నల్లధనం మార్పిడి ముఠా అరెస్ట్
Published Tue, Nov 29 2016 1:21 AM | Last Updated on Wed, Apr 3 2019 5:16 PM
సూర్యాపేట :నల్లధనం మార్పిడికి పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సూర్యాపేట ఎస్పీ పరిమళహననూతన్ అరెస్ట్ నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి కేసు వివరాలు వెల్లడించారు.గరిడేపల్లి మండలం గడ్డిపల్లికి చెందిన గడగాని శ్రీను, బట్టిపల్లి వెంకటరమణ, పెన్‌పహాడ్ మండలం లింగాల గ్రామానికి చెందిన కేసరి రంగారెడ్డి, బక్కయ్యగూడేనికి చెందిన సానం రామయ్య, లింగాల గ్రామానికి చెందిన కేసరి శోభ, నేరేడుచర్ల మండలం మేడారం గ్రామానికి చెందిన శానం వీరభద్రయ్య, గడ్డిపల్లికి చెందిన సంధ్యాల సతీష్‌తో పాటు కుత్బుషాపురం గ్రామ సర్పంచ్‌శ్రీనివాస్, గడ్డిపల్లి గ్రామ ఎంపీటీసీ సుందరి నాగేశ్వరరావు, ఆరెపురి నారాయణ, దేనుట్ల నాగరాజు, నీలకంఠ రాంబాబులు ముఠాగా ఏర్పడ్డారు..
స్వైపింగ్ మిషన్‌తో వ్యాపారం చేస్తున్న మహిళ, ఇరత బ్యాంకు ఖాతాదారులు 12 మంది ముఠాగా ఏర్పడి 10 నుంచి 30 వరకు పర్సంటేజీలు కట్‌చేసుకొని పాత నోట్లకు కొత్త నోట్లు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. వీరిలో ప్రధానంగా గడ్డిపల్లికి చెందిన గడగాని శ్రీను గతంలో ఎస్‌బీహెచ్‌లో డ్రైవర్‌గా పనిచేశాడని.. పెన్‌పహాడ్ మండలం లింగాల గ్రామానికి చెందిన కేసరి రంగారెడ్డి, బక్కయ్యగూడేనికి చెందిన సానం రామయ్యలు గతంలో బ్యాంకులో పనిచేసిన అనుభవంతో ఈ నోట్ల మార్పిడికి పాల్పడ్డారని చెప్పారు. వీరంతా తమకున్న పరిచయాలతో 14 మంది బ్యాంకు ఖాతాదారుల పాస్‌బుక్‌లను తమ వద్దకు తీసుకుని వాటిల్లో బ్లాక్‌మనీ జమచేశారన్నారు.
వెంటనే పలువురుకి రోజుకు రూ.200 నుంచి రూ.500 మేరకు కూలీ ఇచ్చి బ్యాంకుల ముందు క్యూలో నిలబెట్టేవారని.. ఇలా అకౌంట్లలో వేయడం. తిరిగి తీసుకునే ప్రక్రియకు శ్రీకారం చుట్టారన్నారు. ఇందులో భాగంగానే రూ.4 లక్షలను పదిశాతం తీసుకుని రూ.3.60 లక్షలు చెల్లించినట్లు తమకు సమాచారం అందిందన్నారు. దీంతో ముఠాను పట్టుకునేందుకు గరిడేపల్లి, పెన్‌పహాడ్ పోలీసుల ఆధ్వర్యంలో వీరిపై నిఘా ఏర్పాటుచేశామని.. ఈ నేపథ్యంలోనే ఈనెల 22న లింగాల పెట్రోల్ బంకు సమీపంలో డబ్బులు మార్పిడి చేస్తూ.. పట్టుబడ్డారని వివరించారు.
వీరి వద్ద నుంచి రూ.3.10 లక్షల కొత్త నోట్లు, రూ.86. 500 వేలు రూ.వెరుు్య పాత నోట్లను స్వాధీనం చేసుకున్నామని. చెప్పారు. వీరిపై ఐపీసీ 406,409, 420, 180ఆర్/డబ్ల్యూ, 109, 511 కేసులు నమోదు చేస్తున్నట్లు ఎస్పీ వివరించారు. రిజర్వు బ్యాంకు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే.. సహించేది లేదని నోట్ల మార్పిడిలో కమీషన్లకు పాల్పడినవారితో పాటు అందుకు సహకరించిన వారిపై కూడా కఠినచర్యలు తీసుకుంటామని ఎస్పీహెచ్చరించారు. వీరికి సహకరించిన బ్యాంకు సిబ్బందిపై కూడా ఆరా తీస్తున్నట్టు చెప్పారు. విలేకరుల సమావేశంలో సీఐ నర్సింహారెడ్డి, ఎస్‌ఐ రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement