నల్గొండ : టిప్పర్ వాహనంలో గంజాయిని అక్రమంగా తరలిస్తూ దొరికిపోయిన ముఠాను పోలీసులు బుధవారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. సూర్యాపేటలో అయిదు రోజుల క్రితం వాహనాల తనిఖీల్లో భాగంగా అక్రమంగా తరలిస్తున్న 250 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందుకు సంబంధించి ఆరుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు 10 లక్షలు ఉంటుందని అంచనా.
కాగా ట్రిప్పర్ కింద భాగంలో ప్రత్యేకంగా ఓ అరను ఏర్పాటు చేసి అందులో గంజాయిని దాచి పెట్టారు. అంతేకాకుండా ఆ ట్రిపర్ కు ఎస్కార్ట్ గా ముగ్గురు గంజాయి దళారులు కారులో ఫాలో కావటం విశేషం. నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా హైదరాబాద్ కు ఈ గంజాయిని సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది. విశాఖ నుంచి మెదక్... అక్కడ నుంచి కర్ణాటక, అటు నుంచి ముంబైకి తరలించేందుకు ఈ ముఠా ప్లాన్ చేసినట్లు సమాచారం.