
కెవిన్ పీటర్సన్ (ఫైల్ ఫొటో)
న్యూఢిల్లీ : ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ హిందీలో చేసిన ఓ ట్వీట్ అందరి మనసులను కదిలిస్తోంది. అసోం కజిరంగా నేషనల్ పార్క్ ప్రకటించిన జంతువుల లెక్కల్లో ఖడ్గమృగాల (రైనోస్) సంఖ్య పెరిగింది. ఈ విషయాన్ని అందరూ ఆహ్వానించగా.. జంతు ప్రేమికుడైన పీటర్సన్ వాటి సంఖ్య పెరగడంపై సంతోషం వ్యక్తం చేస్తూ హిందీలో ట్వీట్ చేశాడు.
‘చాలా మంచి వార్త విన్నాను. దీంతో చాలా సంతోషపడ్డా. భారత్ అంటే చాలా ఇష్టం. ఇక్కడ రైనోస్ సంఖ్య పెరగడం చాలా సంతోషంగా ఉంది’ అని ట్వీట్‌లో పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట హల్‌చల్ చేస్తోంది. అయితే ఈ హిందీ ట్వీట్ విషయంలో అతనికి ఎవరు సహకరించారో తెలియరాలేదు.
పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్) అనంతరం పీటర్సన్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్ తరఫున 104 టెస్టులు, 136 వన్డేలు ఆడిన పీటర్సన్ 2010 టీ20 ప్రపంచకప్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక ఇంగ్లండ్ తరుఫున అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాట్స్‌మన్ రికార్డు నమోదు చేశాడు.
Yeh bohut achi Khabar hai, isse Padne ke liye mein bohut Khush hoon, india mein appse bohut pyar karta hoon aur aapke jaanwaro se bhi bohut pyar karta hoon. @sorai2018 aapke sabhi pyaare jaanwaro se pratibrad hai. Hum rhinos se suruwatt kar rahe hai. Mein bohut khush hoon. ❤️ pic.twitter.com/VUDlaJja0s
— Kevin Pietersen (@KP24) 2 April 2018
Comments
Please login to add a commentAdd a comment