వైరల్‌ : పాపం ఆ బిడ్డకి తెలియదు తల్లి చనిపోయిందని.. | Baby Rhino Tries To Wake Its Dead Mother Killed By Poachers | Sakshi
Sakshi News home page

పాపం ఆ బిడ్డకి తెలియదు తల్లి చనిపోయిందని..

Published Wed, Jul 3 2019 10:55 AM | Last Updated on Wed, Jul 3 2019 10:57 AM

Baby Rhino Tries To Wake Its Dead Mother Killed By Poachers - Sakshi

న్యూఢిల్లీ : తల్లి.. ఎవరికైనా తల్లే. అది మనుషులకైనా, జంతువులకైనా. మాతృమూర్తి చూపించినంత ప్రేమ ప్రపంచంలో మరెవరూ చూపించలేరనేది నగ్నసత్యం. అలాంటి తల్లి మన నుంచి దూరమైతే..? వినడానికే బాధగా ఉంది. మనుషులకే కాదు జంతువులకు సైతం తల్లి అవసర. తల్లిని కోల్పోతే అవి ఎంతగా బాధపడతాయో తెలియజేసే హృదయవిదారకర వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. ప్రవీణ్‌ కశ్వన్‌ అనే ఫారెస్ట్‌ అధికారి మొదటగా ఆ వీడియోను పోస్ట్‌ చేశాడు. వీడియో ప్రకారం.. ఓ తల్లి ఖడ్గమృగాన్ని(రైనో) వేటగాళ్లు చంపేశారు. అది తెలియక పిల్ల రైనో తల్లి మృతదేహం చూట్టూ తిరుగుతోంది. తనకు ఆకలిగా ఉందని, పాలు ఇచ్చే టైం అయినా ఇంకా లేవడం లేదనే విధంగా మృతదేహం చుట్టూ తిరుతూ తల్లిని లేపడానికి ప్రయత్నిస్తోంది. పాపం ఆ పిల్ల రైనోకి తెలియడం లేదు తల్లి చనిపోయిందని, ఇక రాదని. ఈ వీడియోను ప్రవీణ్‌ పోస్ట్‌ చేస్తూ.. వేట ఎంత విధ్వంసకరమైనదో వీడియో చూసైనా కనువిప్పు కలగాలని ట్వీట్‌ చేశాడు. ఈ ట్వీట్‌ ఇప్పుడు వైరల్‌ అయింది. ప్రముఖ నటి స్వర్ణ భాస్కర్‌తో సహా పలువురు ఈ వీడియోను రీట్వీట్‌ చేశారు.

కాగా ఈ వీడియోలో చనిపోయిన ఖడ్గమృగం 2018 ఫిబ్రవరిలో సోతాఫ్రికాలోని నేషనల్‌ పార్క్‌కు చెందినదిగా తెలుస్తోంది.  రైనోల దంతాలకు అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్‌ ఉంది. దీంతో వేటగాళ్లు రైనోలను చంపి వాటి దంతాలను తీసుకెళ్తున్నారు. భూగోళంపై అంతరించి పోతున్న జీవజాతుల జాబితాలోకి రైనోలు కూడా ఉన్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement