హైదరాబాద్: ఓ వైపు తీవ్ర కరెన్సీ కష్టాలతో బ్యాంకులు, ఏటీఎంల వద్ద జనం పడిగాపులు కాస్తుంటే.. మరో వైపు ఏటీఎం మెషిన్లలో డబ్బు నింపే ఏజెన్సీలో పనిచేసే వారు చేతివాటం ప్రదర్శించిన ఘటన హైదరాబాద్‌లో వెలుగుచూసింది. ఈ మేరకు సీసీఎస్ పోలీసులు ఐదుగురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేశారు. ఏటీఎం మెషిన్లలో పెట్టాల్సిన డబ్బును దారి మళ్లించి వీరు స్వప్రయోజనాలకోసం వాడుకున్నట్లు పోలీసులు గుర్తించారు.
వీరి వద్ద నుంచి రూ. 85 లక్షల నగదు, రూ. 3 లక్షల విలువైన బంగారం, 2 బైక్‌లు, 2 ల్యాప్‌ట్యాప్‌లు స్వాధీనం చేసుకున్నారు. డబ్బు పక్కదారి పట్టిందని గుర్తించి, ఏజెన్సీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు. విచారణ కొనసాగుతోంది.
ఏటీఎంలలో పెట్టాల్సిన డబ్బును దారి మళ్లించి..
Published Mon, Dec 26 2016 9:32 AM | Last Updated on Wed, Apr 3 2019 9:27 PM
Advertisement