది ప్రపంచంలో అత్యంత బిజీ సముద్ర మార్గాల్లో ఒకటి. చమురు, ఇంధనం వంటి వస్తువులు గల్ఫ్ నుంచి యూరప్, ఆసియా దేశాలకు ఇక్కడి ద్వారానే వెళ్తాయి. ప్రపంచంలో మూడవ అత్యంత రద్దీగా ఉండే చమురు రవాణా మార్గం.ఇతర దేశాల మద్దతుతో పనిచేసే గ్రూపులు ఈ మార్గాన్ని ఆక్రమించడానికి ప్రయత్నిస్తే ప్రపంచ భద్రతకు ముప్పు ఉంటుందని యెమెన్ సర్కారు వార్నింగ్ ఇచ్చింది.ఎర్ర సముద్రంలో సమస్యలు వస్తే ప్రపంచ వాణిజ్యం, నౌకల రాకపోకలు నేరుగా ప్రభావితం అవుతాయి.అమెరికా చర్యలకు ప్రతిగా ఇప్పటికే ఇరాన్ హార్మూజ్ జలసంధిని మూసేసింది. బాబ్ అల్-మండెబ్ జలసంధి ప్రపంచ వాణిజ్యంలో అత్యంత కీలకమైన సముద్ర మార్గం. సుయూజ్ కాలువ ద్వారా ఆసియా-యూరప్ మధ్య నేరుగా వాణిజ్యాన్ని సాధ్యమయ్యేలా చేస్తుంది. ప్రపంచ చమురు రవాణాలో దాదాపు 10 శాతం ఈ మార్గం గుండా వెళ్తుంది. దీంతో దీని ప్రాముఖ్యత చాలా ఎక్కువ.ఈ జలసంధి ఎర్ర సముద్రం దక్షిణ చివరలో ఉంది. యెమెన్ జిబౌటి, ఎరిట్రియా (ఆఫ్రికా ఖండం) మధ్యలో ఉంది.గేట్ ఆఫ్ టియర్స్ అని పిలుస్తారు. ఎందుకంటే ఇక్కడ చాలా నౌకా ప్రమాదాలు జరిగాయి.సుయజ్ కాలువ (1869లో ప్రారంభం) తర్వాత దీని ప్రాముఖ్యత మరింత పెరిగింది. ఆసియా-యూరప్ వాణిజ్యం ఆఫ్రికా చుట్టూ తిరగకుండా నేరుగా ఈ మార్గం గుండా సాగుతుంది.చమురు, గ్యాస్, వాణిజ్య సరుకులు సరఫరా అవుతాయి. ప్రపంచంలో మూడవ అత్యంత రద్దీగా ఉండే చమురు రవాణా మార్గం.ఈ నేపథ్యంలోనే యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటు దళాలు ఈ జలసంధిని మూసివేస్తామని హెచ్చరిస్తున్నాయి. ఇది జరిగితే ప్రపంచ చమురు మార్కెట్లకు పెద్ద దెబ్బ తగులుతుంది, అలాగే సుయేజ్ కాలువ ఆదాయం కూడా తగ్గిపోతుంది.ఆసియా–యూరప్ వాణిజ్యానికి ప్రధాన ద్వారం ఇదే. చమురు రవాణాలో కీలక పాత్ర దీనిది. మధ్యప్రాచ్యం, ఆఫ్రికా, యూరప్ దేశాల భద్రత, ఆర్థిక వ్యవస్థలపై నేరుగా ప్రభావం చూపుతుంది. మూసివేస్తే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఇబ్బందులు తలెత్తుతాయి. బాబ్ అల్-మండెబ్ జలసంధి ఒక “లైఫ్‌లైన్” లాంటిది. ఇది మూసివేస్తే, ఆసియా-యూరప్ మధ్య వాణిజ్యం, చమురు సరఫరా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మొత్తం కుదేలవుతుంది.భారత్‌కు ఈ జలసంధి ఎందుకు ముఖ్యం?భారత్ దిగుమతి చేసే చమురు పెద్ద భాగం గల్ఫ్ ప్రాంతం నుంచి వస్తుంది. ఈ మార్గం మూసితే సరఫరా ఆలస్యం అవుతుంది.మార్గంలో ఆటంకాలు ఎదురైతే రవాణా ఖర్చు పెరుగుతుంది. పెట్రోలు, డీజిల్ ధరలు పెరుగుతాయి.యూరప్, ఆఫ్రికా దేశాలతో భారత వాణిజ్యం ఈ మార్గం ద్వారా జరుగుతుంది. దీన్ని మూస్తే సరుకు రవాణా దెబ్బతింటుంది.నౌకలు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలి. సమయం, ఖర్చు పెరుగుతుంది.ఈ ప్రాంతంలో కాల్పులు, దాడులు ఉంటే భారత నౌకలు ప్రమాదంలో పడతాయి.భారత సముద్ర సిబ్బంది పెద్ద సంఖ్యలో ఈ మార్గాల్లో పనిచేస్తారు. వారి భద్రత సమస్యగా మారుతుంది. -
ఇరాన్‌లోని వాటన్నింటినీ ధ్వంసం చేసేస్తాం: ట్రంప్
వాషింగ్టన్: ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వార్నింగ్ ఇచ్చారు. హార్మూజ్ విషయంలో కొనసాగుతున్న నిర్బంధం, పాకిస్థాన్‌లో ఇరాన్‌తో అమెరికా రెండో దశ చర్చలు వంటి అంశాలపై ఆయన ట్రూత్ సోషల్‌లో ప్రస్తావించారు. ఇరాన్ వ్యవహరిస్తున్న తీరు సరికాదని అన్నారు. హార్మూజ్ విషయంలో ఇరాన్‌పై సెటైర్లు వేశారు. ‘ఇరాన్ నిన్న హార్మూజ్ జలసంధిలో కాల్పులు జరపాలని నిర్ణయించింది. ఇది కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘన. చాలావరకు ఫ్రాన్స్ నౌకపై, యునైటెడ్ కింగ్డమ్ నుంచి వచ్చిన సరుకు నౌకను ఇరాన్ లక్ష్యంగా చేసుకుంది. అది మంచిది కాదు, కదా?నా ప్రతినిధులు చర్చల కోసం పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌కు వెళ్తున్నారు. వారు రేపు సాయంత్రం అక్కడ ఉంటారు. ఇరాన్ ఇటీవల జలసంధిని మూసేస్తున్నామని ప్రకటించింది.. ఇది విచిత్రం.. ఎందుకంటే మా నిర్బంధం (బ్లాకేడ్) ఇప్పటికే దాన్ని మూసేసింది.వారు తెలియకుండానే మాకు సాయం చేస్తున్నారు, మూసిన మార్గంతో నష్టపోయేది వారే, రోజుకు 500 మిలియన్ డాలర్లు నష్టపోతారు. అమెరికాకు ఏ నష్టమూ లేదు. నిజానికి, చాలా నౌకలు ఇప్పుడే అమెరికాలోని టెక్సాస్, లూసియానా, అలాస్కా వైపు వెళ్తున్నాయి. మేము చాలా న్యాయమైన, సరైన ఒప్పందాన్ని ప్రతిపాదిస్తున్నాం. ఇరాన్ దాన్ని అంగీకరిస్తుందని ఆశిస్తున్నాను. ఎందుకంటే అలా చేయకపోతే, ఇరాన్లో ప్రతి విద్యుత్ కేంద్రం, ప్రతి వంతెనను అమెరికా ధ్వంసం చేస్తుంది. వారు త్వరగా దిగివస్తారు, సులభంగా దిగివస్తారు, వారు ఒప్పందాన్ని అంగీకరించకపోతే చేయాల్సిన పనిని చేయడమే నాకు గౌరవంగా ఉంటుంది. గత 47 సంవత్సరాలుగా ఇతర అధ్యక్షులు చేయలేని పని అదే. ఇరాన్ హత్యాకాండ ఆగాల్సిన సమయం వచ్చింది’ అని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. -
తుది చర్చలు చాలా దూరం.. ఇరాన్ స్పీకర్
ఇరాన్- అమెరికా మధ్య సీజ్ ఫైర్ ఒప్పందం మరో రెండు రోజుల్లో ఏప్రిల్ 21తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఇరాన్ స్పీకర్ మహమ్మద్ బాగేర్ గాలిభాప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాల మధ్య చర్చలలో ప్రాథమిక అంశాలలో చాలా వ్యత్యాసం ఉందని తెలిపారు. తుదిదశ చర్చలకు రెండు దేశాలు ఇంకా చాలా దూరంలో ఉన్నాయన్నారు.ఇటీవల అమెరికా- ఇరాన్ మధ్య చర్చలు జరిగిన సంగతి తెలిసిందే. ఇరు దేశాల మధ్య సరైన సయోధ్య కుదరకపోవడంతో చర్చలు ఎటువంటి సానూకూల ఫలితాలు లేకుండానే ముగిశాయి. అయితే ఇరు దేశాల మధ్య కుదిరిన సీజ్ఫైర్ ఒప్పందం ఈ నెల 21తో ముగుస్తోంది. అయితే ప్రస్తుతం రెండు దేశాల మధ్య మరో దపా చర్చలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ స్పీకర్ తన అభిప్రాయాల్ని మీడియాతో పంచుకున్నారు.మహ్మద్ గాలిఫ్ మాట్లాడుతూ " ప్రస్తుతం రెండు దేశాల మధ్య కొన్ని విషయాల్లో తీవ్ర అభ్యంతరాలున్నాయి. తుదిదశ చర్చలకు ఇంకా చాలా దూరంలో ఉన్నాం. ఇరాన్ క్షేత్రస్థాయిలో విజయం సాధించింది. అందుకే కాల్పుల విరమణకు అంగీకరించాం". అన్నారు. శత్రుదేశం తమ స్వలాభం కోసం ఎన్నో డిమాండ్లను ఇరాన్‌పై రుద్దే ప్రయత్నం చేసింది. కానీ మేము వాటిని ఎదుర్కొన్నాం. పోరాటంలో చర్చలు కూడా ఓ భాగమే అని మహ్మద్ గాలిఫ్ అన్నారు.తదుపరి చర్చల మాట్లాడే అంశాలపై చివరి దశ ఫ్రేమ్ వర్క్ రూపొందిస్తున్నామని ఇరాన్ ప్రతినిధులు ఈ అంశాలపై సమాలోచనలు జరుపుతున్నారని తెలిపారు. మరోవైపు ట్రంప్ సైతం ఈ అంశంపై స్పందిస్తూ ప్రస్తుతం రెండు దేశాల మధ్య చాలా మంచి సంభాషణలు జరుగుతున్నాయి.ట్రంప్ వ్యాఖ్యలుఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ అంశంపై మాట్లాడుతూ.. చర్చలు సానుకూలంగానే ఉన్నాయని, అయితే ఇరాన్ తమను "బ్లాక్మెయిల్" చేయాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఒప్పందం కుదరకపోతే మళ్ళీ బాంబుల దాడి మొదలుపెడతామని అంతకుముందు ఆయన హెచ్చరించారు.ఇస్లామాబాద్ భేటీఏప్రిల్ 11న ఇస్లామాబాద్‌లో అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ , గాలిబాఫ్ నేతృత్వంలోని బృందం మధ్య చర్చలు జరిగాయి. 1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత ఈ స్థాయిలో ఇరు దేశాల మధ్య చర్చలు జరగడం ఇదే తొలిసారి. అనంతరం మరోదఫా చర్చలు పాకిస్థాన్ వేదికగా రేపు ( సోమవారం) జరగనున్నట్లు సీఎన్ఎన్ నివేదిక వెల్లడించింది.మరోసారి టెన్షన్అయితే ఇరు దేశాల మధ్య సానూకూల వాతావరణం వచ్చినట్లే వచ్చి మరోసారి ఉద్రిక్తపరిస్థితులు నెలకొన్నాయి. ఇరాన్ తొలుత హర్ముజ్‌పై విధిస్తున్న దిగ్భందం తీసివేస్తున్నట్లు ప్రకటించింది. అనంతరం ట్రంప్ వ్యాఖ్యలతో ఆగ్రహించిన ఇరాన్ మరోసారి జలసంధిని మూసివేస్తున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో మరో దఫా చర్చలలో ఏం జరగనుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. -
ఇరాన్ రాజకీయాల్లో కలకలం.. ఖమేనీ అంత్యక్రియలు ఎప్పుడు?
టెహ్రాన్: ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణించి నెలలు గడుస్తున్నా,ఆయన అంత్యక్రియలు ఇప్పటి వరకూ పూర్తి కాలేదు. దీనికి కారణం ఇరాన్ ప్రభుత్వంలో నెలకొన్న భయాలేనని అంతర్జాతీయ వర్గాలు చెబుతున్నాయి. ఖమేనీ అంత్యక్రియలను బహిరంగంగా నిర్వహిస్తే భారీ ఎత్తున జనసమూహం కారణంగా భద్రతా సమస్యలు తలెత్తే అవకాశం ఉందని సమాచారం.ఈ ఏడాది ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో ఖమేనీ మరణించారు. ఆ రోజు నుంచి పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం పరిస్థితులు కొంత సర్దుమణిగినట్లు కనిపిస్తున్నా అంత్యక్రియలు మాత్రం ఇంకా పూర్తి కాలేదు.మార్చి 4న మూడు రోజుల పాటు రాష్ట్ర అంత్యక్రియలు నిర్వహించేందుకు ఇరాన్ ప్రభుత్వం ప్రయత్నాలు చేసింది. కానీ అమెరికా–ఇజ్రాయెల్ వరుస దాడుల కారణంగా ఆ ప్రణాళికను విరమించుకుంది. ఫలితంగా ఖమేనీ అంత్యక్రియలు ఇప్పటికీ జరగకపోవడం చర్చనీయాంశమైంది. ఇదే సమయంలో ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ ప్రభుత్వంలోని పలువురు ప్రముఖులు ప్రాణాలు కోల్పోవడం పరిస్థితిని మరింత క్లిష్టం చేసింది. ఖమేనీ మరణం తర్వాత ఆయన కుమారుడు మోజ్తబా ఖమేనీ సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టినా, ఇప్పటివరకు ప్రజల ముందుకు రాకపోవడం కూడా అనుమానాలకు తావిస్తోంది.1989లో ఇస్లామిక్ విప్లవ నాయకుడు, తొలి సుప్రీం లీడర్ రుహుల్లా మోసావీ ఖమేనీ మరణించిన మరుసటి రోజే ఆయన అంత్యక్రియలు భారీ ఎత్తున జరిగాయి. లక్షలాది మంది ప్రజలు తేహ్రాన్ వీధుల్లోకి పోటెత్తారు. కానీ అలీ ఖమేనీ మరణం తర్వాత అలాంటి దృశ్యాలు కనిపించకపోవడం విశేషం.ఈ నేపథ్యంలో అమెరికాలోని ఇరాన్ విశ్లేషకుడు బెహ్నామ్ బెన్ తలెబ్లూ మాట్లాడుతూ.. ఇరాన్ ప్రభుత్వం అంత్యక్రియలు నిర్వహించలేనంత బలహీనంగా ఉంది. ప్రజా వీధులు తమవని ఎప్పుడూ చెప్పుకుంటుంది. కానీ వాస్తవానికి ప్రజలు నిరసనలకు దిగుతారనే భయంతో 50 రోజుల పాటు ఇంటర్నెట్ను బ్లాక్ చేసింది” అని వ్యాఖ్యానించారు.అంత్యక్రియల ఆలస్యానికి కారణాలుగా వైమానిక దాడుల ముప్పు, జాతీయవాద నిరసనలు మళ్లీ చెలరేగే అవకాశం, అలాగే మోజ్తబా ఖమేనీ ఖననానికి ఆశించిన స్థాయిలో ప్రజల ముందుకు రాకపోవడం వంటి కారణాలుగా అంతర్జాతీయ మీడియా నివేదికలు చెబుతున్నాయి. ఇరాన్ ప్రభుత్వ మీడియా ప్రకారం, ఖమేనీ స్వస్థలం మష్హాద్ నగరాన్ని అంత్యక్రియల స్థలంగా పరిశీలిస్తున్నారు. మష్హాద్‌లోని ఇమామ్ రెజా దర్గా షియా ముస్లింలకు పవిత్ర స్థలం. అక్కడే ఖమేనీని సమాధి చేయాలన్న ప్రతిపాదన ఉందని వెలుగులోకి వచ్చిన నివేదికలు హైలెట్ చేస్తున్నాయి. -
భారత నౌకలపై ఇరాన్ దాడి.. ఆడియో టేప్ వైరల్
నిన్న (శనివారం) హర్ముజ్ జలసంధి దాటుతున్న భారత వాణిజ్య నౌకలపై ఇరాన్ నావికా దళం దాడి చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ దాడి సమయంలో ఆ నౌకకు సంబంధించిన ఆడియో టేప్ బయిటకు వచ్చింది. అందులో నౌక కెప్టెన్ ఇచ్చిన ఎమర్జెన్సీ సందేశం ఇప్పుడు వైరల్‌గా మారింది.పశ్చిమాసియా యుద్ధం ప్రారంభం నుంచి ఇరాన్ హర్ముజ్ జలసంధిని దిగ్భందనం చేసింది. ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన జలసంధిని మూసివేయడంతో అంతర్జాతీయంగా చమురు రవాణా సరఫరా స్తంభించిపోయింది. అయితే భారత్‌తో పాటు ఇతర మిత్ర దేశాలకు చెందిన కొన్ని నౌకలకు మాత్రం జలసంధి గుండా ప్రయాణానికి ఇరాన్ అనుమతించింది. అయితే నిన్న భారత్‌కు చెందిన వాణిజ్య నౌకపైన ఇరాన్ నావిక దళ సిబ్బంది దాడి చేయడం కలకలం రేపింది. ఇప్పుడు దానికి సంబంధించిన ఎమర్జెన్సీ మేస్జ్ ఆడియో టేప్ ఇప్పుడు వైరల్‌గా మారింది.ఆ ఆడియోలో " సెపా నేవీ. సెపా నేవీ. ఇది సన్మార్ హెరాల్డ్ మోటార్ ట్యాంకర్. మీరు నాకు వెళ్ళడానికి అనుమతి ఇచ్చారు. మీ జాబితాలో నా పేరు రెండవది. మీరు ఇప్పుడు కాల్పులు జరుపుతున్నారు. నన్ను వెనక్కి తిరగనివ్వండి" అని ఆ నౌకలోని వ్యక్తి అంటున్నట్లు సందేశం ఉంది. మరోవైపు భారత్ సైతం దీనిపై తీవ్రంగా స్పందించింది. ఈ మేరకు భారత్‌లోని ఇరాన్ రాయబారిని పిలిపింది ఈ విషయమై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇరాన్ ఇది వరకూ భారత్‌కు చెందిన నౌకలకు హర్ముజ్ గుండా వెళ్లడానికి అనుమతులిచ్చిందని ప్రస్తుతం సైతం ఆ సేవలను పునరుద్ధరించాలని కోరినట్లు సమాచారం.అయితే ప్రస్తుతం యుద్ధంపై మరోసారి ఆందోళన కర పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికా - ఇరాన్ చర్చలు పురోగమిస్తున్నాయనే తరుణంలో ట్రంప్ విద్వేశపూరిత వ్యాఖ్యలతో పరిస్థితి మళ్లీ మెుదటికి వచ్చింది. హర్ముజ్ జలసంధిని తెరుస్తున్నట్లు ప్రకటించిన ఇరాన్ ఒకరోజు తిరగకుండానే దానిని మూసివేసింది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య జరిగే రెండోదఫా చర్చలలో ఏం జరగనుందా అని సర్వత్రా టెన్షన్ నెలకొంది.ఏం జరిగింది?శనివారం హార్మూజ్ జలసంధిని దాటే ప్రయత్నంలో దాదాపు రెండు వాణిజ్య నౌకలపై తుపాకీతో కాల్పులు జరిగాయని రాయిటర్స్ వార్తాసంస్థ తెలిపింది. ఈ సమాచారం సముద్ర భద్రత సిబ్బంది, షిప్పింగ్ వర్గాల నుంచి అందిందని పేర్కొంది. ఈ కాల్పుల ఘటన ఒమాన్‌కు ఈశాన్య దిశగా 20 నాటికల్ మైళ్ల దూరంలో జరిగిందని యునైటెడ్ కింగ్డమ్ మెరిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ తెలిపింది. ట్యాంకర్ సిబ్బంది సురక్షితంగా ఉన్నారని కూడా పేర్కొంది.షిప్పింగ్ వర్గాల సమాచారం ప్రకారం.. ఇరాన్ నౌకాదళం నుంచి రేడియో సందేశం అందింది. హర్మూజ్ జలసంధి మళ్లీ మూసివేసినట్లు ప్రకటించారు. ఎలాంటి నౌకలు దాటడానికి అనుమతి లేదని తెలిపారు. ఇది ఇరాన్ ముందుగా వాణిజ్య నౌకలకు జలసంధిని తెరిచి ఉంచుతామని చెప్పిన ప్రకటనకు విరుద్ధంగా తీసుకున్న నిర్ణయం. అంతర్జాతీయ షిప్పింగ్ కంపెనీలు ఇరాన్ నుంచి స్పష్టత కోరుతున్నాయి.కాగా, తమకు సంబంధించిన నౌకలపై ప్రయాణ స్వేచ్ఛను అమెరికా పునరుద్ధరించే వరకు హర్మూజ్ జలసంధిలో పరిస్థితి కఠిన నియంత్రణలో ఉంటుందని ఇరాన్ పేర్కొంది. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో ఒప్పందం కుదిరే వరకు అమెరికా నౌకాదళ నిర్బంధం పూర్తిగా కొనసాగుతుందని తెలిపారు.#BREAKING Audio clip emerges from attacked Indian oil tanker!"You gave me clearance to go. My name is second on your list. You are firing now. Let me turn back!" — Audio from the Indian oil tanker fired on by the Iranian NavyClearance given. Ship fired on anyway https://t.co/FDAxliPc7Q pic.twitter.com/KH0Y4eYGCh— Nabila Jamal (@nabilajamal_) April 18, 2026 -
యుద్ధం వేళ మిత్ర దేశాలకు ట్రంప్ ఝలక్..
వాష్టింగన్: ఇరాన్, అమెరికా యుద్ధం, ఉద్రిక్తత వేళ అధ్యక్షుడు ట్రంప్.. ఇజ్రాయెల్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ఇజ్రాయెల్.. అమెరికాకు అత్యంత నమ్మకమైన, శక్తిమంతమైన మిత్రదేశమని కితాబు ఇచ్చారు. అమెరికాకు గొప్ప భాగస్వామి అంటూ వ్యాఖ్యానించారు. అయితే, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అమెరికాను అనవసర యుద్ధాల్లోకి లాగుతున్నారన్న విమర్శల మధ్య ట్రంప్ ఇలాంటి ప్రకటన చేయడం విశేషం.అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదిక ట్రూత్ వేదికగా.. ఇజ్రాయెల్ ఎవరికి నచ్చినా, నచ్చకపోయినా అమెరికాకు గొప్ప భాగస్వామి. అమెరికాకు ఇజ్రాయెల్ అత్యంత నమ్మకమైన, శక్తిమంతమైన మిత్రదేశం. ఇజ్రాయెల్ ప్రజలు ధైర్యవంతులు, తెలివైనవారు, సాహసవంతులు. ఇరాన్ యుద్ధం వంటి సంక్షోభం లేదా ఒత్తిడి సమయంలో ఇతర దేశాలు తమ అసలు స్వరూపాన్ని బయటపెడుతుంటే, ఇజ్రాయెల్ మాత్రం గట్టిగా నిలబడి పోరాటం చేస్తోంది. విజయం ఎలా సాధించాలో ఇజ్రాయెల్‌కు బాగా తెలుసు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.అయితే, అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ముఖ్యంగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అమెరికాను అనవసర యుద్ధాల్లోకి లాగుతున్నారన్న విమర్శల మధ్య ఈ మద్దతు ప్రకటన వెలువడటం విశేషం.President Donald Trump strongly praised Israel, declaring:"Whether people like Israel or not, they have proven to be a GREAT Ally of the United States of America."A powerful reaffirmation of the enduring US-Israel strategic partnership.#Trump #Israel #USIsraelAlliance… pic.twitter.com/YXqqMcoo9j— News Narrative (@NewsNarrative1) April 19, 2026ఇదిలా ఉండగా.. మధ్య ప్రాచ్యంలో పరిస్థితులు రోజురోజుకు ఉద్రిక్తంగా మారుతున్నాయి. ఒకవైపు అమెరికా-ఇజ్రాయెల్ మైత్రి బలపడుతుండగా, మరోవైపు ఇరాన్ చర్యలు పరిస్థితిని మరింత క్లిష్టతరం చేస్తున్నాయి. హార్మూజ్ జలసంధి మూసివేత వంటి నిర్ణయాలు అంతర్జాతీయ వాణిజ్యం, ఇంధన సరఫరాపై ప్రత్యక్ష ప్రభావం చూపే అవకాశముంది. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలు పరిస్థితులను దగ్గరగా పరిశీలిస్తున్నాయి. -
బీటా హెమ్మతిని చంపేస్తామని ఇరాన్ బెదిరింపులు.. మౌనంగా డొనాల్డ్ ట్రంప్
టెహ్రాన్ : పశ్చిమాసియా యుద్ధం ముగింపు దిశగా అడుగులు పడుతున్న తరుణంలో ఇరాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. జనవరిలో జరిగిన ప్రభుత్వ వ్యతిరేక నిరసనల్లో పాల్గొన్న మహిళ బీటా హెమ్మతికి మరణశిక్ష విధించాలని నిర్ణయించింది. నిరసనలకు గాను మరణశిక్షకు గురైన తొలి మహిళగా బీటా నిలిచింది. ప్రస్తుతం మరణశిక్ష ఖైదీలుగా ఉన్న నలుగురిలో ఆమె ఒకరు. బీటాతో పాటు ఆమె భర్త మహమ్మద్ రెజా మజీదీ-అస్ల్కూ మరణశిక్ష విధించాలని అధికారులు నిర్ణయించారు.వేలాది మంది ప్రాణాలు కోల్పోయిన, పదుల వేల మంది అరెస్టులకు దారితీసిన నిరసనలలో పాల్గొన్నందుకు ఇరాన్ ఇప్పటివరకు ఏడుగురికి ఉరిశిక్ష అమలు చేసింది. ఇజ్రాయెల్–అమెరికా సంయుక్త యుద్ధం నేపథ్యంలో మరణశిక్షల అమలుపై మానవ హక్కుల సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. మహమ్మద్ రెజా మజీదీ-అస్ల్, అతని భార్య బీటా హెమ్మతి, బెహ్రూజ్ సమనేజాద్, కౌరోష్ సమనేజాద్లకు విధించనున్న మరణశిక్షపై అంతర్జాతీయ స్థాయిలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి.అమెరికా జోక్యం తర్వాత, జనవరి నిరసనల్లో అరెస్టైన ఇర్ఫాన్ సోల్తానీ (26)కి విధించిన మరణశిక్షను ఇరాన్ తగ్గించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. దేశ భద్రతకు హాని కలిగించడం, ప్రభుత్వ వ్యతిరేక ప్రచారం వంటి ఆరోపణలు ఉన్నప్పటికీ, అటువంటి నేరాలకు మరణశిక్ష విధించరాదని కొత్త వివరణ ఇచ్చారు.జనవరి 10న నిరసనల్లో పాల్గొన్నందుకు అరెస్టైన ఇర్ఫాన్ సోల్తానీకి జనవరి 14న ఉరిశిక్ష అమలు చేస్తామని అధికారులు ప్రకటించారు. అనంతరం అనూహ్యంగా వాయిదా వేసి, అతనిపై విధించిన ఆరోపణలు మరణశిక్షకు తగినవి కావని స్పష్టం చేశారు. అయితే, ప్రస్తుతం మరణశిక్షకు గురైన ఇతర ఖైదీల విషయంలో ట్రంప్ మౌనం వహిస్తున్నారు. -
హార్మూజ్‌పై ఇరాన్ సంచలన ప్రకటన
టెహ్రాన్: అమెరికా, ఇరాన్ మధ్య మరోసారి మాటల యుద్ధం పీక్ స్టేజ్‌కు చేరుకుంది. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘేర్ గాలిబాఫ్.. అమెరికా, ఇజ్రాయెల్‌పై నిప్పులు చెరిగారు. హార్మూజ్ జలసంధిని ప్రస్తుతానికి తెరిచే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అమెరికా వద్ద ఎక్కువ ధనం, సైనిక శక్తి, అధునాతన ఆయుధాలు, ప్రపంచవ్యాప్తంగా దాడులు చేసిన అనుభవం ఉండవచ్చు. అయితే, వనరులు ఉన్నంత మాత్రాన యుద్ధంలో గెలవలేరు అంటూ కౌంటర్ ఇచ్చారు.ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘేర్ గాలిబాఫ్ తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ..‘అంతర్జాతీయ ఇంధన రవాణాకు హార్మూజ్ జలసంధి అత్యంత కీలకం. హార్మూజ్ జలసంధిపై పట్టు సాధించడం అమెరికా ప్రధాన లక్ష్యం. ఈ జలసంధిని తమ అదుపులోకి తీసుకోవడం ద్వారా ఇరాన్‌ను ప్రపంచ దేశాల నుంచి వేరు చేయాలని వారు చూశారు. కానీ, ఇరాన్ నౌకాదళం, క్షిపణి దళాల పహారా ముందు వారి ప్రయత్నాలు సాగలేదు. అమెరికా వద్ద ఎక్కువ ధనం, సైనిక శక్తి, అధునాతన ఆయుధాలు, ప్రపంచవ్యాప్తంగా దాడులు చేసిన అనుభవం ఉండవచ్చు. శత్రువుల దగ్గర వనరులు ఉన్నా, వాటిని ఉపయోగించే ప్రణాళికలో లోపాలు ఉన్నాయనే విషయాన్ని గుర్తించాలి. యుద్ధంలో ఇరాన్ సాధించిన పైచేయిని చూసి అగ్రరాజ్యం భయపడి ఒప్పందానికి వచ్చింది. మొదట హెచ్చరికలు జారీ చేసిన శత్రువులు, ఇరాన్ వెనక్కి తగ్గకపోవడంతో ఇప్పుడు మధ్యవర్తుల ద్వారా విజ్ఞప్తులు పంపుతున్నారు’ అని సెటైర్లు వేశారు.Mohammad Bagher Ghalibaf:“We are fully prepared, if they make even the slightest mistake, we will respond with force.”The message is clear: escalation won’t go unanswered. The stakes just got higher. pic.twitter.com/SuOEkhH2wj— Irfan Ahmad (@Irfuu_) April 18, 2026ట్రంప్ ఆటలు సాగవు..ఇరాన్‌ను బలహీనపరచాలని శత్రు దేశాలు పన్నిన వ్యూహాలన్నీ బెడిసికొట్టాయి. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్ ప్రజల దేశభక్తిని, సైనిక వ్యూహాలను అంచనా వేయడంలో విఫలమయ్యాయి. వ్యూహాత్మక తప్పిదాలు చేశాయి. ఇరాన్ తన పరిమిత వనరులతోనే శత్రువును ఉక్కిరిబిక్కిరి చేసింది. ఇరాన్లో పాలన మార్పు తీసుకురావాలని ట్రంప్ కలలు కన్నారు. కానీ, ఇరాన్ గడ్డపై ట్రంప్ ఆటలు సాగవు. ఇరాన్ అంటే వెనిజులా కాదని, ఇక్కడ శత్రువుల బెదిరింపులకు లొంగిపోయే ప్రభుత్వం లేదు అనేది ముందుగా తెలుసుకోవాలి’ అని హెచ్చరించారు. దేశ సార్వభౌమాధికారం, జాతీయ ప్రయోజనాల విషయంలో ఇరాన్ రాజీ పడే ప్రసక్తే లేదు. ఇరాన్ రేవులపై అమెరికా విధిస్తున్న దిగ్బంధనాన్ని ఎత్తివేసే వరకు హార్మూజ్ జలసంధిని మూసే ఉంటుందని స్పష్టం చేశారు.‘అమెరికా ఫస్ట్’ కాదు.. ఇజ్రాయెల్ ఫస్ట్.. ఇదే సమయంలో ఎన్నికల సమయంలో ట్రంప్ చెప్పిన అమెరికా ఫస్ట్ నినాదంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా ఆయన.. ట్రంప్ పదేపదే చెబుతున్న ‘అమెరికా ఫస్ట్’ నినాదం గాలికి వదిలేశారు. ట్రంప్ చెప్పేది ఒకటి చేసేది మరొకటి. ‘అమెరికా ఫస్ట్’ అనే నినాదం ఆచరణలో లేదన్నారు. ఆయన ‘ఇజ్రాయెల్ ఫస్ట్’ అనే నినాదం ఎత్తుకున్నట్టు ఉన్నారు. అలాగే వ్యవహరిస్తున్నారు. ఇజ్రాయెల్ ఇచ్చే తప్పుడు సమాచారంతో అమెరికా తన విదేశీ విధానాలను నాశనం చేసుకుంటోంది అంటూ విమర్శించారు. -
‘వార్’ఇంటీ వాకిట్లో... కష్టాల చెట్లు!
అదేంటోగానీ రేలంగి మావయ్యకు అంతా మంచిగానే అనిపిస్తుంటుంది. అంతటా మంచే కనిపిస్తుంటుంది. చివరకు నిన్నమొన్నటి యుద్ధం టైమ్‌లో కూడా. ఆ వార్ తాలూకు కష్టాల్లోనూ మంచిని వెతుక్కుంటుంటాడు మన రేలంగి మామయ్య. ‘‘సార్... రేలంగి అంకుల్ సార్. యుద్ధమంటేనే చెడ్డది. ఆ చెడ్డదాంట్లో కూడా... ఆ యుద్ధాల వాకిట్లో... కష్టాల చెట్లనీ... చెట్లలో కూడా నీడను చూస్తున్నారంటే మీరు మామూలు వ్యక్తులు కారు సార్’’ అన్నాడు రేలంగి మామయ్యగారి వూరి వ్యక్తి ఒకాయన. ‘‘కష్టాలను చెట్టుతో పోల్చారంటే... అసలు మీకంటే గొ΄్పోడెవరుంటార్సార్. ఈ మండు వేసవికాలంలో ఆ చెట్టు నీడకు క్రమంగా అలవాటయ్యామంటే అంతకంటే చల్ల గాలి ఏముంటుందీ. అంతకంటే నేచురాలిటీ ఏముంటుందండీ’’ అంటూ వాక్రుచ్చాడు రేలంగి మామయ్య. ఈ సంభాషణకు నేపథ్యం ఏమిటంటే... ‘‘ఈ ట్రంప్ ఉన్నాడే. వాడు మా చెడ్డవాడు సార్. అనవసరంగా కెలికి లోకమంతటికీ యుద్ధం కష్టాలు తెచ్చిపెట్టాడు. వార్ చేసుకుంటున్నవారు సరే... అసలా వార్తో ఏ సమ్మంధమూ లేనివారిక్కూడా ఎందుకండీ ఈ పాట్లూ... ఈ తిప్పలూ’’ అన్నాడు అక్కడి పల్లెవాసుల్లో ఒకడు. తండ్రికి ఇరువైపులా కూర్చున్న ఆయన కొడుకులు కూడా అదేమాటన్నారు. అంతే... ఒక్కపెట్టున వాళ్లకో క్లాసు తీసుకుంటూ చెలరేగి΄ోయాడు రేలంగి మామయ్య. ఇలా తన స్పీచందుకున్నాడు. ‘‘ఈ యుద్ధం కష్టాలు చూశావా? ఇందులో సీఎన్జీ గ్యాసు దొరకని ఆటోవాడున్నాడూ. టైమ్‌కు ఇంటికి గ్యాసు సిలెండర్ రానివాడున్నాడూ. రెండ్రోజులపాటు పెట్రోలు బంకుల్లో వరసగా బండ్లను పెద్ద... పే...ద్ద... క్యూల్లో నిలబెట్టినవారున్నారూ. మార్కెట్‌కెళ్లి పచారీసామాన్ల రేట్లు చూసి గుండెలు బాదుకున్నవారున్నారూ. వీళ్లందరిదీ ఒకటే మాట. ‘దేవుడా నేను మంచోణ్ణి. నాకు గ్యాసు దొరికేలా చూడూ... దేవుడా మేము మంచోళ్లం... మా స్టవ్వుకు గ్యాస్సిలెండరు లోటు రానివ్వకుండా చూడు. మాకు యుద్ధంతో సమ్మంధం లేదు. మాకెలాంటి సరుకుల కొరతా రానివ్వకు’ అని. కానీ ట్రంపు మంచోడ్రా. ట్రంపంటేనే మంచోడు. అందరికీ సరిసమానంగా కష్టాలు తెచ్చిపెట్టాడు. ఎప్పుడో మా చిన్నతనాన కట్టెల పొయ్యి మీద వండిన టేస్టీ వంటకాల రుచి చూశామా. మళ్లీ ఇన్నాళ్లకి మనందరికీ కట్టెల పొయ్యి మీద వండిన వంటకాల కమ్మటి రుచిని పరిచయం చేశాడు. మన నాస్టాల్జియా రోజుల తాలూకు వంటల రుచి మనకు మళ్లీ చూపించాడు. అందుకు మనమంతా ట్రంపుకి రుణపడి ఉండాల్రా. బజ్జీల బండ్లకూ, టిఫెన్ హోటళ్లకు బ్లాకులో తప్ప కమర్షియల్ సిలెండర్లు దొరక్కుండా చేశాడా... దాంతో కర్రీ΄ాయింట్ల నుంచి కూరలు తెచ్చుకోకుండా, బజార్నుంచి ఏ జంకుఫుడ్డో ఇంటికి తెచ్చుకోకుండా... అందరూ హెల్దీగా హాయిగా హోమ్ఫుడ్డు మాత్రమే వండుకునేలా చేస్తున్నాడు. ఇలా మనందరి ఆరోగ్యాలూ కాపాడుతున్నాడు. అందుకే ట్రంపు మంచోడ్రా. ట్రంపంటేనే మంచోడు. ఒరేయ్... భలే తెచ్చార్రా. భలేగా కట్టెలు కొట్టుకొచ్చారు గొడ్డలితో. ఏదేమైనా... టైముకు తగ్గట్లు – సిచ్యువేషన్ కు సింకయ్యేట్లుగా అలా అందుకోవాల్రా. అన్నట్టొరేయ్... ఈ వార్ వరకే రా – ఈ కష్టాలన్నీ! తర్వాత మరో సంక్షోభమేదో వెతుక్కుంటూ వస్తుంది కదా. మళ్లీ అప్పుడీ కష్టాలు ఉండవు రా. అప్పుడొచ్చేవన్నీ మళ్లీ ఫ్రెష్షు కష్టాలూ... చాలా పెద్ద పెద్ద కష్టాలున్నూ! అష్టకష్టాల్రా అవి. ఓ రకంగా చెప్పాలంటే ముందుముందొచ్చే పెద్ద పెద్ద కష్టాలకు ప్రీవ్యూల్లాంటివి రా... ఈ ట్రైలర్ కష్టాలన్నీ. రాబోయే పాట్లు పెద్దవిగా అనిపించకూడదని... ఇప్పుడే మనకీ శిక్ష–ణ దొరికేలా చూస్తున్నాడురా ట్రంపు. అందుకే ట్రంపు మంచోడ్రా. అసలు ట్రంపంటేనే మంచోడు’’ అంటూ తన మంచితనపు ఉపదేశాన్ని మంచిమంచి మాటల్తో... మంచిగా ముగించాడు మన రేలంగి మావయ్య. ఆ స్పీచ్ విని దారిన పోతున్న ఒక దానయ్య గారికి అకస్మాత్తుగా రావు రమేశ్ పూనాడు. అప్పుడా రావు రమేశ్ పూనిన వ్యక్తి అన్న మాటేవిటో తెలుసా... ‘‘ఈలోకంలో అన్నింటికీ సూత్రాలు కనిపెట్టారుగానీ... ఈ రేలంగి మాయ్యేవిటో... ఈడి విదానాలేవిటో మనకర్దంగావడం లేదు. మావయ్యగారిని ఎవరికన్నా సూపించండ్రా. వదిలేయకండ్రా బాబు అలాగ. సూపించండ్రా’’ అంటూ సవిలెంటుగా డవిలాగు అంటూ మాయమయ్యాడు తెగ మండిపోతూ ఉన్న అపరిచితుడొకడు!– యాసీన్ -
‘ట్రంప్‌తో వాదనకు ఏమాత్రం ఆసక్తి లేదు’
రోమ్: ఇరాన్ యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో వాదించేందుకు తనకు ఏమాత్రం ఆసక్తి లేదని క్యాథలిక్కుల మతపెద్ద పోప్ లియో–14 స్పష్టం చేశారు. దైవ సందేశాన్ని బోధించడమనే తన కర్తవ్యాన్ని యథావిధిగా కొనసాగిస్తానని చెప్పారు. ఆఫ్రికాలోని కామెరూన్ నుంచి అంగోలాకు విమానంలో వెళ్తూ మీడియాతో ఆయన మాట్లాడారు.తన బోధనలు ట్రంప్‌ను ప్రత్యక్షంగా ఉద్దేశించినవి కావని, విస్తృత శాంతి సందేశంలో అవి ఒక భాగమని వివరించారు. తన పర్యటన మొదటి రోజే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నన్ను ఉద్దేశిస్తూ చేసిన కొన్ని వ్యాఖ్యల వల్ల ఏర్పడిన రాజకీయ వాతావరణం కారణంగా.. తనపై వ్యతిరేక ప్రచారం జరిగిందన్నారు. అందులోని కొన్ని అంశాలు నిజాలు కావని చెప్పారు. -
భారత నౌకలపై ఇరాన్ కాల్పులు!
కైరో/న్యూఢిల్లీ: అంతర్జాతీయ చమురు రవాణాకు జీవనాడి అయిన హార్మూజ్ వద్ద ఉద్రిక్తతలు మళ్లీ తారస్థాయికి చేరుతున్నాయి. ఆ జలసంధిని తెరిచినట్టు ఇరాన్ శుక్రవారం ప్రకటించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో హార్మూజ్‌ను దాటుతున్న రెండు భారత చమురు నౌకలపై శనివారం ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ (ఐఆర్జీసీ)కి చెందిన స్పీడ్ బోట్లు కాల్పులకు దిగాయి. దాంతో అవి జలసంధిని దాటకుండానే వెనుదిరిగినట్టు అంతర్జాతీయంగా నౌకల రాకపోకలను ట్రాక్ చేసే టాంకర్ట్రాకర్స్ డాట్‌కామ్ తదితర సంస్థలు వెల్లడించాయి. వాటిలోని సిబ్బంది సురక్షితంగానే ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత్‌లో ఇరాన్ రాయబారి మొహమ్మద్ ఫతాలీకి సమన్లు జారీ చేసింది. అంతేగాక ఇరాన్ చర్యపై తీవ్ర నిరసన కూడా వెలిబుచ్చినట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఐఆర్జీసీ కాల్పులతో మరో నాలుగు భారత చమురు నౌకలు హార్మూజ్‌ను దాటకుండానే వెనుదిరిగాయి. చమురు, సహజవాయువు, ఎరువుల నిల్వలతో కూడిన 13 భారత నౌకలు ప్రస్తుతం జలసంధి వద్ద చిక్కుబడి ఉన్నాయి. అవి సురక్షితంగా హార్మూజ్ దాటేలా ఇరాన్‌తో భారత్ సంప్రదింపులు జరుపుతోంది. అయితే ‘దేశ్ గరిమ’ అనే చమురు నౌక శనివారం హార్మూజ్‌ను దాటి భారత్‌వైపు బయల్దేరినట్టు తెలుస్తోంది. మరోవైపు హార్మూజ్ జలసంధిని తిరిగి మూసేస్తున్నట్టు ఇరాన్ తాజాగా ప్రకటించింది. తమ ఓడరేవుల దిగ్బంధానికి అమెరికా స్వస్తి పలకని కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. దిగ్బంధం కొనసాగినంత కాలం హార్మూజ్‌ను తెరవబోమని ప్రకటించింది. దీనికి తోడు ఇరాన్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి బెదిరింపులకు దిగారు. త్వరలో ఒప్పందానికి రానిపక్షంలో కాల్పుల విరమణ పొడిగింపు ఉండబోదని కుండబద్దలు కొట్టారు. అంతేగాక ఇరాన్‌పై మళ్లీ బాంబుల వర్షం కురిపిస్తామని తాజాగా హెచ్చరికలు జారీ చేశారు. అణు కార్యక్రమంతో పాటు అన్ని అంశాలపైనా ఇరాన్ తమతో సమగ్ర ఒప్పందం కుదుర్చుకునేదాకా ఆ దేశ ఓడరేవుల దిగ్బంధం కొనసాగుతుందని కూడా అధ్యక్షుడు స్పష్టం చేశారు. దాంతో పశి్చమాసియాలో పరిస్థితులు మళ్లీ విషమించేలా కన్పిస్తున్నాయి. త్వరలో చర్చలు! అమెరికా, ఇరాన్ నడుమ మరో దఫా శాంతి చర్చల కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నట్టు పాకిస్తాన్ వెల్లడించింది. ఆ రెండు దేశాల నడుమ కాల్పుల విరమణ ఏప్రిల్ 22తో ముగుస్తుండటం తెలిసిందే. ఆ లోపే చర్చలు జరిగే అవకాశమున్నట్టు పాక్ పేర్కొంది. చర్చల నిమిత్తం పంపిన అమెరికా నూతన ప్రతిపాదనలను పరిశీలిస్తున్నట్టు ఇరాన్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కూడా వెల్లడించింది. ఇప్పటిదాకా 23 నౌకలు వెనక్కు ఇరాన్ ఓడరేవులను దిగ్బంధించినప్పటి నుంచీ ఇప్పటిదాకా హార్మూజ్ జలసంధి వద్ద 23 నౌకలను అడ్డగించి వెనక్కు పంపినట్టు అమెరికా పేర్కొంది. ఆ దేశ సెంట్రల్ కమాండ్ ఎక్స్ పోస్టులో ఈ మేరకు వెల్లడించింది. ఇరాన్ ఓడరేవులతో పాటు ఆ దేశ తీర ప్రాంతమంతటా నౌకల రాకపోకలపై నిషేధం పూర్తిస్థాయిలో కొనసాగుతున్నట్టు పేర్కొంది. అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాల మేరకు ఏప్రిల్ 13న అమెరికా సైన్యం ఇరాన్ ఓడరేవుల దిగ్బంధానికి దిగింది.తీవ్ర పోరుకు సిద్ధం: మొజ్తబా శత్రువులపై తీవ్ర పోరాటానికి ఇరాన్ సిద్ధంగా ఉందని ఆ దేశ సుప్రీం నేత మొజ్తబా ఖమేనీ స్పష్టం చేశారు. వారికి భారీ ఓటమి రుచి చూపేందుకు ఇరాన్ నావికా దళం ఇప్పటికే సర్వ సన్నద్ధంగా ఉందని శనివారం విడుదల చేసిన సందేశంలో పేర్కొన్నారు. ఇరాన్ సైన్యం వ్యవస్థాపక దినం సందర్భంగా సాయుధ దళాలకు ఆయన శుభాకాంక్షలు అందజేశారు. పశ్చిమాసియా యుద్ధంలో ఇజ్రాయెల్‌తో పాటు గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై సైన్యం చేపట్టిన డ్రోన్ దాడులను ప్రత్యేకంగా ప్రశంసించారు. లెబనాన్‌లో శాంతిదళాలపై కాల్పులు → ఒక ఫ్రెంచి సైనికుని మృతి → హెజ్బొల్లా పనేనన్న మాక్రాన్ పారిస్: లెబనాన్‌లో ఐరాస శాంతి పరిరక్షక దళంపై శనివారం జరిగిన కాల్పుల్లో ఒక ఫ్రెంచి సైనికుడు మృతి చెందాడు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రాన్ ఈ మేరకు వెల్లడించారు. తమ దేశానికి చెందిన మరో ముగ్గురు సైనికులు గాయపడ్డట్టు తెలిపారు. దక్షిణ లెబనాన్‌లో శనివారం ఉదయం ఈ ఉదంతం చోటుచేసుకున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఇది హెజ్బొల్లా మిలిటెంట్ సంస్థ పనేనని ఇప్పటిదాకా అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తున్నట్టు సోషల్ మీడియా పోస్టులో మాక్రాన్ వివరించారు. ఇందుకు బాధ్యులైన వారిని లెబనాన్ ప్రభుత్వం తక్షణం అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.యురేనియం అప్పగించబోం: ఇరాన్ శుద్ధి చేసిన యురేనియం నిల్వలను అమెరికాకు అప్పగించే ప్రసక్తే లేదని ఇరాన్ కుండబద్దలు కొట్టింది. వాటిని అప్పగించేందుకు ఇరాన్ అంగీకరించిందనే అర్థం వచ్చేలా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. వాటిని ఇరాన్ విదేశాంగ శాఖ ఉప మంత్రి సయీద్ ఖతీబ్జాదే పూర్తిగా ఖండించారు. అంతేగాక, ‘‘అమెరికా మితిమీరిన అహంకారంతో వ్యవహరిస్తోంది. కనుక ఆ దేశంతో మరో దఫా చర్చలకు ఇరాన్ సిద్ధంగా లేదు’’అని ఆయన పేర్కొన్నారు. ఇరాన్ వద్ద 440 కిలోలకు పైగా శుద్ధి చేసిన యురేనియం నిల్వలున్నట్టు అంచనా. -
అమెరికాకు.. మోజ్తాబా వార్నింగ్
హర్ముజ్ జలసంధి విషయంలో అమెరికా- ఇరాన్ మధ్య మరోసారి ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తాబా ఖమేనీ కీలక ప్రకటన చేశారు. శత్రువులను ఓడించడానికి తమ దేశ నౌకలు సిద్ధంగా ఉన్నాయని ప్రకటించారు.ప్రస్తుతం ఇరాన్ అమెరికా మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ట్రంప్ వ్యాఖ్యలతో ఆగ్రహించిన ఇరాన్ హర్ముజ్‌ను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇరాన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. సుప్రీం లీడర్ మెజ్తాబా ఖమేనీ పేరిట ఈ రోజు (శనివారం) ఒక ప్రకటన విడుదలైంది.మోజ్తాబా ఖమేనీ ప్రకటనలో " అమెరికా దళాలను ఓడించేందుకు ఇరాన్ నౌకాదళం సిద్ధంగా ఉంది. శత్రువులకు కొత్త రకమైన ఓటమిని రుచి చూపిస్తాం". అని హెచ్చరించారు. కాగా యుద్దం ప్రారంభమైన నాటి నుంచి మోజ్తాబా బహిరంగంగా కనిపించలేదు. కేవలం ఆయన పేరు మీద ప్రకటనలు మాత్రమే విడుదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఆయన తీవ్ర స్థాయిలో గాయపడ్డారని, ఆయన ముఖం వికారంగా మారిందని ప్రచారం జరిగింది.ఇరాన్- అమెరికా మధ్య సయోధ్య కుదురుతుందనే నేపథ్యంలో మరోసారి ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చాయి. హర్ముజ్ జలసంధిని తెరుస్తున్నట్లు ప్రకటించిన ఇరాన్.. ఒక రోజు గడవకముందే దానిని మూసివేసింది. ఈ నేపథ్యంలో ఇస్లామాబాద్‌లో సోమవారం జరగనున్న చర్చలలో ఏం జరగనుందా అనే టెన్షన్ నెలకొంది. -
హార్మూజ్ జలసంధిలో భారత నౌకలపై కాల్పులు
టెహ్రాన్: భారత వాణిజ్య నౌకలు హార్మూజ్ జలసంధిని దాటే ప్రయత్నంలో వాటిపై కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. శనివారం హార్మూజ్ జలసంధిని దాటే ప్రయత్నంలో దాదాపు రెండు వాణిజ్య నౌకలపై తుపాకీతో కాల్పులు జరిగాయని రాయిటర్స్ వార్తాసంస్థ తెలిపింది. ఈ సమాచారం సముద్ర భద్రత సిబ్బంది, షిప్పింగ్ వర్గాల నుంచి అందిందని పేర్కొంది. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్‌కు చెందిన రెండు గన్బోట్లు జలసంధి దాటుతున్న ఒక ట్యాంకర్‌పై కాల్పులు జరిపాయని బ్రిటిష్ సైన్యం కూడా తెలిపింది. హార్మూజ్‌ను తెరుస్తున్నట్లు ప్రకటన చేసిన ఇరాన్.. ఆ తర్వాత అమెరికా తీరు వల్ల మళ్లీ మూసివేస్తున్నట్లు చెప్పిన విషయం తెలిసిందే. ఆ కాసేపటికే కాల్పుల ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.ఈ కాల్పుల ఘటన ఒమాన్‌కు ఈశాన్య దిశగా 20 నాటికల్ మైళ్ల దూరంలో జరిగిందని యునైటెడ్ కింగ్డమ్ మెరిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ తెలిపింది. ట్యాంకర్ సిబ్బంది సురక్షితంగా ఉన్నారని కూడా పేర్కొంది.షిప్పింగ్ వర్గాల సమాచారం ప్రకారం.. ఇరాన్ నౌకాదళం నుంచి రేడియో సందేశం అందింది. హార్మూజ్ జలసంధి మళ్లీ మూసివేసినట్లు ప్రకటించారు. ఎలాంటి నౌకలు దాటడానికి అనుమతి లేదని తెలిపారు. ఇది ఇరాన్ ముందుగా వాణిజ్య నౌకలకు జలసంధిని తెరిచి ఉంచుతామని చెప్పిన ప్రకటనకు విరుద్ధంగా తీసుకున్న నిర్ణయం. అంతర్జాతీయ షిప్పింగ్ కంపెనీలు ఇరాన్ నుంచి స్పష్టత కోరుతున్నాయి.కాగా, తమకు సంబంధించిన నౌకలపై ప్రయాణ స్వేచ్ఛను అమెరికా పునరుద్ధరించే వరకు హార్మూజ్ జలసంధిలో పరిస్థితి కఠిన నియంత్రణలో ఉంటుందని ఇరాన్ పేర్కొంది. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో ఒప్పందం కుదిరే వరకు అమెరికా నౌకాదళ నిర్బంధం పూర్తిగా కొనసాగుతుందని తెలిపారు.రెండో దశ చర్చలకు ఏర్పాట్లు?ఇరాన్ అధికారులు తెలిపిన ప్రకారం.. సోమవారం ఇస్లామాబాద్‌లో ఇరాన్, అమెరికా ప్రతినిధుల మధ్య చర్చలు జరిగే అవకాశం ఉంది. ఇరు వర్గాలు ఆదివారం ఇస్లామాబాద్ చేరుకునే అవకాశముంది.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా పాకిస్థాన్‌కు వెళ్లే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఇరాన్‌తో ఒప్పందం చేసుకోవడంలో ఆయన పర్యటన సాయపడుతుందని భావిస్తున్నారు. ఇరాన్ అణు కార్యక్రమంపై 20 సంవత్సరాల విరామాన్ని అమెరికా ప్రతిపాదించగా, ఇరాన్ మాత్రం 5 సంవత్సరాల విరామాన్ని ప్రతిపాదించినట్లు సమాచారం.ప్రస్తుతం కొనసాగుతున్న కాల్పుల విరమణ ఒప్పందం వచ్చే వారం ముగియనుంది. ఇస్లామాబాద్‌లో ఇటీవల 21 గంటలు చర్చలు కొనసాగాయి. ఎటువంటి పురోగతి లేకుండానే ముగిశాయి. -
రాడార్లకు చిక్కకుండా ఇరాన్‌కు చైనా విమానాలు..?
ఇటీవల అమెరికా సీక్రెట్ ఏజెన్సీలు చైనాపై సంచలన ఆరోపణలు చేశాయి. ఇరాన్‌కు యుద్ధంలో చైనా సహకరిస్తోందని ఆ దేశానికి పరోక్షంగా ఆయుధాలు అందజేస్తుందన్నాయి. అయితే ఈ ఆరోపణల్ని చైనా ఖండించింది. తాజాగా మధ్యప్రాచ్యంలో నాలుగు చైనా కార్గో విమానాలు రాడార్లకు చిక్కకుండా అదృశ్యమయ్యాయని నివేదికలు తెలిపాయి. ఈ ఆరోపణలు ఇప్పుడు ఆందోళనకరంగా మారాయి. కొద్దిరోజుల క్రితం అమెరికా నిఘా వర్గాలు ఇరాన్‌కు చైనా భారీగా మ్యాన్‌పాడ్ ఆయుధాలను తరలిస్తోందని ఆరోపించాయి. మ్యాన్‌పాడ్ అంటే భుజంపై ఎక్కడికైనా మోసుకెళ్లగల ఆయుధాలు. వీటిసాయంతో శత్రువుల హెలికాప్టర్లు, డ్రోన్లను సులభంగా కూల్చివేయవచ్చు. ఇరాన్‌తో జరిగిన యుద్ధంలో ఇవి ఎంతో కీలకంగా పనిచేశాయి. అయితే ఇప్పుడు వస్తున్న కొన్ని నివేదికలు అమెరికా సీక్రెట్ ఏజెన్సీల సర్వేలకు మరింత బలం చేకూర్చే విధంగా ఉన్నాయి.చైనా కార్గో విమానాలుకొన్నిరోజుల క్రితం.. కేవలం 48 గంటల వ్యవధిలో నాలుగు చైనా కార్గో విమానాలు తమ ట్రాన్స్పాండర్లను ఆపివేసి చైనా భూభాగంలో దిగాయని పలు నివేదికలు కథనాలు ప్రచురించాయి. ట్రాన్స్‌పాండర్ అనేది సాధారణంగా విమానం ఎంత ఎత్తులో ప్రయాణిస్తుంది. ఎంత వేగంతో వెళుతుంది అనే వివరాలని ప్రసారం చేసే ఒక పరికరం. దీనిని ఉద్దేశపూర్వకంగా ఆపివేయడాన్ని డార్క్ ఫ్లైట్ అంటారు. సాధారణంగా వెళ్లే గమ్యం వెల్లడించకుండా ఉండడానికి సైనిక కార్యకలాపాలు, రహస్య లావాదేవీల సమయంలో ఇటువంటి పద్దతులను ఉపయోగిస్తారు.ఆయుధాల తరలింపు?అయితే కొన్ని సామాజిక మాధ్యమాల కథనాల ప్రకారం.. ఆ విమానాలు ఇరాన్‌కు ఆయుధాలు తరలించడానికి ఉద్దేశించినవని అందులో మందుగుండు సామాగ్రితో పాటు ఇతర ఆయుధాలు తరలిస్తున్నారని పేర్కొంది. అయితే ఈ వ్యాఖ్యలను చైనా ఖండించినట్లు తెలుస్తోంది. అయితే ఇటీవలే చైనా, అమెరికా ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. తమ దేశం బాధ్యతాయుతమైన దేశమని యుద్ధాన్ని ప్రోత్సహించే ఏ పనులు తాము చేయమని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే ఈ నివేదికలు రావడం ఆందోళన కలిగించే అంశం.అయితే ప్రస్తుతం అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవల ఇస్లామాబాద్‌లో జరిగిన చర్చలు విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలోనే మరో దఫా చర్చలకు ఇరు దేశాలు ప్రయత్నిస్తున్నాయి. కాగా ఈ రకమైన నివేదికలు కొంత ఆందోళన కలిగిస్తున్నాయి. -
హర్ముజ్‌ను మళ్లీ మూసేసిన ఇరాన్
ప్రపంచ వ్యాప్తంగా అందరి చూపు హర్మూజ్ జలసంధి వైపే. హర్మూజ్ జలసంధిని తెరవడం.. కీలక నౌకా మార్గాలను సురక్షితం చేసే ప్రక్రియలో భాగంగా ఇప్పటికే పలు దేశాలు నడుంబిగించిన వేళ.. మళ్లీ హర్మూజ్ జలసంధి మూతపడింది. నిన్న(శుక్రవారం, ఏప్రిల్ 17వ తేదీ) హర్మూజ్ జలసంధిని తిరిగి ఓపెన్ చేస్తున్నట్లు ప్రకటించిన ఇరాన్.. రోజు వ్యవధిలోనే దాన్ని మళ్లీ మూసేసింది. అమెరికా వైఖరి కారణంగా హర్మూజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గంటకో మాట మాట్లాడుతున్న తరుణంలో అసలు ఏం జరుగుతుందో ఇరాన్‌కు అంతు చిక్కడం లేదు. ఇరాన్ హర్మూజ్ జలసంధిని ఓపెన్ చేస్తున్నట్లు ప్రకటించిన కాసేపటికి ట్రంప్ కృతజ్ఞతలు తెలిపారు. ఆపై మరి కాసేపటికి హర్మూజ్ జలసంధిని తాము మూసివేస్తున్నామని ప్రకటించారు ట్రంప్. దాంతో గందరగోళ వాతావరణం నెలకొంది. ఈ పరిస్థితుల నడుమ ట్రంప్ మాటల్లో స్పష్టత లేదని అభిప్రాయానికి వచ్చేసింది ఇరాన్. అంతే హర్మూజ్ జలసంధిని తెరిచినట్లే తెరిచి మళ్లీ మూసేసింది. నిన్న ఏం జరిగిందంటే..నిన్న శుక్రవారం ప్రపంచదేశాలకు ఇరాన్ శుభవార్త చెప్పింది. దాదాపు నెలరోజులకు పైగా పర్షియన్ గల్ఫ్ జలాల మీదుగా పయనిస్తే నౌకలను తగలబెడతామనే ఇంతకాలం హెచ్చరికలు జారీ చేసిన టెహ్రాన్ ఎట్టకేలకు బెదిరింపులకు స్వస్థి పలికి ఇకపై అన్ని రకాల వాణిజ్య నౌకల రాకపోకలకు అనుమతినిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ప్రపంచ దేశాలు ఉపిరి పీల్చుకున్నాయి. హర్మూజ్‌పై ఇరాన్ ప్రకటనతో నిన్న స్టాక్‌మార్కెట్లకు ఊపందుకున్నాయి. అమెరికా స్టాక్‌మార్కెట్లు లాభాల్లో ట్రేడవగా ముడిచమురు నేలచూపులు చూసింది. దీనికి కారణం హర్మూజ్‌కు ఇరాన్ విముక్తి కలిగించడమే అయితే ట్రంప్ చేష్టలతో ఇరాన్‌కు మరోసారి నమ్మకం చల్లగిల్లింది.ట్రంప్ కామెంట్స్ ట్రంప్ మాట్లాడుతూ "ఇరాన్ అన్నింటికీ అంగీకరించింది ‘‘ అణు కార్యక్రమాన్ని ఇరాన్ నిలపివేస్తుంది. తన “న్యూక్లియర్ డస్ట్” (అధికంగా శుద్ధి చేసిన యురేనియం) అమెరికాకు అప్పగించేందుకు సిద్ధంగా ఉంది. అయితే ఫ్రీజ్ చేసిన ఇరాన్ నిధులు మాత్రం వెనక్కి ఇవ్వబోం. త్వరలో శాశ్వత ఒప్పందంపై చర్చలు జరుగుతాయి. ఒప్పందం కుదిరితే ఉచిత చమురు, హర్ముజ్ ద్వారా స్వేచ్ఛా రవాణా.. అన్నీ బాగుంటాయి" అని వ్యాఖ్యానించారు. ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ సీరియస్దీనిపై ఇరాన్ సైతం ఘాటుగా స్పందించింది. ట్రంప్ తన ఇష్టానుసారం ప్రకటనలు ఇచ్చుకుంటూ పోతున్నారు. అమెరికా దిగ్బంధం కొనసాగితే.. హర్ముజ్‌ను మళ్లీ మూసేస్తామని హెచ్చరించింది. ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఎస్మాయిల్ బకాయీ స్టేట్ మీడియా టీవీ చానెల్లో మాట్లాడుతూ.. శుద్ధి చేసిన యురేనియం ఇరాన్ నుంచి ఎక్కడికీ తరలించబడదు. కొనసాగుతున్న చర్చల్లో ఇది ఒక ఎర్ర గీత (red line)గా మారింది అని అన్నారు. ట్రంప్ ద్వంద్వ వైఖరిఇలా ఒకవైపు చర్చలు అంటూనే ట్రంప్ ద్వంద్వ వైఖరి ప్రకటించారు. హర్మూజ్‌ను ఇరాన్ తెరిచిన దానికి ధన్యవాదాలు తెలిపిన ట్రంప్.. కాసేపటికి దాన్ని తాము మూసివేస్తున్నట్లు ప్రకటించారు. హర్మూజ్ జలసంధి ఇక తమది అనే సంకేతాలిచ్చిన ట్రంప్.. ఇరాన్‌ను మళ్లీ బెదిరించే యత్నం చేశారు. కథ మళ్లీ మొదటికిఈ పరిస్థితుల నడుమ హర్మూజ్ కథ మళ్లీ మొదటికొచ్చింది. ఒకవైపు శాంతి చర్చలు అంటూ ఇరాన్‌ను బెదిరించే యత్నాలు చేశారు ట్రంప్. హర్మూజ్ తమది అనడంతోపాటు అణుకార్యక్రమాన్ని ఇరాన్ నిలిపివేస్తుందంటూ కూడా చెప్పుకొచ్చారు. దీనిపై చిర్రెత్తుకొచ్చిన ఇరాన్,.. హర్మూజ్ జలసంధిని మళ్లీ మూసేసింది. దాంతో హర్మూజ్ కథ రకరకాల మలుపులు తిరుగుతూ ఉంది. ఇప్పుడు మళ్లీ హర్మూజ్‌ను ఇరాన్ మూసేయడంతో ఇది ఎటువైపు పోతుందో అనే చర్చ మొదలైంది. -
హే అంకుల్ సామ్! బీబీకి దూరం : ట్రంప్‌పై సెటైర్ల జోరు
అమెరికాఅధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడులు మొదలైంది మొదలు, ప్రసుత సీజ్ఫైర్ దాకా పలు సందర్భాల్లో ట్రంప్ చేసిన అనేక వివాదాస్ప, గందరగోళ ప్రకటనలపై ఇరాన్ సోషల్ మీడియా ఘోరంగా ట్రోల్ చేస్తోంది. మరోవైపు ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘేర్ గాలిబాఫ్ గట్టి కౌంటరే ఇచ్చారు. ట్రంప్ విజయోత్సాహపు వాదనలపై 7 వాదనలు, 7 అబద్ధాలు ('7 claims 7 lies') అంటూ విరుచుకు పడ్డారు. ట్రంప్ విజయోత్సాహం, ఇరాన్ తీవ్ర స్పందనఇరాన్ యుద్ధంలో విజయం సాధించానని డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా చేసిన ప్రకటనలను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. ఇవి కేవలం అబద్ధాలని, ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నమని ఇరాన్ మండిపడింది.ప్రపంచానికి ఇది ఒక గొప్ప అద్భుతమైన రోజు అంటూ ట్రంప్ తన ట్రూత్ సోషల్ (Truth Social) పోస్ట్‌లో ట్రంప్ రాసుకొచ్చిన వైనంపై జింబాబ్వేలోని ఇరాన్ ఎంబసీ సంచలన వ్యాఖ్యానించింది. "ఎక్కువ ఆనందాన్ని ప్రదర్శించవద్దు, కొంచెం హుందాగా ఉండండి. ఫోన్ పక్కన పెట్టి హాయిగా నిద్రపోండి. అలాగే నెతన్యాహు (Bibi)ని ఒక వారం పాటు బ్లాక్ చేయండి" అంటూ ఎద్దేవా చేసింది. అలాగే వివిధ దేశాల్లోని ఇరాన్ రాయబార కార్యాలయాలు ట్రంప్‌పై సెటైర్లు వేశాయి. దక్షిణాఫ్రికాలోని ఇరాన్ ఎంబసీ కూడా ఏమీ తక్కువ తినలేదు. ట్రంప్‌కు ఒక మంచి సైకియాట్రిస్ట్ (మానసిక వైద్యుడు) అవసరమని ఘాటుగా వ్యాఖ్యానించింది.New Lego video about Drunk Pete Hegseth.. pic.twitter.com/iLGGvBLtTl— PolitMemeAi🔥 (@MemesNoWords) April 17, 2026 ట్రంప్‌ను ఎగతాళి చేస్తూ, మరో పోస్ట్‌లో ఇలా కూడా పేర్కొంది, "హే అంకుల్ సామ్! మీరెందుకు ఒక నిర్ణయం తీసుకోరు? హోర్ముజ్ జలసంధిని తెరిచి ఉంచాలనుకుంటున్నారా లేక మళ్లీ మూసివేయాలను కుంటున్నారా?!" ఇదీ చదవండి: LPG Gas రూ. 12 వేల కోట్లతో నాలుగు పైప్లైన్ల ప్లాన్కాగా ట్రంప్ అనేక సోషల్ మీడియా పోస్టుల ద్వారా ఇరాన్ యుద్ధంలో విజయం సాధించాం, దీనిని ఇకపై ప్రపంచానికి వ్యతిరేకంగా ఆయుధంగా ఉపయోగించరు అని ప్రకటించిన కొన్ని గంటలకే అమెరికా తన నావికా దిగ్బంధనాన్ని కొనసాగిస్తే హోర్ముజ్ జలసంధిని మళ్లీ మూసివేయవచ్చని ఇరాన్ హెచ్చరించింది. మీడియా యుద్ధం ద్వారా ప్రజల అభిప్రాయాలను మార్చాలని అమెరికా చూస్తోందని, కానీ ఇరాన్ ప్రజలు ఇలాంటి ట్రిక్కులకు ప్రభావితం కారని గాలిబాఫ్ స్పష్టం చేశారు.ఇదీ చదవండి: ఇన్‌స్టా లవ్ : 40 ఏళ్ల విడోతో 21 ఏళ్ల యువకుడి పెళ్లి -
పెట్రోలుకు నీటి వాకిలి హార్మోజ్ జలసంధి
ఇప్పుడు రోజూ హార్మోజ్ జలసంధి వార్తల్లో ఉంది. యుద్ధం జరుగుతుంటే దానిని ఒక దేశం మూసేస్తానంటే మరో దేశం తెరుస్తాను అంటోంది. దీని వివరాలు చూద్దాం. అసలు జలసంధి అంటే ఏంటి? రెండు పెద్ద సముద్రాలను కలిపే సన్నటి నీటి దారిని ‘జలసంధి’ అంటారు. ఇది ఒక నీటి వంతెన లాంటిది. మన ఇంటి సందులో నుంచి మెయిన్ రోడ్‌కి వెళ్లినట్టు. హోర్ముజ్ జలసంధి కూడా అలాంటిదే. ఇది ఇరాన్ దేశం, ఒమన్ దేశం మధ్యలో ఉంది. పర్షియన్ గల్ఫ్ అనే సముద్రాన్ని అరేబియా సముద్రంతో కలుపుతుంది. మ్యాప్‌లో చూస్తే V షేప్‌లో కనిపిస్తుంది. దీని పేరు ‘హోర్ముజ్’ అనే దీవి పేరు మీదుగా వచ్చింది. ఆ దీవి ఒకప్పుడు వ్యాపారానికి చాలా ఫేమస్.ఏమిటి ఈ జలసంధి ప్రత్యేకత?ప్రపంచంలో రోజూ వాడే పెట్రోల్, డీజిల్‌లో దాదాపు 20%– అంటే రోడ్డు మీద తిరిగే 5 పెట్రోలు ట్యాంక్ లారీల్లో 1 లారీలోని సరుకు– ఇదే దారిలో షిప్పుల్లో వెళ్తుంది. అందుకే దీన్ని ‘ఆయిల్ హైవే’ అంటారు. ఈ జలసంధి మొత్తం వెడల్పు 33 కిలోమీటర్లు. కానీ పెద్ద పెద్ద షిప్పులు వెళ్లడానికి కేవలం 3 కి.మీ. దారి మాత్రమే వాడతారు. రెండు వైపులా వెళ్లే, వచ్చే షిప్పులకు వేరు వేరు లైన్లు ఉంటాయి – రోడ్ మీద లాగా. రోజుకి దాదాపు 20–30 పెద్ద ఆయిల్ ట్యాంకర్ షిప్పులు ఇక్కడి నుంచి వెళ్తాయి. ఒక్కో షిప్ 2 కోట్ల లీటర్ల ఆయిల్ తీసుకెళ్లగలదు!ఇక్కడ ఎందుకు గొడవలు?ఈ దారి చాలా చిన్నది కాబట్టి, ఏదైనా దేశం దీన్ని మూసేస్తే ప్రపంచానికి పెట్రోల్ దొరకడం కష్టం. పెట్రోల్ రేట్లు ఒక్కసారిగా పెరిగిపోతాయి. అందుకే అన్ని దేశాలు దీన్ని జాగ్రత్తగా చూస్తాయి. మనం వాడే పెట్రోల్, డీజిల్‌లో చాలా భాగం గల్ఫ్ దేశాల నుంచి ఇదే దారిలో వస్తుంది. కాబట్టి ఇక్కడ ఏదైనా జరిగితే మన బైక్, బస్ రేట్లు కూడా పెరుగుతాయి. హోర్ముజ్ జలసంధి అంటే ప్రపంచానికి పెట్రోల్ పంచే ‘సన్నటి డోర్’. ఆ డోర్ సేఫ్‌గా ఉంటేనే మన వాహనాలు స్మూత్‌గా నడుస్తాయి. -
ఇరాన్ అణు నిల్వలపై చైనా వైఖరి ఇదేనా?
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలను చల్లార్చే దిశగా అంతర్జాతీయ దౌత్య రంగంలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా చేసిన ప్రకటన ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. హార్మూజ్ జలసంధి పునరుద్ధరణ, ఇరాన్ అణు నిల్వలపై చైనా వైఖరి కీలకంగా మారనుంది.హార్మూజ్ జలసంధి పునరుద్ధరణప్రపంచ ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధి తిరిగి తెరుచుకోవడంపై చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ సంతోషంగా ఉన్నారని ట్రంప్ పేర్కొన్నారు. ‘హార్మూజ్ జలసంధి తెరిచినందుకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఎంతో సానుకూలంగా ఉన్నారు’ అని ట్రంప్ తన ట్రూత్ సోషల్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు తగ్గడం వల్ల ప్రపంచ వాణిజ్యానికి, ముఖ్యంగా చైనా ఇంధన అవసరాలకు భారీ ఊరట లభించనుంది. బీజింగ్ నుంచి వస్తున్న ఈ సానుకూల సంకేతాలు అంతర్జాతీయ మార్కెట్లలో కూడా ఆశాభావాన్ని నింపుతున్నాయి.ఇరాన్ అణు నిల్వలు - చైనా వ్యూహాత్మక పాత్రఈ మొత్తం వ్యవహారంలో అత్యంత కీలకమైన అంశం ఇరాన్ యురేనియం. తాజా దౌత్య చర్చల ప్రకారం.. ఇరాన్ వద్ద ఉన్న యురేనియం నిల్వలను తగ్గించడంలో లేదా వాటిని తన ఆధీనంలోకి తీసుకోవడంలో చైనా మధ్యవర్తిగా వ్యవహరించే అవకాశం ఉంది. ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చితే అటు వాషింగ్టన్, ఇటు టెహ్రాన్ మధ్య నేరుగా ఘర్షణ పడకుండా సమస్యను పరిష్కరించే మార్గం సుగమం అవుతుంది. దీనివల్ల గ్లోబల్ పాలిటిక్స్‌లో చైనా ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.ట్రంప్ చైనా పర్యటనత్వరలోనే తాను చైనాలో పర్యటించనున్నట్లు వెల్లడించిన ట్రంప్, ఈ పర్యటన ప్రత్యేకమైనదని, చారిత్రాత్మకమైనదన్నారు. ‘షీ జిన్‌పింగ్‌తో భేటీ కోసం ఎదురుచూస్తున్నాను. ఈ సమావేశం ద్వారా ఎన్నో అద్భుతాలు సాధించబోతున్నాం’ అని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.ఇరాన్ అణు ఒప్పందంపై ప్రతిష్టంభనను తొలగించడానికి చైనాను ఒక బఫర్‌గా వాడుకోవాలని అమెరికా భావిస్తోంది. ఒకవేళ ఇరాన్ తన యురేనియం నిల్వలను చైనాకు తరలించడానికి అంగీకరిస్తే పరిణామాలు ఎలా ఉంటాయో వేచి చూడాల్సి ఉంది.ఇదీ చదవండి: గోల్డ్ ధర.. గుండె దడ! -
బుధవారం మళ్లీ ప్రళయమే: ట్రంప్ సంచలన ప్రకటన
వాషింగ్టన్: ఇరాన్, అమెరికా మధ్య మళ్లీ మాటల యుద్ధం నడుస్తోంది. హార్మూజ్ విషయం, ఇరాన్‌తో చర్చలు అంశంలో అధ్యక్షుడు ట్రంప్ ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు. తాజాగా కాల్పుల విరమణకు సంబంధించి ట్రంప్ మరోసారి వార్నింగ్ ఇచ్చారు. మళ్లీ బాంబులు వేయడం ప్రారంభించాల్సి ఉంటుందని తెలిపారు.కాగా, ఇరాన్ ఒప్పందం కుదరకపోతే కొనసాగుతున్న కాల్పుల విరమణను పొడిగించకపోవచ్చని డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. కాల్పుల విరమణ గడువులోగా ఒప్పందం కుదురుతుందా లేదా అనే దానిపై నిర్ణయం ఆధారపడి ఉంటుందని అన్నారు. మళ్లీ బాంబులు వేయడం ప్రారంభించాల్సి ఉంటుందని తెలిపారు. ఈ నేపథ్యంలో బుధవారం నుంచి మళ్లీ బాంబుల మోత ఉంటుందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.ఇదిలా ఉండగా.. ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం మొదలైనప్పటి నుంచి మూసి ఉంచిన హార్మూజ్ జలసంధిని ఇరాన్ పూర్తిగా తెరిచింది. కాల్పుల విరమణ ముగిసేదాకా వాణిజ్య నౌకలు అందులో రాకపోకలు సాగించవచ్చని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ ప్రకటించారు. ఈ పరిణామాన్ని స్వాగతించిన ట్రంప్ ఇరాన్ ఒప్పందం కుదిరేదాకా ఇరాన్ దిగ్బంధనాన్ని మాత్రం తాము ఉపసంహరించుకోబోమని స్పష్టం చేశారు. అలా అయితే హార్మూజ్‌ను మళ్లీ మూసి వేస్తామంటూ ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది.#WATCH | On being asked if he will extend the ceasefire, US President Donald Trump says, "Maybe I won't extend it. But the blockade is going to remain. So you have a blockade, and unfortunately, we'll have to start dropping bombs again..."(Source: The White House) pic.twitter.com/6HURzpzE0s— ANI (@ANI) April 18, 2026మళ్లీ మూసివేస్తాం: ఇరాన్ఇరాన్ పోర్టుల దిగ్బంధమనం కొనసాగుతుందని ట్రంప్ చేసిన ప్రకటనపై ఆ దేశ పార్లమెంటు స్పీకర్ మహమ్మద్ ఘాలిబఫ్ మండిపడ్డారు. తమ నౌకలను అడ్డుకుంటే హార్మూజ్ జలసంధిని మళ్లీ మూసివేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు చేశారు. హార్మూజ్ జలసంధి, శాంతి ఒప్పందం తదితర విషయాలపై ట్రంప్ ఒక గంటలోనే 7 పోస్టులు చేశారని, అవన్నీ అబద్ధాలేనని ఘాలిబఫ్ తెలిపారు. అబద్ధాలతో యుద్ధం గెలవలేరని.. చర్చల్లో కూడా పురోగతి సాధించలేరని విమర్శించారు. జలసంధికి సంబంధించి ప్రతి నిర్ణయం తామే తీసుకుంటామని రాసుకొచ్చారు. తాము ఇప్పటికే ప్రకటించిన మార్గంలోనే నౌకల రాకపోకలు సాగుతాయని పేర్కొన్నారు.ఐఆర్జీసీ హెచ్చరిక.. హార్మూజ్ జలసంధిని పూర్తిగా తెరిచామని ఇరాన్ విదేశాంగమంత్రి ప్రకటించగా, IRGC నేవీ విభాగం మాత్రం పలు నిబంధనలు విధించింది. హార్మూజ్ గుండా వెళ్లే అన్ని నౌకలు తప్పనిసరిగా తమ అనుమతి తీసుకోవాలని స్పష్టం చేసింది. తాము నిర్దేశించిన మార్గంలోనే పౌర, వాణిజ్య నౌకలు రాకపోకలు సాగించాలని తెలిపింది. సైనిక నౌకలకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించమని స్పష్టంచేసింది. ఈ నిబంధనలన్నీ.. కాల్పుల విరమణ ఒప్పంద నిబంధనలకు అనుగుణంగానే ఉన్నాయని తెలిపింది. -
ఇరాన్‌కు ట్రంప్ బంపరాఫర్
వాషింగ్టన్: హార్మూజ్ జలసంధి విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా సహాయంతో ఇరాన్ జలమార్గం నుండి సముద్ర మైన్లను తొలగిస్తోందని ట్రంప్ చెప్పుకొచ్చారు. మైన్లను తొలగించడానికి అమెరికా, ఇరాన్ కలిసి పనిచేస్తున్నాయని ట్రంప్ అన్నారు.ఇక, అమెరికా నేవీ ఇప్పటికే ఒక లిట్టోరల్ కాంబాట్ షిప్‌ను మైన్ క్లియరింగ్ ఆపరేషన్ల కోసం అక్కడ ఉంచారు. అలాగే, అదనంగా జపాన్ నుంచి రెండు మైన్ క్లియరింగ్ నౌకలు కూడా ఆ ప్రాంతానికి బయలుదేరాయి. అయితే, యుద్ధం నేపథ్యంలో హార్మూజ్‌లో చిన్న పడవల సాయంతో ఇరాన్ మైన్లను అమర్చింది. కాగా.. గత వారం న్యూయార్క్ టైమ్స్ నివేదిక ప్రకారం, హార్మూజ్‌లో ఇరాన్ వేసిన అన్ని మైన్స్‌ను గుర్తించడం కష్టంగా మారింది. కొన్ని మైన్స్.. నీటి ప్రవాహం కారణంగా కొట్టుకుపోయినట్టు తెలిపింది. దీంతో, నీటి నుంచి మైన్స్‌ను తీయడం కష్టంగా మారిందని పేర్కొంది.మరోవైపు.. బెల్జియం, నెదర్లాండ్స్, ఫ్రాన్స్ సహా ఐరోపా దేశాలకు హార్మూజ్ జలసంధిలో ఉన్న మైన్లను తొలగించే సామర్థ్యం ఉందని ఫ్రాన్స్ రక్షణ మంత్రి కేథరీన్ వాట్రిన్ వెల్లడించారు. వ్యూహాత్మకంగా ముఖ్యమైన ఈ జలమార్గం గుండా ప్రయాణించే నౌకలకు ఐరోపా దేశాలు పూర్తి మద్దతుతో కూడిన ఎస్కార్ట్ సేవలను అందించగలవని వాట్రిన్ తెలిపారు. హార్మూజ్ జలసంధిని తిరిగి తెరవడం, కీలకమైన నౌకా మార్గాలను సురక్షితం చేసే ప్రయత్నాల్లో భాగంగా బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్ సహా ఇతర ప్రపంచ నాయకులు సమావేశం కానున్నారు.సమావేశానికి మాక్రాన్, స్టార్మర్ నాయకత్వంమరోవైపు ఇరాన్‌పై దౌత్య, ఆర్థిక ఒత్తిడిని పెంచే అంతర్జాతీయ ప్రయత్నాలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్, బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ నాయకత్వం వహిస్తున్నారు. హార్మూజ్ జలసంధిని తిరిగి తెరవడమే లక్ష్యంగా ఒక అంతర్జాతీయ మిషన్‌ను ఏర్పాటు చేసే ప్రణాళికల్లో భాగంగా ఈ చర్చలు ఉంటాయని బ్రిటన్ ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది.సుమారు 40 దేశాల నాయకులు హాజరుకాగా మాక్రాన్‌తో కలిసి ఈ సమావేశానికి ఆతిథ్యం ఇవ్వడానికి బ్రిటన్ ప్రధాని స్టార్మర్ పారిస్‌కు చేరుకోనున్నారు. అలాగే జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడ్రిక్ మెర్జ్, ఇటాలియన్ ప్రధాని జార్జియా మెలోని కూడా హాజరు కానున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఇతర ప్రపంచ నేతలు వర్చువల్‌గా ఇందులో పాల్గొననున్నట్లు సమాచారం. ఇరాన్‌తో కాల్పుల విరమణకు మద్దతు ఇవ్వడం, కీలకమైన సముద్ర మార్గం గుండా సురక్షిత ప్రయాణం లక్ష్యంగా సుమారు 40 దేశాల నాయకులు ఈ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారని అంతర్జాతీయ మీడియా CNN పేర్కొంది. అయితే, ఆ జాబితాను ఎక్కడా అధికారికంగా వెల్లడించలేదు. ఈ ప్రాంతంలో ప్రయాణించే నౌకలు, సిబ్బంది భద్రతను మెరుగుపరిచేందుకు అంతర్జాతీయ సముద్ర సంస్థ (International Maritime Organization) చేస్తున్న పనికి మద్దతు ఇవ్వడంపై కూడా ఈ శిఖరాగ్ర సమావేశంలో చర్చిస్తారని పేర్కొంది. -
అణు కార్యక్రమాన్ని నిలిపేసేందుకు ఇరాన్ అంగీకారం
ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని నిరవధికంగా నిలిపివేయడానికి అంగీకరించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. అయితే, దీనికి ప్రతిఫలంగా అమెరికాలో స్తంభింపజేసిన ఇరాన్ నిధులను మాత్రం విడుదల చేసే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. తాజాగా ఒక అంతర్జాతీయ వార్తా సంస్థకు ఇచ్చిన టెలిఫోన్ ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ వివరాలను వెల్లడించారు. ఈ వారాంతంలో జరగనున్న శాంతి చర్చల అనంతరం తుది ఒప్పందంపై సంతకాలు జరిగే అవకాశం కనిపిస్తోంది.డబ్బు లేదు.. కేవలం శాంతి మాత్రమేట్రంప్ తన విలక్షణ శైలిలో ఈ ఒప్పందంపై స్పందిస్తూ, టెహ్రాన్‌తో చర్చలు దాదాపుగా పూర్తయ్యాయని ప్రకటించారు. ఈ ఒప్పందంలోని ప్రధాన ముఖ్యాంశాలు ఇవే..యురేనియంతో అణు కార్యక్రమాన్ని ఇరాన్ పూర్తిగా నిలిపివేయనుంది. ఇది కేవలం 10 లేదా 20 ఏళ్ల కాలపరిమితితో కూడుకున్నది కాదని, అపరిమిత కాలం పాటు అమల్లో ఉంటుందని ట్రంప్ నొక్కి చెప్పారు.ఇరాన్‌కు చెందిన సుమారు 20 బిలియన్ డాలర్ల స్తంభింపజేసిన ఆస్తులను అమెరికా విడుదల చేస్తుందన్న వార్తలను ట్రంప్ కొట్టిపారేశారు.చర్చలు తుది దశకు చేరినప్పటికీ ఇరాన్‌పై అమెరికా విధించిన నావికాదళ దిగ్బంధనం కొనసాగుతుందని, ఒప్పందం ఖరారైన తర్వాతే దీనిపై నిర్ణయం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.కీలక పాత్రలో ఈజిప్ట్, టర్కీగత కొన్ని వారాలుగా తెర వెనుక జరిగిన దౌత్య ప్రయత్నాలు ఇప్పుడు ఫలించాయి. పాకిస్థాన్ మధ్యవర్తిత్వంలో ఈజిప్ట్, టర్కీ దేశాల మద్దతుతో జరిగిన పరోక్ష చర్చలు ఈ సానుకూల ఫలితానికి దారితీశాయి. ఒప్పందం ఖరారైతే శాంతి చర్చల ముగింపు కోసం తాను స్వయంగా పాకిస్థాన్ సందర్శించే అవకాశం ఉందని కూడా ట్రంప్ సూచనప్రాయంగా తెలిపారు. ‘చాలా ప్రధాన అంశాలు ఇప్పటికే ఖరారు అయ్యాయి. ఈ ప్రక్రియ చాలా వేగంగా జరగాలి. ఇరాన్ తన అణు నిల్వలను అప్పగించడానికి సిద్ధంగా ఉంది’ అని డొనాల్డ్ ట్రంప్ అన్నారు.ఇరాన్ స్పందనఅమెరికా అధ్యక్షుడి ప్రకటనలపై ఇరాన్ ఇప్పటివరకు అధికారికంగా ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. అయితే, అంతర్జాతీయ వాణిజ్య నౌకల రాకపోకల కోసం హార్మూజ్ జలసంధి ప్రస్తుతం తెరిచే ఉంటుందని టెహ్రాన్ ధ్రువీకరించింది. ఇది ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడానికి ఒక సంకేతంగా విశ్లేషకులు భావిస్తున్నారు.ఇదీ చదవండి: అంతర్జాలంలో సగానికి పైగా ఏఐ రాతలే! -
నేను హర్మూజ్ జలసంధిని మూసేస్తున్నా: ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన ప్రకటన చేశారు. ఇరాన్ హర్మూజ్ జలసంధిని పూర్తిగా తెరిచినట్లు ప్రకటించినప్పటికీ, అమెరికా మాత్రం తన బ్లాకేడ్‌ను ఎత్తివేయబోమని ఆయన స్పష్టం చేశారు. ‘హర్మూజ్ తెరిచి ఉంది.. కానీ ఇరాన్‌తో మా లావాదేవీ పూర్తయ్యే వరకు బ్లాకేడ్ కొనసాగుతుంది’ అని ట్రంప్ తన ట్రూత్ సోషల్ వేదికలో ప్రకటించారు.ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయ వాణిజ్య వర్గాల్లో కలకలం రేపాయి. ఇరాన్ సముద్ర మార్గం తెరవడం వల్ల చమురు ధరలు తగ్గి ఊరటనిచ్చినా, అమెరికా బ్లాకేడ్ కొనసాగుతుండటం ఉద్రిక్తతలను తగ్గించలేకపోయింది. అమెరికా–ఇరాన్ చర్చలు విజయవంతంగా సాగుతున్నాయి. త్వరలో ఒప్పందం కుదిరే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.మరోవైపు అణు అంశంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ అధికంగా శుద్ధి చేసిన యురేనియంను మాకు అప్పగించడానికి సిద్ధంగా ఉంది. ఇరాన్‌తో కలిసి భూగర్భంలో దాచిన యురేనియాన్ని తొలగించనున్నాం’అని చెప్పారు. అంతకుముందు హర్మూజ్ జలసంధిపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి కీలక ప్రకటన చేశారు. లెబనాన్‌లో కాల్పుల విరమణ సమయంలో హర్మూజ్ జలసంధిని పూర్తిగా తెరుస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రకటన తర్వాత అంతర్జాతీయ ముడి చమురు ధరలు 10 శాతం వరకు తగ్గాయి. -
ఇరాన్ వార్ : బడ్జెట్ ఎయిర్‌లైన్స్ దివాలా
అమెరికాకు చెందిన ప్రముఖ బడ్జెట్ విమానయాన సంస్థ స్పిరిట్ ఎయిర్‌లైన్స్ (Spirit Airlines) తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. పెరిగిన ఇంధన ధరలు, భారీ అప్పుల కారణంగా ఈ సంస్థ నేటి నుండే తన కార్యకలాపాలను నిలిపివేసే దిశగా పయనిస్తోంది.CBS న్యూస్ రిపోర్ట్ ప్రకారం అమెరికా-ఇరాన్ యుద్ధం నేపథ్యంలో జెట్ ఇంధన ధరలు పెరగడం వల్ల, రాబోయే రుణ చెల్లింపులు చేయగల సామర్థ్యం అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో విమానయాన సంస్థ రుణదాతలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారని విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ఆ నివేదిక పేర్కొంది.త్వరలోనే మూత పడుతుందా? అమెరికా-ఇరాన్ యుద్ధం కారణంగా విమాన ఇంధన ధరలు విపరీతంగా పెరిగాయి. 2026లో గాలన్ ఇంధనం ధర 2.24 cగా ఉంటుందని కంపెనీ అంచనా వేయగా, ప్రస్తుతం అది 4.24 డాలర్లకు చేరింది. ఇది కంపెనీ అంచనాల కంటే రెట్టింపు. దీనికి తోడు భారీగా పేరుకుపోయిన అప్పులు తీర్చగల కంపెనీ సామర్థ్యంపై రుణదాతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సంస్థను లిక్విడేట్ (ఆస్తులు విక్రయించి మూసివేయడం) చేసే అంశంపై చర్చలు జరుగుతున్నాయి.రుణదాతలతో జరుగుతున్న చర్చల ఫలితాన్ని బట్టి ఈ వారం లోపే కంపెనీ భవిష్యత్తుపై స్పష్టత రానుంది.ఇదీ చదవండి: ఇన్‌స్టా లవ్ : 40 ఏళ్ల విడోతో 21 ఏళ్ల యువకుడి పెళ్లిదివాలా ప్రక్రియ (Bankruptcy)స్పిరిట్ ఎయిర్‌లైన్స్ ఇప్పటికే రెండుసార్లు దివాలా రక్షణ కోరింది. గత ఏడాది ఆగస్టులో 214 విమానాలతో రెండోసారి దివాలా దరఖాస్తు చేసింది. సంస్థను బతికించుకునే ప్రయత్నంలో భాగంగా విమానాల సంఖ్యను భారీగా తగ్గించాలని (సుమారు 80 జెట్లకు) నిర్ణయించింది. ఇది గతంలో ఉన్న విమానాల సంఖ్యలో మూడింట ఒక వంతు మాత్రమే.ఇదీ చదవండి: టీసీఎస్ కేసు : మతమార్పిడి ఆరోపణల్లో సంచలన సాక్ష్యంప్రయాణికులకు హెచ్చరికప్రస్తుతానికి స్పిరిట్ ఎయిర్‌లైన్స్ టిక్కెట్లు విక్రయిస్తున్నప్పటికీ, నిపుణులు ప్రయాణికులను అప్రమత్తం చేస్తున్నారు కంపెనీ కార్యకలాపాలు ఎప్పుడైనా హఠాత్తుగా ఆగిపోయే ప్రమాదం ఉంది కాబట్టి ప్రయాణికులు ముందే 'బ్యాకప్ ప్లాన్' సిద్ధం చేసుకోవాలని సూచిస్తున్నారు.కాగా ఒకప్పుడు 200 పైగా విమానాలతో వెలిగిన ఈ సంస్థ, ఇప్పుడు మనుగడ కోసం పోరాడుతోంది. తక్కువ ధరకే ప్రయాణించే వారు ఎక్కువగా స్పిరిట్‌ను ఎంచుకునేవారు. ఒకవేళ ఇది మూతపడితే, ఇతర విమాన సంస్థల్లో పోటీ లేక టిక్కెట్ ధరలు పెరిగే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇదీ చదవండి: నో ఇంజెక్షన్, రోజుకో పిల్ : యూఏఈ సంచలనం -
వంట గ్యాస్ సంక్షోభం : రూ. 12 వేల కోట్లతో నాలుగు పైప్లైన్ల ప్లాన్
ఇరాన్ వార్ నేపథ్యంలో నెలకొన్న వంట గ్యాస్ సరఫరా సంక్షోభాన్ని పరిష్కరించేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. భారతదేశం వంటగ్యాస్ (LPG) రవాణాను మరింత సురక్షితంగా, వేగంగా, తక్కువ ఖర్చుతో నిర్వహించేందుకు, రిఫైనరీలు, ఓడరేవులను బాట్లింగ్ ప్లాంట్లతో అను సంధానించేలా నాలుగు పైప్లైన్ల నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేసింది. ఇంధన రవాణా వ్యవస్థను బలోపేతం చేసే దిశగా పెట్రోలియం మరియు సహజ వాయువు నియంత్రణ మండలి (PNGRB) సుమారు రూ. 12,500 కోట్ల అంచనా పెట్టుబడితో, సుమారు 2500కిలో మీటర్లు నాలుగు పైప్లైన్ల బిడ్ ప్రతిపాదనలకోసం బిడ్డింగ్ ప్రక్రియను ముగించే పనిలో ఉంది. నాలుగు ప్రధాన మార్గాలు ఏవంటేచెర్లపల్లి – నాగ్‌పూర్ పైప్లైన్శిఖ్రాపూర్ – హుబ్లీ – గోవా పైప్లైన్పారాదీప్ – రాయ్‌పూర్ పైప్లైన్ఝాన్సీ – సీతార్గంజ్ పైప్లైన్ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశ్యంప్రస్తుతం ఎల్పీజీని ట్యాంకర్ల ద్వారా రోడ్డు మార్గంలో తరలిస్తున్నారు. దీనివల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. పైప్లైన్ల ద్వారా రవాణా చేయడం వల్ల ప్రమాదాల ముప్పు తగ్గుతుంది. రిఫైనరీలు మరియు ఓడరేవులను నేరుగా బాట్లింగ్ ప్లాంట్లతో అనుసంధానించడం ద్వారా గ్యాస్ సరఫరాలో అంతరాయాలు కలగకుండా చూడవచ్చు. అవసరమైన సమయంలో ఈ పైప్లైన్లు స్టోరేజ్ యూనిట్లుగా కూడా పనిచేస్తాయి. రోడ్డు రవాణా తగ్గడం వల్ల కార్బన్ ఉద్గారాలు తగ్గి, పర్యావరణానికి మేలు జరుగుతుంది. ఇదీ చదవండి: ఒకప్పుడు స్టార్ లీడర్.. చివరికి భార్యను హత్య చేసి, ఆత్మహత్యపశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా, భారత్ ఎల్పీజీ దిగుమతుల కోసం అమెరికా, ఆస్ట్రేలియా వైపు చూస్తోంది. దీనివల్ల రవాణా ఖర్చులు పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే దేశీయంగా బలమైన పైప్‌లైన్ వ్యవస్థ ఉండటం వల్ల పంపిణీ ఖర్చులను కొంతవరకు నియంత్రించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.మొత్తం 9 ఎల్పీజీ పైప్‌లైన్ ప్రాజెక్టులను గుర్తించగా, ప్రస్తుతం ఈ నాలుగు ప్రధాన ప్రాజెక్టులపై PNGRB దృష్టి సారించింది. ఇది భారతదేశ ఇంధన లాజిస్టిక్స్ నెట్‌వర్క్‌లో ఒక విప్లవాత్మక మార్పుగా నిలవనుందని అంచనాఇదీ చదవండి: ఇన్‌స్టా లవ్ : 40 ఏళ్ల విడోతో 21 ఏళ్ల యువకుడి పెళ్లి -
మోదీకి ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రోన్ ఫోన్
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రోన్ ఫోన్ చేశారు. హార్ముజ్ జలసంధిలో నావిగేషన్ భద్రత, స్వేచ్ఛను అత్యవసరంగా పునరుద్ధరించాల్సిన అవసరాన్ని గురించి ప్రస్తావించారు. ఇరువురు నేతలు పశ్చిమాసియా పరిస్థితిపై చర్చించారు. పశ్చిమాసియా స్థిరత్వం కోసం భారత్, ఫ్రాన్స్ సహకారాన్ని కొనసాగిస్తాయని ఇరువురు నేతలు అన్నారు.“నా ప్రియ మిత్రుడు, అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రోన్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. పశ్చిమాసియా పరిస్థితిపై చర్చించాం. హార్మూజ్ జలసంధిలో భద్రత, నావిగేషన్ స్వేచ్ఛను అత్యవసరంగా పునరుద్ధరించాల్సిన అవసరంపై ఉందని మాట్లాడుకున్నాం. ఆ ప్రాంతంలో శాంతి, స్థిరత్వాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు సన్నిహిత సహకారం కొనసాగిస్తాం” అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.పశ్చిమాసియా, గల్ఫ్ ప్రాంతాల్లో భద్రతా పరిస్థితులు మారుతూ ఉండడడంతో భారత్ ప్రపంచ నాయకులతో ఉన్నత స్థాయి సంప్రదింపులు కొనసాగిస్తోంది. ముందుగా మార్చిలో కూడా ప్రధాన మంత్రి మోదీ ఫ్రాన్స్ అధ్యక్షుడితో మాట్లాడి పశ్చిమాసియా పరిస్థితిపై చర్చించారు. ప్రాంతంలో శాంతి, స్థిరత్వం కోసం సమన్వయం కొనసాగిస్తామని చెప్పారు.ఇటీవలే అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో మోదీ మాట్లాడి పశ్చిమాసియా భద్రతా పరిస్థితిపై చర్చించారు. హార్మూజ్ జలసంధి తెరిచి, సురక్షితంగా ఉంచాల్సిన ప్రాముఖ్యతను ప్రస్తావించారు.గురువారం ఢిల్లీలో మోదీ, ఆస్ట్రియా చాన్స్‌లర్ క్రిస్టియన్ స్టాకర్ పశ్చిమాసియాలో సముద్ర మార్గ రవాణా సురక్షితంగా, అంతరాయం లేకుండా కొనసాగాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. “ఇరు పక్షాలు పశ్చిమాసియా ప్రాంతంలో తాజా పరిణామాలపై కూడా చర్చించారు. సమస్యలను శాంతియుతంగా పరిష్కరించేందుకు చర్చలు, దౌత్య ప్రాముఖ్యతను ప్రస్తావించారు. అందులో సముద్ర రవాణా సురక్షితంగా, అంతరాయం లేకుండా సాగడం అనే అంశం కూడా ఉంది” అని విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి (వెస్ట్) సీబీ జార్జ్ ప్రెస్ బ్రీఫింగ్లో తెలిపారు.40 దేశాల నేతల చర్చలు ఫ్రాన్స్ అధ్యక్షుడు చేసిన ఈ కాల్... ఫ్రాన్స్, యూకే కలిసి 40 పైగా దేశాలను ఒకే తాటికి తీసుకొచ్చి సంయుక్త సమావేశం నిర్వహించే నేపథ్యంలో వచ్చింది. దీని లక్ష్యం హార్మూజ్ జలసంధిలో నావిగేషన్ స్వేచ్ఛ ఉండేలా చేయడం. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రోన్ ఈ వీడియో కాన్ఫరెన్స్ శుక్రవారం (ఏప్రిల్ 17న) పారిస్‌లో జరుగుతుందని తెలిపారు. హార్మూజ్ జలసంధిలో నావిగేషన్ స్వేచ్ఛ పునరుద్ధరణే లక్ష్యంగా 40కి పైగా దేశాలను ఒకే చోటుకు తీసుకురావడానికి యూకే, ఫ్రాన్స్ సంకల్పించాయి. యుద్ధంలో పాల్గొనని దేశాలు దీనికి హాజరవుతాయి. యూకే ప్రధాని కీర్ స్టార్మర్ కూడా ఇటీవల మాట్లాడుతూ.. ఘర్షణ ముగిసిన తరువాత హార్మూజ్ జలసంధి ద్వారా సురక్షిత రవాణా జరిగేలా చేసేందుకు సమన్వయంగా పాటించాల్సిన ప్రణాళికపై చర్చించేందుకు 40కి పైగా దేశాలతో సమావేశం జరుపుతామని తెలిపారు.Received a phone call from my dear friend President Emmanuel Macron. We discussed the situation in West Asia and agreed on the need to urgently restore safety and freedom of navigation in the Strait of Hormuz.We will continue our close cooperation to advance peace and stability…— Narendra Modi (@narendramodi) April 16, 2026 -
ఇరాన్‌లోని ఈ ప్రాంతాల్లో బాంబులు వేస్తాం!: పెంటగాన్
వాషింగ్టన్: ఇరాన్‌కు పెంటగాన్ చీఫ్ పీట్ హెగ్సెత్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ ప్రజలు, ప్రపంచ ప్రయోజనాల కోసం సరైన ఒప్పందాన్ని, సమర్థంగా కుదుర్చుకోకపోతే పోర్టుల నిర్బంధం, ఆర్థికపరంగా ఒత్తిడి కొనసాగుతాయని తెలిపారు. అవసరమైనంతకాలం నిర్బంధం కొనసాగుతుందని చెప్పారు. ఇరాన్ తప్పుడు నిర్ణయం తీసుకుంటే మౌలిక వసతులు, విద్యుత్, ఎనర్జీ రంగాలపై బాంబులు పడతాయంటూ హెచ్చరించారు. శాంతి ఒప్పందాన్ని ఇరాన్ తిరస్కరిస్తే సైనిక దాడులను మళ్లీ ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామని హెగ్సెత్ హెచ్చరించారు. అమెరికా ఇంతకు ముందుకంటే ఎక్కువ శక్తితో మళ్లీ సిద్ధమవుతోందని ఆయన మరోసారి స్పష్టం చేశారు.హార్మూజ్ జలసంధిపై అమెరికా నిర్బంధానికి గురువారం నాటికి మూడో రోజు. అనేక వాణిజ్య నౌకలను వెనక్కి మళ్లించగా, ఇరాన్ పోర్టులకు వెళ్లే, వచ్చే సముద్ర రవాణాపై పూర్తిగా నియంత్రణ సాధించామని అమెరికా దళాలు పేర్కొన్నాయి. ఇరాన్ ఆర్థిక వ్యవస్థను దెబ్బకొట్టాలని ఈ నిర్బంధాన్ని అమలు చేస్తున్నారు.అంతా గమనిస్తున్నాం: హెగ్సెత్ తాజాగా నిర్వహించిన పెంటగాన్ సమావేశంలో హెగ్సెత్తో పాటు సంయుక్త సైన్యాధిపతుల కమిటీ చైర్మన్ జనరల్ డాన్ కేన్, అమెరికా సెంట్రల్ కమాండ్ అధిపతి అడ్మిరల్ బ్రాడ్ కూపర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హెగ్సెత్ మాట్లాడుతూ.. ఇరాన్ సైనిక కదలికలను నిశితంగా గమనిస్తున్నామని తెలిపారు.“మీరు ఏ సైనిక వనరులను ఎక్కడికి తరలించారో మాకు తెలుసు” అని ఇరాన్ సైన్యం, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్‌ను ఉద్దేశించి హెగ్సెత్ చెప్పారు. ఇరాన్ కీలక శక్తి మౌలిక వసతులు బలహీనంగా ఉన్నాయని అన్నారు. ఇరాన్ ఎనర్జీ సెక్టార్‌ను తాము ఇంకా ధ్వంసం చేయలేదని, కానీ అమెరికా అమలు చేస్తున్న నిర్బంధం ఇరాన్ ఎగుమతులను నిలిపివేయడంతో చమురు ఆదాయం బాగా తగ్గుతోందని తెలిపారు. అదే సమయంలో ఇరాన్ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెరుగుతోందని చెప్పారు.వ్యూహాత్మక సముద్ర మార్గాలపై దృష్టి సారిస్తూ హార్ముజ్‌లోకి వచ్చే, వెళ్లే రవాణాను అమెరికా నౌకాదళం నియంత్రిస్తోందని తెలిపారు. ఇది తమ మొత్తం నౌకాదళ సామర్థ్యంలో కేవలం 10 శాతంతోనే చేస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం తీసుకుంటున్న చర్యలు పరిమితమని, మరింత తీవ్ర చర్యలకు దిగే అవకాశం ఉందని సూచించారు. ఇరాన్‌కు నౌకాదళం, సముద్ర పరిస్థితులపై అవగాహన లేదని, వారు దేన్నీ నియంత్రించలేరని తెలిపారు. -
స్కూల్లో భారీగా భయానక ఆయుధాలు.. ఇంతటి డేంజర్లో..
టెల్ అవీవ్: పిల్లలు చదువుకునే స్కూల్లో ఏముంటాయి? స్కూల్ బ్యాగులు, పుస్తకాలు, వాళ్లు కూర్చునేందుకు బెంచీలు వంటివి ఉంటాయి. అయితే, ఓ స్కూల్లో మాత్రం 130కి పైగా భయానక ఆయుధాలు కనపడ్డాయి. లెబనాన్‌లోని బింట్ జ్బైల్ ప్రాంతంలోని ఓ స్కూల్లో హెజ్బొల్లాకు చెందిన ఈ ఆయుధాలను ఇజ్రాయెల్ రక్షణ దళాలు (ఐడీఎఫ్) గుర్తించాయి.కలాష్నికోవ్ తుపాకులు, పిస్టళ్లు, ఇతర ఆయుధాలు ఉన్నాయని ఐడీఎప్ ఎక్స్‌లో పేర్కొంటూ వాటి ఫొటోలను పోస్ట్ చేసింది. ఐడీఎఫ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆయుధాలతో పాటు హెజ్బొల్లా జెండాలు, ఇతర ఉగ్రవాద సంస్థల గుర్తులు కూడా అక్కడ కనపడ్డాయి.ఇదే సమయంలో ఐడీఎఫ్ మరో ప్రకటనలో.. కేవలం ఒక నిమిషంలో సుమారు 70 హెజ్బొల్లా మౌలిక వసతులను ధ్వంసం చేశామని తెలిపింది. డజన్ల కొద్దీ ఆయుధాలను గుర్తించామని తెలిపింది. అందులో ఆర్పీజీలు, కలాష్నికోవ్ తుపాకులు, మందుగుండు సామగ్రి, గ్రెనేడ్లు, స్పై డివైజ్‌లు, ఇతర యుద్ధ సామగ్రి ఉన్నాయి.🔎LOCATED: 130+ weapons belonging to Hezbollah inside a school in the area of Bint Jbeil.The weapons located included Kalashnikov rifles, pistols and additional weapons. Alongside the weapons, the troops also found Hezbollah flags and other terrorist organization insignia. pic.twitter.com/6XCpoouhoX— Israel Defense Forces (@IDF) April 16, 2026మరో ఆపరేషన్‌లో పదులకొద్దీ ఉగ్రవాదులను హతమార్చినట్టు పేర్కొంది. ఇదిలా ఉండగా హెజ్బొల్లా ఇంతకు ముందు ఉత్తర ఇజ్రాయెల్‌లోని సైనిక స్థావరాలపై రెండు డ్రోన్ దాడులకు బాధ్యత వహించింది. నహారియా సమీపంలో ఇజ్రాయెల్ సైన్య స్థావరాలపై డ్రోన్ దాడులు జరిగాయి.ఇదే సమయంలో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు దక్షిణ లెబనాన్‌లో హెజ్బొల్లాపై లక్ష్యిత దాడులు కొనసాగుతున్నాయని, దీర్ఘకాల శాంతి దిశగా చర్చలు జరుగుతున్నాయని తెలిపారు.కాగా, ఓ వైపు చర్చలు జరుపుతూనే మరోవైపు లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు జరుపుతోంది. ఇరు దేశాలు మూడు దశాబ్దాల తర్వాత మొట్టమొదటిసారి ఇప్పుడు అమెరికాలో దౌత్య చర్చలు నిర్వహించాయి. ఈ రెండు దేశాల మధ్య చివరిసారిగా ప్రత్యక్ష చర్చలు 1993లో జరిగాయి. ఇరాన్ మద్దతు ఉన్న హిజ్బుల్లా ఇటీవల రాకెట్లను ప్రయోగించింది. ఉత్తర ఇజ్రాయెల్ నివాస ప్రాంతాలపై ఈ దాడులు జరిపింది. అదే సమయంలో, ఇజ్రాయెల్ దళాలు దక్షిణ లెబనాన్‌లో దాడులు జరిపాయి. ⭕️DISMANTLED: ~70 Hezbollah terror infrastructure sites in just one minute.IDF soldiers located dozens of weapons, among the weapons located were RPGs, Kalashnikov rifles, ammunition, grenades, an anti-aircraft missile, surveillance equipment and combat equipment.In an… pic.twitter.com/dbUHl1rgoV— Israel Defense Forces (@IDF) April 16, 2026 -
రెండో దశ చర్చలు జరుగుతాయా? కథ మళ్లీ మొదటికొస్తుందా?
టెహ్రాన్: పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వేళ పాకిస్థాన్ సైన్యాధిపతి ఆసిమ్ మునీర్ ఏప్రిల్ 15న ఇరాన్ చేరుకున్న విషయం తెలిసిందే. అమెరికా-ఇరాన్ మధ్య మళ్లీ చర్చలు జరిగేలా చేయడానికి ఇరాన్లో మునీర్ ఉన్నత స్థాయి చర్చల్లో పాల్గొన్నారు. ఇరాన్-అమెరికా మధ్య పాకిస్థాన్‌లో చర్చలు పునఃప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నట్లు ఇటీవలే యూఎస్ అధ్యక్షుడు ట్రంప్ కూడా సంకేతాలు ఇచ్చారు. అందుకు సంబంధించే పాక్ ప్రతినిధి బృందంతో మునీర్ ఇరాన్ వెళ్లినట్లు ఆ దేశ సైన్యం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపింది. తాజాగా, మునీర్ ఇరాన్ పర్యటనపై మరికొన్ని అంశాలు బయటకు వచ్చాయి. ఇరాన్ పర్యటన ముగిశాక మునీర్ అమెరికాకు కూడా వెళ్లనున్నారు. అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గించేందుకు చర్చలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఇరాన్ అణు కార్యక్రమం అంశంలో ముందడుగు పడే అవకాశం ఉందని పాకిస్థాన్ అధికారులు భావిస్తున్నారని అల్ జజీరా మీడియా చెప్పింది. అమెరికా ఇచ్చిన ఆఫర్‌ను ఇరాన్‌కు ఆసిమ్ మునీర్ ఇప్పటికే వివరించినట్లు తెలుస్తోంది. ఇరాన్ సందేశాన్ని కూడా తీసుకెళ్లి మునీర్ అమెరికాకు ఇవ్వనున్నారు. ఆ తర్వాత అమెరికా-ఇరాన్ మధ్య పాకిస్థాన్‌లో లేదా ఇతర దేశంలో చర్చలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇరాన్ అణు శుద్ధి ప్రక్రియను ఎంతకాలం ఆపాలనే విషయంలో అమెరికా, ఇరాన్ మధ్య ఏకాభిప్రాయం లేదు. కొందరు ఐదేళ్లు ఆపాలని, మరికొందరు 20 ఏళ్లు ఆపాలని చెబుతున్నారు. ఇది ఇరు దేశాల మధ్య ఉన్న ప్రధాన విభేదం. మరొక ప్రధాన అంశం ఇరాన్ వద్ద ఉన్న 440 కిలోగ్రాముల (972 పౌండ్ల) యురేనియం నిల్వ. ఈ నిల్వను మరో దేశానికి తరలించడం లేదా శుద్ధి స్థాయిని తగ్గించడం వంటి పలు మార్గాలు పరిశీలనలో ఉన్నాయి.ఆ నిల్వతో 10 అణ్వాయుధాలు చేయొచ్చు అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ప్రకారం.. ఇప్పటికే ఇరాన్ 60% స్వచ్ఛత వరకు 440.9 కిలోగ్రాముల (972 పౌండ్ల) యురేనియం నిల్వను శుద్ధి చేసింది. ఇది 90% ఆయుధ-స్థాయి స్వచ్ఛతకు చేరడానికి ఒక చిన్న అడుగు దూరంలో ఉంది.ఒకవేళ ఇరాన్ తన కార్యక్రమాన్ని పూర్తి చేయాలని నిర్ణయించుకుంటే, ఆ నిల్వతో 10 అణ్వాయుధాల వరకు తయారు చేయగలదని ఐఏఈఏ డైరెక్టర్ జనరల్ రాఫెల్ గ్రోస్సీ ఏపీకి ఇచ్చిన ఇప్పటికే ఓ ఇంటర్వ్యూలో హెచ్చరించారు. ఐఏఈఏ మార్గదర్శకాల ప్రకారం.. ఇంత అధికంగా శుద్ధి చేసిన అణు పదార్థాన్ని సాధారణంగా ప్రతి నెల తనిఖీ చేయాలి.ఈ పరిణామాల మధ్య, మునీర్ ఇరాన్ పర్యటన తరువాత వాషింగ్టన్ వెళ్లే అవకాశం ఉంది. ఇది మధ్యవర్తిత్వ ప్రయత్నాల్లో భాగమని పాక్ భద్రతా వర్గాలు తెలిపాయి. బుధవారం అరాఘ్చీ టెహ్రాన్‌లో మునీర్‌ను స్వాగతిస్తూ, చర్చలకు సహకరించిన పాకిస్థాన్ పాత్రను ప్రశంసించారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల మధ్య ప్రాంతీయ శాంతి, స్థిరత్వం అంశాలను ప్రస్తావించారు.ఇస్లామాబాద్‌లో కొన్ని రోజుల క్రితం జరిగిన చర్చలు ఫలితం లేకుండా ముగిసిన తర్వాత ఉద్రిక్తతలు మరింత పెరుగుతాయని అందరూ భావించారు. డొనాల్డ్ ట్రంప్ హార్మూజ్, ఇరాన్ ఓడ రేవుల దిగ్బంధం చేయించడంతో ఇది సమీప భవిష్యత్తులో తీవ్ర ప్రతికూల పరిణామాలను దారి తీయవచ్చు. ఇరాన్ అణు కార్యక్రమం, కాల్పుల విరమణ ఒప్పందంలో లెబనాన్‌ను చేర్చడం, ఇతర "రెడ్ లైన్" అంశాలపై వెనక్కి తగ్గకపోతుండడంతో.. తదుపరి జరిపే ఉన్నత స్థాయి సమావేశమే చివరి ప్రయత్నంగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఇరాన్ అన్ని అంశాల్లో వెనకడుగు వేసేలా కనపడడం లేదు. ఇటువైపేమో రెండో దశ చర్చలు జరగకపోయినా, అవి మళ్లీ విఫలమైనా భీకర యుద్ధం తప్పదని ఇప్పటికే ట్రంప్ సంకేతాలు ఇచ్చారు. దీంతో కథ మళ్లీ మొదటికొచ్చే ప్రమాదం ఉంది. -
యుద్ధం ముగిసినట్టే..!
వాషింగ్టన్/దుబాయ్/ఇస్లామాబాద్: పశ్చిమాసియాలో యుద్ధం దాదాపుగా ముగిసినట్టేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్‌తో సాయుధ పోరుకు అతి త్వరలో తెర పడుతుందని బుధవారం ఫాక్స్ న్యూస్ వార్తా సంస్థకు వెల్లడించారు. కనుక చమురు ధరలు త్వరలోనే భారీగా దిగి రానున్నాయని జోస్యం చెప్పారు. మరో రెండు రోజుల్లో ప్రపంచం అద్భుతాలను చవిచూడనుందని అమెరికా, ఇరాన్ రెండో దఫా చర్చలను ఉద్దేశించి చెప్పుకొచ్చారు. కానీ ఆ వెంటనే గల్ఫ్ ప్రాంతానికి మరో 10 వేల మంది అదనపు సైనికులను పంపుతూ అమెరికా రక్షణ శాఖ నిర్ణయం తీసుకుంది! వాషింగ్టన్ పోస్ట్ వార్తా సంస్థ ఈ మేరకు వెల్లడించింది. దీనికి తోడు చర్చలు తిరిగి ప్రారంభం కావాలంటే ఇరాన్‌కు ట్రంప్ తాజాగా రెండు షరతులు విధించారు. హార్మూజ్ జలసంధిని తక్షణం పూర్తిస్థాయిలో తెరవాలని, చర్చల సందర్భంగా ఎలాంటి నిర్ణయాలైనా తీసుకునేందుకు ఇరాన్ ప్రతినిధి బృందానికి ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ (ఐఆర్జీసీ) పూర్తి అధికారాలివ్వాలని డిమాండ్ చేశారు. దాంతో యుద్ధానికి త్వరలో తెర పడనుందన్న ట్రంప్ ప్రకటన వాస్తవ రూపు దాల్చడం అనుమానాస్పదంగా మారింది. గల్ఫ్ ప్రాంతంలో ఇప్పటికే 50 వేల మంది అమెరికా సైనికులున్న విషయం తెలిసిందే. అమెరికా నావికా దళం ఆధ్వర్యంలో హార్మూజ్ జలసంధి, ఇరాన్ ఓడరేవుల దిగ్బంధం కొనసాగుతూనే ఉంది. ఇందుకు ప్రతీకారంగా పర్షియన్ గల్ఫ్, ఒమన్ సముద్రం, ఎర్ర సముద్రంలో వర్తక మార్గాలన్నింటినీ దిగ్బంధిస్తామని ఇరాన్ తాజాగా హెచ్చరించింది. లెబనాన్‌పై భీకర దాడులు టైర్ (లెబనాన్): లెబనాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులకు దిగింది. మంగళవారం ఇరు దేశాల నడుమ వాషింగ్టన్లో చర్చలు మొదలవడం తెలిసిందే. అయినా బుధవారం తీర నగరం టైర్‌పై క్షిపణులు, డ్రోన్లు, బాంబులతో విరుచుకుపడింది. దాంతో ఎటు చూసినా కుప్పకూలిన భవనాలే దర్శనమిచ్చాయి. వీధులన్నీ వాటి శిథిలాలతో నిండిపోయాయి. దాడుల్లో పౌరులు భారీ సంఖ్యలో మరణించినట్టు లెబనాన్ పేర్కొంది.బుర్జ్ అల్ అరబ్ హోటల్ మూత ప్రపంచంలోని అత్యంత విలాసవంతమైన హోటళ్లలో ఒకటైన దుబాయ్‌లోని బుర్జ్ అల్ అరబ్ 18 నెలల పాటు మూతబడనుంది. యుద్ధం ప్రాంరంభంలో ఇరాన్ జరిపిన డ్రోన్ దాడుల్లో ఈ హోటల్ తీవ్రంగా దెబ్బ తిన్నది. దాంతో మరమ్మతుల నిమిత్తం ఈ నిర్ణయం తీసుకున్నారు. గత 26 ఏళ్లలో ఈ హోటల్ మూతబడటం ఇదే తొలిసారి. ఇది ప్రపంచంలోనే ఏకైక సెవన్ స్టార్ కావడం విశేషం!ఇరాన్‌కు ఆయుధాలు ఇవ్వబోనని చైనా చెప్పింది: ట్రంప్ ఇరాన్‌కు ఇకపై ఆయుధాలు ఇవ్వబోనని చైనా అంగీకరించినట్టు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన లేఖకు రాసిన ప్రత్యుత్తరంలో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఈ మేరకు హామీ ఇచ్చారన్నారు. అంతేగాక అమెరికా హార్మూజ్ జలసంధిని తెరవనుండటంపై చైనా ఎంతో సంతోషం వెలిబుచ్చిందని కూడా చెప్పుకొచ్చారు! ‘‘త్వరలో నేను చైనా వెళ్తున్నా. ప్రెసిడెంట్ జిన్‌పింగ్ గాఢమైన ఆలింగనంతో నన్ను స్వాగతించనున్నారు’’అని ట్రూత్ సోషల్ పోస్టులో పేర్కొన్నారు. అయితే ట్రంప్ వ్యాఖ్యలను వాషింగ్టన్‌లోని చైనా రాయబార కార్యాలయ అధికార ప్రతినిధి ఖండించారు. ఇరాన్‌కు చైనా ఎప్పుడూ ఆయుధాలివ్వలేదన్నారు.ఇరాన్‌కు పాక్ బృందం అమెరికా, ఇరాన్ నడుమ రెండో దఫా చర్చలకు పరిస్థితిని సానుకూలం చేసే ప్రయత్నాల్లో భాగంగా సైన్యాధ్యక్షుడు అసీం మునీర్ సారథ్యంలోని పాక్ ప్రతినిధి బృందం బుధవారం టెహ్రాన్ చేరుకుంది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ తదితరులతో మంతనాలు జరిపింది. రెండో దఫా చర్చలకు ఇస్లామాబాద్‌లో ఇప్పటికే ముమ్మర ఏర్పాటు జరుగుతున్నాయి. -
ఇరాన్‌పై చరిత్రలోనే క్లిష్టమైన సైనిక ఆపరేషన్‌కు ట్రంప్ భారీ ప్లాన్?
వాషింగ్టన్: చింత చచ్చినా పులుపు చావలేదు అన్నట్లు, ఇరాన్‌పై యుద్ధంలో భారీ ఎత్తున ఆస్తి నష్టం జరిగినప్పటికీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఇరాన్లో యురేనియం నిల్వలను స్వాధీనం చేసుకోవడానికి భూతల దాడులకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఒకవైపు యుద్ధం ముగుస్తుందంటూ వ్యాఖ్యానిస్తూనే, మరోవైపు ఇరాన్‌పై మరిన్ని దాడులకు అమెరికా సన్నద్ధమవుతోంది. ఈ క్రమంలో పశ్చిమాసియాలో భారీ ఎత్తున సైన్యాన్ని మోహరిస్తోంది.అంతర్జాతీయ అణు శక్తి సంస్థ నివేదికల ప్రకారం.. ఇరాన్ అధికంగా శుద్ధి చేసిన యురేనియంను ఇస్ఫాహాన్‌లోని భూగర్భ స్థావరాల్లో నిల్వ చేసినట్లు తెలుస్తోంది. ఆ యురేనియంను స్వాధీనం చేసుకోవడానికి ట్రంప్ చరిత్రలోనే అత్యంత క్లిష్టమైన సైనిక ఆపరేషన్ చేపట్టనున్నారని సమాచారం. అందుకు ఊతం ఇచ్చేలా అమెరికా పశ్చిమాసియాలో 10 వేల మంది సైనికులను పంపింది. ఇరాన్‌తో రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉన్న వేళ ఈ సైనిక చర్య అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.వాషింగ్టన్ పోస్ట్ నివేదిక ప్రకారం, ఈ ఏప్రిల్ నెలలోనే 10 వేలకుపైగా సైనికులు ఆ ప్రాంతానికి చేరుకోనున్నారు. వీరిలో 6 వేల మంది సైనికులు ప్రస్తుతం నమీబియా తీరానికి సమీపంలో ఉన్న అమెరికా విమాన వాహక నౌక యూఎస్ఎస్ జార్జ్ హెచ్‌డబ్ల్యూ బుష్ (CVN-77) ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ స్ట్రైక్ గ్రూప్‌లో భాగమవుతారు. మరో 4,200 మంది సైనికులు బాక్సర్ అంఫిబియస్ రెడీ దళంలో చేరి, ఏప్రిల్ చివరి నాటికి అక్కడికి చేరుకోనున్నారు. ఈ గ్రూప్‌లో 800కి పైగా మెరైన్లు, హెలికాప్టర్లు, ల్యాండింగ్ క్రాఫ్ట్‌లు ఉన్నాయి.అమెరికా రక్షణ అధికారులు మాట్లాడుతూ, ఇరాన్లో భూసైనిక చర్యల కోసం కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని వెల్లడించారు. ఇందులో ప్రత్యేక దళాలను ఇరాన్ భద్రపరిచిన యురేనియంను వెలికితీయడం, భద్రపరచడం, అలాగే హోర్ముజ్ జలసంధి సమీపంలోని దీవులు, తీరప్రాంతాల్లో ల్యాండింగ్ ఆపరేషన్లు చేయడం వంటి అంశాలు ఉన్నాయి.ఇదే సమయంలో ట్రంప్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..‘ఇరాన్ యుద్ధం చాలా త్వరలో ముగియబోతోంది. వచ్చే రెండు రోజులు అద్భుతంగా ఉండబోతున్నాయి’ అని వ్యాఖ్యానించారు. ఆయన, కాల్పుల విరమణను పొడిగించాల్సిన అవసరం లేదని, యుద్ధం త్వరలోనే ముగుస్తుందని నమ్ముతున్నట్లు తెలిపారు.ఈ పరిణామాలు, ఇరాన్‌తో అమెరికా మధ్య ఉద్రిక్తతలు ఇంకా తగ్గలేదని సూచిస్తున్నాయి. ఒకవైపు ట్రంప్ ‘యుద్ధం ముగుస్తోంది’ అని చెబుతున్నా, మరోవైపు అమెరికా భారీగా సైనిక బలగాలను సమీకరిస్తోంది. ఇది కాల్పుల విరమణ గడువు ముగిసిన తర్వాత పరిస్థితులు మరింత క్లిష్టం కావచ్చని సంకేతాలు ఇస్తున్నాయి. -
ఇరాన్లో అడుగుపెట్టిన పాక్ సైన్యాధిపతి మునీర్
టెహ్రాన్: పాకిస్థాన్ సైన్యాధిపతి ఆసిమ్ మునీర్ ఇరాన్ చేరుకున్నారు. ఉన్నత స్థాయి చర్చల్లో ఆయన పాల్గొంటారు. ఇరాన్-అమెరికా మధ్య చర్చల పునఃప్రారంభంపై ఈ ఉన్నత స్థాయి సమావేశం జరగనుంది. అందుకు సంబంధించిన పాక్ ప్రతినిధి బృందంతో మునీర్ ఇరాన్ వెళ్లినట్లు పాకిస్థాన్ సైన్యం బుధవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపింది.యుద్ధం వేళ అమెరికాకు పాక్ టీమ్ పలు ప్రతిపాదనలు చేయనుంది. టీమ్‌లో ఆసిమ్ మునీర్‌తో పాటు అంతర్గత వ్యవహారాల మంత్రి మొహ్సిన్ నక్వీ తెహ్రాన్ కూడా ఉన్నారు. అమెరికా ఇచ్చిన ఆఫర్‌ను ఇరాన్‌కు ఆసిమ్ మునీర్ వివరిస్తారు. అమెరికా పంపిన సందేశాన్ని ఇరాన్‌కు ఇచ్చాక రెండో దశ చర్చల అంశాన్ని ప్రస్తావించే అవకాశం ఉంది. అంతకుముందు టెహ్రాన్‌లోని విమానాశ్రయంలో ఆసిమ్ మునీర్ నేతృత్వంలోని పాకిస్థాన్ ప్రతినిధి బృందానికి ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ స్వాగతం పలికారు. కాగా, యూఎస్-ఇరాన్ మధ్య రెండు రోజుల్లో చర్చలు జరగనున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు. ఈ చర్చలు కూడా పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగానే ప్రారంభమయ్యే అవకాశం ఉందన్నారు. పాకిస్థాన్ సైన్యాధ్యక్షుడు, ఫీల్డ్ మార్షల్ అసీమ్ మునీర్ ఈ చర్చల విషయంలో అద్భుతంగా పని చేస్తున్నారని ప్రశంసించారు. ఆయనో అద్భుతమైన వ్యక్తి అని, అందుకే తాము మళ్లీ అక్కడికి వెళ్లే అవకాశం ఎక్కువగా ఉందని ట్రంప్ చెప్పుకొచ్చారు. మరోవైపు, కాల్పుల విరమణ విషయంలో లెబనాన్‌ను చేర్చాలని అమెరికాపై ఇరాన్ ఒత్తిడి పెడుతోందని హెజ్బొల్లా ప్రతినిధి తెలిపారు. హార్మూజ్ జలసంధిపై ఆంక్షలను ఒత్తిడి సాధనంగా ఉపయోగించి, కాల్పుల విరమణ ఒప్పందంలో లెబనాన్‌ను చేర్చాలని ఇరాన్ ప్రయత్నించిందని తెలిపారు. “ఇరానీయులు అమెరికాపై అధిక ఒత్తిడి పెడుతున్నారు, అమెరికా కాల్పుల విరమణలో లెబనాన్‌ను చేర్చాలి అనే షరతులు పెట్టారు. అది చేయకపోతే, హార్మూజ్ ఆంక్షలను కొనసాగిస్తారు” అని తెలిపారు. -
3 దశాబ్దాల తర్వాత ఆ 2 దేశాల మధ్య చరిత్రాత్మక చర్చలు
వాషింగ్టన్: ‘లెబనాన్‌లో ఇజ్రాయెల్ దాడులు ఆపాలి’.. ఇరాన్ చేస్తున్న ప్రధాన డిమాండ్లలో ఇది ఒకటి. అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పటికీ లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు ఆపలేదు. లెబనాన్‌లో తాజా యుద్ధం మార్చి 2న మొదలైంది. ఇరాన్ మద్దతుతో లెబనాన్ సాయుధ గ్రూపు హిజ్బుల్లా ఇజ్రాయెల్‌పై కాల్పులు జరిపింది. దీంతో లెబనాన్‌లో ఇజ్రాయెల్ భీకర దాడులు చేసింది. 2,000 మందికి పైగా మృతి చెందగా, అందులో 165 మంది పిల్లలు, 250 మహిళలు ఉన్నారు. ఇప్పుడు ఎట్టకేలకు ఇజ్రాయెల్-లెబనాన్ చర్చలు జరిపాయి. ప్రస్తుతం ఇరు దేశాల ప్రతినిధులు అమెరికాలో ఉన్నారు.లెబనాన్, ఇజ్రాయెల్ మూడు దశాబ్దాల తర్వాత తొలిసారి దౌత్య చర్చలు నిర్వహించాయి. ఇజ్రాయెల్, లెబనాన్‌కు మధ్య దౌత్య సంబంధాలు లేవు. చివరిసారిగా ప్రత్యక్ష చర్చలు 1993లో జరిగాయి. ఇజ్రాయెల్, ఇరాన్ మద్దతు ఉన్న హెజ్బొల్లా మధ్య ఘర్షణను ముగించాలనే లక్ష్యంతో అమెరికాలో ఇప్పుడు ఈ సమావేశం జరిగింది. ఈ చర్చలకు మధ్యవర్తిత్వం చేసిన అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో మాట్లాడుతూ.. ఇది చరిత్రాత్మక అవకాశమని చెప్పారు. హెజ్బొల్లా ప్రభావం లేకుండా చేసేందుకు ఇదో అవకాశమని అన్నారు.అమెరికా చేసిన ప్రకటన ప్రకారం.. లెబనాన్, ఇజ్రాయెల్ పక్షాలు ప్రత్యక్ష చర్చలు ప్రారంభించేందుకు అంగీకరించాయి. ఇజ్రాయెల్ అన్ని ప్రభుత్వేతర ఉగ్రవాద గ్రూపులను నిరాయుధీకరణ చేయాలని కోరింది. అంటే ఇందులో హెజ్బొల్లా కూడా వస్తుంది.లెబనాన్ కాల్పుల విరమణ కోరింది. మానవతా సంక్షోభాన్ని ఎదుర్కొనే చర్యలు తీసుకోవాల్సి ఉందని చెప్పింది. లెబనాన్‌లో హిజ్బుల్లాను నిరాయుధీకరణ చేయడం, ఆ గ్రూపు లేకుండా చేయడమే తమ లక్ష్యమని ఇజ్రాయెల్ తెలిపింది. గాజా యుద్ధం కొనసాగిన సమయంలో (2023, 2024లో) కూడా హిజ్బుల్లాతో ఇజ్రాయెల్ పోరాడింది.అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి టామీ పిగాట్ మాట్లాడుతూ.. చర్చల తర్వాత విడుదల చేసిన ప్రకటనలో ఇజ్రాయెల్, లెబనాన్ రెండు పక్షాలు హెజ్బొల్లా ప్రభావాన్ని తగ్గించే దిశగా పని చేయడానికి అంగీకరించాయి. హెజ్బొల్లా దాడుల నుంచి తనను తాను రక్షించుకునే ఇజ్రాయెల్ హక్కుకు అమెరికా మద్దతు తెలిపిందని ఆయన చెప్పారు. -
ఎల్పీజీ యథాస్థితికి రావాలంటే ఎన్నేళ్లు పడుతుందో తెలుసా?
ఇరాన్ వార్ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం నెలకొంది. భారతదేశంలో కూడా ఎల్పీజీ దిగుమతుల్లో కష్టాలు, నష్టాలు, అధిక ఖర్చులు, సరఫరా అంతరాయాలు లాంటి సమస్యలు తప్పడం లేదు ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య శాంతి చర్యలు ఇంకా ఒక కొలిక్కి రాని నేపథ్యంలో ప్రపంచవ్యాప్త ఎల్పీజీ సరఫరా పునరుద్ధరణకు ఎంత కాలం పట్టవచ్చు? ఉత్పత్తి తాత్కాలికంగా నిలిచిపోయిందా లేక శాశ్వత నష్టం జరిగిందా? అసలు ఏం జరుగుతోంది? ప్రపంచవ్యాప్తంగా దెబ్బతిన్న ఎల్పీజీ సరఫరా వ్యవస్థ మళ్లీ సాధారణ స్థితికి రావడానికి మూడు నుండి నాలుగు ఏళ్లు పట్టవచ్చని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. భారతదేశం ఎదుర్కొంటున్న పెరుగుతున్న దిగుమతి నష్టాలు, వ్యయ ఒత్తిళ్లను ప్రస్తావిస్తూ, ప్రభావిత సరఫరాదారుల నుండి అందిన సమాచారం ప్రకారం, పునరుద్ధరణకు కనీసం మూడేళ్లు, లేదా అంతకంటే ఎక్కువ సమయం పట్టవచ్చు అని ఆ అధికారి పేరు వెల్లడించకుండా తెలిపారు.మరోవైపు దేశంలో ఎల్పీజీ ధరలు పెరుగుతున్నాయి. దొరుకుతుందా లేదా అనే ఆందోళన ప్రజల్లో రోజు రోజుకీ విపరీతంగా పెరుగుతోంది. నిల్వలు కేవలం 15 రోజుల డిమాండ్‌కు మాత్రమే సరిపోతున్నాయి. ఉత్పత్తి కేంద్రాల్లో నష్టం తాత్కాలికమా లేక శాశ్వతమా అన్నది స్పష్టంగా లేకపోవడమే దీనికి ప్రధాన కారణం.ఇండియా- సవాళ్లుభారతదేశం తన ఎల్పీజీ సరఫరాల కోసం పశ్చిమ ఆసియాపై ఎక్కువగా ఆధారపడి ఉంది. తన మొత్తం వినియోగంలో 60 శాతం దిగుమతుల ద్వారానే పొందుతోంది. అయితే, అమెరికా-ఇజ్రాయెల్ సైనిక చర్యలకు ప్రతిస్పందనగా హోర్ముజ్ జలసంధిపై దిగ్బంధనం, ప్రాంతీయ ఇంధన మౌలిక సదుపాయాలపై ఇరాన్ దాడుల కారణంగా ఆ సరఫరాలు దెబ్బతిన్నాయి.ఎక్కువగా దిగుమతులపై ఆధారపడటంతో ప్రస్తుత సంక్షోభంతో ఎల్పీజీ సరఫరాపై తీవ్ర ప్రభావం పడింది. హోర్ముజ్ జలసంధి (Strait of Hormuz) ద్వారా గతంలో 90 శాతం దిగుమతులు ఈ మార్గం ద్వారానే వచ్చేవి. యుద్ధ వాతావరణం వల్ల మార్చి 24 నాటికి ఇది 55 శాతానికి పడిపోయింది. రూబిక్స్ డేటా సైన్సెస్ , వయానా ట్రేడ్ఎక్స్ఛేంజ్ ఏప్రిల్ నివేదిక ప్రకారం, దారి మళ్లించినా,ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించినప్పటికీ, సరఫరాలో 40-50 శాతం వరకు ఉండవచ్చు.15 రోజులకు మాత్రమే నిల్వ సామర్థ్యందేశంలో సరిపడా ఎల్పీజీని నిల్వ చేసుకునే సామర్థ్యం కేవలం 15 రోజులకు మాత్రమే పరిమితం. ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు మొదలైనప్పటినుంచీ 14.2 కేజీల డొమెస్టింగ్ సిలిండర్ ధర రూ. 60 పెరిగింది. అలాగే కమర్షియల్ సిలిండర్ ధర రూ. 115 పెరిగింది. దీంతో హోటళ్లు, రెస్టారెంట్లు మరియు చిన్న తరహా పరిశ్రమలపై భారం తీవ్రంగా పడుతోంది. అలాగే చమురు కంపెనీలపై సబ్సిడీ ఒత్తిడి పెరుగుతోంది.ప్రభుత్వ చర్యలుసరఫరా అంతరాయం కలగకుండా ప్రభుత్వం చర్యలపై దృష్టి సారిస్తోంది. కోవిడ్ సమయంలో అనుసరించిన పద్ధతుల్లో ఇతర దేశాల నుండి దిగుమతులు పెంచుకోవడంతోపాటు, స్థానిక ఉత్పత్తిపై దృష్టి సారించింది. రిఫైనరీల ద్వారా వంట గ్యాస్ ఉత్పత్తిని గరిష్ట స్థాయికి పెంచాలని భావిస్తోంది. తద్వారా గృహ అవసరాలకు వినియోగించే ఎల్పీజీ సరఫరాలో ఇబ్బంది కలగకుండా ఉండాలని భావిస్తోంది. (ఆప్ ఎంపీ రాఘవ్ చద్దాకు మరో షాక్!)గల్ఫ్ దేశాలపై ఆధారపడటం2025 ఆర్థిక సంవత్సరంలో 6 బిలియన్ డాలర్ల విలువైన భారతదేశ ఎల్పీజీ వినియోగానికి 92 శాతాన్ని యూఏఈ, సౌదీ అరేబియా, ఖతార్, కువైట్, బహ్రెయిన్ , ఒమన్ దేశాలు కలిసి సరఫరా చేశాయి. ఇరాన్ దాడుల తీవ్రతను ఎక్కువగా ఎదుర్కొన్న యూఏఈ, దిగుమతులలో 41 శాతం వాటాను కలిగి ఉండగా, ఖతార్ 22 శాతం వాటాను కలిగి ఉంది అక్కడ యుద్ధ పరిస్థితుల వల్ల రవాణా ఖర్చులు, ఇన్సూరెన్స్ ప్రీమియంలు పెరిగి, చివరికి వినియోగదారునిపై భారం పడుతోంది.ఇదీ చదవండి: ఉదయాన్నే ప్లైన్ దోసె తింటున్నారా? ఈ షాకింగ్ విషయం విన్నారా? -
హార్మూజ్ టెన్షన్.. 40 దేశాలను ఒకే తాటిపైకి తీసుకురావడానికి..
పారిస్: పశ్చిమాసియాలో యుద్ధం, హార్మూజ్ జలసంధి దిగ్బంధం కొనసాగుతుండడంతో ప్రపంచ దేశాలకు సమస్యలు ఎదురవుతున్నాయి. హార్మూజ్ జలసంధిలో స్వేచ్ఛగా నౌకాయానం చేసుకునే పరిస్థితులు తీసుకురావడానికి ఏకంగా 40 దేశాలు ఏకం కావడానికి ఓ వీడియో కాన్ఫరెన్స్ జరగనుంది.హార్మూజ్ జలసంధిలో నావిగేషన్ స్వేచ్ఛ పునరుద్ధరణే లక్ష్యంగా 40కి పైగా దేశాలను ఒకే చోటుకు తీసుకురావడానికి యూకే, ఫ్రాన్స్ సంకల్పించాయి. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రోన్ ఈ వీడియో కాన్ఫరెన్స్ శుక్రవారం (ఏప్రిల్ 17న) జరుగుతుందని తెలిపారు. యుద్ధంలో పాల్గొనని దేశాలు దీనికి హాజరవుతాయని పేర్కొన్నారు. ప్రపంచానికి కీలకమైన హార్మూజ్ జలసంధిలో నావిగేషన్ స్వేచ్ఛ పునరుద్ధరణే లక్ష్యంగా తీసుకునే చర్యలకు సహకరిస్తాయని ఆయన చెప్పారు. యూకే ప్రధాని కీర్ స్టార్మర్ కూడా ఇటీవల మాట్లాడుతూ.. ఘర్షణ ముగిసిన తరువాత హార్మూజ్ జలసంధి ద్వారా సురక్షిత రవాణా జరిగేలా చేసేందుకు సమన్వయంగా పాటించాల్సిన ప్రణాళికపై చర్చించేందుకు 40కి పైగా దేశాలతో సమావేశం జరుపుతామని తెలిపారు.“హార్మూజ్ జలసంధి మూసివేత తీవ్ర ప్రభావం చూపుతోంది. ఖర్చుల ఒత్తిడిని తగ్గించడానికి గ్లోబల్ షిప్పింగ్ తిరిగి ప్రారంభం కావడం కీలకం. నావిగేషన్ స్వేచ్ఛ పునరుద్ధరణ లక్ష్యంతో 40 కంటే ఎక్కువ దేశాలతో యూకే సంప్రదింపులు జరుపుతోంది. ఈ వారం యూకే, ఫ్రాన్స్ కలిసి అంతర్జాతీయ షిప్పింగ్ రక్షణకు సమన్వయ, స్వతంత్ర, బహుళజాతీయ ప్రణాళికపై సమావేశం నిర్వహిస్తాయి” అని కీర్ స్టార్మర్ ఎక్స్‌లో తెలిపారు.మంగళవారం ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రోన్ మాట్లాడుతూ... యుద్ధంలో పాల్గొంటున్న దేశాలు చర్చలను పునఃప్రారంభించాలి, అపోహలను తొలగించాలి, ఉద్రిక్తతలు మరింత పెరగకుండా చూడాలని కోరారు. అన్ని పక్షాలు కాల్పుల విరమణను గౌరవించాలని చెప్పారు.“హార్మూజ్ జలసంధిని వీలైనంత త్వరగా మళ్లీ తెరవడం చాలా ముఖ్యం. ఎటువంటి నియంత్రణలు, టోల్లు ఉండకూడదు. ప్రధాన భాగస్వాముల మద్దతుతో చర్చలు త్వరగా పునఃప్రారంభం కావాలి” అని ఎమ్మాన్యుయేల్ అన్నారు.కాగా, పాకిస్థాన్‌లో ఇటీవల 21 గంటల పాటు జరిగిన చర్చల తర్వాత కూడా అమెరికా-ఇరాన్ మధ్య ఒప్పందం కుదరలేదన్న విషయం తెలిసిందే. ఫ్రాన్స్-యూకే ప్రతిపాదన ఇస్లామాబాద్ చర్చల అడ్డంకిని ఎలా అధిగమిస్తుందో చూడాలి. ఫిబ్రవరి 28 నుంచి ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడులు ప్రారంభం కావడంతో పశ్చిమాసియా, గల్ఫ్ ప్రాంతాల్లో తీవ్ర ప్రతికూల ప్రభావం కనిపిస్తోంది.పాక్‌లో మరోసారి అమెరికా-ఇరాన్ మధ్య చర్చలు జరుగుతాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం (ఏప్రిల్ 14) ప్రకటించారు. రెండు రోజుల్లో చర్చలు జరగనున్నాయని, ఇవి కూడా పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగానే ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలిపారు. -
‘ట్రంప్ రండి.. కూర్చొని మాట్లాడుకుందాం’ : ఇరాన్ అధ్యక్షుడు
టెహ్రాన్: పశ్చిమాసియా యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అమెరికాతో తమ దేశం యుద్ధాన్ని కాకుండా శాంతి చర్చలు కోరుకుంటుందని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని ఇరాన్ ప్రభుత్వ మీడియా సంస్థ ఇస్లామిక్ రిపబ్లిక్ న్యూస్ ఏజెన్సీ (ఐఆర్ఎన్ఏ)ధృవీకరించింది.పశ్చిమాసియా యుద్ధం. ఆ యుద్ధం కారణంగా ఇరాన్‌కు వాటిల్లిన నష్టం, హర్మూజ్ జలసంధిని అమెరికా మూసివేత వంటి పరిణామాలు, పాకిస్థాన్‌లో అమెరికా-ఇరాన్‌ల మధ్య జరిగిన చర్చలతో పాటు ఇతర అంశాలపై పెజెష్కియాన్ ఐఆర్ఎన్ఏతో మాట్లాడారు. ఈ సందర్భంగా పెజెష్కియాన్ తమ దేశం యుద్ధాన్ని కాకుండా చర్చలను కోరుకుంటోందన్నారు. అయితే అమెరికా తన ఇష్టాన్ని మా రుద్దడానికి లేదంటే లొంగిపోయేలా చేసేందుకు అమెరికా చేస్తున్న ఏ ప్రయత్నమైనా విఫలమవుతుందన్నారు. అదే సమయంలో ఇరాన్లో అపార ప్రాణ నష్టానికి కారణమైన అమెరికా, ఇజ్రాయెల్‌ను అంతర్జాతీయ సమాజం ఖండించాలని స్పష్టం చేశారు. అంతర్జాతీయ చట్టం, మానవతా సూత్రాల ప్రకారం పౌరులను, ఉన్నత వర్గాలను, పిల్లలను లక్ష్యంగా చేసుకోవడం, అలాగే పాఠశాలలు, ఆసుపత్రులు వంటి కీలక కేంద్రాలను ధ్వంసం చేయడాన్ని సమర్ధించకూడదని స్పష్టం చేశారు. -
ఇరాన్ ప్రతినిధుల బృందంపై క్షిపణి దాడి ప్లాన్?
ఇటీవల ఇస్లామాబాద్‌లో ఇరాన్-పాక్ మధ్య శాంతి చర్చలు జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ హెలెవల్ డెలిగేషన్ మీటింగ్ అత్యంత పటిష్టమైన భద్రత మధ్య జరిగింది. ఈ నేపథ్యంలో ఇరాన్ రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ మరాండీ సంచలన వ్యాఖ్యలు చేశారు. చర్చలు జరిగి వెళ్లే సమయంలో తమ విమానంపై అటాక్ జరుగుతోందని తీవ్రమైన బెదిరింపులు వచ్చాయన్నారు.అమెరికా- ఇరాన్ మధ్య రేపు( గురువారం) రెండో సారి శాంతి చర్చలు జరగనున్నాయి. ఇస్లామాబాద్‌లో మెుదటగా జరిగిన చర్చలలో ఎటువంటి సానూకూల ఫలితాలు రాకపోవడంతో మరో దఫా చర్చలకు రెండే దేశాలు సమాయాత్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ ప్రొఫెసర్ మారాండీ సంచలన వ్యాఖ్యలు చేశారు. చర్చలు ముగించి తిరుగు ప్రయాణంలో వారి విమానానికి తీవ్రమైన బెదిరింపులు వచ్చాయన్నారు.ప్రొఫెసర్ మారాండీ మాట్లాడుతూ " పాక్‌లో చర్చలు ముగించుకొని వెళుతున్న సమయంలో ఫ్లైట్‌లో అబ్బాస్ అరాఘ్చీ, స్పీకర్ మహమ్మద్ బాఘేర్ ఘాలిబాఫ్‌తో ఇతర కీలక నేతలు ఉన్నారు. ఆ సమయంలో హఠాత్తుగా మా విమానం క్షిపణి దాడికి గురువుతుందని బెదిరింపు వచ్చింది. దీంతో విమానాన్ని ప్రత్యామ్నయ మార్గం ద్వారా తరలించాం. వాస్తవానికి టెహ్రాన్‌లో దిగాల్సి ఉండగా అత్యవసరంగా ఇరాన్ నగరం మషద్ నగరంలో ఫ్లైట్ ల్యాండ్ చేసి కార్లు, ట్రైన్ల ద్వారా టెహ్రాన్ నగరం చేరుకున్నాం".అని అన్నారు.అమెరికా జిత్తులమారని తమకు తెలుసని అందుకే ఆ దేశాన్ని ఎప్పుడు నమ్మదలుచుకోలేదని ప్రొఫెసర్ అన్నారు. మాతో చర్చలు జరుపుతూనే మరోవైపు తమ మిలటరీ బేస్‌లను మరింత బలపరుచుకుంటుందన్నారు. అయితే చర్చల సమయంలో పాకిస్థాన్ ఇరాన్‌కు అత్యంత పటిష్ట భద్రత ఏర్పాటు చేసింది. ఆదేశానికి చెందిన అత్యాధునికి విమానాలు ఇరాన్ ప్రతినిధుల బృందం ఉన్న విమానానికి ఎస్కార్ట్‌గా వెళ్లాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ ప్రొఫెసర్ వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. -
యుద్ధం ముగుస్తుంది.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
వాషింగ్టన్: ఇరాన్‌తో యుద్ధం విషయమై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్-అమెరికా యుద్ధం ముగింపు దశకు చేరుకుందని అన్నారు. ముగింపు దశకు చాలా దగ్గరగా ఉన్నట్టు తాను భావిస్తున్నట్టు తెలిపారు. అయితే, రెండో విడత చర్చలకు సిద్ధమవుతున్న తరుణంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫాక్స్ న్యూస్ ఇంటర్వూలో మాట్లాడుతూ.. ఇరాన్‌తో యుద్ధం ముగింపు దశకు చేరుకుంది. త్వరలోనే ముగుస్తుందని నేను భావిస్తున్నాను. అయితే, ఇరాన్‌తో సంఘర్షణలో అమెరికా పని ఇంకా ముగియలేదు. కానీ, యుద్ధం కారణంగా ఇరాన్ భారీగా నష్టపోయింది. నేను వెళ్లిపోతే ఇరాన్ పునర్నిర్మాణానికి 20 ఏళ్లు సమయం పడుతుంది. ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు ఉంటే వారిని సర్ అని పిలవాల్సి వచ్చేంది. ఇరాన్ వద్ద అణ్వాయుధాలు ఉండకూడదు. మా పని ఇంకా పూర్తి కాలేదు. ఏం జరుగుతుందో చూద్దాం. వారు ఒక ఒప్పందం చేసుకోవాలని బలంగా కోరుకుంటున్నారని నేను భావిస్తున్నాను’ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా.. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ అమెరికా, ఇరాన్ మరోసారి శాంతి చర్చలకు సన్నద్ధమవుతున్నాయి. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా రాబోయే రెండు రోజుల్లోనే ఈ సంప్రదింపులు జరగొచ్చని డొనాల్డ్ ట్రంప్ తాజాగా ప్రకటించిన విషయం తెలిసిందే. అక్కడికి వెళ్లేందుకు తాము సుముఖంగా ఉన్నట్లు చెప్పారు. చర్చలకు వచ్చేందుకు ఇరాన్ కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది. దీంతో పశ్చిమాసియాలో శాంతిస్థాపన దిశగా మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. వాషింగ్టన్-టెహ్రాన్ మధ్య కాల్పుల విరమణ అంగీకారం గడువు ఈ నెల 21తో ముగియనుంది. ఆలోపే చర్చల ద్వారా శాశ్వత శాంతి ఒప్పందం కుదుర్చుకోవాలని ఇరుపక్షాలు కోరుకుంటున్నట్లు తెలుస్తోంది.మరోవైపు, ఇరాన్ దిగ్బంధనాన్ని అమెరికా కొనసాగిస్తోంది. ఆ దేశానికి నౌకల రాకపోకలను హార్మూజ్ సమీపంలో అడ్డుకుంటోంది. దీనిపై ఆగ్రహంతో ఉన్న ఇరాన్.. అమెరికాపై చర్యలు తీసుకోవాలని ఐక్యరాజ్యసమితికి విజ్ఞప్తి చేసింది. అమెరికా చర్య తమ సార్వభౌమాధికారాన్ని, ప్రాదేశిక సమగ్రతను తీవ్రంగా ఉల్లంఘిస్తోందని పేర్కొంది. -
ముగింపు దశకు యుద్ధం ? ట్రంప్ కీలక వ్యాఖ్యలు
-
పాకిస్థాన్‌లో 2 రోజుల్లో మళ్లీ..: ట్రంప్ కీలక ప్రకటన
వాషింగ్టన్: అమెరికా-ఇరాన్ మధ్య రెండు రోజుల్లో చర్చలు జరగనున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం రాత్రి ప్రకటించారు. ఈ చర్చలు కూడా పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగానే ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలిపారు. న్యూయార్క్ పోస్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వివరాలు తెలిపారు.“మీడియా అక్కడే ఉండాలి.. ఎందుకంటే వచ్చే 2 రోజుల్లో ఏదో జరిగే అవకాశం ఉంది. మేము అక్కడికి వెళ్లేందుకే ఆసక్తి చూపుతున్నాం” అని ట్రంప్ చెప్పారు. పాకిస్థాన్ సైన్యాధ్యక్షుడు, ఫీల్డ్ మార్షల్ అసీమ్ మునీర్ ఈ చర్చల విషయంలో అద్భుతంగా పని చేస్తున్నారని ట్రంప్ కొనియాడారు. ఆయనో అద్భుతమైన వ్యక్తి అని, అందుకే తాము మళ్లీ అక్కడికి వెళ్లే అవకాశం ఎక్కువగా ఉందని ట్రంప్ వ్యాఖ్యానించారు. కాగా, శాంతి చర్చల కోసం అమెరికా, ఇరాన్ ప్రతినిధులు ఈ వారం చివరలో పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌కు మళ్లీ రావచ్చని అంతర్జాతీయ మీడియా ఇవాళ మధ్యాహ్నం పేర్కొంది. ఇటీవల పాక్‌లో జరిగిన చర్చలు విఫలమైన విషయం తెలిసిందే. దీంతో రెండో దశ చర్చలు జరపాలని అమెరికా-ఇరాన్ భావిస్తున్నాయి. తేదీని ఇంకా నిర్ణయించలేదని, కానీ ఈ వారం చివరలోనే అమెరికా-ఇరాన్ తిరిగి ఇస్లామాబాద్ రావచ్చని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ఇరు దేశాల ప్రతినిధి బృందాలు శుక్ర/శని/ఆదివారం చర్చల్లో పాల్గొనవచ్చని ఒక సీనియర్ ఇరాన్ అధికారి అన్నారు.పాకిస్థాన్‌లోని సోర్స్ తెలిపిన వివరాల ప్రకారం.. రెండో దశ చర్చల గురించి అమెరికా-ఇరాన్‌తో పాక్ ప్రతినిధులు మాట్లాడుతున్నారు. “మేము ఇరాన్‌తో మాట్లాడాము. రెండో దశ చర్చలకు వారు సిద్ధంగా ఉన్నారని తెలిపేలా సానుకూల స్పందన వచ్చింది” అని పాకిస్థాన్ ప్రభుత్వ సీనియర్ అధికారి తెలిపారు.పాకిస్థాన్‌లో ఇటీవల జరిగిన చర్చలకు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ మొహమ్మద్ బాగేర్ ఖలీబాఫ్ తమ తమ బృందాలకు నాయకత్వం వహించారు. హార్మూజ్ జలసంధి, ఇరాన్ అణు కార్యక్రమం, అంతర్జాతీయ ఆంక్షలు వంటి అంశాలు చర్చలకు అడ్డంకిగా మారాయి. -
యుద్ధం వేళ మోదీకి ట్రంప్ ఫోన్.. ఏకంగా 40 నిమిషాలు..
న్యూఢిల్లీ: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం ఫోన్ చేశారు. మోదీతో ట్రంప్ సుమారు 40 నిమిషాలు మాట్లాడారు. ఇటీవల పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌లో జరిగిన అమెరికా–ఇరాన్ శాంతి చర్చలు విఫలమయ్యాయి. ఒప్పందం కుదరలేదు. దీంతో అనిశ్చితి ఇంకా తొలగిపోలేదు. ఇరాన్ సముద్ర మార్గాలను అమెరికా దిగ్బంధనం చేసింది.యుద్ధానికి సంబంధించి పలు అంశాలపై ట్రంప్‌తో మోదీ కీలక చర్చలు జరిపారు. “నా స్నేహితుడు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి ఫోన్ కాల్ అందింది. వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సహకారంతో సాధించిన గణనీయ పురోగతిని సమీక్షించాము. అన్ని రంగాల్లో మా సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి మేము కట్టుబడి ఉన్నాము. పశ్చిమాసియా పరిస్థితి గురించి కూడా చర్చించాము. హార్మూజ్ జలసంధిని తెరిచి, భద్రంగా ఉంచడం, దాని ప్రాముఖ్యత గురించి మాట్లాడుకున్నాం” ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. Received a call from my friend President Donald Trump. We reviewed the substantial progress achieved in our bilateral cooperation in various sectors. We are committed to further strengthening our Comprehensive Global Strategic Partnership in all areas. We also discussed the…— Narendra Modi (@narendramodi) April 14, 2026కాగా, ఇరాన్–అమెరికా ఉద్రిక్తతలు, యుద్ధం మళ్లీ పెరగకుండా నియంత్రించడం వంటి అంశాలపై మోదీ చర్చించినట్లు తెలుస్తోంది. అమెరికా-ఇరాన్ చర్చలు విఫలమైన తర్వాత తదుపరి దౌత్య చర్యలు ఎలా ఉండాలి అన్న అంశాలపై కూడా ఇరువురు నేతలు మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది. ఇది అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ తర్వాత ఇద్దరు నేతల మధ్య తొలిసారి జరిగిన చర్చ. ‘‘భారత ప్రజలు మిమ్మల్ని అభిమానిస్తారు” అని ఫోన్ కాల్ సమయంలో ట్రంప్‌కు మోదీ చెప్పారు. వారి మధ్య జరిగిన చర్చ విషయాలను అధికారికంగా వెల్లడించలేదు. అంతర్జాతీయ ఉద్రిక్తతల మధ్య మోదీ, ట్రంప్ జరిపిన చర్చకు ప్రాధాన్యం సంతరించుకుంది. మోదీకి తాజా సమాచారం అందిస్తుంటారు: సెర్జియో ఇద్దరు నేతలు పశ్చిమాసియా పరిస్థితి, వాణిజ్యం వంటి అంశాలపై చర్చించినట్లు భారత్‌లోని అమెరికా రాయబారి సెర్జియో గోర్ తెలిపారు. “కొన్ని నిమిషాల క్రితమే వారు ఫోన్ సంభాషణ ముగిసింది. అధ్యక్షుడు ట్రంప్ చాలా యాక్టివ్‌గా ప్రధానమంత్రి మోదీకి తాజా సమాచారం అందిస్తారు. పశ్చిమాసియాలో జరుగుతున్న పరిణామాలపై అధ్యక్షుడు వివరాలు చెప్పారు. అలాగే అమెరికా, భారత్ మధ్య వాషింగ్టన్లో జరుగుతున్న కీలక అంశాలపై కూడా చర్చ జరిగింది” అని గోర్ చెప్పారు. -
పాక్‌లో అమెరికా-ఇరాన్ మళ్లీ చర్చలు..! ఎప్పుడంటే?
వాషింగ్టన్: పశ్చిమాసియాలో శాంతి గురించి చర్చించడానికి అమెరికా, ఇరాన్ ప్రతినిధులు ఈ వారం చివరలో పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌కు మళ్లీ రావచ్చని అంతర్జాతీయ మీడియా పేర్కొంటోంది. ఇటీవల ఇస్లామాబాద్‌లో జరిగిన చర్చలు విఫలమైన విషయం తెలిసిందే. దీంతో రెండో దశ చర్చలు జరపాలని అమెరికా-ఇరాన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. తేదీని ఇంకా నిర్ణయించలేదని, కానీ ఈ వారం చివరలోనే అమెరికా-ఇరాన్ తిరిగి ఇస్లామాబాద్ రావచ్చని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ఇరు దేశాల ప్రతినిధి బృందాలు శుక్ర/శని/ఆదివారం చర్చల్లో పాల్గొనవచ్చని ఒక సీనియర్ ఇరాన్ అధికారి అన్నారు.అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న ఘర్షణకు పరిష్కారం కోసం చర్చల ప్రతిపాదనలు వస్తున్నాయి. ఇటీవల ఇరు దేశాల అధికారులు సమావేశమయ్యారు. దశాబ్దానికి పైగా కాలంలో అమెరికా, ఇరాన్ అధికారుల మధ్య జరిగిన తొలి ప్రత్యక్ష భేటీ ఇది. అలాగే 1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత జరిగిన అత్యున్నత స్థాయి సంప్రదింపులు ఇవే.పాకిస్థాన్‌లోని సోర్స్ తెలిపిన వివరాల ప్రకారం.. తదుపరి దశ చర్చల గురించి అమెరికా-ఇరాన్‌తో పాక్ ప్రతినిధులు మాట్లాడుతున్నారు. “మేము ఇరాన్‌తో మాట్లాడాము. రెండో దశ చర్చలకు వారు సిద్ధంగా ఉన్నారని తెలిపేలా సానుకూల స్పందన వచ్చింది” అని పాకిస్థాన్ ప్రభుత్వ సీనియర్ అధికారి తెలిపారు.పాకిస్థాన్‌లో ఇటీవల జరిగిన చర్చలకు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ మొహమ్మద్ బాగేర్ ఖలీబాఫ్ తమ తమ బృందాలకు నాయకత్వం వహించారు. హార్మూజ్ జలసంధి, ఇరాన్ అణు కార్యక్రమం, అంతర్జాతీయ ఆంక్షలు వంటి అంశాలు చర్చలకు అడ్డంకిగా మారాయి. -
అమెరికాకు చైనా వార్నింగ్ : నాలుగు కీలక ప్రతిపాదనలు
పశ్చిమ ఆసియా (Middle East) సంక్షోభాన్ని పరిష్కరించేందుకు చైనా దౌత్యపరమైన జోక్యాలను ముమ్మరం చేసింది. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ తాజాగా నాలుగు అంశాల ప్రణాళికను (Four-point framework) ప్రతిపాదించారు. ముఖ్యంగా అమెరికా-ఇరాన్ చర్చలలో పురోగతి స్తంభించిపోయిన నేపథ్యంలో,ఉద్రిక్తతలను తగ్గించి, స్థిరత్వాన్ని పునరుద్ధరించడమే లక్ష్యంగా చైనా ఈ ప్రతిపాదన చేసింది. చైనా నాలుగు సూత్రాల ప్రణాళిక,కీలక అంశాలుజిన్హువా వార్త నివేదిక ప్రకారం అమెరికా నేతృత్వంలోని జోక్యాలకు భిన్నంగా, పశ్చిమ ఆసియాలో తన దౌత్యపరమైన ఉనికిని విస్తరించుకోవడానికి చైనా చేస్తున్న విస్తృత ప్రయత్నాలకు ఈ ప్రతిపాదనలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. యుఏఈ నాయకుడు ఖలీద్ బిన్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో జరిగిన సమావేశంలో జిన్‌పింగ్ ఈ ప్రణాళికను సమర్పించారు.శాంతియుత సహజీవనం , సంయమనంసార్వభౌమాధికారానికి గౌరవం ఇవ్వడం మరో కీలకమైన స్తంభమని పేర్కొంది. దేశాలు ఒకరి అంతర్గత వ్యవహారాల్లో మరొకరు జోక్యం చేసుకోకూడదని ఈ ప్రతిపాదన నొక్కి చెబుతోంది. ప్రాంతీయ శక్తులన్నీ శాంతికి ప్రాధాన్యత ఇవ్వాలని, ఉద్రిక్తతలను పెంచే చర్యలకు దూరంగా ఉండాలని చైనా కోరుతోంది. గొడవలను పక్కన పెట్టి దేశాల మధ్య పరస్పర అవగాహన పెరగాలని సూచించింది.సార్వభౌమాధికారానికి గౌరవంఏ దేశం కూడా ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదని చైనా నొక్కి చెప్పింది. ప్రతి దేశం స్వయంప్రతిపత్తిని గౌరవించాలని ఈ ప్రణాళికలో చైనా పేర్కొందిభద్రతతో కూడిన ఆర్థిక అభివృద్ధిసుస్థిరమైన శాంతి కావాలంటే ఆర్థిక వృద్ధి కూడా అంతే ముఖ్యమనిజిన్పింగ్ అభిప్రాయపడ్డారు. భద్రత మరియు ఆర్థిక అభివృద్ధిని కలిపి ముందుకు తీసుకెళ్లాలని, దీనికోసం దేశాల మధ్య సహకారం పెరగాలని ఆయన పిలుపునిచ్చారు.అంతర్జాతీయ చట్టాల అమలుచివరి అంశం అంతర్జాతీయ చట్టంపై కేంద్రీకృతమై ఉంది. అంతర్జాతీయ నిబంధనలను అందరూ సమానంగా పాటించాలని చైనా స్పష్టం చేసింది. ప్రపంచ నిబంధనలనుఎంపిక చేసుకుని పాటించడంపై జిన్‌పింగ్ హెచ్చరించారు. వాటిని అమలు చేయడంలో స్థిరత్వం పాటించాలని పిలుపు నిచ్చారు. "అంతర్జాతీయ చట్ట పాలనను కాపాడాలి. 'మనకు అనుకూలంగా ఉన్నప్పుడు వాడుకోవడం, లేనప్పుడు వదిలేయడం' కుదరదని చైనా స్పష్టం చేసింది. ప్రపంచం తిరిగి అరాచక చట్టాల వైపు మళ్లడానికి అనుమతించలేం అంటూ ఆయన ఘాటుగా స్పందించారు. ఇదీ చదవండి: రూ.90 లక్షలు ఇస్తేనే ఫస్ట్‌నైట్ : తీవ్ర ఘర్షణ, కట్ చేస్తే!అదే సమయంలో, హోర్ముజ్ జలసంధి (Strait of Hormuz) పరిణామాలపై చైనా తన వైఖరిని మరోసారి స్పష్టం చేసింది. ఈ వ్యూహాత్మక జలమార్గంలో ఆంక్షలు విధించవద్దని చైనా అమెరికాను గట్టిగానే హెచ్చరించింది. ఇరాన్‌తో తమ సంబంధాలలో జోక్యం చేసుకోవద్దని, ఇరాన్‌తో తమకు ఉన్న వాణిజ్య, ఇంధన సంబంధాలను కొనసాగిస్తామని చైనా రక్షణ మంత్రి స్పష్టం చేశారు.పశ్చిమాసియా నుండి వచ్చే ఇంధనంపై చైనా ఎక్కువగా ఆధారపడుతుంది. అందుకే ఆ ప్రాంతంలో స్థిరత్వం ఉండటం చైనా ఆర్థిక ప్రయోజనాలకు అత్యవసరం.అమెరికా నాయకత్వంలోని దౌత్యం విఫలమవుతున్న తరుణంలో, తాము ఒక నమ్మకమైన ప్రత్యామ్నాయంగా ఎదగాలని చైనా ప్రయత్నిస్తోంది. ఈ ప్రతిపాదనలకు ఆదరణ లభిస్తుందా ? ఇతర దేశాల నుండి ఎలాంటి మద్దతు లభిస్తుందో వేచి చూడాలి. ఇదీ చదవండి: పండ్లు, చిప్స్ ప్యాకెట్లతో పెళ్లి కారు ముస్తాబు : నెటిజన్లు షాక్ -
పశ్చిమాసియా సంక్షోభం.. మామిడి ప్రియులకు గుడ్‌న్యూస్
ఎంకి పెళ్లి సుబ్బిచావుకొచ్చిందనేది తాతల కాలం నాటి సామెత... కానీ ప్రపంచం ఒక కుగ్రామంగా మారిపోయిన పరిస్థితుల్లో ఇప్పుడు అది అక్షర సత్యం కూడా. ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా అది ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపుతున్న సాంకేతిక యుగంలో యుద్ధం లాంటి పరిస్థితులు మరింత ప్రభావాన్ని చూపిస్తాయని ప్రస్తుత పశ్చిమాసియా సంక్షోభం నిరూపిస్తోంది. నెలలుగా కొనసాగుతున్న పశ్చిమ ఆసియా సంక్షోభం ఓ వైపు గ్యాస్ పెట్రోల్ వంటి అత్యవసరాలకు ఇబ్బందులు సృష్టిస్తుంటే మరోవైపు మామిడి పండ్ల ప్రియులకు తీపి కబురు తెస్తోంది.పశ్చిమాసియా పరిస్థితుల కారణంగా ఏటా ఆకాశంలో చక్కర్లు కొట్టే మామిడి పండ్ల ధరలు ఈ సీజన్లో నేల చూపులు చూడనున్నాయి. దీనికి కారణం యుద్ధం నేపధ్యంలో విదేశాలకు ఎగుమతులు గణనీయంగా తగ్గడం. ప్రస్తుతం జనాదరణ పొందిన బెనిషాన్ రకం మామిడి పండు కిలోకు రూ. 150–200 మధ్య అమ్ముడవుతోంది. అలాగే తీపి, రసభరితమైన రుచికి ప్రసిద్ధి చెందిన రసాలు హైదరాబాద్‌లో కిలోకు రూ. 100–150కి లభిస్తున్నాయి. ఇంకా ఇప్పుడిప్పుడే సీజన్ ప్రారంభం కాబట్టి అంతగా తెలియకున్నా రాబోయే రోజుల్లో మామిడి ధరలు బాగా తగ్గే అవకాశం ఉందని పండ్ల వ్యాపారులు అంచనా వేస్తున్నారు.ప్రతి సంవత్సరం, తెలుగు రాష్ట్రాల నుంచి వివిధ దేశాలకు మామిడి పండ్లు భారీగానే ఎగుమతి అవుతాయి. మరీ ముఖ్యంగా యూఏఈ, యూఎస్ కెనడాలకు మన దగ్గర నుంచి మామిడి పండ్ల ఎగుమతి ఎక్కువ. సగటున ప్రతి సంవత్సరం, భారతదేశం సుమారు 30 వేల మెట్రిక్ టన్నుల మామిడి పండ్లను ఎగుమతి చేస్తుంది, వాటిలో అత్యధిక వాటా అంటే దాదాపుగా 10 వేల మెట్రిక్ టన్నులకు పైగా ఒక్క యూఏఈకి వెళుతుంది.అయితే ఎడతెగని యుద్ధం, తద్వారా యుఏఈలో ఏర్పడిన సంక్షోభ పరిస్థితుల కారణంగా, మామిడి ఎగుమతులకుు డిమాండ్ తగ్గింది. అందుబాటులో ఉన్న ఒక నివేదిక ప్రకారం, ఇప్పటికే మామిడి ఎగుమతులు 20–30 శాతం తగ్గుదలను నమోదు చేస్తున్నాయి. ఆ ప్రాంతంలో నెలకొన్న అనిశ్చితితో పాటు బాగా పెరిగిన ఎగుమతి వ్యయం కూడా దీనికి దోహదం చేస్తోంది. రవాణా ఛార్జీలు పెరగడం వల్ల యూఎస్ కెనడా వంటి ఇతర గమ్యస్థానాలకు ఎగుమతులు కూడా దెబ్బతిన్నాయి.ఏతావాతా ఇది భారతీయ నగరాల్లో మామిడి ధరలు తగ్గడానికి దారితీయవచ్చునని అంచనా. దేశీయ మార్కెట్లో ధరలు తగ్గినప్పటికీ, అత్యుత్తమ నాణ్యత గల కొన్ని రకాల ఖరీదైన పండ్ల విక్రయాలకు ఎగుమతులే ఆధారం వాటి ఎగుమతులు పడిపోయినప్పటికీ వాటికి స్థానికంగా కొనుగోలుదారులు దొరుకుతారో లేదోనని కూడా ఎగుమతిదారులు సందేహిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఎగుమతిదారులు ప్రస్తుతం పరిస్థితి సాధారణ స్థితికి రావాలని ఎదురుచూస్తున్నారు. -
యుద్ద నష్టం ఇన్ని లక్షల కోట్లా..? ఇరాన్ సంచలన ప్రకటన
పశ్చిమాసియా యుద్ధంలో అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్‌పై భారీ స్థాయిలో దాడులు చేసిన సంగతి తెలిసిందే. రెండు దేశాలు కలిసి ఇరాన్ మౌళిక సదుపాయాలతో పాటు ఆర్మీ బేస్, విద్యుత్ ప్లాంట్లపై క్షిపణులు వర్షం కురిపించింది. ఈ నేపథ్యంలో ఇరాన్ యుద్ధం వల్ల తమ దేశానికి కలిగిన నష్టాన్ని అధికారికంగా ప్రకటించింది.ఇరాన్ ప్రభుత్వం యుద్ధం వల్ల ఇప్పటి వరకూ జరిగిన నష్టంపై ప్రాథమిక అంచనా విడుదల చేసింది. టెహ్రాన్‌పై జరిపిన దాడులలో ఇప్పటి వరకూ దాదాపు రూ. 25 లక్షల కోట్లు నష్టం ఇరాన్‌కు వాటిల్లిందని తెలిపింది. ఇది కేవలం ప్రాథమిక అంచనా మాత్రమేనని ఈ సంఖ్య మరింతగా పరిగే అవకాశం ఉందని తెలిపింది. ఇంత పెద్ద మెుత్తంలో తమ దేశ ఆస్తిని ధ్వంసం చేసిన వారినే పరోక్షంగా అమెరికా, ఇజ్రాయెల్ దేశాలని పరిహారం చెల్లించాల్సిందిగా కోరుతామని తెలిపింది.అయితే ఇరాన్ తొలుత నుంచి అమెరికాను పరిహారం చెల్లించాల్సిందిగా కోరింది. ఇటీవల ఇస్లామాబాద్‌లో జరిగిన చర్చల్లోనూ యుద్ద నష్టపరిహరం తన డిమాండ్లలో ఉంచింది. ఇంత పెద్దమెుత్తంలో ఆస్తి నష్టం జరగడంతో ఒక వేళ పరిహారం చెల్లించకపోతే ఇరాన్ ఆర్థికంగా నిలదొక్కుకోవడం చాలా కష్టం. అయితే దీనిపై అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇప్పటి వరకూ ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు. -
యూఏఈ సంచలన కామెంట్స్
యూఏఈ సంచలన వ్యాఖ్యలు చేసింది. హర్ముజ్ జలసంధి మీద అధికారం కేవలం ఒక్క ఇరాన్‌కే లేదని తెలిపింది. అది ఏమి టెహ్రాన్ ఆస్తి కాదని తెలిపింది. హర్ముజ్ జలసంధిని విముక్తి చేయడానికి అమెరికా చేస్తున్న ప్రయత్నాలకు యుఏఈ మద్దతిస్తుందని ప్రకటించింది.ప్రస్తుతం పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికా హర్మూజ్‌ను బ్లాకేడ్ చేయడంతో చమురు సరఫరా పూర్తిగా నిలిచిపోయే అవకాశం ఉంది. దీంతో గల్ఫ్ దేశాలు అమెరికాను రిక్వెస్ట్ చేస్తున్నాయి. హర్ముజ్ దిగ్భందనం తొలగించాలని సౌదీఅరేబియా అమెరికాను కోరింది.ఈ నేపథ్యంలో యూఏఈ ఇరాన్‌కు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. హర్ముజ్ జలసంధి కేవలం ఇరాన్ సొత్తు కాదని తెలిపింది. హర్మూజ్‌ను విముక్తి చేయడానికి చేస్తున్న ప్రయత్నాలకు గల్ఫ్ దేశాలు అండగా నిలుస్తాయని పేర్కొంది. ఈ అంశమై బహ్రెయిన్ రాజుతో యూఏఈ అధ్యక్షుడు సమావేశమైనట్లు తెలుస్తోంది.దేశ సమస్యలను చర్చలతో పరిష్కరించుకోవాలి గానీ ఇటువంటి దిగ్భందనాలు చేయడటం మంచిది కాదని యూఏఈ పేర్కొంది. ఈ విషయమై ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అరాగ్చీతో యూఏఈ సంప్రదింపులు జరిపినట్లు పేర్కొంది. అయితే అమెరికా విపరీత డిమాండ్ల వల్లనే చర్చలు విఫలమయ్యాయని ఆయన యూఏఈతో తెలిపినట్లు సమాచారం.ప్రస్తుతం అమెరికా సైతం హర్ముజ్‌ను బ్లాకేడ్ చేయడంతో పరిస్థితులు మరింత దిగజారాయి. ఇరాన్ పోర్టుల నుండి నౌకలు ఎటు కదలడం లేదు. దీంతో రోజుకు సరాసరిన రూ. 4 వేల కోట్ల రుపాయల నష్టం జరుగుతుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. -
ఇరాన్-అమెరికా మళ్లీ చర్చలుంటాయా?
ఇటీవల పాకిస్థాన్‌లో జరిగిన అమెరికా- ఇరాన్ చర్చలు విఫలమైన నేపథ్యంలో మరో కీలక ముందడుగు పడే అవకాశముంది. జెనీవా వేదికగా త్వరలో రెండో విడత చర్చలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇది వరకే ఈ అంశమై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీవాన్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాల మరో విడత చర్చలకు అవకాశం ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.ప్రస్తుతం పశ్చిమాసియా యుద్ధంలో సీజ్ ఫైర్ ఒప్పందం నడుస్తోంది. అయితే హర్ముజ్‌ను దిగ్భందించింది. దీంతో అమెరికా ఇరాన్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇరాన్ పోర్టుల వైపు వెళ్లకుండా అమెరికా నౌకలును అడ్డగిస్తూ బ్లాక్‌డేను ప్రారంభించింది. అయితే దీనిపై ఇరాన్ సైతం గుర్రుగానే ఉంది. ఈ నేపథ్యంలో యుద్ధంపై అమెరికా ఉపాధ్యక్షుడు కీలక వ్యాఖ్యలు చేశారు.జేడీవాన్స్ మాట్లాడుతూ" ఇరాన్‌తో చర్చలకు ఇంకా ఆస్కారం ఉంది. యుద్ధం ఆగడం మా చేతుల్లో లేదు. బంతి ఇంకా ఇరాన్ కోర్టులోనే ఉంది. ఇరాన్ దిగిరావాలి. ఇంకా సరళమైన ధోరణి ప్రదర్శించాలి". అని అన్నారు. జలసంధిలో ఇరాన్ నౌకలను అడ్డుకోవడం ఆర్థిక ఉగ్రవాదమేనని పేర్కొన్నారు. ఒకవేళ ఇరాన్ కనుక అలా చేస్తే వారి నౌకలను బయిటకి వెళ్లకుండా చేస్తామని హర్ముజ్ వద్ద ఇరాన్ చర్యలను అడ్డుకుంటాం" అన్నారు. హర్ముజ్ విషయంలో ట్రంప్ నాయకత్వంలో అమెరికా తగిన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. కాగా అమెరికా మీడియా కథనాల ప్రకారం ట్రంప్ సైతం చర్చలకు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. సీజ్ఫైర్ ఒప్పందం ముగిసే లోగా మరోదశ చర్చలు జరపాలని భావిస్తోన్నట్లు సమాచారం. కొన్ని అంతర్జాతీయ కథనాల ప్రకారం ఈ నెల 16 (గురువారం) నాడు ఇరు దేశాల భేటీ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇరాన్ ఇంతవరకూ స్పందించలేదు. -
పోప్ దుర్బలుడు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చివరికి పోప్‌ను కూడా వదలడం లేదు. ఇరాన్‌పై యుద్ధాన్ని తప్పుబడుతూ పోప్ లియో–14 చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. లియో ఓ బలహీన పోప్ అంటూ దుయ్యబట్టారు. ఈ మేరకు ట్రూత్ సోషల్‌లో సుదీర్ఘమైన పోస్ట్ పెట్టడమే గాక మీడియాతో మాట్లాడుతూ కూడా పోప్‌పై పదునైన విమర్శలకు దిగారు. అసలు తనవల్లే ఆయనకు పోప్ పదవి దక్కిందని చెప్పుకొచ్చారు! ఈ విమర్శలపై పోప్ కూడా దీటుగా స్పందించారు. శాంతి సందేశాన్ని విన్పించే విషయంలో ట్రంప్ యంత్రాంగానికి తాను భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ‘‘దైవ సందేశాన్ని ట్రంప్ అర్థం చేసుకోవడం లేదు. నేను ఆయన్నో, ఇంకెవరినో నేరుగా విమర్శించడం లేదు. ట్రంప్‌తో వాదనకూ దిగదలచుకోలేదు. కానీ వాస్తవాలు చెప్పేందుకు మాత్రం ఎప్పుడూ వెనకాడబోను. ఒక్కటి మాత్రం నిజం. శాంతి స్థాపకులు మాత్రమే ఆశీర్వాదానికి పాత్రులు’’అన్నారు. వారి మాటల యుద్ధం ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపింది! అమెరికా అధ్యక్షులకు, పోప్ స్థానంలో ఉన్నవారికి నడుమ అభిప్రాయ భేదాలు కొత్తేమీ కాకున్నా ఈ స్థాయి వాద ప్రతివాదాలు మాత్రం ఇదే తొలిసారి. ఇలాంటి పోప్ నాకొద్దు! పోప్‌గా లియో–14 సరిగా పని చేయడం లేదని ట్రంప్ ఆదివారం ట్రూత్ సోషల్ పోస్టులో ఆక్షేపించారు. ‘‘నేరాలపై స్పందించడంలో మరీ బలహీనుడు. ఇక ఆయన విదేశాంగ విధానమైతే మరీ దారుణం! ఇరాన్ వద్ద అణ్వాయుధమున్నా పర్లేదనుకునే, వెనెజువెలాపై అమెరికా దాడి చేయొద్దనుకునే, ఇలా అమెరికా అధ్యక్షుడినే విమర్శించే పోప్ నాకొద్దు! ఆయన మితిమీరిన ఉదారవాదం కనబరుస్తున్నారు. నేరాలను ఇష్టపడే వ్యక్తిలా కూడా కన్పిస్తున్నారు. ఇప్పటికైనా కాస్త ఇంగిత జ్ఞానం వాడాలి. వామపక్షవాదానికి దన్నుగా నిలవడం మానుకోవాలి. లియో తీరు ఆయనకే గాక క్యాథలిక్ చర్చికి కూడా చాలా చేటు చేస్తోంది. ఆయన ఇప్పటికైనా రాజకీయ నాయకునిగా ప్రవర్తించడం మాని గొప్ప పోప్‌గా రాణించడంపై దృష్టి పెడితే మంచిది! నేనైతే పోప్ లియోకు అస్సలు అభిమానిని కాను. నావల్లే ఆయనకు పోప్ పదవి దక్కింది. లియో పేరు తొలుత చర్చి పరిశీలనలో కూడా లేదు. నన్ను ఎదుర్కోవాలంటే ఆ పదవిలో ఒక అమెరికన్ ఉండాలనే భావనతోనే పోప్‌గా నియమించింది’’అంటూ తూర్పారబట్టారు. ఇరాన్‌పై ట్రంప్ యుద్ధాన్ని పోప్ తీవ్రంగా తప్పుబడుతూ వస్తున్నారు. ‘‘తాము సర్వశక్తిమంతులమని కొందరిలో నెలకొన్న భ్రమలే ఇరాన్‌పై యుద్ధానికి కారణం. కానీ యుద్ధాలకు దిగేవారి ప్రార్థనలను దేవుడు ఆలకించడు’’అని గతంలోనూ ఆయన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ నాగరికతనే నాశనం చేస్తామన్న ట్రంప్ బెదిరింపులను కూడా తీవ్రంగా తప్పుబట్టారు. క్రీస్తు మాదిరిగా దివ్య శక్తులతో అమెరికాకు తాను హీలింగ్ చేస్తున్నట్టుగా ఉన్న ఈ ఏఐ ఆధారిత ఫొటోను ట్రంప్ ట్రూత్ సోషల్‌లో పోస్టు చేశారు. తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో కాసేపటికే దాన్ని డిలీట్ చేశారు. -
హార్మూజ్ దిగ్బంధం
కైరో/దుబాయ్: పశ్చిమాసియా ఉద్రిక్తతలు మళ్లీ తీవ్ర రూపు దాలుస్తున్నాయి. చర్చల వైఫల్యంపై మండిపడుతున్న అమెరికా మరోసారి ఇరాన్‌పై తీవ్ర చర్యలకు దిగుతోంది. సోమవారం సాయంత్రం నుంచి హార్మూజ్ జలసంధితో పాటు ఇరాన్‌కు చెందిన ఓడరేవులన్నింటినీ దిగ్బంధించింది. హార్మూజ్ గుండా ఇరాన్ ఓడల రాకపోకలను కూడా అడ్డుకుంటోంది. చర్చలు విఫలమైతే హార్మూజ్‌ను దిగ్బంధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదివారమే హెచ్చరించడం తెలిసిందే. అమెరికా నావికా దళం సోమవారం సాయంత్రమే రంగంలోకి దిగింది. ఇరాన్ తీర ప్రాంతాలన్నింటినీ పూర్తిస్థాయిలో పహారా కాస్తోంది. ఏ దేశానికి చెందిన నౌకలూ ఇరాన్ రేవుల్లోకి రాకపోకలు జరపడానికి వీల్లేదని యూఎస్ సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. అయితే, ఇరానేతర రేవుల నుంచి వచ్చే నౌకలను మాత్రం హార్మూజ్ గుండా వెళ్లేందుకు అనుమతిస్తామని వెల్లడించడం విశేషం! ఇరాన్ ‘ఫాస్ట్ అటాక్’షిప్‌లు గనక తమ నావికా దళం దిగ్బంధించిన ప్రాంతాల సమీపంలోకి వస్తే మరో ఆలోచనే లేకుండా వాటిని తక్షణం పేల్చేస్తామని ట్రంప్ అల్టిమేటమిచ్చారు. అమెరికా తాజా చర్యతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు విపరీతంగా పెరిగేలా కన్పిస్తున్నాయి. అంతేగాక ట్రంప్ ప్రకటించిన రెండు వారాల కాల్పుల విరమణ కూడా బుట్టదాఖలయ్యేలా కన్పిస్తోంది. దాని గడువు ఏప్రిల్ 22 దాకా ఉంది. ఇరాన్ ఓడరేవుల దిగ్బంధం ద్వారా అమెరికా సాధించబోయేది ఏమిటో అర్థం కావడం లేదంటూ అంతర్జాతీయ నిపుణులు పెదవి విరుస్తున్నారు. అగ్ర రాజ్యం తాజా చర్యలపై ఇరాన్ మండిపడింది. గల్ఫ్ ప్రాంతంలోని ఓడరేవులన్నింటినీ పూర్తిస్థాయిలో లక్ష్యం చేసుకుని దాడులకు దిగుతానని తీవ్రంగా హెచ్చరించింది. ‘‘పర్షియన్ గల్ఫ్, ఒమన్ సముద్ర ప్రాంత రక్షణ బాధ్యత ఈ ప్రాంతంలోని ప్రతి దేశానిదీ. మాపై దాడులు, దిగ్బంధాలు జరిగితే ఈ ప్రాంతంలోని ఏ రేవూ సురక్షితం కాబోదు’’అని ఇరాన్ సైన్యం, రివల్యూషనరీ గార్డ్ (ఐఆర్జీసీ) స్పష్టం చేశాయి. హార్మూజ్ ఇప్పటికీ పూర్తిగా ఇరాన్ అదుపులోనే ఉన్నట్టు చెప్పుకొచ్చాయి. ‘ట్రంప్‌కు యుద్ధమే కావాలనుకుంటే మేం సిద్ధమే’అని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బఘేర్ గలీబాఫ్ స్పష్టం చేశారు. అంతేగాక ‘ఆటలో ఇప్పటిదాకా వాడని సరికొత్త ‘వ్యూహా’లను ఇకపై బయటికి తీస్తా’మంటూ ఇరాన్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ అధికార ప్రతినిధి ఎబ్రాహీం రజెయ్ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. పశ్చిమాసియా నుంచి అమెరికా ఖాళీ చేతులతో వెనుదిరగాల్సిందేనని ఇరాన్ ఖుద్స్ ఫోర్స్ విభాగం చీఫ్ ఎస్మాయిల్ ఖానీ ఎద్దేవా చేశారు. గత వారం కాల్పుల విరమణ మొదలైనప్పటి నుంచి 40 వాణిజ్య నౌకలు హార్మూజ్‌ను దాటాయి. అమెరికా, ఇరాన్ నడుమ యుద్ధానికి తెర దించేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తున్నట్టు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తెలిపారు.ఇరాన్ గమ్మత్తైన ‘గణిత’పోస్టు హార్మూజ్‌ను దిగ్బంధిస్తామన్న ట్రంప్ హెచ్చరికలను ఇరాన్ ఎద్దేవా చేసింది. ఈ మేరకు గమ్మత్తైన గణిత సమీకరణాలతో ఎక్స్‌లో పోస్టు పెట్టింది. ‘‘హార్మూజ్ దిగ్బంధంతో అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగిపోతాయి. తర్వాత జరిగే చైన్ రియాక్షన్ వల్ల చూస్తుండగానే అవి చుక్కలనంటుతాయి’’అంటూ వాటి అర్థాన్ని కూడా వివరించింది!‘హార్మూజ్’పై భేటీ.. బ్రిటన్, ఫ్రాన్స్ వెల్లడి లండన్/పారిస్: పశ్చిమాసియా యుద్ధానికి తెర దించి హార్మూజ్ జలసంధిని తక్షణం తెరిపించే ప్రయత్నాలను బ్రిటన్, ఫ్రాన్స్ ముమ్మరం చేశాయి. అందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ వారంలో సమావేశం నిర్వహించనున్నట్టు బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రాన్ వెల్లడించారు. ఈ అంశంపై వారిద్దరూ ఫోన్లో చర్చలు జరిపారు. అమెరికా చేపట్టిన హార్మూజ్, ఇరాన్ రేవుల దిగ్బంధానికి బ్రిటన్ మద్దతివ్వబోదని స్టార్మర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.100 మంది హెజ్బొల్లా ఫైటర్ల మృతి! బీరూట్: ఇజ్రాయెల్ సైన్యం, హెజ్బొల్లా దళాలు సోమవారం లెబనాన్‌లో పరస్పర దాడులకు దిగాయి. దక్షిణాదిన వ్యూహాత్మకంగా కీలకమైన కొండ ప్రాంత పట్టణం బింట్ బెల్ వద్ద ఇజ్రాయెల్ సైన్యంపై హెజ్బొల్లా తీవ్రవాదులు రాకెట్లతో దాడి చేశారు. అయితే పట్టణంపై ఇజ్రాయెల్ సైన్యం పట్టు సాధిస్తున్నట్టు లెబనాన్ మీడియా తెలిపింది. బింట్ బెల్ వద్ద కనీసం 100 మంది హెజ్బొల్లా తీవ్రవాదులను మట్టుబెట్టినట్టు ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది. లెబనాన్ మాత్రం దీన్ని ధ్రువీకరించలేదు. రాజధాని బీరూట్‌పై దాడులకు ఇజ్రాయెల్ విరామం ఇచ్చింది. మంగళవారం ఇజ్రాయెల్, లెబనాన్ నడుమ ప్రత్యక్ష చర్చలు జరగనుండటం తెలిసిందే. అమెరికాలోని ఇరు దేశాల రాయబారులు వాషింగ్టన్లో చర్చలు జరపనున్నారు. అయినా లెబనాన్‌పై దాడులు మాత్రం ఆగబోవని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రకటించారు. చర్చలకు సిద్ధమే: ఇరాన్న్యూఢిల్లీ: అమెరికాతో మరో దఫా చర్చలకు ఇరాన్ సిద్ధమేని భారత్‌లో ఆ దేశ రాయబారి మొహమ్మద్ ఫతాలీ ప్రకటించారు. అయితే, ‘అమెరికా అక్రమ డిమాండ్లు చేయరాదు. ఇరాన్ షరతులకు అంగీకరించాలి’అని పేర్కొన్నారు. తమ శక్తి ఏమిటో అమెరికాకు బాగా తెలుసని ఆయనన్నారు. హార్మూజ్ ఇరాన్‌దేనని స్పష్టం చేశారు. ఇరాన్ చమురు విక్రయాలపై తీవ్ర చర్యలు: అమెరికా ఇరాన్‌కు చెందిన నిషేధిత చమురును కొనుగోలు చేసినా, విక్రయించినా తీవ్ర చర్యలు తప్పవని అమెరికా హెచ్చరించింది. అలాంటి వ్యక్తులు/దేశాలను కోర్టుల్లో నిలబెట్టి తీరుతామని అమెరికా తాత్కాలిక అటార్నీ జనరల్ టాడ్ బ్లాంచె ప్రకటించారు. -
‘హార్మూజ్ వద్ద భారత ట్యాంకర్లు టోల్ ఫీజు చెల్లించలేదు’
న్యూఢిల్లీ: హార్మూజ్ జలసంధి గుండా ప్రయాణించిన భారత ట్యాంకర్లు టోల్ ఫీజు చెల్లించాయని వస్తున్న ప్రచారాన్ని ఇరాన్ ఖండించింది. భారత ట్యాంకర్లు టోల్ ఫీజు చెల్లించలేదని స్పష్టం చేసింది. న్యూఢిల్లీలోని ఇరాన్ రాయబారి మహమ్మద్ ఫతాలి సోమవారం మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని తెలిపారు. ఈ కష్టకాలంలో భారత్-ఇరాన్ మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని తెలిపారు. ఇరు దేశాలు ఒకే రకమైన ప్రయోజనాల కోసం కృషి చేస్తున్నాయని అన్నారు. కాగా, ఇరాన్‌కు టోల్ చెల్లింపులు చేసే నౌకలను అడ్డుకుంటానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే.“ఇప్పటి వరకు ఇరాన్ ఏమైనా వసూలు చేసిందా? అని మీరు భారత ప్రభుత్వాన్ని అడగవచ్చు” అని మహమ్మద్ ఫతాలి ఇరాన్ దౌత్య కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో చెప్పారు.ఎల్పీజీ తీసుకెళ్తున్న 9 నౌకలు బయలుదేరేందుకు ఎలాంటి టోల్ చెల్లించలేదని భారత్ ఇప్పటికే పలుసార్లు తెలిపింది. మరోవైపు, పర్షియన్ గల్ఫ్‌లో 15 భారత జెండా ఉన్న నౌకలు ఇంకా ఇరుక్కుపోయే ఉన్నాయని భారత్ చెబుతోంది. భారత్ ముడి చమురు, ఎల్పీజీ సరఫరాల్లో సుమారు సగం హార్మూజ్ జలసంధి గుండా వెళ్తుంది.కాగా, అమెరికా-ఇరాన్ మధ్య ఇటీవల కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత కూడా హార్మూజ్ జలసంధి మీదుగా నౌకలను అనుమతించలేదు. తమ మిత్రదేశాలకు మాత్రమే ఇరాన్ అనుమతి ఇచ్చింది.నౌకలు వెళ్లాలంటే తమ అనుమతి తీసుకోవాలని, లేదంటే వాటిని నాశనం చేస్తామని ఇరాన్ చెప్పింది. వాటి సురక్షిత ప్రయాణం కోసం ఫీజులు వసూలు చేస్తామని కూడా తెలిపింది. అయితే, టోల్ చెల్లించడం సరైన మార్గం కాదని ట్యాంకర్ సంస్థలకు ప్రాతినిధ్యం వహించే ఇంటర్టాంకో సంస్థకు చెందిన ఫిలిప్ బెల్చర్ చెప్పారు. -
హర్మూజ్ జలసంధిపై ట్రంప్ కొత్త గేమ్ ప్లాన్!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఓ వైపు హర్మూజ్ జలసంధిలో నౌకల్ని ఆపేస్తూ, మరో వైపు ఇరాన్‌ను బయపెట్టించేలా ఆ దేశంపై మరోసారి ముప్పేట క్షిపణులతో దాడి చేసే అవకాశాలపై ట్రంప్ తన సీనియర్ సలహాదారులతో చర్చిస్తున్నట్లు సమాచారం. ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ పలు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి.నిన్న ఇదే అంశంపై ట్రంప్ ఫ్లోరిడాలోని డోరల్ రిసార్ట్‌లో ఫాక్స్ న్యూస్‌తో మాట్లాడారు. దౌత్యపరమైన పరిష్కారానికి సిద్ధంగా ఉన్నానంటూనే ఇరాన్‌కు పరోక్షంగా హెచ్చరికలు జారీచేశారు. ‘హర్మూజ్ జలసంధిపై ఆంక్షలు కొనసాగిస్తూ, ఇరాన్ మౌలిక సదుపాయాలపై దాడి చేయాలని అనుకుంటున్నాను. కానీ నేను అలా చేయాలని అనుకోవడం లేదు. ఎందుకంటే హర్మూజ్ జలసంధి ఇరాన్‌ది. సముద్రపు నీటిని త్రాగునీటిగా మార్చే సాలినేషన్ ప్లాంట్లు వాళ్లవి. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు వాళ్లవి. వాటిపై సులభంగా దాడి చేయొచ్చు’ అని అన్నారు.యుద్ధం ప్రారంభ దశలో భాగమైన బాంబింగ్ దాడుల్ని మళ్లీ ప్రారంభించే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. అయితే ట్రంప్ సలహాదారులు మాత్రం ఈ తరహా దాడులు చేసే అవకాశం తక్కువగా ఉందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. కారణం.. బాంబింగ్ దాడులతో ప్రాంతీయ అస్థిరతను మరింత పెరిగే ప్రమాదం ఉంది. అలాగే ట్రంప్ దీర్ఘకాలిక సైనిక యుద్ధాల్ని కొనసాగించేందుకు ఇష్టపడటం లేదని వారు చెబుతున్నారు.మరో ప్రత్యామ్నాయం తాత్కాలికంగా ఆంక్షలను కొనసాగిస్తూ.. దీర్ఘకాలంలో హర్మూజ్ జలసంధి ద్వారా సురక్షిత రవాణా జరిగేలా మిత్రదేశాలను బాధ్యత వహించేలా ఒత్తిడి చేసే అవకాశం ఉందని వైట్ హౌస్ ప్రతినిధి ఒలివియా వేల్స్ తెలిపారు. ‘ట్రంప్ ఇప్పటికే హర్మూజ్ జలసంధిపై నావికాదళ ఆంక్షలు విధించారు. ఇరాన్ దోపిడీని ఆపారు. అదనపు అన్ని అవకాశాలను జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు’ అని వాల్ స్ట్రీట్ జర్నల్‌కు తెలిపారు.ఇరాన్‌తో చర్చలు విఫలమైన తర్వాత ట్రంప్ ఏ చర్యలకు ఉపక్రమించనున్నారనే అంశాలపై వస్తున్నవన్నీ ఊహాగానాలేనని వైట్ హౌస్ వర్గాలు స్పష్టం చేశాయి. ట్రంప్ మాత్రం ఇరాన్ తిరిగి చర్చలకు రావాలనుకుంటుందని పేర్కొన్నారు. -
ఇరాన్ సముద్ర మార్గాల్లో అమెరికా ఆపరేషన్ ప్రారంభం
వాషింగ్టన్: ఇరాన్ సముద్ర మార్గాల్లో నౌకల రాకపోకలను అడ్డుకుంటామని ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నంత పని చేశారు. ఇరాన్ పోర్టులను అమెరికా సైన్యం నిర్బంధించడం ప్రారంభించింది. అంతేగాక, ఇరాన్ నౌకలకు ట్రంప్ హెచ్చరిక జారీచేశారు. “గల్ఫ్‌లో మా నిర్బంధాన్ని లెక్క చేయకుండా ఏ నౌక వచ్చినా దాన్ని వెంటనే నాశనం చేస్తాం” అని అన్నారు.ఇరాన్ నౌకాదళం ఇక పనిచేయలేని స్థితిలో ఉందన్నట్లు ట్రంప్ అతిశయోక్తితో ట్రూత్‌లో పోస్ట్ చేశారు. “ఇరాన్ నౌకాదళం సముద్ర అడుగునే ఉంది. 158 నౌకలు పూర్తిగా నాశనమయ్యాయి. మేము దాడి చేయని వాటి సంఖ్య తక్కువగా ఉంది. ఇరాన్ వాటిని ‘ఫాస్ట్ అటాక్ షిప్స్’ అని పిలుస్తోంది.. కానీ, అవేమో చిన్న నౌకలు. అవి ప్రమాదమని మేము భావించడంలేదు. హెచ్చరిక చేస్తున్నాను.. ఈ నౌకల్లో ఏదైనా మేము చేపట్టిన మా నిర్బంధానికి దగ్గరగా వస్తే, సముద్రంలో పడవలపై మత్తు పదార్థాల వ్యాపారులను ఎదుర్కొనే విధానంలో వీటిని కూడా ఎదుర్కొని వెంటనే నాశనం చేస్తాం. ఈ చర్య వేగంగా, క్రూరంగా ఉంటుంది. పీఎస్ సముద్ర మార్గం ద్వారా అమెరికాలోకి వచ్చే మత్తు పదార్థాల్లో 98.2% ఆగిపోయాయి” అని ట్రంప్ తెలిపారు.కాగా, డొనాల్డ్ ట్రంప్ హార్మూజ్ జలసంధిని నిర్బంధించడానికి వేసుకున్న ప్లాన్‌లో తాము పాల్గొనబోమని నాటో మిత్ర దేశాలు సోమవారం తెలిపాయి. యుద్ధం ముగిసిన తర్వాత మాత్రమే జోక్యం చేసుకుంటామని సూచించాయి, ఈ నిర్ణయం ట్రంప్‌కు అసహనం కలిగించి, కూటమిలో ఉద్రిక్తతలను పెంచే అవకాశం ఉంది. -
ట్రంప్ సముద్ర దిగ్బంధనం : ఇరాన్ తీవ్ర హెచ్చరిక
ఇరాన్ సముద్ర కార్యకలాపాలపై దిగ్బంధనాన్ని అమలు చేయడానికి అమెరికా సిద్ధమవుతున్న నేపథ్యంలో ఇరాన్ తీవ్ర స్థాయిలో హెచ్చరిక జారీ చేసింది. తమ ఓడరేవులను లక్ష్యంగా చేసుకుంటే పర్షియన్ గల్ఫ్ లేదా ఒమన్ సముద్రంలోని ఏ ఓడరేవూ సురక్షితంగా ఉండదని ఇరాన్ తాజాగా హెచ్చరించింది. యుద్ధ విరమణ చర్చలు విఫలమైన తర్వాత టెహ్రాన్‌పై ఒత్తిడి పెంచే లక్ష్యంతో, ఇరాన్ ఓడరేవులలోకి ప్రవేశించే లేదా బయలుదేరే నౌకలను అడ్డుకోవడం ప్రారంభిస్తామని అమెరికా సైన్యం ప్రకటించిన నేపథ్యంలో ఈ హెచ్చరిక వచ్చింది. ఏప్రిల్ 13 (సోమవారం) నుండి ఇరాన్ ఓడరేవులపై ఆంక్షలు అమలులోకి రానున్న తరుణంలో గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరుకున్నాయి.అమెరికా సముద్ర దిగ్బంధనం (Blockade)పై ట్రంప్ ప్రకటన నేపథ్యంలో ఇరాన్ ధీటుగా స్పందించింది. ఒకవేళ అమెరికా దాడులకు దిగితే, తాము కూడా దీటుగా స్పందిస్తామని, తమ వద్ద ఇంకా వాడని ఆయుధాలు/అస్త్రాలు ఉన్నాయని ఇరాన్ నేతలు స్పష్టం చేశారు. తమ దేశ ఓడరేవులను లక్ష్యంగా చేసుకుంటే, పర్షియన్ గల్ఫ్ లేదా ఒమన్ సముద్రంలోని ఏ ఓడరేవు కూడా సురక్షితంగా ఉండదని ఇరాన్ హెచ్చరించింది. "పర్షియన్ గల్ఫ్ భద్రత అనేది అందరికీ ఉండాలి, లేదంటే ఎవరికీ ఉండదు" అని ఇరాన్ మిలిటరీ మరియు రివల్యూషనరీ గార్డ్స్ ప్రకటించాయి.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు, ఏప్రిల్ 13 ఉదయం 10 గంటల (EDT) నుండి ఇరాన్ ఓడరేవుల్లోకి ప్రవేశించే లేదా బయటకు వచ్చే అన్ని దేశాల నౌకలను అమెరికా సైన్యం అడ్డుకోనుంది. ఇరాన్ తన అణు కార్యక్రమంపై అమెరికా షరతులను అంగీకరించకపోవడంతో ట్రంప్ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఇరాన్ ఓడరేవులకు వెళ్లే నౌకలను మాత్రమే అడ్డుకుంటామని, ఇతర దేశాల మధ్య ప్రయాణించే నౌకలకు హార్ముజ్ జలసంధి గుండా అనుమతి ఉంటుందని అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపింది. ఈ ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు ఒక్కసారిగా పెరిగాయి. అమెరికా క్రూడ్ ఆయిల్ ధర 8 శాతం పెరిగి 104.24 డాలర్లకి చేరగా, బ్రెంట్ క్రూడ్ 102.29 కి డాలర్ల చేరుకుంది. హార్ముజ్ జలసంధి గుండా రోజుకు 100-135 నౌకలు వెళ్లేవి, కానీ ఇప్పుడు ఆ సంఖ్య 40కి పడిపోయింది. ఇదీ చదవండి: రిషబ్శెట్టికి జోడీగా తెరంగేట్రం : ఆశా వారసురాలి గురించి తెలుసా?యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి లక్షలాది బ్యారెళ్ల చమురును ఎగుమతి చేసిన ఇరాన్‌పై ఒత్తిడిని పెంచడానికే ఈ దిగ్బంధనం ఉద్దేశించినట్లుగా ఉంది. ఇరాన్ చమురు ఎగుమతుల కోసం ఉపయోగిస్తున్న "డార్క్ ట్రాన్సిట్స్" (రహస్య రవాణా) ను అడ్డుకోవడమే అమెరికా ప్రధాన లక్ష్యం. అయితే, ఈ దిగ్బంధనం వల్ల గల్ఫ్ ప్రాంతంలో పూర్తిస్థాయి యుద్ధం మొదలవుతుందేమోనన్న ఆందోళన ప్రపంచ దేశాల్లో నెలకొంది. ప్రస్తుత కాల్పుల విరమణ ఒప్పందం ఏప్రిల్ 22తో ముగియ నుండటంతో, ఆ తర్వాత పరిస్థితి మరింత దారుణంగా మారే అవకాశం ఉందా అనే ఆందోళన నెలకొంది. ఇదీ చదవండి: పోప్‌కు కౌంటర్ : ట్రంప్ సంచలన పోస్ట్ -
ఇరాన్ సమీపంలో అమెరికా నౌకా దళాలు
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరోసారి పరాకాష్టకు చేరుకున్నాయి. ఇరాన్ ఓడరేవులను లక్ష్యంగా చేసుకుని అమెరికా ప్రకటించిన ‘నౌకా దళ దిగ్బంధనం’ (నేవల్ బ్లాకేడ్) ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయంపై రష్యా తీవ్రస్థాయిలో విరుచుకుపడటంతో పాటు శాంతి స్థాపన కోసం ఇరాన్ వద్ద ఉన్న యురేనియం నిల్వలను తమ అధీనంలోకి తీసుకునేందుకు సిద్ధమని ప్రకటించింది.యురేనియం తరలింపునకు ప్రతిపాదనప్రపంచంలోనే అతిపెద్ద అణ్వాయుధ నిల్వలు కలిగిన రష్యా, ఇరాన్ అణు సంక్షోభాన్ని నివారించడానికి కీలక ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. ఇరాన్ వద్ద ఉన్న యురేనియంను రష్యాకు తరలించడం ద్వారా అగ్రరాజ్యంతో శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకోవచ్చని క్రెమ్లిన్ సూచించింది. ‘ఈ ప్రతిపాదనను అధ్యక్షుడు పుతిన్ గతంలోనే అమెరికా ముందు ఉంచారు’ అని క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ స్పష్టం చేశారు.అంతేకాకుండా, ఆదివారం ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్‌తో పుతిన్ ఫోన్లో మాట్లాడారు. మధ్యప్రాచ్యంలో న్యాయమైన, శాశ్వత శాంతిని సాధించడానికి రష్యా మధ్యవర్తిగా వ్యవహరించడానికి సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు.హార్మూజ్ జలసంధి.. ట్రంప్ కఠిన నిర్ణయంపాకిస్థాన్లోని ఇస్లామాబాద్‌లో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఇరాన్ ప్రతినిధి బృందం మధ్య జరిగిన చర్చలు విఫలమవ్వడంతో అమెరికా తన తదుపరి వ్యూహాన్ని అమలులోకి తెచ్చింది. వ్యూహాత్మక హార్మూజ్ జలసంధిని, ఇరాన్ ఓడరేవులను దిగ్బంధిస్తున్నట్లు ట్రంప్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. సోమవారం నుంచి ఇది ప్రారంభమవుతుందన్నారు. ఇరాన్ ఓడరేవులకు వచ్చే లేదా అక్కడి నుంచి వెళ్లే అన్ని రకాల నౌకలకు ఇది వర్తిస్తుందని చెప్పారు. ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన ఈ మార్గం మూతపడటం అంతర్జాతీయ మార్కెట్‌ను అతలాకుతలం చేసే అవకాశం ఉంది.అయితే, ఈ దిగ్బంధనాన్ని అమెరికా సైన్యం క్షేత్రస్థాయిలో ఎలా అమలు చేస్తుందనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. మరోవైపు, ఇరాన్ సైన్యం ఈ చర్యను పైరసీగా అభివర్ణించింది.యుద్ధం ముగిసేది ఎప్పుడు?ఫిబ్రవరి చివరలో అమెరికా-ఇజ్రాయెల్ దళాలు ఇరాన్‌పై దాడులు ప్రారంభించినప్పటి నుంచి వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. వారాంతపు చర్చలు విఫలమవ్వడంతో యుద్ధం త్వరలో ముగుస్తుందన్న ఆశలు ఆవిరయ్యాయి. ప్రస్తుతం ఇరాన్ తన స్నేహపూర్వక దేశాలైన చైనా వంటి ప్రాంతాలకు మాత్రమే చమురు నౌకలను అనుమతిస్తోంది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో రష్యా ముందుకొస్తున్నా అమెరికా తన మొండివైఖరిని వీడకపోతే ప్రపంచం భారీ ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.ఇదీ చదవండి: దేశ రాజధాని సమీపంలో కార్మికుల నిరసన.. -
పోప్‌కు కౌంటర్ : ట్రంప్ సంచలన పోస్ట్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ,పోప్ లియో XIV మధ్య నడుస్తున్న మాటల యుద్ధం ఇప్పుడు మరో మలుపు తిరిగింది. పోప్‌ను విమర్శించిన కొద్దిసేపటికే, ట్రంప్ తనను తాను ఏసు క్రీస్తు తరహాలో చిత్రీకరించుకున్న ఒక AI చిత్రాన్ని సోషల్ మీడియాలో పంచుకోవడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. పోప్ లియోతో వివాదం మధ్య, ట్రంప్ తాజా పోస్ట్ సంచలనంగా మారింది. .ప్రపంచ సంఘర్షణలపై పోప్ లియో XIV వైఖరిని విమర్శిస్తూ, బలహీనుడు, అతి ఉదారవాది అని అభివర్ణించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆ తర్వాత క్రీస్తును పోలిన తన చిత్రాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ చిత్రంలో, ట్రంప్ దైవిక కాంతితో కూడిన వస్త్రాలతో, ఒక వ్యక్తిని "స్వస్థత" పరుస్తున్నట్లుగా, పక్కనే దేవదూతలు లేదా సైనికులు ఉన్నట్లుగా ఆ చిత్రం ఉంది. ఇదీ చదవండి: రిషబ్శెట్టికి జోడీగా తెరంగేట్రం : ఆశా వారసురాలి గురించి తెలుసా?ఫ్లోరిడా నుండి వాషింగ్టన్కు తిరిగి వస్తున్నప్పుడు విలేకరులతో మాట్లాడుతూ, తాను పోప్‌కు ఫ్యాన్‌కు కాదని, అందుకే ప్రపంచ సమస్యలపై ఆయన వైఖరిని విమర్శించానని ట్రంప్ పేర్కొన్నారు. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను గద్దె దించే తన ప్రయత్నాలను పోప్ వ్యతిరేకిస్తున్నారని, తద్వారా అమెరికా ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ట్రంప్ ఆరోపించారు.కాగా ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధాన్ని పోప్ తీవ్రంగా ఖండించారు. 'సర్వశక్తిమంతులమనే భ్రమ' ఆజ్యం పోస్తోందని పోప్ ఘాటుగా విమర్శించిన నేపథ్యంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. పోప్ నేరుగా ట్రంప్ పేరు ప్రస్తావించనప్పటికీ, ఆయన వ్యాఖ్యలు అమెరికా నాయకత్వాన్ని ఉద్దేశించినవిగా కనిపించాయి. దీనికి ప్రతిస్పందనగా, లియో 'విదేశాంగ విధానానికి పనికిరాడని' ట్రంప్ ఆరోపించారు ,నేరం, అణు ముప్పు వంటి విషయాలపై మెతక వైఖరి అవలంబిస్తున్నారని మండిపడ్డారు. ఇరాన్ వద్ద అణ్వాయుధాలుండటం సరైనదేనని భావించే పోప్ తనకు అవసరంలేదంటూ మరోసారి విమర్శనాస్త్రాలను సంధించారు. మరోవైపు పోప్‌తో విభేదాల నేపథ్యంలో తనను తాను ఒక ఆధ్యాత్మిక రక్షకుడిగా చూపించుకునే ప్రయత్నం ఇది అని విశ్లేషకులు భావిస్తున్నారు. ట్రంప్ తనను తాను దైవంగా అభివర్ణించుకున్న వైనం మిత్రదేశాలు, శత్రువులు ఈ పోరాటాన్ని చూసే విధానాన్ని మార్చి వేస్తుందా? ఒకవేళ ఈ ఇరాన్ యుద్ధాన్ని 'పవిత్ర యుద్ధం'గా చిత్రీకరిస్తే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న 140 కోట్ల మంది క్యాథలిక్కులు ముఖ్యంగా అమెరికాలో నవంబర్ మధ్యంతర ఎన్నికలలో ఓటు వేయనున్న 7 కోట్ల మందికి పైగా క్యాథలిక్కులను ప్రభావితం చేస్తుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.ఇదీ చదవండి : ట్రంప్ అంటే నాకేమీ భయం లేదు.. పోప్ లియో సంచలన వ్యాఖ్యలు -
ఇరాన్‌పై అమెరికా యుద్ధం.. భారత్‌లో వీటి ధరలు పెరగనున్నాయా?
న్యూఢిల్లీ: ఇరాన్‌పై అమెరికా యుద్ధం కారణంగా రాబోయే రోజుల్లో హర్మూజ్ జలసంధిలో చమురు, ఎల్పీజీ సరఫరా అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే భారత్‌లో వినియోగదారులు గ్యాస్ కొరతను ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితి త్వరలో సల్ఫర్ దిగుమతులపై కూడా తీవ్ర ప్రభావం చూపనుంది. ఫలితంగా సల్ఫర్ ఆధారిత ఉత్పత్తుల తయారీ ఖర్చులు పెరిగి, వాటి ధరలు అమాంతం పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.మోడరన్ వార్ ఇన్స్టిట్యూట్ నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా సముద్ర మార్గంలో జరిగే సల్ఫర్ రవాణాలో దాదాపు సగం హర్మూజ్ జలసంధి ద్వారానే జరుగుతుంది. సల్ఫర్ అనేది ఎరువుల తయారీ, రసాయన పరిశ్రమలు, లోహ శుద్ధి, బ్యాటరీలు, సెమీకండక్టర్ల తయారీకి అవసరమైన ప్రధాన ముడి పదార్థం. హర్మూజ్ జలసంధి మార్గంలో అంతరాయం కొనసాగితే ఈ కీలక పదార్థం కొరత మరింతగా పెరిగే అవకాశం ఉంది.ఫిబ్రవరి 28 నుంచి ప్రారంభమైన ఇరాన్‌పై అమెరికా -ఇజ్రాయెల్ సంయుక్త దాడుల ప్రభావంతో 44 వేలకుపైగా కంపెనీల ఉత్పత్తుల రవాణా అంతరాయం ఎదుర్కొన్నట్లు డన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్ మరో నివేదికలో పేర్కొంది.దీని ప్రభావం భారత్‌లోని తయారీ రంగాలపై తీవ్రంగా పడనుంది. ఉత్పత్తి ఖర్చులు పెరగడంతో పాటు వాటి ధరలను కూడా పెంచాల్సి వస్తుంది. ప్రభుత్వం ఇప్పటికే కరీఫ్ సీజన్ కోసం ఎరువుల సబ్సిడీని 12 శాతం పెంచింది. అయినప్పటికీ యుద్ధం కొనసాగితే ప్రభుత్వ ఆర్థిక భారమూ మరింత పెరుగుతుంది. చైనా మే నెల నుంచి సల్ఫ్యూరిక్ యాసిడ్ ఎగుమతులను నిలిపివేయనున్నట్లు సంకేతాలు ఇచ్చింది. ఇది ప్రపంచవ్యాప్తంగా సరఫరా ఒత్తిడిని మరింత పెంచుతుంది. ఇప్పటికే యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి చైనాలో సల్ఫర్ ధరలు 15 శాతం పెరిగాయి.భారత్ మాత్రం ద్వంద్వ సమస్యను ఎదుర్కొంటోంది. రైతులకు ఎరువుల ధరలు పెరగకుండా సబ్సిడీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరోవైపు ప్రభుత్వ ఆదాయంపై భారీ ఒత్తిడి పడుతుంది. యుద్ధం ఎక్కువ కాలం కొనసాగితే ఆహార ధరలు పెరిగి ద్రవ్యోల్బణం మరింత పెరిగే అవకాశం ఉంది. మొత్తానికి, ఇరాన్–అమెరికా యుద్ధం ప్రభావం కేవలం చమురు, ఎల్పీజీ సరఫరాలకే పరిమితం కాదు. సల్ఫర్ సరఫరా అంతరాయం దేశ ఆహార భద్రత, రైతుల ఖర్చులు, పరిశ్రమల ఉత్పత్తి ఖర్చులపై తీవ్ర ప్రభావం చూపనుందని నివేదికలు స్పష్టంగా హెచ్చరిస్తున్నాయి. -
ట్రంప్ అంటే నాకేమీ భయం లేదు.. పోప్ లియో సంచలన వ్యాఖ్యలు
వాటికన్,వైట్ హౌస్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల మధ్య పోప్ లియో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ అంటే తనకు భయం లేదని, యుద్ధానికి వ్యతిరేకంగా గళం విప్పడం కొనసాగిస్తానని పోప్ స్పష్టం చేశారు. ఇరాన్‌పై అమెరికా , ఇజ్రాయెల్ జరుపుతున్న దాడులను అన్యాయం, క్రూరమైనవిగా అభివర్ణించారు. ఏ మత సిద్ధాంతం కూడా యుద్ధాన్ని సమర్థించదని ఆయన స్పష్టం చేశారు.ట్రంప్ ఎన్ని విమర్శలు చేసినా, శాంతి కోసం తన గళాన్ని వినిపిస్తూనే ఉంటానని పోప్ లియో (Pope Leo) చెప్పారు. 10 రోజుల ఆఫ్రికా పర్యటన ప్రారంభంలో భాగంగా అల్జీర్స్‌కు వెళ్తున్న పోప్ విమానంలో రాయిటర్స్‌తో మాట్లాడారు. అయితే తాను ట్రంప్‌తో నేరుగా ఘర్షణకు దిగబోనని, కానీ మత బోధనలను దుర్వినియోగం చేయవద్దని లియో హెచ్చరించారు. ఇదీ చదవండి: రిషబ్శెట్టికి జోడీగా తెరంగేట్రం : ఆశా వారసురాలి గురించి తెలుసా?అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విదేశీ విధానాలను పోప్ ఇటీవల తీవ్రంగా విమర్శిస్తున్నారు. ముఖ్యంగా అమెరికా నేతృత్వంలో ఇరాన్‌పై యుద్ధాన్ని పోప్ ఇటీవల విమర్శించిన నేపథ్యంలో వీరి మధ్య వాగ్వాదం జరిగింది. సెయింట్ పీటర్స్ బసిలికాలో జరిగిన ప్రార్థనా కార్యక్రమంలో సంయమనం,శాంతి కోసం పిలుపునిచ్చారు లియో. "సర్వశక్తిమంతులమనే భ్రమ" ఈ యుద్ధానికి కారణం అంటూ ధ్వజమెత్తారు. స్వార్థం, డబ్బుపై ఆరాధన చాలు!", అధికార ప్రదర్శన చాలు! యుద్ధం చాలు! అని లియో గట్టిగా హెచ్చరించారు.పోప్ వ్యాఖ్యలపై ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ పోప్‌ను నేరాల విషయంలో బలహీనమైన వ్యక్తి అని, విదేశీ విధానంపై అవగాహన లేని వ్యక్తి అని విమర్శించారు. అంతేకాకుండా, అమెరికా అధ్యక్షుడిని విమర్శించే పోప్ తనకు వద్దు, తాను ఏ పని కోసం అయితే అఖండ మెజారిటీతో ఎన్నికయ్యానో, ఆ పనిని కచ్చితంగా చేస్తున్నానని సోషల్‌మీడియా వేదికగా ట్రంప్ ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే పోప్ లియో ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వాదోప వాదాలు, ఈ సంఘర్షణ వైట్ హౌస్ , వాటికన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలను స్పష్టం చేస్తున్నాయి.కాగా ముంబైలో పుట్టి పెరిగి, అమెరికా పౌరసత్వం కలిగి ఉండి, గత ఏడాది (మే 2025) క్యాథలిక్ చర్చికి తొలి అమెరికన్ పోప్‌గా ఎన్నికైన వ్యక్తి పోప్ లియో XIV (రోబర్ట్ ప్రివోస్ట్). ప్రస్తుతం పోప్ లియో 11 రోజుల ఆఫ్రికా పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనలో అల్జీరియా, అంగోలా, కెమెరూన్, ఈక్వటోరియల్ గినియా దేశాలను సందర్శించనున్నారు. అమెరికాలోని 70 మిలియన్ల క్యాథలిక్ ఓటర్లపై ఈ వివాదం ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.ఇదీ చదవండి: రిక్షా డ్రైవర్ కొడుకు, అమెరికాలో టెకీ, అంతలోనే విషాదం -
మరోసారి ఇరాన్‌తో చర్చలు? ట్రంప్ ఏమన్నారంటే..!
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి ఇరాన్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ తదుపరి చర్చలకు వచ్చినా.. రాకపోయినా తనకు సంబంధం లేదని అసలు ఆవిషయం తాను పట్టించుకోనని తెలిపారు. ఇటీవల జరిగిన చర్చలు విఫలమైన నేపథ్యంలో ట్రంప్ మాటలు మరోసారి హీట్ పెంచాయి.ప్రస్తుతం పశ్చిమాసియా యుద్ధంలో తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం జరుగుతుంది. ఇటీవల జరిగిన చర్చలు విఫలమవడంతో ట్రంప్ మరోసారి విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇదివరకే హార్ముాజ్ను దిగ్భందిస్తామని వ్యాఖ్యానించారు. అయితే దానికి ఇరాన్ సైతం ఘాటుగానే బదులిచ్చింది. తాజాగా మరోసారి ట్రంప్ చర్చల విషయమై మాట్లాడారు.ట్రంప్ మాట్లాడుతూ "అసలు ఇరాన్ మరోసారి చర్చలకు తిరిగి వస్తుందో లేదో తెలియదు. ఒకవేళ వారు చర్చలకు వచ్చినా రాకపోయినా ఆ విషయం నేనసలు పట్టించుకోను. ఇరాన్ దేశం దాదాపు నాశనమైంది. ప్రస్తుతం ఆదేశం చాలా దీన పరిస్థితుల్లో ఉంది. చర్చలు విఫలమైనప్పటికీ వారి వద్ద అణ్వాయుధం ఉండదు. ఉండే అవకాశం లేదు". అని అన్నారు.అయితే ఇరాన్ మౌళిక సదుపాయాలపై అమెరికా పెద్దగా దాడి చేయలేదని ఆ దేశంలోని ఒకే వంతెనను కూల్చివేసిందని, అది కూడా వారి తప్పేనన్నారు. హర్ముజ్‌ను తెరుస్తామని అమెరికా మాటిచ్చి ఇప్పుడు దానిని తప్పారని ఇరాన్ పెద్ద అబద్ధాల కోరు దేశమన్నారు. అయితే ప్రస్తుతం ఇరు దేశాల మధ్య నడుస్తున్న సీజ్ఫైర్ ఏప్రిల్ 22 వరకూ కొనసాగుతుందన్నారు. ఇరాన్ ఓడరేవుల దిగ్భందనం మెుదలవుతుందన్నారు. పశ్చిమాసియా యుద్ధం శాంతిస్తుందనుకున్న తరుణంలో ప్రస్తుతం ఇరాన్- అమెరికా మధ్య మరోసారి ఉద్రిక్తతలు పెరిగేలా ఉన్నాయి. హర్ముజ్‌ను దిగ్భందించాలని అమెరికా నావికాదళానికి ట్రంప్ ఆదేశాలివ్వడం.. అలా చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఇరాన్ హెచ్చరించడంతో మరోసారి ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి.


