rhinos
-
నరేంద్ర మోదీ ఒక హీరో.. ఇంగ్లండ్ మాజీ ఆటగాడు ప్రశంసలు వర్షం
Kevin Pietersen Comments ON Narendra Modi: భారత ప్రధాని నరేంద్ర మోదీపై ఇంగ్లండ్ మాజీ ఆటగాడు, పర్యావరణ పరిరక్షకుడు కెవిన్ పీటర్సన్ ప్రశంసల జల్లు కురిపించాడు. ఖడ్గమృగాల రక్షణ కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకుంటున్న చర్యలను పీటర్సన్ కొనియాడాడు. ఖడ్గమృగాలన్ని కాపాడటానికి అస్సాం ప్రభుత్వం చేస్తున్న కృషిని అతడు ప్రశంసించాడు. భారత ప్రధానిని అనుకరించాలని ఇతర ప్రపంచ నాయకులకు పీటర్సన్ పిలుపు నిచ్చాడు. ప్రధాని నరేంద్ర మోదీని అతడు ఒక "హీరో" గా అభివర్ణించాడు. "ఒక కొమ్ము గల ఖడ్గమృగం భారతదేశానికి గర్వకారణం.. దాని శ్రేయస్సు కోసం అన్ని చర్యలు తీసుకోబడతాయి" అని ప్రధాని చెప్పారని పీటర్సన్ పేర్కొన్నాడు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్లే భారతదేశంలో ఖడ్గమృగాల సంఖ్య వేగంగా పెరుగుతోందని అతడు వెల్లడించాడు. ప్రపంచ ఖడ్గమృగ దినోత్సవం సెప్టెంబర్ 22 న, అసోం ప్రభుత్వం 2,479 ఖడ్గమృగాల కొమ్ములను బహిరంగంగా వేద ఆచారాల మధ్య దహనం చేసిన సంగతి తెలిసిందే. ఈ వేడుకలో ముఖ్య అతిథిగా అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ పాల్గొన్నారు. ఒక కొమ్ము గల ఖడ్గమృగం భారతదేశానికి గర్వకారణం, దాని శ్రేయస్సు కోసం అన్ని చర్యలు తీసుకోబడతాయి ”అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. చదవండి: అతడు ఆద్భుతమైన ఆటగాడు: ఇర్ఫాన్ పఠాన్ -
వైరల్ : పాపం ఆ బిడ్డకి తెలియదు తల్లి చనిపోయిందని..
న్యూఢిల్లీ : తల్లి.. ఎవరికైనా తల్లే. అది మనుషులకైనా, జంతువులకైనా. మాతృమూర్తి చూపించినంత ప్రేమ ప్రపంచంలో మరెవరూ చూపించలేరనేది నగ్నసత్యం. అలాంటి తల్లి మన నుంచి దూరమైతే..? వినడానికే బాధగా ఉంది. మనుషులకే కాదు జంతువులకు సైతం తల్లి అవసర. తల్లిని కోల్పోతే అవి ఎంతగా బాధపడతాయో తెలియజేసే హృదయవిదారకర వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ప్రవీణ్ కశ్వన్ అనే ఫారెస్ట్ అధికారి మొదటగా ఆ వీడియోను పోస్ట్ చేశాడు. వీడియో ప్రకారం.. ఓ తల్లి ఖడ్గమృగాన్ని(రైనో) వేటగాళ్లు చంపేశారు. అది తెలియక పిల్ల రైనో తల్లి మృతదేహం చూట్టూ తిరుగుతోంది. తనకు ఆకలిగా ఉందని, పాలు ఇచ్చే టైం అయినా ఇంకా లేవడం లేదనే విధంగా మృతదేహం చుట్టూ తిరుతూ తల్లిని లేపడానికి ప్రయత్నిస్తోంది. పాపం ఆ పిల్ల రైనోకి తెలియడం లేదు తల్లి చనిపోయిందని, ఇక రాదని. ఈ వీడియోను ప్రవీణ్ పోస్ట్ చేస్తూ.. వేట ఎంత విధ్వంసకరమైనదో వీడియో చూసైనా కనువిప్పు కలగాలని ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ అయింది. ప్రముఖ నటి స్వర్ణ భాస్కర్‌తో సహా పలువురు ఈ వీడియోను రీట్వీట్ చేశారు. కాగా ఈ వీడియోలో చనిపోయిన ఖడ్గమృగం 2018 ఫిబ్రవరిలో సోతాఫ్రికాలోని నేషనల్ పార్క్‌కు చెందినదిగా తెలుస్తోంది. రైనోల దంతాలకు అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. దీంతో వేటగాళ్లు రైనోలను చంపి వాటి దంతాలను తీసుకెళ్తున్నారు. భూగోళంపై అంతరించి పోతున్న జీవజాతుల జాబితాలోకి రైనోలు కూడా ఉన్నాయి. The picture of poaching !! A baby #rhino tries to wake #mother, who is killed by poachers for the #horn. Devastating & eye opening. pic.twitter.com/EnAS2PAHiD — Parveen Kaswan, IFS (@ParveenKaswan) July 2, 2019 -
హృదయాలను కలిచివేస్తున్న ఫోటో.. తల్లి కోసం..
తల్లి బిడ్డల బంధం విడదీయలేనిది. అది మనుషులకైనా, పశుపక్ష్యాదులకైనా ఒక్కటే. తన బిడ్డకు చిన్న గాయం అయినా తల్లి గుండె తల్లడిల్లిపోతుంది. అలాగే తల్లికి ఏ చిన్న హానీ కలిగినా బిడ్డ అంతే బాధపడుతుంది. తన తల్లిని చంపేందుకు వచ్చిన వేటగాళ్లను ఎదిరించే దమ్ములేకపోయినా.. తల్లిని రక్షించడం కోసం చివరిదాక ప్రయత్నం చేసింది ఓ పిల్ల ఖడ్గమృగం(రైనో). కానీ తల్లిని రక్షించేకోలేక గాయాలతో తల్లి శవం వద్దే పడిఉంది. ఇప్పుడా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ హృదయ విచారక ఘటన అఫ్రికాలోని క్రుగర్ నేషనల్ పార్క్‌లో జరిగింది. ఈ ఫోటో చూసిన ప్రతి ఒక్కరి హృదయం చలించిపోతుంది. ఖడ్గమృగాల కొమ్ముల కోసం వేటగాళ్లు వాటిని చంపేస్తుంటారు. సాధారణంగా ఖడ్గ మృగం కొమ్ములు తీసుకొని వెళ్ళడానికి వేటగాళ్ళు వచ్చినప్పుడు.. వాటి పిల్లలను కూడా చంపేయడమో.. లేదా వాటికి మత్తుపదార్థాలు పెట్టడమో చేస్తూ ఉంటారు. పిల్ల రైనోలు వారి పనికి అడ్డు తగిలే అవకాశం ఉంటుందని అలా చేస్తారు. వేటగాళ్లకు చిక్కిన ఓ ఖడ్గమృగాన్ని కాపాడేందుకు ఓ బుల్లి రైనో తన ప్రాణాలను సైతం లెక్కచేయలేదు. ఒక్క నెల వయస్తున్న ఆ రైనో తన తల్లికి హానీ కలిగించడానికి వచ్చిన వేటగాళ్లను ఎదురించించింది. ఇంకా కొమ్ములు కూడా రాని ఆ బుల్లి రైనో తన తల్లిని రక్షించేందుకు సాయశక్తులా ప్రయత్నించింది. చివరకూ వేటగాళ్ల చేతిలో గాయాలపాలై తల్లి శవం వద్దే పడిపోయింది. ఆ ఫోటో ఇప్పుడు వైరల్ అయింది. నెల వయస్సు ఉన్న రైనో తన తల్లికోసం అంత సాహసం చేయడం.. చివరకి వేటగాళ్ల చేతిలో ఓడిపోయి తల్లి శవం వద్ద దీనస్థితిలో పడిఉండడం ప్రతి ఒక్కరిని కలిచివేసింది. కాగా ఆ బుల్లి రైనోని సఫారీ జూ సిబ్బంది తీసుకెళ్లి ట్రీట్మెంట్ అందిస్తోంది. దానికి ఆర్థర్ అని పేరు పెట్టి ట్రీట్మెంట్కోసం విరాళాలను కూడా సేకరిస్తోంది. దానికి గాయాలు ఎక్కడెక్కడ అయ్యాయో.. తల్లికోసం అది చేసిన సాహసం ఏంటో తెలుపుతూ విరాళాలు సేకరిస్తున్నారు. జంతూ ప్రేమికులు కూడా బుల్లి రైనో ఆర్థర్‌కు పెద్ద ఎత్తున సాయం అందిస్తున్నారు. ఆ విరాళాలతో ఇలా గాయపడిన ఎన్నో ఖడ్గమృగాలను రక్షిస్తున్నారు. -
కెవిన్ పీటర్సన్ ట్వీట్.. భారతీయులు ఫిదా!
సాక్షి వెబ్‌డెస్క్: అచ్చమైన మాతృభాషలో మాట్లాడటం.. రాయడం కూడా ఇప్పుడు కష్టమైపోతోంది. భారతీయ భాషలన్నింటిలోనూ ఆంగ్ల పదాలు చొచ్చుకుపోయాయి. రోజువారీ జనజీవితంలో భాగమైపోయాయి. ప్రస్తుతం ఫోర్జీ స్పీడ్ యుగంలో పరభాష పదం లేకుండా మాట్లాడటం, రాయడం అంటే కష్టమేనేమో. కానీ ఒక పరదేశీయుడు స్వచ్ఛమైన మన భాషలో రాస్తే.. ఒక్క ఆంగ్ల పదాన్ని ఉపయోగించకపోతే.. ఇప్పుడు ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ హిందీలో చేసిన ట్వీట్‌పై.. ఇలాగే ఆశ్చర్యపోతున్నారు మన నెటిజన్లు. కెవిన్ ఎంత స్వచ్ఛమైన హిందీలో ట్వీట్ చేశారని మురిసిపోతున్నారు. మనం కూడా హిందీలో ఇంత చక్కగా రాయలేమోనని ఉత్తరాది నెటిజన్లు సంభ్రమాశ్చర్యాలు వ్యక్తం చేస్తున్నారు. కజిరంగా జాతీయ పార్కులో రైనోల సంఖ్య గణనీయంగా పెరిగిపోవడం తనకు ఆనందం కలిగిస్తోందని, భారతీయులు అన్నా, భారత్‌లోని జంతుజాలమన్నా తనకు ఎంతో ఇష్టమని కెవిన్ స్వచ్ఛమైన హిందీలో ట్వీట్ చేశాడు. అతని ట్వీట్‌కు సోషల్ మీడియాలో విశేషమైన స్పందన లభిస్తోంది. ఈ ట్వీట్‌ను ఇప్పటివరకు 3వేలమంది రీట్వీట్ చేశారు. 12వేలమందికిపైగా లైక్ చేశారు. భారతీయులు కూడా ఇలా ఒక్క ఆంగ్ల పదం లేకుండా రాయలేరని, మన కన్నా కెవిన్ బెటర్ అని నెటిజన్లు ఆయనను ప్రశంసిస్తున్నారు. Yeh bohut achi Khabar hai, isse Padne ke liye mein bohut Khush hoon, india mein appse bohut pyar karta hoon aur aapke jaanwaro se bhi bohut pyar karta hoon. @sorai2018 aapke sabhi pyaare jaanwaro se pratibrad hai. Hum rhinos se suruwatt kar rahe hai. Mein bohut khush hoon. ❤️ pic.twitter.com/VUDlaJja0s — Kevin Pietersen (@KP24) 2 April 2018 to be honest. No indian would speak hindi like this. He would definitely use a english word in btwn. Damn u are bettr than us😂😂 — Utkarsh (@utkarshnigam76) 2 April 2018 😱 OMG Hindi me tweet kia apne Thnx @KP24 💪💪👏👏👏👏👏😘😘😘♥️♥️♥️♥️ — Mo Sohel🐦 (@_imsohel) 2 April 2018 Hey Kevin who is your Hindi Tutor😉?Anyways doing good job.All the best — Rahul Dravid (@rahulthewall00) 2 April 2018 -
హిందీలో ఇంగ్లండ్ క్రికెటర్ హార్ట్‌టచింగ్ ట్వీట్
న్యూఢిల్లీ : ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ హిందీలో చేసిన ఓ ట్వీట్ అందరి మనసులను కదిలిస్తోంది. అసోం కజిరంగా నేషనల్ పార్క్ ప్రకటించిన జంతువుల లెక్కల్లో ఖడ్గమృగాల (రైనోస్) సంఖ్య పెరిగింది. ఈ విషయాన్ని అందరూ ఆహ్వానించగా.. జంతు ప్రేమికుడైన పీటర్సన్ వాటి సంఖ్య పెరగడంపై సంతోషం వ్యక్తం చేస్తూ హిందీలో ట్వీట్ చేశాడు. ‘చాలా మంచి వార్త విన్నాను. దీంతో చాలా సంతోషపడ్డా. భారత్ అంటే చాలా ఇష్టం. ఇక్కడ రైనోస్ సంఖ్య పెరగడం చాలా సంతోషంగా ఉంది’ అని ట్వీట్లో పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట హల్చల్ చేస్తోంది. అయితే ఈ హిందీ ట్వీట్ విషయంలో అతనికి ఎవరు సహకరించారో తెలియరాలేదు. పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) అనంతరం పీటర్సన్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్ తరఫున 104 టెస్టులు, 136 వన్డేలు ఆడిన పీటర్సన్ 2010 టీ20 ప్రపంచకప్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక ఇంగ్లండ్ తరుఫున అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాట్స్‌మన్ రికార్డు నమోదు చేశాడు. Yeh bohut achi Khabar hai, isse Padne ke liye mein bohut Khush hoon, india mein appse bohut pyar karta hoon aur aapke jaanwaro se bhi bohut pyar karta hoon. @sorai2018 aapke sabhi pyaare jaanwaro se pratibrad hai. Hum rhinos se suruwatt kar rahe hai. Mein bohut khush hoon. ❤️ pic.twitter.com/VUDlaJja0s — Kevin Pietersen (@KP24) 2 April 2018 -
అసోంలో ఖడ్గమృగాల హల్చల్
-
అడవిలో కెమెరాలు వదిలిపెట్టి దౌడో దౌడు..
ఆఫ్రికా: ఈ మధ్య అటవీ జంతువులకు మనుషులంటే తెగ కోపమొచ్చేస్తుంది. సరదాగా వాటిని చూసేందుకు వెళ్లినా.. ఫొటోలు తీసేందుకు ప్రయత్నించినా వెంటపడి తరుముతున్నాయి. కార్లలో కూర్చున్నప్పటికీ గుండెలు జారీపోయేంత పనిచేస్తున్నాయి. దురదృష్టంకొద్ది కారు ఆగిందో ప్రాణాలుపోవడం తప్పని పరిస్థితి ఎదురవుతుంది. మొన్న ప్రముఖ హాలీవుడ్ నటుడికి గుండెల్లో రైల్లు పరుగెత్తించినట్లుగానే రెండు ఖడ్గమృగాలు ఇద్దరు దంపతులకు చుక్కలు చూపించాయి. బ్రతికితే చాలు అన్నంత వేగంగా ఆ ఇద్దరు, మరికొందరు కార్లలో దౌడు తీశారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. అది ఆఫ్రికాలోని హుహువి పార్క్. ఇద్దరు దంపతులు సఫారీకి వెళ్లారు. ఆ ఓపెన్ వన్యప్రాణి క్షేత్రంలో రెండు కెమెరాలతో కనిపించిన ప్రతి జంతువును ఫొటోలు తీసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంతలో దుమ్ముకొట్లాడే రోడ్డులో ఓ రెండు ఖడ్గమృగాలు బలంగా కొట్టుకుంటున్నాయి. యుద్ధాన్ని తలపించే రీతిలో వాటి బలమైన పదునైన కొమ్ములతో పోట్లాడుకుంటున్నాయి. ఆ సన్నివేశాన్ని చూసిన ప్రతి ఒక్కరు తమ కార్లలో ఉండి కెమెరాల్లో బందిస్తుండగా.. ఓ దంపతులు మాత్రం ఉత్సాహంతో వాటికి సమీపంగా వెళ్లారు. ఆ సమమంలో హాలీవుడ్ సినిమాలో చూపించినట్లుగా పోట్లాటను ఆపేసిన ఖడ్గమృగాలు.. ఒక్కసారిగా నిశ్శబ్దంలోకి జారుకొని స్లోమోషన్లో తలలు ఎత్తి ఏదో మాట్లాడుకున్నట్లుగా తలలు ఊపి వెంటనే ఆ దంపతులవైపు వేగంగా వచ్చాయి. వాటి వేగాన్ని చూసిన ఆ ఇద్దరు కార్లో దూరి దౌడోదౌడు అంటూ పారిపోయారు. ఆ కారును వెంబడించిన తీరు చూస్తే ఒళ్లుగగుర్పొడవాల్సిందే. -
బెంగాల్ జాతీయపార్కులో ఖడ్గమృగాలు మృతి
వాయవ్య బెంగాల్‌లోని జల్దపురా జాతీయ పార్కులో ఇటీవలే ౩ ఖడ్గమృగాలు మృతిచెందాయని అటవీ శాఖ అధికారి ఆదివారం తెలిపారు. ఒక్క కొమ్ము ఉండే ఖడ్గమృగాలకు అస్సాంలోని కజరంగ జాతీయ పార్కు తర్వాత జల్దపురా పార్కు ప్రసిద్ధి చెందింది. ఈ నెల 22, 23 తేదీలలో మూడు ఖడ్గమృగాలు చనిపోయాయి. వాటిది సహజ మరణమేనని పశ్చిమబెంగాల్ రాష్ట్ర వన్యమృగ సంరక్షణ ముఖ్యఅధికారి ఉజ్వల్ భట్టాచార్య తెలిపారు. మూడు ఖడ్గమృగాల మృతికి గల కారణాలను శనివారం కనుగొన్నామని ఉజ్వల్ చెప్పారు. ఏది ఏమైనప్పటికీ జాతీయపార్కులో సంరక్షణలో ఉన్న వన్యమృగాలు మృతి చెందడం బాధాకరం.