baba fasiuddin
-
Ghmc: కాంగ్రెస్‌లోకి బీఆర్ఎస్ మాజీ డిప్యూటీ మేయర్
సాక్షి,హైదరాబాద్: బోరబండ ప్రస్తుత కార్పొరేటర్, గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ బీఆర్ఎస్కు రాజీనామా చేశారు. రాజీనామాకు సంబంధించి బాబా పార్టీ చీఫ్ కేసీఆర్‌కు లేఖ రాశారు. ‘బీఆర్ఎస్ పార్టీ కోసం 22 ఏళ్లు సైనికుడిగా పనిచేశా. పార్టీలో ఉద్యమకారుడికి రక్షణ కరువైంది’ అని లేఖలో బాబా పేర్కొన్నారు. గురువారం సాయంత్రం కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపాదాస్ మున్షి సమక్షంలో బాబా కాంగ్రెస్‌లో చేరారు. జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌తో ఉన్న విభేదాల కారణంగానే బాబా బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌లో చేరినట్లు సమాచారం. ఇదీ చదవండి.. సీఎం రేవంత్ చిట్‌చాట్.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు -
శివ.. హుస్సేన్ సాగర్ హీరో!
సాక్షి, హైదరాబాద్ సిటీబ్యూరో: ట్యాంక్ బండ్ చుట్టుపక్కల ఎప్పుడు ఎలాంటి సమస్య వచ్చినా పరిష్కారానికై వినబడే పేరు.. శివ! జీవితం మీద విరక్తితో హుస్సేన్ సాగర్ లో దూకి ఆత్మహత్య చేసుకోవాలని వచ్చే వారిని కాపాడటంతోపాటు.. రకరకాల కారణాలతో హుస్సేన్ సాగర్ లో దూకి చనిపోయినవారి మృతదేహాలను వెలికి తీయడం వరకు అన్ని పనులు చేస్తాడు శివ. అందుకే తోటి కార్మికులు అతణ్ని 'హుస్సేన్ సాగర్ కా హీరో' అని పిలుచుకుంటారు. కార్మికుడిగా శివ చేస్తోన్న పనులను జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ మెచ్చుకున్నారు. శుక్రవారం తన చాంబర్ కు పిలిపించుకుని శివకు శాలువా కప్పి సన్మానించారు. ఎందరినో కాపాడి, ఎన్నో మృతదేహాలను వెలికితీస్తూ శివ చేస్తున్న పని సామాన్యమైనదేమీకాదని డిప్యూటీ మేయర్ ప్రశంసించారు. -
నగరంలో డిప్యూటీ మేయర్ ఆకస్మిక తనిఖీలు
హైదరాబాద్ : నగరంలోని వివిధ ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ ఫసీయుద్దీన్ బుధవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా పంజాగుట్ట, జూబ్లీహిల్స్, బేగంపేట తదితర ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా రోడ్డుపై నిల్వ ఉన్న చెత్తతోపాటు నీరును తొలగించే పనులను ఆయన పరిశీలించారు. అందులోభాగంగా ఆయన ఉన్నతాధికారులకు పలు సూచనలు చేశారు.