'బాహుబలి' మొదటిపార్టులో భారీ దున్నపోతు రానా అలియాస్ భల్లాలదేవుడిని ఎదుర్కొనే సన్నివేశం రోమాంఛితంగా ఉంటుంది. అదేవిధంగా 'బాహుబలి' రెండోపార్టులో మదమెక్కిన భారీ ఏనుగును ప్రభాస్ నిలువరించే సీన్ కూడా ప్రేక్షకులను అలరిస్తోంది. అవి రెండూ గ్రాఫిక్ సన్నివేశాలే అయినా.. నేపాల్‌లో మాత్రం వాటిని తలదన్నే స్థాయిలో భారీగా ఉన్న ఓ రైనో నడిరోడ్డుమీద వీరవిహారం చేసింది. అభాగ్యులైన ఇద్దరు వ్యక్తులు బైక్ మీద వెళుతుండగా.. వారిని వెంటాడుతూ శరవేగంగా చూపరుల ఒళ్లు గగుర్పొడిచేలా చేసింది.