తిర్యాణి(లింగాపూర్): కొమురంభీమ్ జిల్లా లింగాపూర్ మండలం దంపూర్ గ్రామంలో అడవి జంతువుల కోసం వేటగాళ్లు వేసిన ఉచ్చుకు గురువారం రాత్రి ఓ యువకుడు బలయ్యాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. తిర్యాణి మండలం దంతన్‌పెల్లి గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు భీమన్న దేవుని గంగస్నానం కోసం గురువారం దంపూర్ గ్రామం మీదుగా కాలినడకన జన్నారం వైపు వెళ్లారు.
గంగస్నానం ముగించుకుని తిరిగి వస్తున్న క్రమంలో రాత్రివేళ దంపూర్ గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో జంతువుల కోసం వేటగాళ్లు అమర్చిన విద్యుత్ తీగలు తగిలి దంతన్‌పల్లి గ్రామానికి చెందిన ఆత్రం భీమ్‌రావు(21) అక్కడికక్కడే మృతి చెందాడు. భీమ్‌రావుతోపాటు ఉన్న ఆత్రం పావుగా అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఇతడికి లింగాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స అనంతరం ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. మృతుడి తండ్రి ఆత్రం భీము ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపార
Comments
Please login to add a commentAdd a comment