ఒట్టావా/న్యూఢిల్లీ: ఇండియా విషయంలో కెనడా ప్రభుత్వం దుందుడుకు చర్యలకు పాల్పడుతోంది. ఇండియా నుంచి తమకు సైబర్ ముప్పు పొంచి ఉందని పేర్కొంది. ఏయే దేశాల నుంచి సైబర్ ముప్పు ఉందన్నదానిపై గత నెల 30న కెనడియన్ సెంటర్ ఫర్ సైబర్ సెక్యూరిటీ(సైబర్ సెంటర్) ఓ జాబితా విడుదల చేసింది. ఇందులో ఇండియాను సైతం చేర్చింది. నేషనల్ సైబర్ థ్రెట్ అసెస్‌మెంట్(ఎన్‌సీటీఏ) 2025–26లో చైనా, రష్యా, ఇరాన్, ఉత్తర కొరియా తర్వాత ఇండియా పేరును చేర్చడం గమనార్హం.
భారత ప్రభుత్వం నియమించిన వ్యక్తులు గూఢచర్యం కోసం తమ ప్రభుత్వ నెట్‌వర్క్‌పై సైబర్ ముప్పు కార్యకలాపాలకు పాల్పడే ప్రమాదం ఉందని కెనడా ప్రభుత్వం ఆరోపించింది. ఎన్‌సీటీఏ జాబితాను ప్రతి రెండేళ్లకోసారి విడుదల చేస్తుంటారు. 2018, 2020, 2023–24 నాటి జాబితాలో ఇండియా పేరులేదు. తొలిసారిగా 2025–26 జాబితాలో ఇండియా పేరు చేర్చారు. ఇదిలా ఉండగా, భారత్ నుంచి సైబర్ ముప్పు పొంచి ఉందంటూ కెనడా విడుదల చేసిన జాబితాపై భారత విదేశాంగ శాఖ అధికారి రణ«దీర్ జైస్వాల్ శనివారం అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రపంచ దేశాల అభిప్రాయాన్ని భారత్‌కు వ్యతిరేకంగా మా ర్చాలన్నదే కెనడా కుట్ర అని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment