శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరులో అటవీ పక్షులను వేటాడుతున్న నలుగురు వ్యక్తులను పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు.
శ్రీకాకుళం : శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరులో అటవీ పక్షులను వేటాడుతున్న నలుగురు వ్యక్తులను పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి సుమారు 100 పక్షులను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.