‘కుసిని’కి కోపమొచ్చింది.. | Angry Rhino Attack Car Flips It In Germany | Sakshi
Sakshi News home page

వైరల్‌ వీడియో: డ్రైవర్‌తో సహ కారును దొర్లించిన ఖడ్గమృగం

Published Wed, Aug 28 2019 7:19 PM | Last Updated on Wed, Aug 28 2019 7:45 PM

Angry Rhino Attack Car Flips It In Germany - Sakshi

బెర్లిన్‌: మామూలుగా మనుషులకు కోపం వస్తే ఏం చేస్తారు... అరవడం, చేతిలో ఉన్న వస్తువులను విసరడం లాంటివి చేస్తారు. అదే జంతువులకు కోపమొస్తే.. ఆ పరిస్థితులు ఎంత దారుణంగా ఉంటాయో ఈ వీడియో చూస్తే అర్థం అవుతుంది. ఆగ్రహంతో ఊగిపోతున్న ఓ ఖడ్గమృగం ఎదురుగా ఉన్న కారును, డ్రైవర్‌తో సహ కిందకు దొర్లించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో తెగ వైరలవుతోంది. ఈ సంఘటన జర్మనీలోని హోడెన్‌హాగన్‌లోని సెరెంగేటి సఫారి పార్క్‌లో చోటు చేసుకుంది. కుసిని అనే ఖడ్గమృగానికి ఉన్నట్టుండి విపరీతమైన కోపం వచ్చింది. దాంతో తన ఎదురుగా ఉన్న వాహనం మీద దాడికి దిగింది. ఆ సమయంలో వాహనంలో డ్రైవర్‌ కూడా ఉంది. అదృష్టం కొద్ది ఆమె స్వల్ప గాయాలతో బయటపడింది. కానీ ఆమె వాహనం మాత్రం నామరూపాల్లేకుండా పోయింది. దీని గురించి పార్కు మేనెజర్‌ మాట్లాడుతూ.. ‘కుసిని ఇక్కడ 18 నెలలుగా ఉంటుంది. గతంలో ఎప్పడు ఇలా ప్రవర్తించలేదు. సందర్శకులకు కూడా ఎలాంటి హానీ తలపెట్టలేదు. కానీ ఈ రోజు దాని ప్రవర్తనలో ఉన్నట్టుండి మార్పు వచ్చింది. వాహనంపై దాడి చేసింది. ప్రస్తుతం వైద్యులు కుసినిని పరీక్షిస్తున్నారు’ అని తెలిపాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement