అభ్యర్థుల వివరాలను పొందుపర్చిన ఎన్నికల సంఘం వెబ్‌సైట్
షాద్‌నగర్ టౌన్: ఎన్నికల సంగ్రామంలో నామినేషన్ల ఘట్టం ముగిసింది. బరిలో ఉన్న అభ్యర్థులు నియమావళి ప్రకారం నామినేషన్‌కు సంబంధించిన పత్రాలను ఎన్నికల అధికారులకు సమర్పించారు. పోటీలో ఉన్న అభ్యర్థులకు సంబంధించిన ఆస్తులు, అప్పులు, వారిపై నమోదైన కేసులు, ఆదాయ మార్గాలు, విద్యార్హతల గురించిన వివరాలను తెలుసుకోవాలని ఆయా నియోజకవర్గ ఓటర్లకు కుతూహలంగా ఉంటుంది.
ఒక్క క్లిక్‌తో అన్ని విషయాలను సులభంగా తెలుసుకోవచ్చు. ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో అభ్యర్థులకు సంబంధించిన అఫిడవిట్‌లను అప్‌లోడ్ చేసింది. (ceotelangana.nic.in) అనే వెబ్‌సైట్‌లో అభ్యర్థుల అఫిడవిట్‌లను అందుబాటులో ఉంచారు. ఎన్నికల సంఘానికి సంబంధించిన వెబ్‌సైట్ ఓపెన్ చేసిన తర్వాత జనరల్ ఎలక్షన్ 2018 ఆప్షన్ ఉంటుంది. దానిని క్లిక్ చేయగానే ఎన్నికల నియమ నిబంధనలు, నోటిఫికేషన్, ప్రభుత్వ ఉత్తర్వులు, అఫిడవిట్‌లు ఇలా రకరకాల వివిధ రకాల సమాచారం కనిపిస్తుంది.
దానిలో అఫిడవిట్ అనే ఆప్షన్‌ను క్లిక్ చేయగానే జిల్లా పేరు, అసెంబ్లీ నియోజకవర్గం ఎంపిక చేసుకోగానే అందులో నామినేషన్ వేసిన అభ్యర్థుల అఫిడవిట్లు కనపిస్తాయి. అందులో అభ్యర్థికి సంబంధించిన సమగ్ర సమాచారం సులభంగా తెలుసుకోవచ్చు. అఫిడవిట్‌కు సంబంధించిన పీడీఎఫ్ ఫైల్‌ను కూడా మనం డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment