ప్రభుత్వ వెబ్‌సైట్లు, సోషల్ మీడియా హ్యాండిల్స్ తొలగించడం సరికాదు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర చరిత్ర, ప్రాముఖ్యతకు సంబంధించిన ఆధారాలు, డిజిటల్ సమా చారాన్ని ప్రభుత్వ వెబ్‌సైట్లు, సోషల్‌మీడియా హ్యాండిల్స్ నుంచి తొలగించడం సరికాదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచి్చన తర్వాత గత ప్రభుత్వానికి సంబంధించిన డిజిటల్ సమాచారాన్ని ఉద్దేశపూర్వంగా తొలగిస్తున్నారని మండిపడ్డారు.
ఈ విషయంలో జోక్యం చేసుకొని డిజిటల్ సమాచారాన్ని కాపాడాలని ప్రభుత్వ ప్రధా నకార్యదర్శి శాంతికుమారికి మంగళవారం కేటీఆర్ లేఖ రాశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచి్చన తర్వాత తొలగించిన వైబ్‌సైట్లు, సోషల్ మీడియా హ్యాండిల్స్ వివరాలను ఆ లేఖలో కేటీఆర్ జత చేశారు. సీఎంగా కేసీఆర్ పనిచేసిన కాలానికి సంబంధించిన (జూన్ 2014 – డిసెంబర్ 2023) వేలాది ఫొటోలు, వీడియోలతోపాటు ఎంతో విలువైన సమాచారం తొలగించారన్నారని లేఖలో పేర్కొన్నారు.
2023 డిసెంబర్‌లో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి తెలంగాణ ప్రభుత్వ వెబ్‌సైట్‌లు, మీడియా హ్యాండిల్స్‌లో ముఖ్యమైన కంటెంట్, సమాచారం కనబడకుండా పోతోందని, కొన్ని ముఖ్యమైన వెబ్‌సైట్లు కూడా తొలగించారని చెప్పారు. ఈ చర్యల వెనుక రాష్ట్ర ప్రభుత్వంలోని ఉన్నతాధికారులు ఉన్నారనే సందేహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వాలకు సంబంధించిన మొత్తం డిజిటల్ కంటెంట్‌ను భద్రపర్చాల్సిన అవసరముందన్నారు. పబ్లిక్ డొమైన్ నుంచి తొలగించిన కంటెంట్‌ను వెంటనే పునరుద్ధరించేలా సంబంధిత అధికారులను ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment