ఫ్లాట్‌గా ట్రేడవుతున్న స్టాక్‌ మార్కెట్లు | Stock Market Opening Rally On October 08 2024 | Sakshi
Sakshi News home page

ఫ్లాట్‌గా ట్రేడవుతున్న స్టాక్‌ మార్కెట్లు

Published Tue, Oct 8 2024 9:41 AM | Last Updated on Tue, Oct 8 2024 10:44 AM

Stock Market Opening Rally On October 08 2024

దేశీయ స్టాక్‌ మార్కెట్లు మంగళవారం ఉదయం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:27 సమయానికి నిఫ్టీ 6 పాయింట్లు పెరిగి 24,808కు చేరింది. సెన్సెక్స్‌ 84 పాయింట్లు పుంజుకుని 81,142 వద్ద ట్రేడవుతోంది.

అమెరికా డాలర్‌ ఇండెక్స్‌ 102.53 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌ ధర 80.8 అమెరికన్‌ డాలర్ల వద్ద ఉంది. యూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 4.02 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో నష్టాల్లో ముగిశాయి. ఎస్‌ అండ్‌ పీ 0.96 శాతం నష్టపోయింది. నాస్‌డాక్‌ 1.18 శాతం దిగజారింది.

ఇదీ చదవండి: హైడెల్‌బర్గ్‌ సిమెంట్‌పై అదానీ కన్ను!

రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధంతో అస్తవ్యస్తంగా మారిన ఆర్థిక వ్యవస్థలకు తాజాగా పశ్చిమాసియా ఉద్రిక్తతలు తీవ్ర అనిశ్చితులకు గురిచేస్తున్నాయి. ఇజ్రాయెల్‌–హమాస్‌ మధ్య పోరు లెబనాన్‌కు పాకడం.. ఇరాన్‌ కూడా రంగంలోకి దూకి ఇజ్రాయెల్‌పై మిసైళ్ల వర్షం కురిపించడంతో ఈ ప్రాంతంలో పూర్తిస్థాయి యుద్ధానికి దారితీసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. గడిచిన రెండేళ్ల కాలం నుంచి వారం రోజుల్లో మార్కెట్లు ఇంతలా పడిపోవడం ఇదే తొలిసారి. అయితే, ఈ పతనాలను చూసి రిటైల్‌ ఇన్వెస్టర్లు మరీ అందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు మార్కెట్‌ నిపుణులు. గత యుద్ధాల సమయంలో పడిపోయిన మార్కెట్లు చాలా త్వరగా కోలుకున్నాయని, అందుకే ఈ మార్కెట్‌ క్రాష్‌ను సదవకాశంగా మలచుకోవాలని సూచిస్తున్నారు.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement