
తమిళసినిమా: అశ్లీల వెబ్‌సైట్‌లకు మంగళం పాడే విధంగా ఎక్స్ వీడియోస్ చిత్రం ఉంటుందని ఆ చిత్ర దర్శకుడు సజో సుందర్ తెలిపారు. ఈయన దర్శకత్వం వహిస్తున్న తొలి చిత్రం ఎక్స్ వీడియోస్. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ అశ్లీల చిత్రాలను ఎక్స్ వీడియోస్ పేరుతో ఇంటర్నెట్‌లో ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందేనన్నారు. అలాంటి వెబ్‌సైట్స్‌కు వ్యతిరేకంగా ఈ చిత్రం ఉంటుందని చెప్పారు. అశ్లీల సన్నివేశాలతో కూడిన వెబ్ చిత్రాలు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయని, ఎక్స్ అనే పదానికి దేనితోనైనా పోల్చవచ్చునని అన్నారు. ఎక్స్ వీడియోస్ అనే పేరు పెట్డడంతో తమ చిత్రం అశ్లీల చిత్రం కాదని అన్నారు. అలాంటి ఎక్స్ వీడియోస్ కారణంగా బాధితుల గురించి పోరాడే చిత్రంగా ఈ చిత్రం ఉంటుందని చెప్పారు.
అదే విధంగా అసభ్యకరమైన పడకగది సన్నివేశాలు లాంటి ఉండవని, మహిళల రక్షణ గురించి బలంగా చెప్పే చిత్రంగా ఎక్స్ వీడియోస్ చిత్రం ఉంటుందని తెలిపారు. ముఖ్యంగా మహిళలు చూడాల్సిన చిత్రం ఇదని చెప్పారు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ చిత్రం విడుదలకు ముందే ఎక్స్ వీడియోలను నిషేధించాలని కోరుతూ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయనున్నట్టు దర్శకుడు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment