ఒక ఖడ్గమృగం రోడ్డుపై వేగంగా వెళ్తున్న భారీ వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటన అస్సాంలోని కజిరంగలో హల్దీబారీ రహదారి వద్ద చోటు చేసుకుంది. వాస్తవానికి వాహనం వేగంగా వెళ్తుంటే ఖడ్గమృగం నాదారికే అడ్డుగా వస్తావా అన్నట్లుగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో అదృష్టవశాత్తు ఆ జంతువుకు ఎలాంటి గాయాలు కాలేదు. కొద్దిలో పెను ప్రమాదం తప్పింది. అయితే సదరు వాహనాన్ని పోలీసులు ఆపి జరిమాన విధించారు.
ఆ ఘటనకు సంబంధించిన వీడియోని అస్సాం ముఖ్యమంత్రి ట్విట్టర్‌లో షేర్ చేస్తూ...ఈ రహదారిలో ఆ జంతువులకు ఇబ్బంది కలిగిస్తే ప్రయాణించేందుకు అనుమతించం అని ట్వీట్ చేశారు. తాము ఈ కజిరంగా వద్ద జంతువులను రక్షించాలనే ఉద్దేశంతో సుమారు 32 కి.మీ ఎలివేటర్ కారిడర్‌ని అధికారులు చేత దగ్గరుండి పర్యవేక్షిస్తున్నామని అన్నారు.
ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు ఈ రహదారిలో వాహనాలు వేగంగా వెళ్తే చెట్లకు, జంతువులకు ఇబ్బంది కలగవచ్చని కొందరూ, మరికొందరూ నుమాలిగర్ వద్ద బ్రహ్మపుత్ర నదిపై నిర్మిస్తున్న వంతెన పూర్తి అయితే వాహనాలను అటు మళ్లించే ఏర్పాట్లు చేయడమే కాకుండా అంతవరకు ఈ రహదారిలో వాహనాలు తక్కువ వేగంతో వెళ్లేలా చూడాలంటూ సలహలిస్తూ...ట్వీట్ చేశారు.
Rhinos are our special friends; we’ll not allow any infringement on their space.
— Himanta Biswa Sarma (@himantabiswa) October 9, 2022
In this unfortunate incident at Haldibari the Rhino survived; vehicle intercepted & fined. Meanwhile in our resolve to save animals at Kaziranga we’re working on a special 32-km elevated corridor. pic.twitter.com/z2aOPKgHsx
(చదవండి: మేక మొక్కులకు భక్తులే షాకయ్యారు.. శివయ్య వరమిస్తాడా?.. వీడియో వైరల్)
Comments
Please login to add a commentAdd a comment