
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజల డేటా చోరీతో అడ్డంగా దొరికిపోయిన తెలుగుదేశం పార్టీ ఏం జరుగుతుందోననే భయంతో బుధవారం రాత్రి నుంచి పార్టీ వెబ్‌సైట్‌ను నిలిపివేసింది. దీనిపై మీడియాలో వార్తలు రావడంతో గురువారం రాత్రికి మళ్లీ వెబ్‌సైట్‌ను పునరుద్ధరించింది. బుధవారం రాత్రి నుంచి టీడీపీ వెబ్‌సైట్ www. telugudesam. org తెరిస్తే ఎర్రర్ మెసేజ్ వచ్చింది.
ఇప్పటికే డేటా చోరీ ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరవుతున్న సమయంలో వెబ్‌సైట్‌లోని సమాచారం ద్వారా లేనిపోని ఇబ్బందులు వస్తాయనే కారణంతో దాన్ని నిలిపేసినట్లు తెలిసింది. నిలిపివేత వల్ల ప్రభుత్వం తప్పుచేసినట్లు ఒప్పుకున్నట్లేనని ప్రచారం జరగడంతో వెంటనే గురువారం రాత్రి వెబ్‌సైట్‌ను పునరుద్ధరించారు.