Shekhar Kapoor
-
ఆ హీరోయిన్ వల్లే నాకు విడాకులు.. ఇప్పటికీ తనను క్షమించను: సింగర్
ప్రముఖ గాయని, చిత్రకారిణి, నటి సుచిత్రా కృష్ణమూర్తి చాలాకాలం తర్వాత మరోసారి తన విడాకుల గురించి ప్రస్తావించింది. 1999లో దర్శకుడు శేఖర్ కపూర్‌ను ప్రేమించి పెళ్లాడిన ఆమె 2007లో అతడికి విడాకులిచ్చింది. అయితే పెళ్లికి ముందు వరకు నటిగానూ మంచి క్రేజ్ అందుకున్న ఆమె వివాహం తర్వాత నటించకూడదని శేఖర్ పెట్టిన కండీషన్ వల్ల నటనకు దూరైంది. తనకంటే 30 ఏళ్లు పెద్దవాడు, అందులోనూ అప్పటికే పెళ్లి చేసుకుని విడాకులు కూడా తీసుకోవడంతో ఇంట్లో ఎవరూ ఒప్పుకోకపోయినా వాళ్లను ఎదిరించి మరీ శేఖర్‌తో ఏడడుగులు వేసింది. వీరికి ఒక కూతురు కూడా పుట్టింది. కానీ అతడి ప్రేమలో నిజాయితీ లేదంటూ శేఖర్‌కు విడాకులిచ్చేసి తన దారి తాను చూసుకుంది. ఈ విషయాలన్నీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించిన ఆమె హీరోయిన్ ప్రీతిజింటాపై మరోసారి నిప్పులు చెరిగింది. తన విడాకులకు కారణం ప్రీతినే అని వెల్లడించిన సుచిత్రా.. ఇప్పటికీ తనను క్షమించేది లేదని చెప్పుకొచ్చింది. భార్యాభర్తల మధ్యలో ప్రీతి దూరడం వల్లే తమ వైవాహిక జీవితం తెరపడిందని గతంలో కూడా హీరోయిన్‌పై సంచలన ఆరోపణలు చేసింది. అయితే ఆ రోజుల్లోనే ఈ ఆరోపణలను ప్రీతి ధీటుగా తిప్పికొట్టింది. 'నేనిప్పుడు ఇండస్ట్రీలో నెంబర్ 1 హీరోయిన్ను. కనీసం నువ్వు సినిమాల్లో కూడా యాక్ట్ చేయడం లేదు. కేవలం ఇంట్లో ఒక సాధారణ గృహిణిగా మిగిలిపోయావు. సుచిత్రా.. నువ్వు నాతో ఇష్టమొచ్చినట్లు మాట్లాడకు. నీ మానసిక స్థితి సరిగా లేనట్లుంది.. ముందు వెళ్లి ఏదైనా మంచి సైకియాట్రిస్ట్‌కు చూపించుకో' అని కౌంటర్ ఇచ్చింది. సదరు వ్యాఖ్యలను ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తి గుర్తు చేయగా.. సుచిత్ర స్పందిస్తూ.. 'తన మాటలను నేను పట్టించుకోవాల్సిన పని లేదు. ఈ ప్రపంచంలో ఎవరు ఏదైనా మాట్లాడవచ్చు. ఒక గృహిణిగా ఉన్నందుకు నేను గర్విస్తున్నాను. 20 ఏళ్లు తల్లిగా ఉన్నందుకు ఎంతో గర్వపడుతున్నాను. ఎవరెన్ని మాట్లాడినా సత్యానికే బలం ఉంటుంది. చివరకు అదే నిలబడుతుంది. ఇప్పటికీ నేను ఆమెను క్షమించను. అసలు తను ఉందా? లేదా? అన్నది కూడా పట్టించుకోను' అని చెప్పుకొచ్చింది. (చదవండి: ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ వద్దు.. పవన్ 'బ్రో'పై థమన్ సీరియస్ కామెంట్స్) -
నా కంటే 30 ఏళ్లు పెద్దవాడు.. అయినా పెళ్లి చేసుకుంటే: ప్రముఖ సింగర్
మీరు 1990ల నాటి ఇండియన్ సంగీతానికి అభిమాని అయితే, బాలీవుడ్లో వచ్చిన డోల్ డోల్.. దమ్ తారా అనే పాటకు కచ్చితంగా ఫిదా అయింటారు. షారుఖ్ ఖాన్ సూపర్ హిట్ సాంగ్ 'కబీ హాన్ కబీ నా' పాటకు కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇలాంటి సూపర్ హిట్ సాంగ్స్‌తో అభిమానులను సొంతం చేసుకున్న సింగర్,నటి సుచిత్రా కృష్ణమూర్తి. ఆమె 1999లో ప్రముఖ దర్శకుడు శేఖర్ కపూర్‌ను ప్రేమించి వివాహం చేసుకుంది. వారికి కావేరి అనే కూతురు కూడా ఉంది. కానీ కొన్ని విభేదాల వల్ల 2007లో విడిపోయారు. సుచిత్ర మార్చి 9, 1974న మహారాష్ట్రలోని తెలుగు మాట్లాడే కుటుంబంలో జన్మించింది. ఆమె తండ్రి ఆదాయపు పన్ను శాఖలో కమిషనర్‌గా ఉండగా, ఆమె తల్లి ప్రొఫెసర్‌గా పనిచేశారు. (ఇదీ చదవండి: ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్‌కు ఊరట.. కేసు కొట్టివేసిన హైకోర్టు) తాజాగా సుచిత్రా కృష్ణమూర్తి తన వ్యక్తిగత జీవితంపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తన మాజీ భర్త, దర్శకుడు శేఖర్ కపూర్‌లో నిజాయతీ లేదని, ప్రేమించి పెళ్లి చేసుకుని తనని మోసం చేశాడని ఆమె ఆరోపిస్తూ.. గతాన్ని గుర్తు చేసుకున్నారు. వారి వైవాహిక బంధంలో భర్త నిజాయతీగా లేకపోవడం వల్లే విడిపోవాల్సి వచ్చిందని ఆమె చెప్పింది. తనకు సినీ పరిశ్రమలో ఎవరూ తెలియకపోయిన ఇష్టంతో సినిమాల్లోకి వచ్చానని చెప్పింది. ఆప్పట్లో పరిశ్రమపై తన తల్లిదండ్రులకు సదుద్దేశం లేదు. అందువల్ల వాళ్లకు అబద్ధం చెప్పి కొచ్చి వెళ్లి సినిమాలో పనిచేశానని చెప్పింది. (ఇదీ చదవండి: Bigg Boss Telugu 7 Promo: బిగ్ బాస్ సీజన్ 7 ప్రోమో వచ్చేసింది.. మేకర్స్ ఏం చెప్పారంటే) అక్కడ తను నటించిన చాలా సినిమాలు సూపర్‌హిట్స్ అందుకోవడంతో మంచి గుర్తింపు వచ్చిందని సుచిత్రా కృష్ణమూర్తి తెలిపింది. అయితే అదే సమయంలో అక్కడ శేఖర్‌తో పరిచయం ఏర్పడినట్లు పేర్కొంది. ఆ తర్వాత ఇద్దరికీ పెళ్లి చేసుకోవాలనే ఆలోచన వచ్చిందని, అప్పటికే తనకు సినిమాల్లో మంచి క్రేజ్ ఉందని పేర్కొంది. కానీ పెళ్లి తర్వాత మూవీల్లో నటించకూడదని శేఖర్ కండీషన్ పెట్టినట్లు ఆమె గుర్తు చేసుకుంది. ఆయన మాటకు గౌరవం ఇచ్చి వచ్చిన సినిమా అవకాశాలను కూడా వదులు కోవాల్సి వచ్చిందని తెలిపింది. శేఖర్ కపూర్‌ని పెళ్లి చేసుకోవడం తన తల్లిదండ్రులకు ఏమాత్రం ఇష్టం లేదని, అందుకు ప్రధాన కారణం తనకంటే వయసులో 30 ఏళ్లు పెద్దవాడు కావడంతో ఇంట్లో వ్యతిరేఖత వచ్చిందని సుచిత్రా కృష్ణమూర్తి చెప్పింది. అంతే కాకుండా అప్పటికే ఆయనకు విడాకులు కూడా అయ్యాయని తెలిపింది. అతడిని పెళ్లి చేసుకోవద్దని తన అమ్మ పదే పదే చెప్పినా వినకుండా చేసుకున్నానని చెప్పుకొచ్చింది. కానీ ఎన్ని అడ్డంకులు వచ్చినా ఇష్టంతో పెళ్లి చేసుకుంటే తను మోసం చేసి వెళ్లిపోయాడని సుచిత్ర తెలిపింది. -
ఏడేళ్ల ప్రేమకు బ్రేక్ పడింది..
తుఝ్సే నారాజ్ నహీ జిందగీ.. హైరాన్ హూ మై, హో హైరాన్ హూ మై తెరే మాసూమ్ సవాలోంసే పరేషాన్ హూ మై, హో పరేషాన్ హూ..(జీవితమా నీ మీద అలకలేదు కాని ఆశ్చర్యమేస్తోంది.. నీ అమాయకమైన ప్రశ్నలతో ఆందోళన కలుగుతోంది) అనే పాట ‘మాసూమ్’ అనే సినిమాలోనిది. నటి షబానా ఆజ్మీ.. దర్శకుడు శేఖర్ కపూర్. ఈ వారం విఫల ప్రేమ గాథ ఆ ఇద్దరిదే. బ్రేకప్ తర్వాత ఆ ఇద్దరి పరిస్థితి ఆ గీతాలాపనే. షబానా ఆజ్మీ.. కైఫీ ఆజ్మీ, షౌకత్‌ల కూతురు అని తెలిసిందే. ఇండియన్ పీపుల్స్ థియేటర్ అసోసియేషన్ (ఇప్టా), ప్రోగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్‌కు సారథ్యం వహించడంతోపాటు సినిమా రంగంతోనూ అనుబంధం ఉన్నవారే. షబానాకు నటన వారసత్వంగా అబ్బినా, అవకాశాలను మాత్రం ప్రతిభతోనే అందిపుచ్చుకుంది. అలా 1974లో శ్యామ్ బెనగల్ దర్శకత్వంలో ‘అంకుర్’తో సినిమాల్లోకి వచ్చింది. అదే యేడు ‘ఇష్క్ ఇష్క్ ఇష్క్’లోనూ నటించింది. అందులో ఒక హీరో.. శేఖర్ కపూర్. అతను.. చిత్రరంగ ప్రవేశం చేసే ముందు వరకు శేఖర్ కపూర్ లండన్‌లో చార్టెర్డ్ అకౌంటెంట్‌గా ప్రాక్టీస్‌లో ఉన్నాడు. సాహిత్యంలోనూ మంచి పట్టున్నవాడు. వృత్తి కన్నా ప్రవృత్తిని బాగా ప్రేమించేవాడు. పేరుకే అంకౌట్స్ కాని చిత్తమంతా బాంబే సినిమా మీదే ఉంది. శేఖర్ కపూర్ మనసు అతని మేనమామ దేవానంద్‌కు తెలుసు. మామ నుంచి పిలుపు వచ్చేలోపే బాంబేలో వాలిపోయాడు శేఖర్ కపూర్. మోడలింగ్ మొదలుపెట్టాడు. సినిమాల్లో అవకాశాల పోరాటమూ చేస్తున్నాడు. అప్పుడే దేవానంద్ ‘ఇష్క్ ఇష్క్ ఇష్క్’ సినిమా ప్రారంభించాడు. అందులోని మూడు జంటల్లో షబానా, శేఖర్ కపూర్‌ను ఒక జతగా ఖాయం చేశాడు. మూవీ సెట్స్‌లో ఆ ఇద్దరి మధ్యా ఇష్క్ మొదలైంది. షబానా చురుకుదనం అతణ్ణి ఆకర్షించింది. అతని పరిజ్ఞానం, ఆధునిక ఆలోచనా శైలి ఆమెకు నచ్చాయి. ఆ ఇష్టం..స్నేహంగా మారి ప్రేమగా బలపడి .. ఇద్దరూ కలిసి ఉండేంతగా స్థిరపడింది. ఆ సహజీవనం మీడియాకు కావల్సినన్ని గాసిప్స్నిచ్చింది. ప్యాకప్.. బ్రేకప్.. కాలం గడుస్తోంది. శేఖర్, షబానా లవ్ లైఫ్ హ్యాపీగా సాగుతోంది కాని శేఖర్ యాక్టింగ్ గ్రాఫే ముందుకు సాగట్లేదు. అతను హీరోగా నటించిన ఆరు సినిమాలూ కమర్షియల్ ఫ్లాప్. ఇటు షబానాకు నటిగా మంచి గుర్తింపు వచ్చేసింది. కథానాయికగా డిమాండ్ కూడా పెరిగింది. ఏం జరిగిందో తెలియదు ఆ ఇద్దరి ఏడేళ్ల ప్రేమ, సాహచర్యానికి బ్రేక్ పడింది. ఒకే చూరు కింద ఉంటున్న ఆ జంట వేరుపడింది. అయినా చెలిమిని కొనసాగించారు. శేఖర్ కపూర్ నటన నుంచి దర్శకత్వం వైపు రూటు మార్చుకున్నాడు. ‘మాసూమ్’ సినిమాతో దర్శకుడిగా మారాడు. అందులో హీరోయిన్గా షబానానే తీసుకున్నాడు. అలా వాళ్ల స్నేహం ఇప్పటికీ కొనసాగుతోనే ఉంది.. ఎవరి జీవితాల్లో వాళ్లు సెటిల్ అయినా! దిల్ చాహ్తా హై ప్రేమ వైఫల్య విషాదాన్ని మరిచిపోవడానికి సినిమాలతో బిజీ అయిపోయింది షబానా. ఆ టైమ్‌లోనే జావేద్ అఖ్తర్ ఉర్దూ కవిత్వంలో మరింత పట్టు సాధించడం కోసం షబానా వాళ్ల నాన్న కైఫీ ఆజ్మీ దగ్గరకు వస్తూండేవాడు. తన తండ్రితో జావేద్ చేసే సాహిత్య, ఫిలాసఫీ చర్చల్లో ఆమే పాల్గొనేది. ఆమె ఆత్మవిశ్వాసం, అవగాహన, స్పష్టమైన అభిప్రాయ ధోరణి విపరీతంగా నచ్చేశాయి జావెద్‌కు. తన పట్ల అతను ఆసక్తి చూపిస్తున్నాడని షబానాకు అర్థమైనా పట్టించుకోలేదు. కారణం.. అప్పటికే జావేద్ వివాహితుడు, ఇద్దరు పిల్లల తండ్రీ కావడమే. కాని జావేద్‌కు అవేవీ అడ్డం కాలేదు షబానా మీద ప్రేమను ప్రకటించడానికి. ప్రకటించి షబానాను ఒప్పించడానికి. ఈ ప్రేమా బాలీవుడ్లో గుప్పుమంది. ఆ నాటికే జావేద్‌కు సలీమ్‌తో జంట రచయితగా మంచి పేరు వచ్చింది. షోలే లాంటి హిట్లతో ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. హనీకి తెలిసి... జావేద్ అఖ్తర్ తొలి ప్రేమ హనీ ఇరానీ. ఆమె కూడా నటే. సీతా ఔర్ గీతా సమయంలో ఆమెతో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లయ్యాక ఇల్లు, పిల్లల (జోయా, ఫర్హాన్)తో బిజీ అయిపోయింది హనీ. జావేద్ రహస్య ప్రేమ ఆమె దాకా చేరింది. పెద్దగా వాదులాడలేదు హనీ. పిల్లలు డిస్టర్బ్ అవుతారని. వాళ్లకు తండ్రి మీద అయిష్టత ఏర్పడకూడదని. ఈ వ్యవహారం ఇటు షబానా ఇంట్లోనూ తెలిసింది. కైఫీ ఆజ్మీ అభ్యంతరపెట్టాడు. ఇంకో ఆడబిడ్డ కాపురం కూల్చిన నింద తన కూతురు మీద పడొద్దని. నిజానికి జావేద్ జీవితంలోకి షబానా ప్రవేశించే వరకు జావేద్, హనీలది కలతలు లేని కాపురమే. లేమిలో జావేద్‌కు నైతిక అండగా నిలిచింది హనీ. ఆ విషయాలన్నీ కైఫీకి తెలుసు. అందుకే కూతురిని వారించాడు. తన వల్ల జావేద్ విడాకులు తీసుకోవట్లేదని తండ్రిని ఒప్పించింది షబానా. విడాకులతో హనీకి అల్విదా చెప్పి నిఖాతో షబానాకు తోడయ్యాడు జావేద్. ‘జావేద్, షబానాల పట్ల నా పిల్లల మనసుల్లో వ్యతిరేకత నాటడం నాకు ఇష్టంలేదు. పిల్లలకు జావేద్ దూరం కావద్దని కోరుకున్నానంతే. షబానాను శత్రువుగా చూడలేదు. ఫ్రెండ్‌గానూ దగ్గర కాలేదు. నా పిల్లలకు మాత్రం ఆమె అత్యంత ఆప్తురాలు. వాళ్లు నన్నెలా ప్రేమిస్తారో, గౌరవిస్తారో షబానానూ అంతే ప్రేమిస్తారు. గౌరవిస్తారు’ అని చెప్తుంది హనీ ఇరానీ. ∙ఎస్సార్ -
నీ ప్రతిభను బాలీవుడ్ హ్యాండిల్ చేయలేదు
‘‘నువ్వు ఆస్కార్ అవార్డు అందుకున్నప్పుడే బాలీవుడ్ హ్యాండిల్ చేయలేనంత టాలెంట్ నీది అని నిరూపితమైంది రెహమాన్’’ అంటున్నారు ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు, నటుడు శేఖర్ కపూర్. ‘‘నా దగ్గరకు సినిమా (హిందీని ఉద్దేశించి) లు రానీయకుండా ఓ గ్యాంగ్ తెగ ప్రయత్నిస్తోంది. నా గురించి లేనిపోని వార్తలు ప్రచారం చేస్తోంది’’ అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సంగీత దర్శకుడు రెహమాన్ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రెహమాన్ కి మద్దతుగా నిలిచారు శేఖర్ కపూర్. ‘‘రెహమాన్ ఈ సమస్య ఎందుకు ఏర్పడిందో చెప్పనా? నువ్వు ఆస్కార్ సాధించిన సంగీత దర్శకుడివి. ఆస్కార్ గెలవడం అంటే బాలీవుడ్ లో మృత్యువుని ముద్దాడినట్టే. నిన్ను బాలీవుడ్ హ్యాండిల్ చేయలేనంత ప్రతిభ నీలో ఉంది అని అర్థం’’ అని ట్వీట్ చేశారు శేఖర్ కపూర్. దీనికి రెహమాన్ సమాధానమిస్తూ – ‘డబ్బు పోతే తిరిగి సంపాదించుకోవచ్చు. పేరు పోతే కూడా సంపాదించుకోవచ్చు. కానీ విలువైన సమయాన్ని వృథా చేస్తే మళ్లీ ఎంత ప్రయత్నించినా తిరిగి తెచ్చుకోలేము. అందుకే ఇలాంటి చిన్న చిన్న విషయాల్ని పట్టించుకోవద్దు. మనం చేయాల్సిన గొప్ప పనులు ఎన్నో ఉన్నాయి. వాటి మీద దృష్టిపెడదాం’’ అన్నారు. -
మరో ఏడాది థియేటర్లు ఉండవు
‘‘మరో ఏడాది వరకూ థియేటర్లు రీ ఓపెన్ అయ్యే అవకాశం లేదు. కాబట్టి మొదటివారం మా సినిమా 100 కోట్ల క్లబ్లో చేరిందనే టాక్ ఇక వినిపించనట్లే. ‘స్టార్ సిస్టమ్’ (స్టార్ హీరోలను ఉద్దేశించి) ఇక నశించినట్లే’’ అని బాలీవుడ్ ప్రముఖ దర్శక–నిర్మాత–నటుడు శేఖర్ కపూర్ సోషల్ మీడియా ద్వారా సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘2020 మార్చి నుండి సినిమాల మొదటి వారం వ్యాపారం గురించి ఊసే లేదు. మరో ఏడాది వరకు సినిమాలు థియేటర్లో విడుదలయ్యే పరిస్థితి లేదు. అసలు ఆ అవకాశం కనుచూపు మేరలో లేదు. అందుకే స్టార్స్ తమ సినిమాలను ఓటీటీ ప్లాట్ఫామ్లో విడుదల చేసుకోవడానికి రెడీ అయిపోవాలి. సొంత యాప్‌లతో వాళ్లు సిద్ధంగా ఉండాలి. ఇవాళ టెక్నాలజీ అంతా మన చేతుల్లోనే ఉంది’’ అని కూడా అన్నారు శేఖర్ కపూర్. ఇప్పటికే అక్షయ్ కుమార్ (‘లక్ష్మీ బాంబ్’), అజయ్ దేవగన్ (భూజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా) వంటి స్టార్స్ చిత్రాలు ఓటీటీలో విడుదలకు సిద్ధమైన నేపథ్యంలో శేఖర్ కపూర్ అన్నట్లు భవిష్యత్తులో సినిమా బాక్సాఫీస్ 100 కోట్లు, 200 కోట్లు, 300 కోట్లను చూసే అవకాశం లేదా? కాలమే చెప్పాలి. -
'అది నీ సినిమా అని ఎలా చెప్పుకుంటావ్?'
మిస్టర్ ఇండియా సినిమాకు బాలీవుడ్లో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. 1987లో రిలీజైన 'మిస్టర్ ఇండియా' అప్పట్లో బ్లాక్ బాస్టర్ హిట్‌గా నిలిచింది. అనిల్ కపూర్, శ్రీదేవి జంటగా శేఖర్ కపూర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి కథను సలీమ్-జావేద్ అక్తర్‌లు అందించారు. తాజాగా ఈ సినిమాను మిస్టర్ ఇండియా 2గా తీయాలని 'టైగర్ జిందా హై' ఫేమ్, దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్ రీమేక్‌గా తెరకెక్కించాలని భావిస్తున్నాడు. ఇదే విషయాన్ని అబ్బాస్ తన ట్విటర్లో వెల్లడిస్తూ.. ' మిస్టర్ ఇండియా సినిమా కోసం పనిచేయడం నాకెంతో సంతోషంగా అనిపించింది. ప్రతి ఒక్కరి చేత ప్రశంసలందుకున్న ఐకానిక్ పాత్రలను మరోసారి మీ ముందుకు తీసుకువచ్చే ప్రయత్నంలో ఉన్నాను. అయితే ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్‌ను పూర్తి చేసే పనిలో ఉన్నా.. నటీనటులు ఎవరనేది ఇంకా ఏం నిర్ణయించలేదు' అని పేర్కొన్నారు. (‘అమృతగా తాప్సీ నన్ను ఆకట్టుకుంది’) అయితే మిస్టర్ ఇండియా సినిమాలో హీరోగా నటించిన అనిల్ కపూర్, చిత్ర దర్శకుడు శేఖర్ కపూర్‌ను సంప్రదించకుండా రీమేక్ ఎలా తీస్తారంటూ నటి, అనిల్ కపూర్ కూతురు సోనమ్ కపూర్ ట్విటర్ వేదికగా ప్రశ్నించారు. వారి అనుమతి లేకుండా సినిమాను తీస్తే వారిని అగౌరవపరిచినట్టేనని పేర్కొన్నారు. దీనిపై దర్శకుడు శేఖర్ కపూర్ ట్విటర్లో స్పందించారు.' మిస్టర్ ఇండియా సినిమా గురించి నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా... నన్ను అడగకుండా, నా అనుమతి లేకుండా సినిమాను రీమేక్ చేయాలనుకుంటున్నారు. మిస్టర్ ఇండియా సినిమా మంచి విజయం సాధించి దర్శకుడిగా నాకు గుర్తింపునిచ్చింది. ఈ సినిమాపై నాకు హక్కులు ఉండవా ?' అంటూ పేర్కొన్నారు. Shekhar saheb the story the situations the scenes the characters the dialogue the lyrics even the title none of these were yours .I gave it all to you . Yes you execute it very well but how can your claim on the film be more than mine . It wasn’t you idea . It wasn’t your dream — Javed Akhtar (@Javedakhtarjadu) February 28, 2020 దీనిపై జావేద్ అక్తర్ శేఖర్ కపూర్‌ను తప్పుబడుతూ రీట్వీట్ చేశారు.' మిస్టర్ ఇండియా కథ, పాటలు, డైలాగ్‌లు, సన్నివేశాలు, కనీసం చిత్రం టైటిల్ కూడా మీకు సొంతం కాదు. వాటిన్నంటిని నేను సలీమ్ కలిసి మీకు అందించాం అన్న విషయాన్ని మరిచిపోయారు. నిజమే.. మీరు సినిమాను చాలా బాగా తెరకెక్కించారు.. ఆ విషయం నేను ఒప్పుకుంటా.. కానీ సినిమా మీద మొత్తం హక్కులు నీకే ఉన్నాయనడం ఏం బాగాలేదు. అసలు ఈ సినిమా మీ ఆలోచన కాదు, అది మీ కల కూడా కాదు' అంటూ జావేద్ మండిపడ్డారు. -
‘మిస్టర్ ఇండియా 2’ లేనట్లే!
కొన్ని పాత్రలు కొందరిని వెతుక్కుంటూ వెళతాయని సినీ ప్రముఖులు అంటుంటారు. శ్రీదేవి కెరీర్లో అలాంటి పాత్రలు చాలా ఉన్నాయి. ‘మిస్టర్ ఇండియా’ లో శ్రీదేవి చేసిన ‘సీమా సోనీ’ క్యారెక్టర్ అలాంటిదే. ఈ పాత్రలో ఆమె ఎంత అద్భుతంగా నటించారంటే.. వేరే ఏ నాయికనూ ఊహించుకోలేం. ఈ చిత్రదర్శకుడు శేఖర్ కపూర్ కూడా అదే అంటున్నారు. శ్రీదేవి చనిపోవడంతో ‘మిస్టర్ ఇండియా’కి సీక్వెల్ తీయాలనే తన ఆలోచన చనిపోయిందని శేఖర్ కపూర్ పేర్కొన్నారు. శ్రీదేవి లేకుండా సీక్వెల్ తీస్తే తాజ్‌మహల్ లేని ఆగ్రాలా, నర్గిస్ లేని ‘మదర్ ఇండియా’ సినిమాలా ఉంటుందనీ, ‘మిస్టర్ ఇండియా’కి బలం అనిల్ కపూర్, అమ్రిష్ పురి, శ్రీదేవి అనీ, అమ్రిష్, శ్రీదేవి చనిపోయారు కాబట్టి, వారి ప్లేస్‌లో వేరే ఆర్టిస్టులను తీసుకుని సీక్వెల్ చేస్తే పాత మేజిక్‌ని రీ–క్రియేట్ చేయలేమని చిత్రనిర్మాత–శ్రీదేవి భర్త బోనీ కపూర్ భావించారట. అందుకే సీక్వెల్ తీయాలనే ఆలోచన మానుకున్నారని సమాచారం. ‘‘సీక్వెల్ గురించి బోనీ ఏమనుకుంటున్నారో నాకు తెలియదు. నేను మాత్రం సీక్వెల్‌ని డైరెక్ట్ చేయలేను. శ్రీదేవి చనిపోవడంతో చాలా కలలు చనిపోయాయి. వాటిలో ‘మిస్టర్ ఇండియా’ సీక్వెల్ ఒకటి’’ అని శేఖర్ కపూర్ పేర్కొన్నారు. సో.. ‘మిస్టర్ ఇండియా 2’ రెండో భాగం లేనట్లే. -
ఎవరికీ తెలియని విషయాలతో...
శ్రీదేవి నాలుగేళ్ల వయసులో సినిమాల్లోకి వచ్చింది. 13 ఏళ్ల వయసులో హీరోయిన్ అయింది. చైల్డ్ ఆర్టిస్ట్ టు హీరోయిన్.. ఆమె కెరీర్ 50 ఏళ్లు. ‘ఆల్ ఇండియా సూపర్ స్టార్’. హిందీ నిర్మాత బోనీ కపూర్‌ని పెళ్లి చేసుకున్నారు. ఇలాంటి విషయాలన్నీ అందరికీ తెలిసినవే. ఎవరికీ తెలియని విషయాలు చాలా ఉన్నాయి. అలాంటి అరుదైన విషయాలతో బోనీ కపూర్ ఓ డాక్యుమెంటరీ తీయడానికి ప్లాన్ చేస్తున్నారని సమాచారం. భార్య హఠాన్మరణాన్ని ఆయన తట్టుకోలేకపోతున్నారని, ఆమె మరణం గురించి పలువురు పలు రకాలుగా మాట్లాడుకోవడం ఆయన్ను మరింత బాధపెడుతోందని సన్నిహితులు అంటున్నారు. భార్య గురించి ఎవరికీ తెలియని విశేషాలతో ఆయన తీయనున్న డాక్యుమెంటరీలో శ్రీదేవి జీవితంలోని కీలక వ్యక్తులు తమ అభిప్రాయాలు పంచుకుంటారని సమాచారమ్. జగదేక సుందరి కెరీర్లో చెప్పుకోదగ్గ చిత్రాల్లో ఒకటైన ‘మిస్టర్ ఇండియా’ దర్శకుడు శేఖర్ కపూర్ ఈ డాక్యుమెంటరీని తెరకెక్కించనున్నారట. కచ్చితంగా ఈ చిత్రం కోసం శ్రీదేవి అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తారు. బోనీ నుంచి ఎప్పుడు అధికారిక ప్రకటన వస్తుందో చూడాలి. -
'మా వైవాహిక జీవితానికి ప్రీతిజింటా తెరదించింది'
ముంబై: లైంగికంగా వేధిస్తున్నారని మాజీ ప్రియుడు, వ్యాపారవేత్త, ఐపీఎల్ ఫ్రాంచైజీలో సహా భాగస్వామి నెస్ వాడియాపై బాలీవుడ్ నటి, వ్యాపారవేత్త ప్రీతి జింటా ఫిర్యాదు చేయడం తాజాగా సంచలనం రేపింది. గతంలో కూడా ఎలాంటి బెదిరింపులకు తలవొగ్గకుండా పలుమార్లు ఫిర్యాదు చేసి జింటా అందర్నిఆకర్షించారు. ప్రీతి జింటా తన జీవితంలో సంచలనం రేపిన కొన్ని ఘటనలను, ప్రత్యేక సంఘటనలు, వివాదాలు, విశేషాలను ఓసారి పరిశీలిద్దాం. 1. 2003లో అండర్ వరల్డ్ మాఫియాపై కోర్టులో ఫిర్యాదు చేయడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. బాలీవుడ్ లో ఏ హీరో, హీరోయిన్ కూడా మాఫియాకు భయకుండా ప్రీతిలా ఫిర్యాదు చేసిన దాఖలాలు ఇప్పటి వరకు నమోదు కాలేదు. 2. 2005 లో తనపై అమర్యాదపూర్వకంగా బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ గొంతుతో వ్యాఖ్యలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ముంబైకి చెందిన పత్రికపై పరువు నష్టం కేసును ప్రీతిజింటా నమోదు చేసింది. 3. ప్రముఖ దర్శకుడు శేఖర్ కపూర్ తో తన వైవాహిక జీవితానికి తెరపడటానికి కారణం ప్రీతి జింటా అంటూ సుచిత్రా కృష్ణమూర్తి ఆరోపణలు చేసింది. అయితే సుచిత్ర ఆరోపణలకు ధీటుగా స్పందించిన ప్రీతి.. ఆమె మానసిక పరిస్థితి బాగా లేదు అని వ్యాఖ్యలు చేశారు. 4. ఐపీఎల్ క్రేజ్ కు ఆకర్షితురాలై.. బాలీవుడ్ కు దాదాపు గుడ్ బై చెప్పిందనే విమర్శలు వచ్చాయి. 5. 2001లో విడుదలైన 'చోరి చోరి చుప్కే చుప్పే' చిత్రంలో వ్యభిచారి పాత్రను పోషించడమే కాకుండా సర్రోగసి మదర్(అద్దె తల్లి)గా నటించి ప్రీతి జింటా సంచలనానికి తావిచ్చింది. 6. క్యా కహనా చిత్రంలో పెళ్లికాకుండానే తల్లైన పాత్రను పోషించి ప్రీతి జింటా మీడియా దృష్టిని ఆకర్షించింది. 7. మణిరత్నం దర్శకత్వం వహించిన 'దిల్ సే' చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ప్రీతిజింటా ఆ చిత్ర హీరో షారుక్ ఖాన్ ను నీవు బ్రహ్మచారివేనా అంటూ ప్రశ్నించడం అనేక విమర్శలకు దారి తీసింది.