
బెంగళూరు: పేమెంట్ సొల్యూషన్ల కంపెనీ రేజర్‌పే నూతనంగా పేమెంట్ పేజెస్ అనే సర్వీస్‌ను ఆరంభించింది. అన్ని రకాల వ్యాపారస్తులు ఆన్‌లైన్ చెల్లింపులను స్వీకరించేందుకు వీలుగా దీన్ని రూపొందించినట్టు ఈ సంస్థ తెలిపింది. ఎటువంటి హోస్టింగ్ వ్యయాలు, ఇంటెగ్రేషన్, నిర్వహణ చార్జీలు లేదా స్థిర ఫీజుల అవసరం ఇందులో ఉండదని పేర్కొంది.
దేశ జీడీపీలో 30 శాతం వాటా కలిగిన చిన్న, మధ్య స్థాయి వ్యాపారుల్లో 68% మందికి వెబ్‌పోర్టళ్లు కానీ, యాప్స్ కానీ లేవని తెలిపింది. ఈ పరిస్థితుల్లో ఆయా వ్యాపారులకు పేమెంట్ పేజీని ఐదు నిమిషాల వ్యవధిలోపే రేజర్ పే పెమెంట్ పేజెస్ ఏర్పాటు చేస్తుందని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment