'బాహుబలి' రేంజ్‌లో రైనో విహారం! | Rhino rampage in southern Nepal | Sakshi
Sakshi News home page

'బాహుబలి' రేంజ్‌లో రైనో విహారం!

Published Sat, Apr 29 2017 7:24 PM | Last Updated on Tue, Sep 5 2017 9:59 AM

'బాహుబలి' రేంజ్‌లో రైనో విహారం!

'బాహుబలి' రేంజ్‌లో రైనో విహారం!

'బాహుబలి' మొదటిపార్టులో భారీ దున్నపోతు రానా అలియాస్‌ భల్లాలదేవుడిని ఎదుర్కొనే సన్నివేశం రోమాంఛితంగా ఉంటుంది. అదేవిధంగా 'బాహుబలి' రెండోపార్టులో మదమెక్కిన భారీ ఏనుగును ప్రభాస్‌ నిలువరించే సీన్‌ కూడా ప్రేక్షకులను అలరిస్తోంది. అవి రెండూ గ్రాఫిక్‌ సన్నివేశాలే అయినా.. నేపాల్‌లో మాత్రం వాటిని తలదన్నే స్థాయిలో భారీగా ఉన్న ఓ రైనో నడిరోడ్డుమీద వీరవిహారం చేసింది. అభాగ్యులైన ఇద్దరు వ్యక్తులు బైక్‌ మీద వెళుతుండగా..  వారిని వెంటాడుతూ శరవేగంగా చూపరుల ఒళ్లు గగుర్పొడిచేలా చేసింది.

నేపాల్‌లోని హెటావుడా పట్టణంలో ఈ ఘటన జరిగింది. సమీపంలోని అడవి నుంచి తప్పించుకొని వచ్చిన ఓ రైనో హెటావుడాలో భయభ్రాంతులకు గురిచేసింది. పట్టణంలో వీరవిహారం చేస్తూ ఒకరిని హతమార్చి.. పలువురిని గాయపర్చింది.ఈ సందర్భంగా నడిరోడ్డు మీద బైక్‌పై ఇద్దరు వ్యక్తులు వేగంగా తప్పించుకొని పోతుండగా.. వారిని అంతేవేగంగా వెంటాడుతూ దూసుపోతుతన్న రైనో వీడియో ఇప్పుడు ఆన్‌లైన్‌లో హల్‌చల్‌ చేస్తోంది.  గ్రేటర్‌ రైనోలు దాదాపు అంతరించిపోయేదశకు చేరుకున్న తరుణంలో నేపాల్‌లో వీటి పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement