
దస్రుబాయి(ఫైల్)
పెంచికల్‌పేట్(సిర్పూర్)కొమరంభీం జిల్లా: మండలంలోని కమ్మర్‌గాం గ్రామానికి చెందిన దుర్గం దస్రుబాయి(22) అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం సదరు యువతి శుక్రవారం ఉదయం గ్రామ సమీపంలోని పంట చేనుకు కాపలా వెళ్లింది.
మధ్యాహ్నం వరకూ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు గాలించగా పంటచేనులో మృతదేహం కనిపించింది. స్థానికుల సమాచారంతో ఎస్సై విజయ్‌కుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సిర్పూర్(టి) ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. యువతి తల్లి శకుంతల ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఆయన తెలిపారు.
మృతిపై అనుమానాలు
దస్రుబాయి మృతి పట్ల తల్లి శకుంతల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పంట చేనుకు కాపలా వెళ్లిన తన కూతురును హత్య చేసి నోట్లో పురుగుల మందు పోసి ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు. భూతగాదాల నేపథ్యంలో హత్య చేశారని నిందితులపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
చదవండి: విజయవాడలో స్పా మాటున హైటెక్ వ్యభిచారం..
Comments
Please login to add a commentAdd a comment