మీరు 1990ల నాటి ఇండియన్ సంగీతానికి అభిమాని అయితే, బాలీవుడ్‌లో వచ్చిన డోల్ డోల్.. దమ్ తారా అనే పాటకు కచ్చితంగా ఫిదా అయింటారు. షారుఖ్ ఖాన్ సూపర్ హిట్ సాంగ్ 'కబీ హాన్ కబీ నా' పాటకు కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇలాంటి సూపర్ హిట్ సాంగ్స్‌తో అభిమానులను సొంతం చేసుకున్న సింగర్,నటి సుచిత్రా కృష్ణమూర్తి. ఆమె 1999లో ప్రముఖ దర్శకుడు శేఖర్ కపూర్‌ను ప్రేమించి వివాహం చేసుకుంది. వారికి కావేరి అనే కూతురు కూడా ఉంది. కానీ కొన్ని విభేదాల వల్ల 2007లో విడిపోయారు. సుచిత్ర మార్చి 9, 1974న మహారాష్ట్రలోని తెలుగు మాట్లాడే కుటుంబంలో జన్మించింది. ఆమె తండ్రి ఆదాయపు పన్ను శాఖలో కమిషనర్‌గా ఉండగా, ఆమె తల్లి ప్రొఫెసర్‌గా పనిచేశారు.
(ఇదీ చదవండి: ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్‌కు ఊరట.. కేసు కొట్టివేసిన హైకోర్టు)
తాజాగా సుచిత్రా కృష్ణమూర్తి తన వ్యక్తిగత జీవితంపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తన మాజీ భర్త, దర్శకుడు శేఖర్ కపూర్‌లో నిజాయతీ లేదని, ప్రేమించి పెళ్లి చేసుకుని తనని మోసం చేశాడని ఆమె ఆరోపిస్తూ.. గతాన్ని గుర్తు చేసుకున్నారు. వారి వైవాహిక బంధంలో భర్త నిజాయతీగా లేకపోవడం వల్లే విడిపోవాల్సి వచ్చిందని ఆమె చెప్పింది. తనకు సినీ పరిశ్రమలో ఎవరూ తెలియకపోయిన ఇష్టంతో సినిమాల్లోకి వచ్చానని చెప్పింది. ఆప్పట్లో పరిశ్రమపై తన తల్లిదండ్రులకు సదుద్దేశం లేదు. అందువల్ల వాళ్లకు అబద్ధం చెప్పి కొచ్చి వెళ్లి సినిమాలో పనిచేశానని చెప్పింది.
(ఇదీ చదవండి: Bigg Boss Telugu 7 Promo: బిగ్ బాస్ సీజన్ 7 ప్రోమో వచ్చేసింది.. మేకర్స్ ఏం చెప్పారంటే)
అక్కడ తను నటించిన చాలా సినిమాలు సూపర్‌హిట్స్ అందుకోవడంతో మంచి గుర్తింపు వచ్చిందని సుచిత్రా కృష్ణమూర్తి తెలిపింది. అయితే అదే సమయంలో అక్కడ శేఖర్‌తో పరిచయం ఏర్పడినట్లు పేర్కొంది. ఆ తర్వాత ఇద్దరికీ పెళ్లి చేసుకోవాలనే ఆలోచన వచ్చిందని, అప్పటికే తనకు సినిమాల్లో మంచి క్రేజ్ ఉందని పేర్కొంది. కానీ పెళ్లి తర్వాత మూవీల్లో నటించకూడదని శేఖర్ కండీషన్ పెట్టినట్లు ఆమె గుర్తు చేసుకుంది. ఆయన మాటకు గౌరవం ఇచ్చి వచ్చిన సినిమా అవకాశాలను కూడా వదులు కోవాల్సి వచ్చిందని తెలిపింది.
శేఖర్ కపూర్‌ని పెళ్లి చేసుకోవడం తన తల్లిదండ్రులకు ఏమాత్రం ఇష్టం లేదని, అందుకు ప్రధాన కారణం తనకంటే వయసులో 30 ఏళ్లు పెద్దవాడు కావడంతో ఇంట్లో వ్యతిరేఖత వచ్చిందని సుచిత్రా కృష్ణమూర్తి చెప్పింది. అంతే కాకుండా అప్పటికే ఆయనకు విడాకులు కూడా అయ్యాయని తెలిపింది. అతడిని పెళ్లి చేసుకోవద్దని తన అమ్మ పదే పదే చెప్పినా వినకుండా చేసుకున్నానని చెప్పుకొచ్చింది. కానీ ఎన్ని అడ్డంకులు వచ్చినా ఇష్టంతో పెళ్లి చేసుకుంటే తను మోసం చేసి వెళ్లిపోయాడని సుచిత్ర తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment