Viral Video: Ajith Kumar turns as chef at a restaurant in Nepal - Sakshi
Sakshi News home page

Ajith Kumar : రెస్టారెంట్‌లో చెఫ్‌గా అవతారం ఎత్తిన ‍స్టార్‌ హీరో.. వీడియో వైరల్‌

Published Fri, Apr 28 2023 7:56 PM | Last Updated on Fri, Apr 28 2023 8:57 PM

Ajith Kumar Turns As Chef At Restaurant In Nepal See Video - Sakshi

తమిళ స్టార్‌ హీరో అజిత్‌ కుమార్‌కు ఉన్న మాస్‌ ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ఏడాది తునివు సినిమాతో సక్సెస్‌ అందుకున్న అజిత్‌ తర్వాత చేయబోయే సినిమాలపై ఫోకస్‌ పెట్టాడు. అయితే ఈ స్టార్‌ హీరో నేపాల్‌లో చెఫ్‌గా మారిపోయి అందరినీ ఆశ్చర్యపరిచాడు.



ఇంత​కీ విషయం ఏమిటంటే..అజిత్‌కు బైక్‌ రైడింగ్‌ అంటే మహా ఇష్టం. రీసెంట్‌గా బైక్‌పై నేపాల్‌ వెళ్లిన ఆయన ఓ హోటల్‌లో చెఫ్‌ అవతారం ఎత్తాడు. ఈ సందర్భంగా అక్కడ వంట చేస్తూ షాకిచ్చాడు.దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇది చూసిన నెటిజన్లు.. ఎంత స్టార్‌డమ్‌ ఉన్నా ఇంత సింపుల్‌గా ఉండటం చాలా గ్రేట్‌ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. ఇక అజిత్‌ వచ్చారని తెలిసి చుట్టుపక్కల ప్రజలు పెత్త ఎత్తున ఆయనతో ఫోటోలు దిగేందుకు ఆసక్తి చూపారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement