దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాల్లో ముగిశాయి. 5-రోజుల నష్టాల నుంచి బయటపడి విజయాల బాట పట్టాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 584.81 పాయింట్లు లేదా 0.72 శాతం లాభపడి 81,634.8 వద్ద ముగిసింది. నిఫ్టీ 50 కూడా 217.38 పాయింట్లు లేదా 0.88 శాతం పెరిగి 25,013.15 వద్ద ముగిసింది.
సెన్సెక్స్ వ్యక్తిగత స్టాక్‌లలో అదానీ పోర్ట్స్, ఎం&ఎం, రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎల్&టీ, ఎస్‌బీఐ, అల్ట్రాటెక్ సిమెంట్, ఎన్‌టీపీసీ, కోటక్ బ్యాంక్ టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. 1 శాతం నుండి 4.5 శాతం మధ్య లాభపడ్డాయి. మరోవైపు టాటా స్టీల్, టైటాన్ కంపెనీ, బజాజ్ ఫిన్‌సర్వ్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, బజాజ్ ఫైనాన్స్, టాటా మోటార్స్, ఐటీసీ షేర్లు 2.7 శాతం వరకు క్షీణించి సెన్సెక్స్ టాప్ లూజర్‌గా ఉన్నాయి.
విస్తృత మార్కెట్లలో వీఎస్‌ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 1.86 శాతం, బీఎస్‌ఈ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 2.44 శాతం పెరిగింది. విస్తృత సూచీలు నేడు బెంచ్‌మార్క్ సూచీలను అధిగమించాయి. ఇదిలా ఉండగా సెక్టార్లలో నిఫ్టీ మెటల్ ఇండెక్స్ మినహా అన్ని సూచీలు ఈరోజు ట్రేడింగ్‌లో ర్యాలీ చేశాయి. నిఫ్టీ మీడియా ఇండెక్స్ 3 శాతం, నిఫ్టీ ఆటో 1.84 శాతం, నిఫ్టీ ఫార్మా 1.5 శాతం చొప్పున ఎగబాకాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment