చచ్చేలా బూటు కాలుతో తొక్కుతూ.. | Anti-government protester seen being kicked and stamped by Kenyan riot police | Sakshi
Sakshi News home page

చచ్చేలా బూటు కాలుతో తొక్కుతూ..

Published Tue, May 17 2016 9:13 PM | Last Updated on Wed, Sep 18 2019 3:24 PM

చచ్చేలా బూటు కాలుతో తొక్కుతూ.. - Sakshi

చచ్చేలా బూటు కాలుతో తొక్కుతూ..

నైరోబీ: కెన్యాలో తలెత్తిన ఆందోళన విధ్వంసకరంగా మారింది. వచ్చే ఏడాదిలో ఎన్నికల జరగనున్న నేపథ్యం జరిగిన ఈ ఘటన పెద్ద చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా పోలీసులు ఉద్యమకారులపై చూపించిన ప్రతాపం అంతా ఇంత కాదు. ఓ నిరసన కారుడిని అందరూ చూస్తుండగా కిందపడేసి అతి కిరాతకంగా పోలీసులే స్వయంగా చితక్కొట్టి తీవ్రంగా పదేపదే బూటుకాలితో తొక్కడంతో అతడు ఆస్పత్రిలో చేరిన కొద్ది సేపటికే కన్నుమూశాడు.

ఈ వీడియో ఫొటోలు ఇప్పుడు వెలుగులోకి రావడంతో ప్రపంచమంతా దాన్ని చూసి విస్తు పోయింది. వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికలకు సంబంధించిన ఓ అంశంపై ఆందోళన ప్రారంభమైంది. భారీ ఎత్తున నిరసనకారులు రోడ్లపైకి రావడంతో పోలీసులు వారిపై తమ ప్రతాపాన్ని చూపించారు. ఈ క్రమంలోనే ఓ యువకుడు పోలీసుల బూటుకాళ్లకిందపడి నలిగిపోయాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement