ఫిన్‌ల్యాడ్: మనం చాలా నిధుల గురించి విని ఉంటాం అయితే ఈ ఫిన్‌ల్యాండ్‌లోని లెమ్మిన్‌కైనెన్ అనే నిధి నిక్షేపం కోసం 30 ఏళ్లుగా పరిశోధిస్తునే ఉన్నారంటా. అంతేకాదు ఈ లెమ్మిన్‌కైనెన్ అనే నిధి కోసం "ట్వెల్వ్ టెంపుల్" పేరుతో పన్నెండు మంది బృందం 1987 నుండి అన్వేషిస్తోందట.
(చదవండి: అతనే గనుక ఆ సమయంలో అక్కడ లేకపోతే !)
పైగా ఈ నిధిలో 1500 కోట్లు పైన ఉండచ్చని భావిస్తున్నారు. అంతేకాదు చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం వజ్రాలు, నీలమణులు, పురాతన కళాఖండాలు వంటివి 50వేలుకు పై చిలుకే ఉంటాయని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. వెయ్యేళ్లనాటి నిధిని చేధించేందకు ఈ పన్నెండు బృందాలు 30 ఏళ్లుగా అన్వేషిస్తునే ఉంది. ఈపరిశోధనల్లో భాగంగా వాళ్ల చాలా కష్ట నష్టాలను చవిచూశారు. అయితే ఇంతవరకు ఎవరు ఈ నిధిని కనుగొన లేకపోయారు.
ఈ మేరకు ఆ పన్నెండు మంది బృందం తాము కొద్ది దూరంలో ఉన్నామని త్వరలోనే ఈ నిధిని కనుగొన గలమంటూ విశ్వాసం వ్యక్తం చేసింది. లెమ్మిన్‌కైనెన్ నిధి అన్వేషణాధికారి మాట్లాడుతూ...గణనీయమైన పురోగతి సాధించాం. త్వరలోనే మా బృందం ఆ నిధిని గుర్తించ గలదు" అంటూ విశ్వాసం వ్యక్తం చేశారు.
(చదవండి: కాప్ 26 సదస్సులో జోబైడెన్ కునికిపాట్లు)
Comments
Please login to add a commentAdd a comment