Freelance Jobs in Hyderabad | నెలకు పదివేల నుంచి లక్ష.. ఫ్రీలాన్స్‌ జాబ్స్‌ హవా! - Sakshi
Sakshi News home page

సోలో సర్వీసే.. సో బెటరు!

Published Tue, Oct 22 2019 2:27 AM | Last Updated on Tue, Oct 22 2019 11:44 AM

Hyderabad People Changing New Job Trends - Sakshi

మారుతున్న జీవన శైలి.. ఉరుకులు పరుగుల జీవితం.. ట్రాఫిక్‌ పద్మవ్యూహంలో ఆఫీస్‌కెళ్లి పనిచేయడం.. బాస్‌ తిడితే బాధపడటం.. సెలవు కావాలంటే ఇబ్బందిపడుతూ అడగటం.. ఇదీ రోజువారీ ఉద్యోగాలు చేసే సిటిజన్ల పరిస్థితి. అయితే ఇలాంటి ప్రహసన ఉద్యోగాలకు చెక్‌ పెడుతున్నారు కొందరు నగరవాసులు. తమకు నచ్చిన పని, నచ్చినప్పుడు ఇంట్లో కూర్చొని చేస్తున్నారు. వారికి వారే బాస్‌.. ఇళ్లే ఆఫీస్‌. ఇదే ‘ఫ్రీలాన్స్‌ జాబ్స్‌’ అంటే. ఇప్పుడు నగరంలో ఇదే ట్రెండ్‌గా మారింది.

సాక్షి, హైదరాబాద్‌: గ్రేటర్‌ సిటిజన్ల జాబ్‌ ట్రెండ్‌ మారింది. ఉరుకుల పరుగుల జీవితం. ట్రాఫిక్‌ పద్మవ్యూహంలో చిక్కుకొని నిర్ణీత వేళకు ఆఫీసుకు వెళ్లి... ఎనిమిది నుంచి పది గంటలు కంప్యూటర్‌తో కుస్తీ పట్టడం.. సెలవులు దొరక్క ఇబ్బందులు పడటం.. ఇప్పుడిలాంటి వాటికి చెక్‌ పెడుతున్నారు. ఇంట్లో కూర్చుని ఖాళీ సమయాల్లో తమ హాబీకి, టాలెంట్‌కు తగిన ఉద్యోగాన్ని వెదికిపెట్టే వెబ్‌సైట్లు బోలెడు అందుబాటులోకి వచ్చాయి. ఇలాంటి ఉద్యోగాలకే సిటిజన్లు ఓటేస్తున్నారు. గృహిణులు, విద్యార్థులు, రిటైర్డ్‌ ఉద్యోగులు, వృత్తి నిపుణులు.. ఇలా మహానగరంలో ఫ్రీలాన్స్‌ ఉద్యోగాలు చేస్తూ నెలకు పది వేల నుంచి లక్షకు పైగా ఆర్జిస్తున్నవారు లక్ష మందికిపైగానే ఉన్నారు. ప్రధానంగా మెడికల్‌ ట్రాన్స్‌స్క్రిప్షన్, ట్రాన్స్‌లేషన్, ఐటీ అండ్‌ ప్రోగ్రామింగ్, గ్రాఫిక్‌ డిజైన్, కంటెంట్‌ రైటింగ్, డేటా ఎంట్రీ, మార్కెటింగ్, ఫొటోగ్రఫీ, ట్రావెల్‌ ఎక్స్‌పర్ట్, ఫుడ్‌ బ్లాగర్, ఇంటీరియర్‌ డిజైనింగ్, మొబైల్‌ యాప్‌ తయారీ, వెబ్‌సైట్‌ మేకప్‌ తదితర ఫ్రీలాన్స్‌ జాబ్స్‌తో అత్యధికంగా ఉపాధి పొందుతున్నారు. పార్ట్‌టైమ్‌ లేదా ఫుల్‌టైమ్‌ చేసుకునే అవకాశం ఉండటం ఈ ఫ్రీలాన్సింగ్‌ ఉద్యోగాల ప్రత్యేకత.

ఇంకా బోలెడు.. 
ఫ్రీలాన్స్‌ ఇండియా, ఆన్‌కాంట్రాక్ట్‌ , డిజైన్‌హిల్‌ లాంటి ఫ్రీలాన్స్‌ జాబ్‌ వెబ్‌సైట్లను కూడా వేలాది మంది సంప్రదిస్తున్నారు. వీటికితోడు రెగ్యులర్‌ జాబ్‌ వెబ్‌సైట్స్‌ షైన్, లింక్డిన్, ఇండీడ్‌ లాంటి వాటిలోనూ జాబ్స్‌ వెతుక్కుంటున్నారు.

హాబీల ద్వారా ఆదాయం.. 
పలువురు సిటిజన్లు తమ హాబీల ద్వారా కూడా ఫ్రీలాన్సర్‌గా డబ్బులు సంపాదిస్తున్నారంటే ఆశ్చర్యపోవాల్సిందే. ఫొటోగ్రఫీ అంటే ఇష్టమున్నవారు తమ ఫొటోలను కొన్ని వెబ్‌సైట్లలో తేలికగా విక్రయించుకొని ఆదాయం ఆర్జిస్తున్నారు. ఇక సేవారంగంలో కొత్త తరహా వెబ్‌ సైట్లు అందుబాటులోకి వస్తున్నాయి. డోర్‌ స్టెప్‌ సర్వీసులు అందిస్తున్నాయి. అర్బన్‌ క్లాప్‌ డాట్‌ కామ్‌ తదితర వెబ్‌ సైట్లు కూడా సర్వీసులు అందిస్తూనే ప్రొఫెషనల్స్‌కు జాబ్‌ అవకాశాలు అందిస్తుండటం విశేషం.

ఫైవర్‌
రెగ్యులర్‌ ఫ్రీలాన్స్‌ జాబ్స్‌తోపాటు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన జాబ్స్‌ ఈ వెబ్‌సైట్‌ ప్రత్యేకత. అంటే మీ వ్యక్తిగత నైపుణ్యాలను కూడా సొమ్ము చేసుకోవచ్చు. ట్రావెలింగ్‌ ఎక్స్‌పర్ట్, ఆర్ట్స్, హెల్త్, ఆస్ట్రాలజీ, ఆన్‌లైన్‌ లెసన్స్‌లాంటివి. వీటితోపాటు గ్రాఫిక్స్‌ అండ్‌ డిజైన్, డిజిటల్‌ మార్కెటింగ్, రైటింగ్, ట్రాన్స్‌లేషన్, ప్రోగ్రామింగ్, బిజినెస్‌ సెక్టార్లలో కూడా ఫ్రీలాన్స్‌ జాబ్స్‌ వెతుక్కోవచ్చు. మీ ఫ్రెండ్స్‌కు ఈ వెబ్‌సైట్‌ను రిఫర్‌ చేసి కూడా మీరు డబ్బు సంపాదించుకోవచ్చు.  ఠీఠీఠీ.జజీఠ్ఛిటట.ఛిౌఝ

అప్‌వర్క్‌
మన దేశంలో ఫ్రీలాన్సర్స్‌కు మంచి పార్ట్‌టైమ్‌ జాబ్స్‌ ఆఫర్లు ఇస్తున్న వెబ్‌సైట్‌ ఇది. ఇది అమెరికాకు చెందిన జాబ్‌ వెబ్‌సైట్‌. ఇంటర్నేషనల్‌ వెబ్‌సైట్‌ కావడంతో వేతనం కూడా ఆ మేరకే ఉంటుంది. సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్, రైటింగ్, సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్, కస్టమర్‌ సర్వీస్, ఇంజనీరింగ్‌ అండ్‌ ఆర్కిటెక్చర్‌ లాంటి రంగాల్లో ఫ్రీలాన్స్‌ జాబ్స్‌ను వెతుక్కోవచ్చు. ఇందులో ఫ్రీగా మీరు ప్రొఫైల్‌ క్రియేట్‌ చేసుకోవచ్చు. ఏదైనా ఫ్రీలాన్స్‌ వర్క్‌ మీరు చేస్తే ఆ మొత్తంలో కొంత అప్‌వర్క్‌ తీసుకొని మిగతా డబ్బు మీకు ఇస్తుంది.   ఠీఠీఠీ.upఠీౌటజు.ఛిౌఝ

ఫ్రీలాన్సర్‌.కామ్‌
ఈమెయిల్‌ లేదా ఫేస్‌బుక్‌ ఐడీతో ఫ్రీలాన్సర్‌.కామ్‌లో ప్రొఫైల్‌ క్రియేట్‌ చేసుకోవచ్చు. ఆసక్తి, నైపుణ్యమున్న వివిధ రంగాలను ఎంపిక చేసుకునే అవకాశం ఫ్రీలాన్సర్‌ కల్పిస్తోంది. పార్ట్‌టైమ్‌ ఉద్యోగం కోసం స్టూడెంట్స్‌ ఈ వెబ్‌సైట్‌ను సంప్రదిస్తున్నారు. www.freelancer.com

వర్క్‌ఎన్‌హైర్‌
ఈజీగా, యూజర్‌ ఫ్రెండ్లీగా ఉండే వెబ్‌సైట్స్‌లో ఇది ముందు వరుసలో ఉంది. ఎలాంటి గజిబిజి లేకుండా ఎవరైనా సింపుల్‌గావాడుకోవచ్చు. ఇండియన్స్‌ కోసం ప్రత్యేకంగా రూపొందించిన జాబ్‌ వెబ్‌సైట్‌ ఇది. మీకు ఎలాంటి ఉద్యోగం కావాలో ఎంపిక చేసుకోవచ్చు. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్, ఆన్‌లైన్, పార్ట్‌టైమ్‌ జాబ్స్‌లాంటి కేటగిరీలు ఉంటాయి. www.worknhire.com

ట్రూలాన్సర్‌
మన దేశంలో ఉన్న ఫ్రీలాన్స్‌ మార్కెట్‌పైనే దృష్టి సారిస్తున్న సైట్‌ ఇది. మన నైపుణ్యాలు కావాల్సిన విదేశీ కంపెనీల్లోనూ ఫ్రీలాన్స్‌ జాబ్స్‌ కోసం వెతుక్కునే అవకాశం ఉంటుంది. మీరున్న లొకేషన్‌ను బట్టి కూడా అక్కడ అందుబాటులో ఉన్న ఫ్రీలాన్స్‌ జాబ్స్‌ చూసుకోవచ్చు.
www.truelancer.com

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement