మైనర్‌ బాలికపై సామూహిక అత్యాచారం | Minor Girl Molested in Komaram Bheem District | Sakshi
Sakshi News home page

మైనర్‌ బాలికపై సామూహిక అత్యాచారం

Published Tue, Dec 17 2019 1:33 PM | Last Updated on Tue, Dec 17 2019 1:38 PM

Minor Girl Molested in Komaram Bheem District - Sakshi

సాక్షి, జైనూర్‌: కొమరం భీం జిల్లాలో మైనార్‌ బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. మాయమాటలు చెప్పి.. బాలికను మభ్యపెట్టిన ఇద్దరు యువకులు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో బాలిక గర్భం దాల్చింది. జిల్లాలోని జైనూర్ మండలం శేకుగూడ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.  మైనర్ బాలికపై సామూహికంగా అత్యాచారం చేసిన నిందితులు ఆత్రం ప్రభు (24), పెందూర్ శ్రీకాంత్ (19)పై బాధితురాలి కుటుంబసభ్యులు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటన తన దృష్టికి రావడంతో నిందితులపై పోక్సో చట్టం కింద అభియోగాలు నమోదు చేసి కేసు పెట్టాల్సిందిగా జిల్లా డీఎస్పీ ఆదేశాలు ఇచ్చారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement