
సాక్షి,హైదరాబాద్: బోరబండ ప్రస్తుత కార్పొరేటర్, గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేశారు. రాజీనామాకు సంబంధించి బాబా పార్టీ చీఫ్ కేసీఆర్‌కు లేఖ రాశారు.
‘బీఆర్‌ఎస్ పార్టీ కోసం 22 ఏళ్లు సైనికుడిగా పనిచేశా. పార్టీలో ఉద్యమకారుడికి రక్షణ కరువైంది’ అని లేఖలో బాబా పేర్కొన్నారు. గురువారం సాయంత్రం కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపాదాస్ మున్షి సమక్షంలో బాబా కాంగ్రెస్‌లో చేరారు. జూబ్లీహిల్స్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌తో ఉన్న విభేదాల కారణంగానే బాబా బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరినట్లు సమాచారం.
ఇదీ చదవండి.. సీఎం రేవంత్ చిట్‌చాట్.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment