ప్రేమ వివాహం.. అల్లుడిపై దాడి చేసిన మామ | Asifabad District Man Stabs Son In Law Over Inter Caste Marriage | Sakshi
Sakshi News home page

ఆసిఫాబాద్‌లో దారుణం.. అల్లుడిపై మామ హత్యాయత్నం

Published Mon, Oct 14 2019 11:56 AM | Last Updated on Mon, Oct 14 2019 12:09 PM

Asifabad District Man Stabs Son In Law Over Inter Caste Marriage - Sakshi

సాక్షి, ఆసిఫాబాద్‌: జిల్లాలో పరువు హత్య కలకలం సృష్టించింది. కుమార్తె వేరే కులం వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకోవడాన్ని తట్టుకోలేకపోయిన ఓ తండ్రి.. అల్లుడిని హత్య చేసేందుకు కత్తితో దాడి చేశాడు. వివరాలు.. తిర్యాని మండలం నాయకపు గూడాకు చెందిన నవీన్‌, కావ్యలకు మూడు నెలల క్రితం ప్రేమ వివాహం జరిగింది. అయితే ఇది కులాంతర వివాహం కావడంతో కావ్య తండ్రి వీరి వివాహాన్ని అంగీకరించలేదు. అంతేకక అల్లునిపై కక్ష పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం కావ్య తండ్రి, నవీన్‌పై కత్తితో దాడి చేశాడు. అనంతరం అక్కడ నుంచి పరారయ్యాడు. రక్తపు మడుగులో ఉన్న నవీన్‌ను గమనించిన స్థానికులు తిర్యాని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి.. కావ్య తండ్రి కోసం గాలిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement