సాక్షి, అమరావతి: ఇంటర్నెట్ ప్రపంచంలో కోట్లాది వెబ్‌సైట్లు సమాచార సామ్రాజ్యాన్ని ఏలుతున్నాయి. లావాదేవీలకు వారధిగా నిలుస్తూ కీలక పాత్ర పోషిస్తున్నాయి. నిమిషానికి 175 కొత్త వెబ్‌సైట్లు పుట్టుకొస్తున్నాయి. రోజూ 2.52 లక్షల కొత్త వెబ్‌సైట్లను సృష్టిస్తున్నారు. 1991లో ఒక్క వెబ్‌సైట్‌తో ప్రారంభమైన ఇంటర్నెట్ ఈ రోజు బిలియన్ల సంఖ్యకు చేరుకోవడం విశేషం. ప్రస్తుతం ఇంటర్నెట్‌లో సుమారు 1.13 బిలియన్ల వెబ్‌సైట్లు ఉన్నట్లు ఇంగ్లాండ్‌కు చెందిన ఇంటర్నెట్ సంస్థ నెట్‌క్రాఫ్ తాజా నివేదికలో వెల్లడించింది. అధికంగా ఆంగ్లంలోనే వెబ్‌సైట్లను రూపొందిస్తున్నారు.
18 శాతం మాత్రమే యాక్టివ్..
ఇంటర్నెట్‌లోని కోట్లాది వెబ్‌సైట్‌లలో కేవలం 18 శాతం మాత్రమే యాక్టివ్‌గా ఉన్నట్టు నెట్‌క్రాఫ్ట్ పేర్కొంది. ప్రస్తుతం 20.29 కోట్ల వెబ్‌సైట్లు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. యాక్టివ్ వెబ్‌సైట్ల కంటే పని చేయనివి ఐదు రెట్లు ఎక్కువగా ఉండటం గమనార్హం. ఒక Ðవెబ్‌సైట్‌లో అనేక వెబ్ పేజీల సమాచారం ఉంటుంది. 50 బిలియన్ల వెబ్‌పేజీల సమాచారం నెట్‌లో నిక్షిప్తమైంది. టిల్æబర్గ్ వర్సిటీ (నెదర్లాండ్స్) పరిశోధన ప్రకారం ఇండెక్డ్ వెబ్ ఏకంగా 4.98 బిలియన్ల పేజీలను కలిగి ఉంది.
రెండు బిలియన్ల మంది షాపింగ్
దాదాపు 71 శాతం వ్యాపారాలను వెబ్‌సైట్లపై ఆధారపడి నిర్వహిస్తున్నారు. ఇందులో 28 శాతం ఆన్‌లైన్ వ్యాపారం నడుస్తోంది. 43 శాతం మంది చిన్న వ్యాపారులు తమ వెబ్‌సైట్‌లను మరింత మెరుగ్గా నిర్వహించేందుకు పెట్టుబడి పెట్టాలని భావిస్తున్నారు. 2 బిలియన్ల మందికిపైగా వివిధ వెబ్‌సైట్ల ద్వారా ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నారు. ఈ–కామర్స్ విక్రయాలు 4.2 ట్రిలియన్ల డాలర్లుకుపైగా చేరుకుంటున్నాయి.
వెబ్‌సైట్లో ఇలా..
♦ ప్రపంచ వెబ్ ట్రాఫిక్‌లో 93 శాతం గూగుల్ నుంచే వస్తోంది. గూగుల్‌లో అత్యధికంగా సగటున 22 నిమిషాల పాటు బ్రౌజింగ్ సమయాన్ని వెచి్చస్తున్నారు. ఇది యూట్యూబ్‌లో 9 నిమిషాలుగా ఉంది.
♦ ఒక రోజులో 3 బిలియన్ల కంటే ఎక్కువగా గూగుల్ శోధనలు జరుగుతున్నాయి.
♦ ఒక్క రోజులో 70,000కు పైగా వెబ్‌సైట్‌లు హ్యాక్‌కి గురవుతున్నాయి.
♦ ఒక రోజులో దాదాపు 120 బిలియన్ ఈ–మెయిల్స్ పంపుతున్నారు.
♦ప్రతిరోజూ 4 బిలియన్ గిగాబైట్ల కంటే ఎక్కువ ఇంటర్నెట్ ట్రాఫిక్ నమోదవుతోంది.
♦ 63 మిలియన్ వెబ్‌సైట్‌లు కంటెంట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌లను ఉపయోగిస్తున్నాయి.
♦ ప్రపంచవ్యాప్తంగా ఉన్న అగ్ర వెబ్‌సైట్‌లలో 76.17 శాతం మొబైల్‌కు అనుకూలమైనవి కాగా 23.83 శాతం వెబ్‌సైట్‌లు మొబైల్‌లో ఓపెన్ కావు.
Comments
Please login to add a commentAdd a comment