దిస్పూర: సెప్టెంబర్ 22 ప్రపంచ ఖడ్గమృగం దినోత్సవం సందర్భంగా అస్సాం ప్రభుత్వం వినూత్నంగా వేడుకలు నిర్వహించింది. వేటగాళ్ల నుంచి స్వాధీనం చేసుకున్న వేలాది ఖడ్గమృగాల కొమ్ములను దగ్దం చేసింది. కాజీరంగ జాతీయ ఉద్యానవనంలోని బోకాఖట్‌లో 2,500 ఒంటి కొమ్ము ఖడ్గమృగాల కొమ్ములను అక్కడి అధికారులు బహిరంగంగా దగ్దం చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
చదవండి: డ్రగ్స్ కోసం దాడి: అవమానం తట్టుకోలేక ఫ్రెండ్ ఆత్మహత్య
ఇటీవల ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ చేపట్టిన ‘రైనో హార్న్ రీ-వెరిఫికేషన్’ కార్యక్రమంలో భాగంగా వీటిని స్మగ్లర్ల నుంచి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం గత వారం రాష్ట్ర మంత్రివర్గం కొమ్ముల దహనం చేయనున్నట్లు తమ నిర్ణయాన్ని ప్రకటించింది. అయితే ఆస్సాం ప్రభుత్వం ఖడ్గమృగం కొమ్ములను దహనం చేయడం వెనుక ఓ కారణం ఉంది.
చదవండి: చీర కట్టుకొని వస్తే ఎలా? రెస్టారెంట్‌కు వెళ్లిన మహిళకు అవమానం
వీటి కొమ్ములను చైనీయులు సంప్రాదాయక ఔషధాల తయారీలో వాడుతారనే కారణంతో వేటగాళ్లు అటవీ అధికారుల కళ్లుగప్పి ఒక కొమ్ము ఖడ్గమృగాలను వేటాడుతున్నారు. అత్యంత కిరాతకంగా వాటిని చంపి, కొమ్ములు కోసుకుని పారిపోతున్నారు. ఈ క్రమంలో రైనో కొమ్ములకు ఎలాంటి ఔషధ ప్రాముఖ్యత లేదని వేటగాళ్లకు బలమైన సందేశం ఇవ్వడం కోసం అసోం సర్కారు ఇలా చేసింది.
Comments
Please login to add a commentAdd a comment