నేరాలు ఎంత అనాలోచితంగా, కుట్రపూరితంగా చూస్తుండగానే క్షణాల్లో జరిగిపోతాయి. ఆ ఘటనలు మిగిల్చే నష్టం, బాధ అంతా ఇంతా కాదు. ఆఖరికి వాటి ఇన్విస్టిగేషన్ కూడా ఓ పట్టాన వీడని మిస్టరీలా ఉండిపోతాయి. అంత తేలిగ్గా చిక్కుముడి వీడదు. ఒక్కోసారి ఏళ్లకు ఏళ్లు పడుతుంది. బాధితులకు తీరని మనో వ్యధ జీవితాంతం ఉంటుంది. ఆ వ్యక్తి తాలుకా వివరాలు బంధువులకు చేరక ఒకవైపు, ఆ కేసులోని చిక్కులు వీడక అధికారులు మరోవైపు ఇలా ఇరువురు తెలియని నరకం చూస్తారు. అలాంటి ఒక గాథ ఇది. 41 ఏళ్ల క్రితం నాటి మహిళ అదృశ్యం కేసు. ఆమె ఏమైంది? ఎలా చనిపోయింది? అనేది తెలియని ఓ అంతుచిక్కని మిస్టరీ. కానీ ఇప్పుడు ఆమె ఎవరనేది ఇప్పటికీ గుర్తించి ఆ బాధితురాలి కూతురికి తెలియజేస్తే.. వాళ్ల పరిస్థితి ఎలా ఉంటుందనేది మాటలకందని భావోద్వేగమే కదా!.
ఒరెగాన్‌లోని కొన్నీ లోరైన్ క్రిస్టెన్‌సన్ అనే మహిళ కనిపించకుండా పోయింది. ఆమె చివరిసారిగా 1982లో టేనస్సీలోని నాష్‌విల్లేలో కనిపించింది. ఆ తర్వాత నుంచి కనిపించకుండా పోయింది. దీంతో ఆమె బంధువులు మిస్సింగ్ కేసుగా ఫైల్ చేశారు. కానీ ఆమె ఆచూకీ ఎక్కడన్నది కానరాకుండా పోయింది. ఆ తర్వాత కొన్నాళ్లకి ఆమె ఇండియానాలోని ఓ గ్రామంలో చనిపోయినట్లు పోలీసులు కనుగొన్నారు. అక్కడ ఆమెకు సంబంధించిన వస్తువులు హైహిల్స్, బంగారు ఉంగరం తదితర వస్తువులను కొన్నీగా స్వాధీనం చేస్తుకున్నారు
విచారణలో ఆమె వేటగాళ్ల చేతిలో శవమైనట్లు విచారణలో తేలింది. ఆమె మృతదేహానికి సంబంధించిన అవశేషాలు అదృశ్యమైన కొన్నీ లోరైన్ అవశేషాలతో సరిపోలాయి. దీంతో ఆమె గురించి వారి బంధువులకు తెలయజేయాలనే ఉద్దేశ్యంతో కరోనర్ కార్యాలయంలో ఫోరెన్సిక్ ఆంత్రోపాలజీ విభాగంలో స్టోర్ చేశారు పోలీసులు. ఆమె తుపాకీ గాయం కారణంగా మరణించినట్లు పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో వెల్లడైంది. అయితే కొన్నీ లోరైన్ హత్య ఎలా జరిగిందనేది తెలియరాలేదు పోలీసులకు. అయితే విచారణలో వాకింగ్ కోసం బయటకు వచ్చిందని, అప్పుడామె నాలుగు నెలల గర్భవతి అని తేలింది.
అలాగే ఆమెకు ఓ ఏడాది కూతురు కూడా ఉందని, ఆమెను తన తోపాటు బయటకు తీసుకువెళ్ల లేదని తేలింది. ఇక ఇండియానా స్టేట్ పోలీస్ ఫోరెన్సిక్ లాబరేటరీ ఆమెకు సంబంధించిన అవశేషాలను, డీఎనే రిపోర్ట్‌ని వెబ్‌సెట్‌లో అందుబాటులో ఉంచడమే గాక ఆమె దుస్తులను, తాలుక వస్తువులను భద్రపరిచారు. ఆమె అవశేషాలు బంధువులకు చేర్చేలా గుర్తింపు చర్యలు ముమ్మరంగా సాగించింది. ఎట్టకేలకు ఆమె అవశేషాలు ఘటన జరిగిన 41 ఏళ్లకు ఆమె కూతురు చెంతకు చేరాయి. ఆమె తాలుకు బంగారపు ఉంగరం, వజ్రాలు అన్నింటిని అధికారలు ఆమెకు అందజేశారు.
తన తల్లి ఏమైందీ? ఎక్కడుంది? అనే సమాధానంలేని వేల ప్రశ్నకు ఆ కూతురికి ఇన్నేళ్లకు సమాధానాలు దొరికాయి. తల్లి గురించి తెలుసుకోగలిగానని ఆనందపడాలో ఎలా అనాథలా చనిపోయిందని తెలుసుకుని బాధపడాలో తెలియని ఉద్విగ్న స్థితితో ఉక్కిరిబిక్కిరి అయ్యింది కొన్నీ లోరైన్ కూతురు. పైగా తన తల్లి ఆచూకి కనీసం ఇప్పటికైనా తనకు తెలిసేలే కృషి చేసినందుకు పోలీసులుకు వేవేల కృతజ్ఞతలు తెలుపుకుంది. ఆ అవశేషాలను ఖననం చేసి..తన తల్లికి భారంతో కూడిన హృదయంతో ఘనంగా వీడ్కోలు పలికింది ఆ కూతురు.
(చదవండి: వింత ఘటన: ఓ మహిళ టూత్‌బ్రెష్‌ని అనుకోకుండా మింగేసింది! అంతే..)
Comments
Please login to add a commentAdd a comment