కెవిన్‌ పీటర్సన్‌ ట్వీట్‌.. భారతీయులు ఫిదా! | Kevin Pietersen tweets in Hindi on rhinos, indian netizens praise | Sakshi
Sakshi News home page

Published Thu, Apr 5 2018 9:17 AM | Last Updated on Thu, Apr 5 2018 11:17 AM

Kevin Pietersen tweets in Hindi on rhinos, indian netizens praise - Sakshi

కెవిన్‌ పీటర్సన్‌

సాక్షి వెబ్‌డెస్క్‌: అచ్చమైన మాతృభాషలో మాట్లాడటం.. రాయడం కూడా ఇప్పుడు కష్టమైపోతోంది. భారతీయ భాషలన్నింటిలోనూ ఆంగ్ల పదాలు చొచ్చుకుపోయాయి. రోజువారీ జనజీవితంలో భాగమైపోయాయి. ప్రస్తుతం ఫోర్‌జీ స్పీడ్‌ యుగంలో పరభాష పదం లేకుండా మాట్లాడటం, రాయడం అంటే కష్టమేనేమో. కానీ ఒక పరదేశీయుడు స్వచ్ఛమైన మన భాషలో రాస్తే.. ఒక్క ఆంగ్ల పదాన్ని ఉపయోగించకపోతే.. ఇప్పుడు ఇంగ్లండ్‌ మాజీ క్రికెటర్‌ కెవిన్‌ పీటర్సన్‌ హిందీలో చేసిన ట్వీట్‌పై.. ఇలాగే ఆశ్చర్యపోతున్నారు మన నెటిజన్లు.

కెవిన్‌ ఎంత స్వచ్ఛమైన హిందీలో ట్వీట్‌ చేశారని మురిసిపోతున్నారు. మనం కూడా హిందీలో ఇంత చక్కగా రాయలేమోనని ఉత్తరాది నెటిజన్లు సంభ్రమాశ్చర్యాలు వ్యక్తం చేస్తున్నారు. కజిరంగా జాతీయ పార్కులో రైనోల సంఖ్య గణనీయంగా పెరిగిపోవడం తనకు ఆనందం కలిగిస్తోందని, భారతీయులు అన్నా, భారత్‌లోని జంతుజాలమన్నా తనకు ఎంతో ఇష్టమని కెవిన్‌ స్వచ్ఛమైన హిందీలో ట్వీట్‌ చేశాడు. అతని ట్వీట్‌కు సోషల్‌ మీడియాలో విశేషమైన స్పందన లభిస్తోంది. ఈ ట్వీట్‌ను ఇప్పటివరకు 3వేలమంది రీట్వీట్‌ చేశారు. 12వేలమందికిపైగా లైక్‌ చేశారు. భారతీయులు కూడా ఇలా ఒక్క ఆంగ్ల పదం లేకుండా రాయలేరని, మన కన్నా కెవిన్‌ బెటర్‌ అని నెటిజన్లు ఆయనను ప్రశంసిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement