మోసాలకు ఫుల్‌స్టాప్ అనేదే ఉండదు. రోజుకో కొత్తరకం మోసం, వంచన వెలుగుచూస్తూనే ఉంటాయి. దొంగతనాలు, బెట్టింగ్ యాప్స్, ఆన్‌లైన్ మోసం, సైబర్ నేరాలు ఇవన్నీ పెరిగిపోతున్నాయి. అమాయక ప్రజల నుంచి బడా అధిపతుల వరకు అందరిని మోసగాళ్లు దోచుకుంటూనే ఉన్నారు.
తాజాగా దేశంలో సైబర్ దాడులు కూడా పెచ్చుమీరుతున్నాయి. నెట్‌వర్క్ సాధనాలు, కంప్యూటర్ సిస్టమ్, సర్వర్లు వంటి డిజిటల్ పరికారలకు చెందిన డేటాను దొంగిలించమే సైబర్ అటాక్. తమ తమ ప్రయోజనాల కోసం డేటాను దొంగిలించి, నాశనం చేయడం, మార్చడం వంటివి చేస్తుంటారు సైబర్ నేరగాళ్లు.
అయితే రోజుకో కొత్త పుంతలు తొక్కుతున్న సైబర్ దాడుల కారణంగా దేశ జాతీయ భద్రతకు తీవ్ర ముప్పు కలుగుతోంది. దేశంలో 2033 నాటికి సైబర్‌టాక్‌లు 1 ట్రిలియన్‌కు పెరుగుతాయని PRAHAR అనే ఎన్జీవో అంచనా వేసింది. అదే 2047 నాటికి 17 ట్రిలియన్లకు చేరుకోవచ్చని తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా భారత్‌కు పెరుగుతున్న హోదా, ఖ్యాతి కారణంగా దాడులు కూడా పెరిగే అవకాశం ఉందని ఈ సర్వే అంచనా వేసింది. ఈ మేరకు ప్రహార్ ‘ది ఇన్విజిబుల్ హ్యాండ్’ పేరుతో నివేదికను న్యూఢిల్లీలో నేడు ఆవిష్కరించింది.
దీని ప్రకారం.. సైబర్‌టాక్‌లు లేదా సైబర్‌వార్‌ఫేర్ వంటివి భారత్‌కు వ్యతిరేకంగా ఉద్భవించిన అత్యంత శక్తివంతమైన ముప్పుగా తయారయ్యింది. సోషల్ మీడియా వాడకం, గేమింగ్, బెట్టింగ్ వంటివి ఆధునాతన సబైర్ మానిప్యులేషన్‌కు దారి తీస్తుంది., దేశంపై దాడులకు సాధనాలుగా మారుతున్నాయి
సైబర్‌టాక్‌లు లేదా సైబర్‌వార్‌ఫేర్ భారతదేశానికి వ్యతిరేకంగా ఉద్భవించిన అత్యంత శక్తివంతమైన ముప్పు. సైబర్‌స్పేస్ అనేది కొత్త యుద్దభూమి. దీనిపై భారత్ దాడికి దిగాల్సిందే. అధునాతన సాంకేతిక మౌలిక సదుపాయాలు, నైపుణ్యం మెరుగుదల, డిజిటల్ యాప్‌లు, ప్లాట్‌ఫారమ్‌లను వైట్‌లిస్ట్ చేయడం, పౌరులకు అవగాహన కల్పించడం వంటివి ఎంతో అవసరం. పెరుగుతున్న సైబర్ దాడులు దేశంలో బలమైన సమగ్ర సైబర్ రక్షణ విధానం రూపొందించి, దాని అమలు చేసే ఆవశ్యకతను తెలియజేస్తుంది.
ప్రపంచవ్యాప్తంగా సైబర్‌టాక్‌లు 2024 మొదటి నెలలో 76% పెరిగాయి. బర్‌నేరగాళ్లు ఎక్కువగా లక్ష్యంగా చేసుకుంటున్న దేశాల్లో భారత్ కూడా ఉంది. దిని సైబర్ భద్రతా చర్యల అవసరాన్ని నొక్కి చెబుతుంది. గతేదాడి దేశం 79 మిలియన్లకు పైగా సైబర్ అటాక్‌లను ఎదుర్కొంది. ఇది ప్రపంచ వ్యాప్తంగా పోలిస్తే మూడో స్థానంలో ఉంది. ఇక గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది 15% పెరుగుదలను గుర్తించింది. 2024 500 మిలియన్లకు పైగా అటాక్‌కు కనిపించాయి. 2024 రెండవ త్రైమాసికంలో సైబర్‌టాక్‌లు 46% పెరిగాయి.
2024 మొదటి నాలుగు నెలల్లో, సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కి భారతీయులు రూ. 1,750 కోట్లకు పైగా కోల్పోయారు. ఈ విషయం నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌లో 740,000 ఫిర్యాదుల ద్వారా వెల్లడైంది. బంగ్లాదేశ్ శ్రీలంక వంటి పొరుగు దేశాలలో ఇటీవలి రాజకీయ తిరుగుబాట్లు పరిణాల్లోనూ సైబర్ నేరస్థుల పాత్ర ఉండవచ్చనే సందేహాలను లేవనెత్తుతున్నాయి.
సైబర్‌టాక్‌లపై నేషనల్ కన్వీనర్ & ప్రహార్ ప్రెసిడెంట్ అభయ్ మిశ్రా తీవ్ర ఆందోళనలను వ్యక్తం చేశారు. ‘“సైబర్‌టాక్‌లు రెండు రకాలు. మొదటిది ఆర్థిక లాభం సిస్టమ్‌లలోని దుర్బలత్వాన్ని ఉపయోగించుకునే సాంప్రదాయ హ్యాకర్‌లు. రెండవది పౌరులను లక్ష్యంగా చేసుకుంటుంది. బలవంతం, బెదిరింపుల ద్వారా దేశ వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొనడానికి వారిని రిక్రూట్ చేస్తుంది. అక్రమ బెట్టింగ్ యాప్‌లలో ఇటువంటి వ్యూహాలు ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ వ్యూహం బంగ్లాదేశ్‌లో మోహరించిన విధానాలను కూడా పోలి ఉంటుంది, ఇక్కడ సాధారణ పౌరులను అస్థిరపరిచే సాధనాలుగా మార్చుతారు. ప్రభుత్వ సంస్థలను లోపల నుంిచి అణగదొక్కారు. భారత భద్రతా సంస్థలు అటువంటి అవకాశాల ప్రాబల్యాన్ని క్షుణ్ణంగా పరిశోధించాలి’ అని తెలిపారు.
ఇటీవలి సంవత్సరాలలో అక్రమ ప్లాట్‌ఫారమ్‌ల విస్తరణ ఉంది. ఈ విదేశీ యాజమాన్యంలోని ప్లాట్‌ఫారమ్‌లు, భారతదేశ నిబంధనలకు వెలుపల ప్రత్యేకంగా యువతను డబ్బు కోసం లక్ష్యంగా చేసుకుని దోపిడీ చేస్తున్నాయి మరియు అదే డబ్బును తిరిగి దేశంలోకి మళ్లించి ఇబ్బందులను రేకెత్తిస్తాయి.
అక్రమ ఆన్‌లైన్ జూదం, జూదగాళ్ల వల్ల కలిగే నష్టాలు రూ.1 లక్ష కోట్లుదాటవచ్చని అంచనాలు సూచిస్తున్నాయి. చట్టవిరుద్ధమైన ఆఫ్‌షోర్ బెట్టింగ్ అప్లికేషన్‌ల ద్వారా జరిగే లావాదేవీలు సంవత్సరానికి రూ2 లక్షల కోట్ల (సుమారు USD 24 బిలియన్లు) వరకు చేరుకుంటాయని తెలిపింది.
అయితే జాతీయ భద్రత పేరుతో గేమింగ్, ఆన్‌లైన్ జూదం ప్లాట్‌ఫామ్స్‌ను మూసివేయాలి. అలాగే దేశంలో ఆన్‌లైన్ సంస్థలను పరిమితులు విధించాలనిసూచించింది. చట్టవిరుద్ధమైన ప్లాట్‌ఫారమ్‌ల బారిన పడకుండా యువతను నిరోధించాలని తెలిపింది .
Comments
Please login to add a commentAdd a comment