బేబి దియా | Baby rhino named after Dia Mirza in Kenya | Sakshi
Sakshi News home page

బేబి దియా

Published Sun, Jul 29 2018 1:05 AM | Last Updated on Tue, Oct 16 2018 8:42 PM

Baby rhino named after Dia Mirza in Kenya - Sakshi

దియా మీర్జా

ఏ స్టార్‌కి ఎక్కడ ఫ్యాన్స్‌ ఉంటారో చెప్పలేం. వాళ్ల మాతృభాషలో ఉండొచ్చు.. పరాయి భాషల్లోనూ ఫ్యాన్స్‌ ఉండొచ్చు. అంతెందుకు? పరాయి దేశాల్లో కూడా ఫాలోయింగ్‌ ఉండి ఉండొచ్చు. ఒకవేళ అభిమానం ఎక్కువైతే ఆ స్టార్‌ పేరు తమ పిల్లలకో, అభిమానంగా పెంచుకుంటున్న పెంపుడు జంతువులకో పెట్టుకుని ఫ్యాన్స్‌ మురిసిపోతారు. ఇప్పుడు దియా మీర్జా పేరు ఓ ఖడ్గమృగానికి సెట్‌ అయింది. ‘లగేరహో మున్నాభాయ్, దస్, సంజు’ సినిమాలతో బాలీవుడ్‌లో ఫేమ్‌ సంపాదించారు దియా.

యుఎన్‌ ఎన్విరాన్‌మెంట్‌ గుడ్‌విల్‌ అంబాసిడర్, భారతదేశపు వన్యప్రాణ సంరక్షణ ట్రస్ట్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా  సేవలను అందిస్తున్నారామె. కెన్యాలోని ఓఐపెజెటా సంరక్షణ సంస్థలోని ఓ ఖడ్గ మృగానికి దియా మిర్జా పేరుని పెట్టారు. ఈ విషయాన్ని దియా తెలియజేస్తూ –‘‘థ్యాంక్యూ ఓఐపెజెటా. నా పేరును ఓ బ్యూటిఫుల్‌ బేబీకు పెట్టినందుకు చాలా ఆనందంగా ఉంది. మీ టీమ్‌ అందరికీ స్పెషల్‌ థ్యాంక్స్‌.  కెన్యాలోని ఈ ప్లేస్‌ని ఎవరైనా విజిట్‌ చేసినప్పుడు దియాతో ఫొటో దిగి నాకు షేర్‌ చేయండి’’ అని పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement