
బీఆర్‌ఎస్, ఎల్‌ఆర్‌ఎస్ సమగ్ర సమాచారం
సాక్షి, హైదరాబాద్: నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనాల క్రమబద్ధీకరణకు, అనధికార లే అవుట్లను, ప్లాట్లను క్రమబద్ధీకరించేందుకు గత నెలలో తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ పథకాన్ని అమలు చేసేందుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఆన్‌లైన్ సేవలను ప్రవేశపెట్టింది.
ఎల్‌ఆర్‌ఎస్, బీఆర్‌ఎస్‌కు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు www.telanganalrsbrs.in, http://eghmc.ghmc.gov.in వెబ్‌సైట్లను అందుబాటులో ఉంచారు. ఎల్‌ఆర్‌ఎస్, బీఆర్‌ఎస్ దరఖాస్తుకు ఇంకా నెలరోజులు మాత్రమే గడువు ఉంది. మరో పదిరోజుల్లో దరఖాస్తులు పరిశీలించనున్నారు. ఎల్‌ఆర్‌ఎస్, బీఆర్‌ఎస్ సంబంధించి ఏమైన సందేహాలు ఉన్నట్లయితే జీహెచ్‌ఎంసీ వెబ్‌సైట్ ద్వారా వాటిని నివృత్తి చేసుకునేందుకు ఆస్కారం ఉంది.
దీంతో పాటు హెల్ప్‌లైన్ నంబర్లుకూ 155304/040-2322537 ఫోన్ చేయొచ్చు. క్రమబద్ధీకరణకు సంబంధించిన సందేహాలకు
- నరహరి (ఏసీపీ)7093906446,
- కె.గంగాధర్ (ఏసీపీ) 7702774317,
- అమృత్‌కుమార్ (ఏసీపీ) 9701363242,
- రమేష్‌బాబు (ఏసీపీ) 8006110487లను ఫోన్‌ద్వారా సంప్రదించవచ్చు.
అలాగే దరఖాస్తులతోపాటు ధ్రుపత్రాల అప్‌లోడ్‌లో ఇబ్బందులు ఉంటే (జీహెచ్‌ఎంసీ)
- రామకృష్ణారెడ్డి (టీమ్ లీడర్, సీజీజీ) 9989930333,
- కోటిరెడ్డి (వ్యాపార విశ్లేషకులు,సీజీజీ) 9603563891,
- హరి (ప్రోగ్రామర్,సీజీజీ) 9848858380లను సంప్రదించవచ్చు.
లెసైన్స్ పొందిన వ్యక్తి బిల్డింగ్ ప్లాన్లు, లే అవుట్ ప్లాన్, ప్లాట్ ప్లాన్‌ను గీయాల్సి ఉంటుంది. ఇందుకు కోసం 8897911680, 9346906744, 8096712869 సంప్రదించవచ్చు. siddharth_nnv@yahoo.com లో కూడా సంప్రదించవచ్చు.