సగం షేవ్‌తో కల్లిస్‌.. ఎందుకిలా! | Jacques Kallis Shaved Exactly Half Of His Beard | Sakshi
Sakshi News home page

సగం షేవ్‌తో కల్లిస్‌.. ఎందుకిలా!

Published Fri, Nov 29 2019 2:38 PM | Last Updated on Fri, Nov 29 2019 2:38 PM

Jacques Kallis Shaved Exactly Half Of His Beard - Sakshi

న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికా మాజీ ఆల్‌ రౌండర్‌ జాక్వస్‌ కల్లిస్‌ క్రికెట్‌ అభిమానులకు సుపరిచితమే. దక్షిణాఫ్రికా తరఫున సుదీర్ఘ కాలం క్రికెట్‌ ఆడిన కల్లిస్‌.. టెస్టుల్లో, వన్డేల్లో 10వేలకు పైగా పరుగులు, 250కి పైగా వికెట్లను సాధించిన ఏకైక క్రికెటర్‌. తన కెరీర్‌లో 166 టెస్టులు, 328 వన్డేలు ఆడాడు. ఇక పొట్టి ఫార్మాట్‌లో దేశం తరఫున 25 టీ20ల్లో పాల్గొన్నాడు.  టెస్టుల్లో 13,289 పరుగులు చేసిన కల్లిస్‌.. వన్డేల్లో 11,579 పరుగులు చేశాడు. టెస్టుల్లో 292 వికెట్లు సాధించగా, వన్డేల్లో 273 వికెట్లను ఖాతాలో వేసుకున్నాడు. క్రికెట్‌కు దూరమైన తర్వాత పెద్దగా కనిపించని కల్లిస్‌.. తాజాగా ఒక ఫోటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు.

అది సగం షేవ్‌తో ఉన్న ఫొటో కావడంతో హాట్‌ టాపిక్‌ అయ్యింది. అయితే కల్లిస్‌ ఇలా ఎందుకు దర్శనమిచ్చాడంటే.. ఒక చాలెంజ్‌లో భాగంగా కచ్చితంగా సగం గడ్డం, సగం మీసంతో కనిపించాడు. దక్షిణాఫ్రికాలో అంతరించిపోతున్న ఖడ్గ మృగాల సంరక్షణలో భాగంగా ‘సేవ్‌ ద రైనో’ చాలెంజ్‌ను స్వీకరించిన కల్లిస్‌ ఈ రకంగా అలరించాడు. తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో కల్లిస్‌ ఫోటోను పోస్ట్‌ చేయగా, అందుకు పాజిటివ్‌గా కామెంట్లు వస్తున్నాయి. కల్లిస్‌ కొత్త  లుక్‌లో అద్భుతంగా ఉన్నాడంటూ ఫ్యాన్స్‌ కొనియాడుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement