జిల్లాలోని అడవుల్లో వన్యప్రాణులు, మృగాలకురక్షణ కరువైంది. వేటగాళ్ల ఉచ్చులకు ఎప్పుడు దేని ప్రాణం పోతుందో తెలియని పరిస్థితి నెలకొంది. వన్యప్రాణులు జనారణ్యంలో రావడం కాదు.. జనమేఅడవుల్లోకి వెళుతూ వాటి మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్నారు. జిల్లాలోని పలు అడవుల్లో వన్యప్రాణుల కోసం అమర్చిన ఉచ్చులు, నల్లమందు ఉండలు,అడవిని ఆనుకొని ఉన్న పొలాల్లో కరెంటు తీగలు దర్శనమిస్తున్నాయి. మేతకోసం వెళ్లే మేకలు, పశువులు ఉచ్చులో పడి మృత్యువాత పడుతున్నాయి.పదేళ్లలో నాటు తుపాకుల కాల్పులు, నల్లమందు ఉండలకు బలైన వారు 25మంది పైమాటే.వందలాది పశువులు, మేకలు, కుక్కలు సైతం మృత్యువాత పడ్డాయి.–పలమనేరు
అడవిలోకి వెళ్లాలంటే భయం భయం..
⇔ నాలుగేళ్లలో 12 ఏనుగులు, రెండు చిరుతల మృతి
⇔ 2013 వికోట మండలం నాయకనేరి వద్ద మదపుటేనుగు దాడిలో ఆడ ఏనుగు చనిపోయింది.
⇔ 2013లోనే బైరెడ్డిపల్లె మండలం వెంగవారిపల్లెలో ఓ ఏనుగు మృతి చెందింది. అదే ఏడాది గున్న ఏనుగు మృతిచెందింది.
⇔ 2014లో పలమనేరు మండలం కాలువపల్లె వద్ద నీటిదొనలో పడిన గున్న ఏనుగును తిరుపతి జూకి తరలించగా మృతి చెందింది.
⇔ 2013లో రామకుప్పం మండలం నినియాల తాండాలో విద్యుత్‌షాక్‌కు గురై ఓ ఏనుగు మృతి చెందింది.
⇔ 2015లో రామకుప్పం మండలంలోమరో ఏనుగు మృతి చెందింది.
⇔ 2015లో ఆగస్టులో రామకుప్పం మండలంలో బావిలో పడిన గున్న ఏనుగును తిరుపతి జూకు తరలించగా చనిపోయింది.
⇔ 2015లో రామకుప్పం మండలం పల్లికుప్పం వద్ద ఓ ఏనుగు కరెంట్ షాక్‌తో మృతిచెందింది.
⇔ 2017లో కుప్పం సమీపంలోని తమిళనాడు సరిహద్దులో రెండు ఏనుగులు కరెంటు షాక్‌కు బలయ్యాయి.
⇔ తాజాగా ఎర్రావారిపాళ్యం మండలం కోటకాడిపల్లెవద్ద ఓ ఏనుగు మృతిచెందింది.
⇔ ఈ ఏడాది జనవరిలో బంగారుపాళ్యం మండలం పెరుమాళ్లపల్లె అటవీప్రాంతంలో వేటగాళ్ల ఉచ్చులో చిరుత చిక్కుకుంది.
⇔ మూడు రోజుల క్రితం ఐరాలమండలం మల్లార్లపల్లి వద
⇔ వేటగాళ్ల ఉచ్చులో జింక పడింది. దీన్ని జూకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉంది.
శేషాచలంలో 1,700 రకాల జీవులు
చిత్తూరు, కడప జిల్లాలో వ్యాపించి ఉన్న శేషాచలం అడవులు 4775 చదరపు కిలోమీటర్ల మేర వ్యాపించి ఉన్నాయి. ఇందులో 178 జాతులకు చెందిన 1700 రకాల జీవులకు నిలయంగా ఉం ది. 178 రకాల పక్షులకు ఈ అడవి ఆవాసం. అలాగే కౌండిన్య అభయారణ్యంలోకి 1983లో తమిళనాడులోని అనెకల్, çహోసూర్, కర్ణాటకలోని మైసూరు, బన్నేరుగట్ట అడవుల నుంచి ఏనుగులు, ఇతర జంతువులు వచ్చి చేరాయి. అడవుల్లో లభించే వెదురు, ఇతర ఆకులు, బెరడు ఆహారంగా తీసుకుంటూ ఇక్కడి అడవుల్లోని చిన్న కుంట లు, చెరువుల్లో నీటిని తాగుతూ ఉంటున్నాయి. ప్రధానంగా కౌండి న్య, కైగల్, పాలారు నదులను ఆనుకుని వీటి జీవనం సాగుతోంది.
వన్యప్రాణులకు నిలయం కౌండిన్య
జిల్లాలోని పశ్చిమ భాగంలో కౌండిన్య అభయారణ్యం పలు వన్యప్రాణులకు నిలయంగా ఉంది. బంగారుపాళ్యం నుంచి పలమనేరు, కుప్పం ప్రాంతాల్లో అటు తమిళనాడు, ఇటు కర్ణాటక రాష్ట్ర సరిహద్దుల వరకు సుమారు 357 చదరపు కిలోమీటర్ల మేర ఈ అడవి వ్యాపించి ఉంది. ఈ అడవిలో 39 ఏనుగులు, ఏడు వేలకు పైగా జింకలు, ఎనిమిదివేల దుప్పులు, కణితలు, ఎలుగుబంట్లు, కొన్ని హైనాలు, చీటాలు ఉన్నా యి. అడవి గొర్రెలు, కుందేళ్లు, బావురు పిల్లులు, ఉడుములు, నక్కలు, నెమళ్లు, 40 రకాల క్షీరదాలు,160కి పైగా పలురకాల పక్షులు, అరుదైన కొంగలు, వంద రకాల సీతాకోక చిలుకలు, నక్షత్ర తాబేళ్లు, ఇతర కీటకాలతో పాటు మరికొన్ని జంతువులు ఉన్నాయి. జిల్లాలోని మధ్యప్రాంత అడవుల్లో భాగంగా ఉన్న పెద్ద ఉప్పరపల్లె, సోమల, తుంబకుప్పం, తుంబపాళ్యం అడవుల్లోనూ 300 రకాలకుపైగా వన్యప్రాణులున్నాయి. ఈ ప్రాంతంలో నాలుగు దాకా చీటాలున్నట్టు తెలుస్తోంది.
పంథా మార్చిన వేటగాళ్లు
అటవీప్రాంత గ్రామాల్లోని కొం దరు వేటగాళ్లు నిత్యం వేట కెళ్లడం జీవనోపాధిగా మార్చుకున్నారు. దీనిపై మూడేళ్ల కిందట దృష్టి సారించిన పోలీసులు పెద్ద సంఖ్యలో నాటు తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. దీంతో వేటగాళ్లు పంథా మార్చారు. పాత వేట పద్ధతులను ఎంచుకున్నారు. నాటు బాంబులను, నల్లమందు ఉండలను అడవిలో పెట్టి వస్తున్నారు. కమ్మీలు, వైర్లతో తయారు చేసిన ఉచ్చులు, ఉరులను పగటి పూట అడవిలో చెట్ల మధ్య అమర్చుతున్నారు. వాటిల్లో ఇరుక్కున్న జం తు వులను అక్కడే చంపి మాంసాన్ని తీస్చుకువస్తున్నారు. ఇది నిత్యం జరుగుతున్న సంఘటనే. నాటు తుపాకి ట్రిగ్గర్‌కు రబ్బర్ బ్యాండ్ కట్టి దానికి దారంతో పది అడగుల పొడవున రెండు అడుగుల ఎత్తులో కట్టడం, పొలాలకు రక్షణ పేరిట కరెంటు లాగడం తదితరాలను చేపడుతున్నారు. వీటితో పశువుల కాపరులు, కలపకోసం వెళ్లే కూలీలు సైతం చనిపోతున్నారు. పదేళ్లలో అడవుల్లోకెళ్లి నాటుతుపాకుల కాల్పులు, నల్లమందు ఉం డలకు బలైన వారు 25మందిపైమాటే. తాజాగా చిత్తూరు సమీపంలోని ఓ చెరుకుతోటలో ఏర్పాటు చేసిన కరెంటు తీగలకు ఇద్దరు బలైన విషయం తెలిసిందే. అటవీశాఖ చట్టం ప్రకారం విద్యుత్ తీగలను అడవులకు సమీప పొలాల్లో కంచెగా ఏర్పాటు చేయకూడదనే నిబంధలున్నాయి. కానీ అధికారులు పట్టించుకోకపోవడంతో జంతువులు, ప్రజల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి.
15.83 శాతం అడవులు
జిల్లా భౌగోళిక అటవీ ప్రాతం 15,151 చదరపు కిలోమీటర్లు. ఇందులో ఏడు ప్రాంతాల్లో మాత్రం అతి దట్టమైన అడవులు, 29 ప్రాంతాల్లో దట్టమైన అడవులున్నాయి. ఓపెన్ ఫారెస్ట్‌గా 1463 కిలోమీటర్లు, మిగిలినవి చిట్టడవులుగా వ్యాపించి ఉన్నాయి. మొత్తం విస్తీర్ణంలో అడవులు 15.83 శాతం విస్తరించి ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment