డబ్బు పోగొట్టుకోవడం, బెదిరింపులు ఎదుర్కోవడం, వీడియో–ఆడియో సంభాషణల ద్వారా ఇబ్బందులకు లోను అవడం.. ఇవన్నీ ఇటీవల ఆన్‌లైన్, సోషల్ మీడియా వేదికగా అధికంగా జరుగుతున్న నేరాలు. ఈ–మోసాలకు గురైతే ఏం చేయాలి? ఇంటర్నెట్‌లో భద్రంగా ఎలా ఉండాలి..? వివరంగా తెలుసుకుని ఆచరిస్తే సమస్యల నుంచి సులువుగా బయటపడవచ్చు. మన దేశంలో సైబర్ నేరాలను అధికారులకు రిపోర్ట్ చేయాలంటే కొన్ని ముఖ్యమైన దశలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి..
సైబర్ క్రైమ్‌కు సంబంధించి వీలైనంత ఎక్కువ సాక్ష్యాలను సేకరించాలి. ఇందులో స్క్రీన్ షాట్‌లు, ఇ–మెయిల్స్, చాట్‌లాగ్‌లు, బ్యాంక్‌లావాదేవీల రికార్డులు, వీడియో అండ్ ఆడియో సంభాషణలు లేదా మీ ఫిర్యాదుకు మద్దతునిచ్చే ఏవైనా ఇతర సంబంధిత సమాచారం అంతా మీ దగ్గర ఉండాలి.
1. సంఘటన ఆధారంగా..
ఇంటర్నెట్, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మొదలైనవాటిలో మీరు అవతలి వ్యక్తులతో కమ్యూనికేట్ చేసిన విధానం. తేదీ, సమయం, ఏ ప్లాట్ ఫారమ్ (ఇంటర్నెట్, సోషల్ మీడియా... మొదలైనవి) అనే అంశాల్ని చూసుకోవాలి. అలాగే సాక్ష్యాలను అప్‌లోడ్ చేయాలి (నగదు చెల్లింపులు /బ్యాంక్ స్క్రీన్‌షాట్‌లు ఆర్థిక మోసాలకు సంబంధించిన స్టేట్‌మెంట్‌లు. వేధింపులకు లేదా ఇతర వాటికి సంబంధించిన స్క్రీన్‌షాట్‌లు, ఫొటో, ఆడియో, వీడియో మొదలైనవి ఏమైనా ఉంటే జత చేయాలి).
2. అనుమానితుడి వివరాలు ఏవైనా ఉంటే..
అనుమానితుడి పేరు, గుర్తింపు (మొబైల్, ఇ–మెయిల్, సోషల్ మీడియా యుఆర్‌ఎల్ మొదలైనవి), ప్లేస్ (ఆఫీస్... మొదలైనవి).
3. కంప్లైంట్స్ వివరాలు
బాధితుడి పూర్తి పేరుతో పాటు తండ్రి/జీవిత భాగస్వామి/ సంరక్షకుడు మొదలైనవి నోట్ చేయాలి. ఇ–మెయిల్ ఐడీ /ఫోన్ నెంబర్, చిరునామా, ఐడీ గుర్తింపు (ఆధార్.. మొదలైనవి)తో మీ దగ్గరలోని స్థానిక పోలీస్‌స్టేషన్ లేదా సంబంధిత పోలీస్ కమిషనరేట్‌లోని సైబర్ క్రైమ్ విభాగాన్ని సంప్రదించాలి. నేరం గురించి, సంఘటన జరిగిన తేదీ, సమయం, మీరు సేకరించిన సాక్ష్యాలతో సహా అన్ని వివరాలతో కూడిన రాతపూర్వక ఫిర్యాదుతో వారికి అందించాలి. మీ ఫిర్యాదుకు ఏవైనా సంబంధిత పత్రాలు లేదా సాక్ష్యాధారాల కాపీలను జత చేయాలి. మీ పట్ల జరిగిన నేరం వరుస పద్ధతిలో సాక్ష్యాలను జాబితా చేయడం మంచిది. మీ కంప్లైంట్ /ఎఫ్‌ఐఆర్/ పిటిషన్ ఫాలోఅప్ గురించి విచారించాలి. మీ కేసుకు కేటాయించిన దర్యాప్తు అధికారిని క్రమం తప్పకుండా వివరాలను కనుక్కుంటూ ఉండాలి. అధికారి పేరు, సంప్రదింపు వివరాలు, మీకు అందించిన ఏవైనా రిఫరెన్స్ నంబర్ల రికార్డును మెయిన్‌టెయిన్ చేయాలి. ఇ–మెయిల్, సందేశాలు లేదా ఏదైనా ఇతర డిజిటల్ కంటెంట్‌తో సహా సైబర్ నేరానికి సంబంధించిన అన్ని సంబంధిత సాక్ష్యాలను భద్రపరిచారని నిర్ధారించుకోవాలి. విచారణ ప్రయోజనాల కోసం సాక్ష్యాలను తారుమారు చేయద్దు.
సైబర్‌క్రైమ్ రిపోర్టింగ్ సంబంధిత పోర్టల్స్:
- దేశంలో వివిధ రకాల సైబర్ నేరాలను నివేదించడానికి ఉన్న పోర్టల్స్..
- పరువు నష్టం, సైబర్ బెదిరింపు, సైబర్ స్టాకింగ్, అశ్లీల కంటెంట్, అశ్లీలత, లైంగిక వేధింపులు, ఫిషింగ్ మోసాలు.. వంటి సైబర్ మోసాలను నివేదించడానికి మీరు https://www. cybercrime.gov.in/
- పెట్టుబడి మోసాలు, క్రిప్టో కరెన్సీ స్కామ్‌లు, ఇ–కామర్స్ మోసాలు, వర్క్ ఫ్రమ్ హోమ్‌స్కామ్‌లు, ఫిషింగ్ మోసాలతో సహా ఆర్థిక సైబర్ మోసాలకు గురైనట్లైతే.. 1930కి కాల్ చేయవచ్చు. సిటిజన్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ స్కామర్ల నిధులను స్తంభింపజేయడానికి ఈ వ్యవస్థ సహాయం చేస్తుంది.
- సైబర్ సెక్యూరిటీ, సైబర్ టెర్రరిజానికి సంబంధించిన సంఘటలను రిపోర్ట్ చేయడానికి ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ((CERT-In)) వెబ్‌సైట్ ద్వారా https://cert-in.org.in లో రిపోర్ట్ చేయవచ్చు.
- పోగొట్టుకున్న ఫోన్ల గురించి https://ceir.sancharsaathi.gov.in/ Home/index.jspలో రిపోర్ట్ చేయచ్చు. మీ ఫోన్‌లను బ్లాక్ చేయడానికి, ట్రాక్ చేయడానికి ఈ పోర్టల్ మీకు అనుమతిస్తుంది. సరైన సూచనల కోసం పోలీస్‌స్టేషన్‌ను కూడా సంప్రదించవచ్చు.
- ఎవరైనా మీ అనుమతి లేకుండా మొబైల్ ఫోన్ సేవల కోసం మీ ఆధారాలను ఉపయోగిస్తున్నారని అనుమానం వస్తే.. దానిని https://tafcop. sancharsaathi.gov.in/ telecomUser/ లో రిపోర్ట్ చేయవచ్చు.
- వన్ నేషన్ వన్ అంబుడ్స్‌మన్ స్కీమ్ అనేది మీరు యుపీఐని ఉపయోగించి అనుకోకుండా ఇతరులకు డబ్బును బదిలీ చేస్తే, ఫిర్యాదు చేయడానికి అనుమతించే పథకం. సంబంధిత యుపీఐ సర్వీస్‌ప్రొవైడ్ (పేటీఎమ్, గూగుల్ పే, ఫోన్ పే మొదలైనవాటిపై ఫిర్యాదు), టోల్ ఫ్రీ నంబర్ 14448కి కాల్ చేయాలి. https://ceir.sancharsaathi.gov.in/ Home/index.jsp పోర్టల్‌లో రిపోర్ట్ చేయాలి. ప్రత్యామ్నాయంగా CRPC@rbi.org.inకు మెయిల్ చేయవచ్చు.
- యుపీఐ లావాదేవీకి సంబంధించి https://www.npci.org.in/what-we-do/upi/dispute-redressal-mechanismలో రిపోర్ట్ చేయచ్చు.
సైబర్ సెక్యూరిటీకి చిట్కాలు
- పెద్ద అక్షరాలు, చిన్న అక్షరాలు, ప్రత్యేక అక్షరాలు, సంఖ్యా కలయికతో బలమైన పాస్‌వర్డ్‌లను సృష్టించాలి.
- మీ ఆన్‌లైన్, సోషల్ మీడియా, ఇ–మెయిల్ ఖాతాల కోసం .. టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ (2ఎఫ్‌ఎ)ని ప్రారంభించాలి.
- ఎసెమ్మెస్ ద్వారా మీ మొబైల్ పరికరానికి పంపిన ప్రత్యేక కోడ్‌ని లేదా ప్రత్యేక ప్రమాణీకరణ అప్లికేషన్‌ను ఉపయోగించవచ్చు.
- సురక్షిత డేటా ట్రాన్స్‌మిషన్ కోసం గ్కిఅ2 లేదా గ్కిఅ3 ఎన్‌క్రిప్షన్‌తో మీ వైఫై రూటర్‌ని సెట్ చేయాలి. చట్టబద్ధ్దమైనదని మీకు కచ్చితంగా తెలిస్తే తప్ప పబ్లిక్ ౖÐð ఫైని ఎప్పటికీ ఉపయోగించవద్దు.
- మీ సోషల్ మీడియా ఖాతాల్లోని సీక్రెట్ సెట్టింగ్‌లను చెక్ చేస్తూ ఉండాలి. మీ వ్యక్తిగత వివరాలను నమ్మకమైన వారితో మాత్రమే పంచుకోవాలి.
- సాఫ్ట్‌వేర్ యాప్‌లు, ఫైల్స్‌ను రిప్యుటేషన్ ఉన్నవాటి నుండి మాత్రమే డౌన్‌లోడ్ చేసుకోవాలి. ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుండి మాత్రమే అప్లికేషన్‌లను ఇన్‌స్టాల్ చేయాలి.
- మీ ముఖ్యమైన డేటా, ఫైల్స్ డేటా, క్లౌడ్ స్టోరేజీ మొత్తాన్ని క్రమం తప్పకుండా బ్యాకప్ చేసుకోవడం మంచిది.
- డిజిటల్ భద్రత పద్ధతుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడం మంచిది.
లోతైన పరిష్కారానికి..
సోషల్ మీడియా మోసాలకు సంబంధించి సరైన, సంతృప్తికరమైన పరిష్కారం దొరకలేదు అనుకుంటే జ్టి్టpట://జ్చఛి.జౌఠి.జీn/లో రిపోర్ట్ చేయవచ్చు. ఈ ఎఅఇ కమిటీ డిజిటల్ ప్లాట్‌ఫారమ్ బాధితుల కంప్లైంట్స్‌ను అప్పీళ్లతో పరిష్కరిస్తుంది.
(చదవండి: పీ ఫర్ పాడ్‌కాస్ట్.. బీ ఫర్ భార్గవి)
Comments
Please login to add a commentAdd a comment