నకిలీనోట్ల తయారీ ముఠా అరెస్ట్
Published Fri, Jan 8 2016 9:22 AM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM
శంషాబాద్: నకిలీ నోట్లు ముద్రిస్తున్న వ్యక్తిని ఎస్‌వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం తొండుపల్లి గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. గ్రామంలోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్న మహేష్ అనే వ్యక్తి నకిలీ నోట్లను తయారు చేస్తున్నాడనే సమాచారంతో రంగంలోకి దిగిన ఎస్‌వోటీ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి రూ. 83 వేల విలువైన నకిలీ నోట్లతో పాటు, ఓ ప్రింటర్, ఓ ల్యాప్‌టాప్, 50 గ్రాముల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాలో ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన మరి కొంత మంది ఉన్నట్లు సమాచారం.
Advertisement
Advertisement