ఆన్‌లైన్‌లో వ్యాఖ్యలపై అరెస్టులను తప్పుబట్టిన సుప్రీం | supreme court condemns arrest of online comments | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌లో వ్యాఖ్యలపై అరెస్టులను తప్పుబట్టిన సుప్రీం

Published Wed, Dec 10 2014 12:37 AM | Last Updated on Sun, Sep 2 2018 5:20 PM

supreme court condemns arrest of online comments

న్యూఢిల్లీ: సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ కొందరిని అరెస్టు చేయటంపై పోలీసులను సుప్రీంకోర్టు తప్పుబట్టింది. ఇటువంటి అరెస్టులను కేంద్రం సమర్థించుకోజూడటాన్ని జస్టిస్ చలమేశ్వర్ నేతృత్వంలోని ధర్మాసనం తీవ్రంగా పరిగణించింది. ఐటీ చట్టంలోని సెక్షన్ 66ఏ ను ఉపయోగించుకుని సోషల్ వెబ్‌సైట్లలో అభ్యంతరకర వ్యాఖ్య లు చేసిన వారిని అరెస్టు చేయటం, మూడేళ్ల వరకు జైలు శిక్ష విధించటం చట్టాన్ని దుర్వినియోగం చేయటమేనని తేల్చిచెప్పింది.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement