
సాక్షి బెంగళూరు: కొత్తకొత్త సాంకేతికతలు పెరుగుతున్న కొద్ధీ నేరాల తీరు కూడా పెచ్చు మీరుతోం ది. అందులో సైబర్ నేరాల తీరు తెన్నులను అంచనా వేయడం, నిందితులను పట్టుకోవడం పోలీసులకు తలకుమించిన భారంగా మారింది. ఈ క్ర మంలో మరో కొత్త సైబర్ నేరం పోలీసులకు తలనొప్పిగా మారింది. అశ్లీల వెబ్‌సైట్లలో వేరే ఎవరో యువతి ఫోటోపై వేరే ఎవరో ఫోన్ నంబర్ పెట్టి కాల్ చేయమని కొందరు నిందితులు యువతీ యువకులను వేధిస్తున్నారు. పోలీసులు ఈ కొత్తరకమైన నేరానికి ‘మొబైల్ రివెంజ్’ అని పేరు పె ట్టారు. ప్రస్తుతం వందలాది మంది నగర యువతీ యువకులను ఈ మొబైల్ రివెంజ్ విపరీతంగా వేధిస్తోంది.
అశ్లీల వెబ్‌సైట్‌లో వేరే ఎవరో యువతి ఫోటో...
అశ్లీల వెబ్‌సైట్లలో వేరే ఎవరో అర్ధ నగ్నంగా లేదా నగ్న ఉన్న ఫోటోలపై వేరే ఎవరో యువతి ఫోన్ నంబర్‌ను పెట్టి కాల్ గర్ల్ పేరిట మొబైల్ నంబర్ ను ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం ఇలాంటి కేసులు ఎక్కువగా నమోదవుతున్నట్లు సైబర్ క్రైమ్ పోలీసులు చెబుతున్నారు. ఇలాంటి కేసుల గురిం చి మౌఖికంగా సైబర్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదులు అందుతున్నట్లు తెలిపారు. ఈ మొబైల్ రివెం జ్‌కు సంబంధించి ఒక యువకుడు ఈ నెల 2న నగర పోలీసు కమిషనర్ టి.సునీల్ కుమార్‌కు సోషల్ మీడియా ద్వారా ఫిర్యాదు చేశారు. అశ్లీల వెబ్‌సైట్‌లో వేరే ఎవరో యువతి ఫోటోపై తన నంబర్‌ను పెట్టారని అప్పటి నుంచి రోజూ ఫోన్ కాల్స్‌తో మానసికంగా వేధిస్తూన్నారని కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. దీనివల్ల తన కుటుంబం ఎంతో ఇబ్బందుకు గురవుతుందని,తనసమస్యకు పరిష్కారం చూపాలనిఫిర్యాదులో విజ్ఞప్తి చేశాడు.
మొబైల్ రివెంజ్ అంటే..
మీ మొబైల్‌కు అనుమానస్పద వ్యక్తుల నుంచి కాల్స్ వచ్చి.. ‘రాత్రి, పగలు ఎంత?, ఎక్కడున్నావ్, ఏ ఏరియా, రేటు ఎంత, ఏ స్థలానికి రావాలి??’ లాంటి ప్రశ్నలు విన్నారా!! ఇలాంటి తరహా ప్రశ్నలు వచ్చాయంటే అనుమానమే లేకుండా మీరు ‘ౖమొబైల్ రివెంజ్’కు బలి అయినట్లే.. మీ మొబైల్ నంబర్‌ను వేరే ఎవరో అశ్లీల వెబ్‌సైట్లో పెట్టినట్లు అర్థం. అందుకే మీకు ఇలాంటి తరహా ఫోన్ కాల్స్ వస్తున్నాయి. అశ్లీల వెబ్‌సైట్‌లో అర్ధనగ్నంగా ఉన్న యువతి ఫోటోపై మీ నంబర్ పెట్టి ‘నేను కాల్ గర్ల్.. లైంగిక సేవ కోసం ఈ నంబర్‌కు ఫోన్ చేయండి’ అంటూ కొందరు ఆకతాయిలు ఈ చర్యకు పూనుకుంటున్నారు. ఆ సైట్లో మీ ఫోన్ నంబర్ చూసిన వ్యక్తులు లైంగిక సేవ కోసం ఫోన్లు చేస్తూ వేధిస్తూనే ఉంటారు. ఇలాంటి తరహా కేసులు ఎక్కువగా నమోదవుతున్నట్లు సైబర్ పోలీసులు తెలిపారు.
యువకులను విడిచిపెట్టడం లేదు..
వేరే ఎవరో యువతి ఫోటోపై వేరే మరో యువతి మొబైల్ నంబర్‌ను పెట్టి వేధిస్తున్న ఆకతాయిలు.. యువకులను సైతం విడిచిపెట్టడం లేదు. అశ్లీల వెబ్‌సైట్లలో యువతి అర్ధనగ్న ఫోటోలపై యువకుల నంబర్లను కూడా పెట్టి వేధిస్తున్నారని తెలిసింది. ఈ మొబైల్ రివెంజ్‌పై చాలా మంది సైబర్ క్రైమ్ పోలీసు స్టేషన్‌కు వచ్చి మౌఖికంగా ఫిర్యాదులు చేస్తున్నారని పోలీసు అధికారులు తెలిపారు. ఇలాంటి విరుద్ధ చర్యలకు వేరే ఎవరో అపరిచితులు పాల్పడడం లేదని చెబుతున్నారు. కేవలం పరిచయం ఉన్నవారు, సంబంధికులే ఇలాంటి పోకిరీ చర్యలకు పాల్పడుతున్నారని చెప్పారు. పలాన వ్యక్తిపై అసహనం, కోపం లేదా ప్రతీకారం తీర్చుకోవాలనే ఉద్ధేశంతోనే తెలిసిన వారే ఇలాంటి ఆకతాయి చర్యలకు పాల్పడుతున్నట్లు తమ విచారణలో వెలుగులోకి వస్తోందని తెలిపారు. ఇలాంటి మొబైల్ రివెంజ్‌కు పాల్పడే వారిపై బాధితులు ఫిర్యాదు చేస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అంతేకాకుండా మొబైల్ రివెంజ్‌కు పాల్పడితే వారిపై క్రిమినల్ కేసులు పెట్టి జైలుకు తరలిస్తామని పోలీసులు హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment